• facebook
  • whatsapp
  • telegram

 Parts of Speech

          గ్రామర్‌లో అత్యంత ప్రాముఖ్యం ఉన్న బేసిక్స్‌లో మొదటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీటినే భాషాభాగాలు అంటారు. ఇంగ్లిష్ వ్యాకరణ రచనకు కావాల్సిన పరిజ్ఞానానికి ఇది తొలి మెట్టు. ఒక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని (మాట) అది చేసే పనిని బట్టి ఒక భాషాభాగంగా నిర్ణయించారు. ఆ క్రమంలో ఇంగ్లిష్‌లోని పదాలన్నింటినీ (మాటలను) మొత్తం ఎనిమిది విభాగాలుగా విభజించారు. వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని వ్యవహరిస్తారు. నిజానికి వీటిపై గట్టి పట్టు ఉంటేనే ఇంగ్లిష్‌లో పటిష్ఠమైన వాక్యరచన సాధ్యమవుతుంది. 
          Words in English are divided into eight kinds according to their use in sentences, which are called Parts of Speech in English. The Part of Speech of a particular word in a sentence is decided by the context in which it is used. This is important to be rememberedin identifying the parts of speech of words in English. ఇంగ్లిష్‌లోని ఎనిమిది భాషాభాగాల గురించి వివరంగా తెలుసుకుందాం
There are eight Parts of Speech in English. They are:
1. Noun
2. Pronoun
3. Verb
4. Adjective
5. Adverb
6. Preposition
7. Conjunction
8. Interjection

 

1. NOUN: A Noun is the name of a person, place or ANY thing. అంటే వ్యక్తులు, స్థలాలు, వస్తువుల పేర్లు Concrete Nouns  అవుతాయి. అయితే courage, education, idea, love, luck మొదలైనవి కూడా Nouns అని గ్రహించాలి. ఎందుకంటే గుణాలు, పనులు, స్థితులు, కళలు, శాస్త్రాల పేర్లను తెలియజేసే పదాలు abstract  (గ్రహించదగినవి మాత్రమే) sense లో ఉంటాయి. అందువల్ల వాటిని Abstract Nouns అంటారు. Nouns విషయంలో ఇది గ్రహిస్తే చాలు.
e.g.: Shreya (వ్యక్తి పేరు);             Ooty (స్థలం పేరు);              pencil ; (వస్తువు పేరు);
         student  (కామన్ నౌన్);       army(సమూహం పేరు);     iron (పదార్థం పేరు);
 poverty  (స్థితికి పేరు);        grammar  (శాస్త్రం పేరు);          laughter (పనికి పేరు);
         beauty  (గుణానికి పేరు);    dream (అనుభవానికి పేరు);      pleasure (అనుభూతికి పేరు);
         paramecium (జీవికి పేరు); penicillin (ఔషధానికి పేరు)...
So,  ఈ విధంగా పేర్లను తెలిపే అన్ని పదాలను Nouns గా పరిగణించాలి. -ness, -dom, -ship, -ion, -ation, - ist, -ance, -ence, -or, -er, -ity, -ment, -ian  మొదలైన Suffix లు కూడా Nouns ను ఏర్పాటు చేస్తాయి.
e.g.: neatness, wisdom, friendship, tension, inforrmation, dentist, attendance, evidence, convenor, teacher, brevity, move ment,
technician . . .
కొన్ని సందర్భాల్లో వేరే భాషా భాగానికి చెందిన పదాలు కూడా Nouns గా  పనిచేస్తాయి. నిజానికి మనం జాగ్రత్తగా ఉండాల్సింది సరిగ్గా ఇలాంటి పరిస్థితులలోనే!
e.g.: He wants to watch the T.V. at night.
                            Verb
He looked at his watch immediately.
                         Noun
* అదే పదం Verb గా మరియు Noun గా వాడిన సందర్భాలివి.
e.g.:   He is a rich man.
                    Adj.
        Don’t believe the rich.
                                  Noun

*  అదే పదం Adjective గా మరియు Noun గా వాడిన సందర్భాలివి.

 

2. PRONOUN: A Pronoun is a word used in the place of a noun. It helps us to avoid
repetition of nouns. అంటే నామవాచకాలకు బదులుగా ఉపయోగించే మాటలను సర్వనామాలు అంటారు.
                              e.g.: Ravi built a house.    It is nice.
                                                      Noun      PronounNote: Who, What, Which, Where, Whom, Whose, Why మరియు How లను Question Words అంటారు.  కానీ వీటిని చాలా సందర్భాలలో  Interrogative Pronouns గా కూడా ఉపయోగిస్తారు. అందుకే ఒక పదం యొక్క Parts of Speech ను ఉపయోగించిన వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి.
e.g.:   A triangle whose three sides are equal is called equilateral.
                           Pronoun
         This is the boy that I spoke of.
                             Pronoun    
He said that he would go home.
                 Conjunction
* ఒక పదం వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు భాషాభాగంగా ఉండొచ్చు. అందుకే Parts of Speech of a certain word depends on the context in which it is used.

 

3. VERB: A Verb is a word which expresses the action of doing, being or possessing.
అంటే పనిని తెలిపే పదాన్ని క్రియ అంటారు. పనులను, స్థితులను, కలిగి ఉండటాన్ని తెలియజేసే పదాలను Verbs  అని పిలుస్తారు.
e.g.:   The pen is black. (action of being)
                     Verb
          I have a house. (action of possessing)
          Verb
         Children play games. (action of doing)
                      Verb
పనులు మూడు విధాలుగా జరుగుతాయని చూశారు కదా!
*  స్థితులను తెలియజేసే Verbs ను ‘be’ forms  అంటారు. అవి am, is, are, was, were
*  కలిగి ఉండటాన్ని తెలియజేసే Verbs ను ‘Possessive’ forms of Verbs అంటారు. అవి have, has, had.
* చేసే పనులను తెలియజేసే Verbs ను '‘do’ forms of Verbs అంటారు. అవి walk, run, eat, sleep, do, sit . . .... మొదలైనవి.
* అనేక సందర్భాల్లో సహాయక క్రియలుగా వచ్చే Verbs ను Helping Verbs  లేదా Auxiliary Verbs అంటారు. అవి can, could, shall, should, will, would, may, might, must మొదలైనవి మరికొన్ని.
* ప్రతి Verb మూడు విభాగాలుగా ఉంటుంది. ఒకటో విభాగం V1 (Simple Present);  రెండో విభాగం V2 (Simple Past)  మూడో విభాగం V3 (Past Participle). ఉదాహరణకు go- went- gone. ఈ మూడు విభాగాలలో ఉన్న పదాలన్నీ క్రియలే.
          ఈ విధంగా క్రియలను గుర్తించాలి. అయితే వీటికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఈ కింద చూడండి.
* కొన్ని సార్లు క్రియాపదం (Verb) ) వేరే భాషాభాగంగా కూడా ఉండొచ్చు.
e.g.: We want to visit our Chairman shortly.
                             Verb
We paid a visit to him last summer.
                 Noun
Visit మొదటి వాక్యంలో Verb గా, రెండవ వాక్యంలో Noun గా వాడారు. మరొక ఉదాహరణ... |
I saw a saw, is sawing a saw, such a saw I never saw!
  Verb     Noun                   Noun           Noun           Verb
*  -fy, -en, -ateమొదలగు suffix లు కూడా Verbs ను రూపొందిస్తాయి.
e.g.: identify, strengthen, decorate

 

4. ADJECTIVE: An ‘Adjective’ tells the quality, quantity, colour and number of nouns/pronouns. అంటే స్వభావాన్ని, పరిమాణామాన్ని, రంగును, సంఖ్యను తెలిపే పదాలు. ఇవి నామవాచకాలను లేదా సర్వనామాలను వర్ణిస్తాయి.
e.g.: great, much, double, this, each, whose, same, green . . . మొదలైనవి.
* ఒక పదం యొక్క భాషాభాగాన్ని దాన్ని వాడిన వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి. కాబట్టి ఇతర భాషాభాగాలకు చెందిన పదాలు కూడా Adjectives అయ్యే వీలుంది. అందుకని దీన్ని వివరంగా చూడాలి.
* ఒక Adjective  అనేది Noun/Pronoun ను గురించి తెలియజేస్తుంది. కాబట్టి వాక్యంలో అది Noun/ Pronoun ముందే ఉండాలా? అనే సందేహానికి జవాబుగా 'అక్కర్లేదు' అని చెప్పవచ్చు.
e.g.:    She has melodious  voice.
                          Adjective    Noun
వివరణ:  Noun కు ముందు వచ్చి దాని గురించి తెలిపే Adjectiveను ‘epithet’ (Attributive Adjective) అంటారు.
e.g.:     Her voice is melodious.
                     Noun    Adjective
వివరణ: ఇక్కడ Adjective అనేది వాక్యంలో Noun  తర్వాత ఉంది. దీన్ని Predicative Adjective  అంటారు. అయితే రెండు వాక్యాల భావార్థం ఒకటే!
ఇప్పుడు Adjective లో రకాలేంటో చూద్దాం.
* Qualitative Adjectives: Shapeని  size ని colour ని taste ని condition ని behaviour ని అవి కలిగించే impression ని తెలియజేసేవి.
e.g.: round, narrow, white, bitter, weak, cruel, smooth, great, attractive, beautiful. . .
* Quantitative Adjectives: పరిమాణం, పరిమితిని తెలియజేసేవి.
e.g.:   much, little, any, no, many, some, all . . .
          I  have a little knowledge of English.
                          Adj.
*  Numeral Adjectives: Numbers (definite/indefinite/multiplicative) ను తెలియజేసేవి.
e.g.:   two, five, first, tenth, double, bi-fold . . .
         We have been living in the twenty-first century.
                                                           Adjective
*  Demonstrative Adjectives: 'ఫలానా' అని నిర్దేశించేవి.
e.g.: this, that, these, those, such, same, the, other, certain . . .
A certain man went down from Kashmir to Cape Comarin.

 

Adjective
 

* Distributive Adjectives: వస్తువులు/ వ్యక్తులు ఒక్కొక్కటిగా తీసుకునేలా తెలియజేసేవి.
e.g.: each, every, either, neither . . .
Every boy praised Raghu yesterday.
  Adj.
* Interrogative Adjectives: Nouns  ముందు వాడుతూ ప్రశ్నలు వేయడానికి ఉపయోగపడేవి.
e.g.: what, which, whose . . .
        which boy got the prize in the race?
     Adjective

 

*  Relative Adjectives: 'సంబంధిత' అనే అర్థంలో వాడేవి.
e.g.: which, what, whose . . . Relative Adjectives కూడానూ
         This is Ramu whose pen was stolen.
                              Adjective
*  ఒక వాక్యంలో రెండు Nouns పక్కపక్కనే వచ్చినప్పుడు మొదటి Noun, Adjective అవుతుంది.
Pronoun లుగా స్ఫురించే కొన్ని పదాలు Adjective  కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందువల్ల ఆయా సందర్భాల్లో వాటిని Adjectives  గానే గుర్తించాలని తెలుసుకున్నారు కదా! అందుకే Parts of Speech ఆద్యంతం ఆసక్తికరం. వాటి ఉపయోగాల వెనక ఉన్న స్వల్ప తేడాలను గ్రహిస్తే వాక్య రచనాశైలి మెరుగుపడుతుంది. ఇందులో సందేహమే లేదు.
మీకు తెలుసా?
When you put more than one adjective together, the order of the adjectives is important.

 

Order of Adjectives
 

(OSASCOMP)
1. opinion (= what you think about something)
2. size
3. age
4. shape
5. colour
6. origin (=where something comes from)
7. material (= what something is made of)
8. purpose (=what something is used for)
e.g.:    a    clever,   big,   old,   round,    black,   Chinese,   pet   dog.
      Adj.  Adj.    Adj.   Adj.     Adj.       Adj.         Adj.       Adj.   Noun

 

5. ADVERB: ఒక Verb  (క్రియ) తెలియజేసే పని ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంతవరకు జరుగుతుందో తెలియజేసే పదాలు, Adjectives  (విశేషణాలు) పరిమితిని తెలియజేసే మాటలను క్రియా విశేషణాలు (ADVERB) ) అంటారు. అలాగే ఒక Adverb కొన్ని సందర్భాల్లో మరొక Adverb యొక్క పరిమితిని కూడా తెలియజేస్తుంది.
So, an ‘Adverb’ is a word which qualifies or adds to the meaning of a verb, an adjective or another adverb.
e.g.: Raju came  yesterday. (పని 'ఎప్పుడు' జరిగింది అని తెలిపే Adverb)
               Verb  Adverb
        Raju spoke  gently. (పని 'ఎలా' జరిగింది అని తెలిపే Adverb)
                Verb   Adverb
        Raju eats   slowly. ( పని 'ఏవిధంగా' జరిగింది అని తెలిపే Adverb)
               Verb  Adverb
        Raju lived   here. (పని 'ఎక్కడ' జరిగింది అని తెలిపే Adverb)
               Verb  Adverb      
Raju is very   handsome. (‘Adjective’ పరిమితిని తెలిపే Adverb)
                Adverb  Adjective
        Raju sang enough  sweetly. ( ‘Adverb’ పరిమితిని తెలిపే మరొక Adverb)
                     Adverb   Adverb
        Raju’s house is extremely  busy. ( ఎంతమేరకు అని తెలిపే Adverb)
                               Adverb    Adverb
ఈ విధంగా ఒక Verb యొక్క,  Adjective  యొక్క, మరొక Adverb  యొక్క అర్థాన్ని విశదీకరించి చెప్పే పదాలను ADVERBS గా గుర్తించాలి. భాషాభాగాలను గుర్తించే ప్రక్రియలో ఈ Adverbs ను గుర్తించడం కష్టతరం. ఇపుడు వీటిలో ఉన్న రకాలను తెలుసుకుందాం.
ADVERB ల రకాలు

 

1. Adverbs of Time: సమయ నిర్దేశం చేసేవి, ఒక వాక్యంలో Verb కి ‘When’ అనే ప్రశ్నవేస్తే వచ్చే జవాబే ఈ Adverbs of Time.. ఉదాహరణకు now, then, since, ago, before, already, soon, presently, immediately, instantly, early, late, today, tomorrow, yesterday, afterward, next లాంటివి.
e.g.: Lakshmi will arrive tomorrow.

 

2. Adverbs of Place:  స్థల నిర్దేశం చేసేవి. '‘Where’ అని అడిగితే వచ్చే జవాబులు. ఉదాహరణకు here, there, hence, thence, hither, thither, in, out, within, without, above, below, far, near, inside, outside, up, down, beyond లాంటివి.
e.g.: We find him everywhere.

 

3. Adverbs of Number:  'ఎన్నిసార్లు' అని నిర్దేశించేవి. ‘How often’ అనే ప్రశ్నకు సమాధానంగా నిలిచే Adverbs. ఉదాహరణకు once, twice, thrice, again, always, seldom, never, frequently, sometimes, often, firstly, secondly, four-fold, five-fold  లాంటివి.
e.g.: I helped him once.

 

4. Adverbs of Manner:  పని జరిగిన తీరును నిర్దేశించేవి. ‘How’ అనే ప్రశ్నకు జవాబుగా వచ్చే పదాలు. ఉదాహరణకు surely, probably, ertainly, meanly, extremely, so, conveniently, happily, sadly, well, ill, badly, quickly, loudly లాంటివి.
e.g.: She did the job happily.

 

5. Adverbs of Degree or Extent or Quantity: ఏ పరిమాణం మేరకు, ఎంతవరకు ఒక పని జరిగిందో నిర్దేశించేవి. ఉదాహరణకు  too, almost, fully, rather, quite, very, wholly, partly,  somewhat, (a) little, much, enough, pretty, half, so లాంటివి.
e.g.: The student’s answer is quite right.

 

6. Adverbs of Affirmation and Negation:  అవును/ కాదు, ఉంది/ లేదు అని సరళంగా నిర్దేశించే పదాలు ఉదాహరణకు: yes, surely, certainly, definitely, no, not లాంటివి.
e.g.: Lalitha does not make false promises.

 

7. Adverbs of Reason:  కాబట్టి/ అందువల్ల అని తెలిపేవి. ‘Why’ అని అడిగితే వచ్చే జవాబు పదాలు ఈ Adverbs ఉదాహరణకు as, because, therefore, hence, since లాంటివి.
e.g.: I therefore stopped talking to him.

 

8. Adverbs of Interrogation:  ప్రశ్నించడానికి వాడే పదాలన్ని ఈ రకం Adverb లే. ఉదాహరణకు why, where, when, how మొదలైనవి.
e.g.: How do you drink that bad?
* ఇవే కాకుండా Adverbial Particles  కొన్ని ఉన్నాయి. అవి up, down, in, out, on, off, away,
back లాంటివి.
e.g.: Take off your coat.
* ఇతర భాషాభాగాలకు చెందిన పదాలు కూడా Adverbs గా పనిచేయడం గమనార్హం.
e.g. He has been sleeping since morning.
* -ly తో అంతమయ్యే పదాలు చాలా వరకు Adverbs అయి ఉంటాయి.
e.g.; The cup was nearly full.

 

POSITION OF ADVERBS IN A SENTENCE
 

*  e.g.: Mayuri danced well in the auditorium last Sunday.
                               Adv.                 Adv.                Adv.                           

వివరణ:  పై వాక్యంలో Adverbs of manner, place, time లువరుసగా వచ్చాయి.
¤  e.g.: Radha studied the book carefully.
                                                     Adv.
వివరణ: పై వాక్యంలో Adverb మామూలుగానే object తర్వాత వచ్చింది.
¤  e.g.: I do not know him.
                  Adv.
వివరణ:  పైవాక్యంలో auxiliary verb ఉంది కాబట్టి దానికి, main verb కి మధ్య Adverb ఉంది
¤  e.g.: Nirmala often drinks tea.
                           Adv.
వివరణ: పై వాక్యంలోని Adverb of frequency, main verb కి ముందుంది. అంటే వాక్యములోని mid-position లో ఉంది.

 

PLACEMENT OF ADVERB IN A SENTENCE
¤ Only Raju saw her. (అంటే 'అతను' మాత్రమేనని)
   Adv.
¤ Raju only saw her. (అంటే merely (కేవలం) అని)
           Adv.

¤ Raju  saw only her. (అంటే 'ఆమెను' మాత్రమేనని)
                    Adv.
¤ Raju saw her only. (అంటే మాములుగా చూశాడు అని)
   Adv.
చూశారు కదా! Adverb అనేది వాక్యంలోనున్న position ను బట్టి దాని emphasis/meaning ఆధారపడుతుంది/ అర్థం అర్థమవుతుంది.

 

6. PREPOSITION: పరిమాణంలో చిన్నవే అయినా వాటికి ఉన్న విస్తృత ఉపయోగం కారణంగా  English
Grammar లో Prepositions పాత్ర ప్రముఖమైంది. ఒకే Preposition ను వివిధ సందర్భాల్లో వేర్వేరు అర్థం వచ్చేలా ఉపయోగించడం వల్ల ఏర్పడే సంక్లిష్టతను అధిగమించాలి. ప్రిపొజిషన్ల సందర్భోచిత ఉపయోగాలను తెలుసుకుంటే బాగుంటుంది.
e.g.: There is a glass on the table.
e.g.: The hunter aimed at he bird.
e.g.: She is fond of sweets.
¤ మొదటి ఉదాహరణలో ‘on’ అనే పదం glass, table అనే వస్తువుల (things  మధ్య సంబంధాన్ని సూచిస్తోంది. అంటే వాక్యంలోని రెండు Nouns మధ్య సంబంధం...

¤ రెండో ఉదాహరణలో aim అనే పని (verb)కి, bird అనే వస్తువు (things)కి మధ్య సంబంధాన్ని నిర్దేశిస్తోంది... ఆ ‘at’ అనే పదం.
¤ ఇక మూడో ఉదాహరణలోని  ‘of’ అనే పదం fond అనే లక్షణం/ గుణానికి, sweets అనే Noun కి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తోంది. 
          So, a Preposition is a word placed before a noun or pronoun to show what one person or thing has to do with another person or thing, అంటే the preposition shows the relation between a noun or pronoun and the other part of the sentence.
          at, in, by, on, for, from, of, about, between, among, till, to, with, without, within, after, beside, besides, before, since, over, towards, against లాంటివి అన్నీ ఆయా సందర్భాలను బట్టి ప్రిపొజిషన్లే!

 

Prepositionల రకాలు
          ఏ Preposition అయినా వాక్యంలో ఉన్న మాటల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. అలా connect చేస్తేనే అది ప్రిపొజిషన్.
1. Simple Prepositions: ఒకే పదం రూపంలో ఉండేవి. above, at, behind, between, during, from, of, on, round, since, with మొదలైనవి
e.g.: She met me at the bus stop yesterday.

 

2. Phrase Prepositions: పదబంధ రూపంలో ఉండేవి. ఉదాహరణకు for the sake of, in front of,  by way of, with reference to మొదలైనవి.
e.g. Dogs bark in order to frighten strangers.¤

 

3. Double Prepositions: రెండు సింపుల్ ప్రిపొజిషన్స్ కలిస్తే ఏర్పడేవి. ఉదాహరణకు into, within, onto,
from-among.
e.g.: A rat went into the hole.

 

4. Followed Prepositions: కొన్ని prepositions, కొన్ని verbs, nouns, adjectives, participlesముందు విధిగా ఉంటాయి. అవి ఉదాహరణకు congratulate on(అభినందించడం); fond of(ఇష్టపడటం); good at(నేర్పు కలిగిన); prefer to(ప్రాధాన్యం); proud of (గర్వం); మొదలగునవి. ఇవి ఎక్కువగా తెలుసుండాలి.
e.g.: She congratulated him on his success.
Ms. Rani is fond of good English.
Sruthi is good at studies.
I prefer British English to American English.
We are proud of our chairman.
ఇప్పుడు కొన్ని ప్రిపొజిషన్లు చేసే పనులను చూద్దాం.

¤  at:  సమయాన్ని, స్థలాన్ని, స్థానాన్ని, ధరను, వేగాన్ని, దిశను, నిమగ్నమై ఉండటాన్ని, స్థితిని, చిన్న ఊళ్లను, ప్రదేశాలను సూచించడానికి దీన్ని వాడతారు.
e.g.: He came at 4 O’ clock in the evening.(సమయం) 
        The train is running at full speed.(వేగం) 
        They were at work.(నిమగ్నమైన స్థితి) 

 

¤  in: సమయాన్ని, కార్యకలాపాన్ని, నివాసాన్ని, పెద్ద ప్రదేశాలను, దుస్తులను నిర్దేశించడానికి దీన్ని వాడతారు.
e.g.: She was dressed in silk.(దుస్తులు) 
        Kiran wastes his life in gambling.(కార్యకలాపం)

 

¤ of:  కారణాన్ని, ఉపశమనాన్ని, విభాగాన్ని, సంబంధాన్ని, మానసిక స్థితిని తెలిపేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
e.g.: He died of cancer.(వ్యాధి)
        One of my friends is in England.(విభాగం)
        She gave me a cup of tea.(పదబంధంలో) 

 

¤  for:  కాల వ్యవధి, ఉద్దేశాన్ని, గమనాన్ని, ప్రయోజనాన్ని, కోరికను, ఆశను, బదులు అనే అర్థంలో, అభిరుచిని, సామర్థ్యాన్ని, అనుకూలతను తెలియజేయడానికి వాడతారు.
e.g.: He was leaving for Delhi.(గమ్యం)
        I applied for a job.(ఉద్దేశం/ ప్రయోజనం)        

        Let us hope for the best.(ఆశ)
        He has a good ear for music.(అభిరుచి) 

 

¤  from:  ప్రారంభ దశ, దూర వ్యవధి, తేడా, ఆధారం, మొదలైన సందర్భాల్లో వాడతారు.
e.g.: It is ten miles from the coast.(దూర వ్యవధి)
        Wine is made from grapes.(వనరు)

 

¤  on: ఒక ప్రత్యేకమైన రోజు, తేది, సభ్యత్వం, స్థితి మొదలైన వాటి గురించి తెలపడానికి వాడతారు.
e.g.: He will be back on Monday.(ఫలానా రోజు)
        Indira Gandhi was born on November 19 th.(తేది)
        Mr. Murthy is on the committee. (సభ్యత్వం)

 

¤ by: 'దగ్గర' అనే అర్థం వచ్చేలా, passive voice లో చెప్పడానికి, ప్రయాణసాధనాల గురించి తెలియజేయడానికి, 'దాటవేసి' అనే అర్థం వచ్చేలా, ‘because of '  అనే అర్థం వచ్చేలా వాడతారు. 
e.g.: My friend sits by me in the class.(పక్కన అనే అర్థంలో)
        He received the money by M.O..(తీరు)
        He was scolded by his teacher. (passive voice )

 

¤  to:  'ఒక వైపు  అనే అర్థంలో కి, కు,ట అనే అర్థంలో వాడతారు.
e.g.: Turn to the left.(వైపు)
He always goes to Guntur('కు' అనే అర్థంలో)

 

¤ about: అనే అర్థంలో, ఫలానా దానికి సంబంధించి అనే అర్థంలో, సమాచారం అడగటానికి, సూచన చేయడానికి వాడతారు.
e.g.: She is about forty.(దాదాపు అనే అర్థంలో)
        How about having a cup of tea.(సూచన చేసే అర్థంలో) 

 

COMMIT TO MEMORY

ప్రిపొజిషన్స్ ఉపయోగించకూడని సందర్భాలు

ఇంగ్లిష్‌లో కొన్ని పదాల తర్వాత ప్రిపొజిషన్స్ follow కావు. ఉదాహరణకు order, criticize, discuss,
obey, resemble, sign, enter, join, await, resist, avenge మొదలైన పదాల తర్వాత ప్రిపోజిషన్స్ వాడకూడదు.
e.g.: He entered the room.((entered into అనకూడదు)
¤ ఒక వ్యక్తికి ఉన్న పరిజ్ఞానానికి గీటురాయిలా నిలిచే Followed Prepositionsను లోతుగా అధ్యయనం చేయడం తప్పనిసరి. అసలు ప్రిపొజిషన్స్‌పై అడిగే ప్రశ్నాంశాలన్నీ కూడా Appropriate Prepositionsకు సంబంధించినవై ఉంటాయి. ప్రిపొజిషన్ల రకాలలో వీటిని Followed Prepositions లో నొక్కి చెప్పినప్పటికీ, వీటిపై మరొకసారి దృష్టి కేంద్రీకరించడం అవసరం.
ఉదాహరణకు ‘angry’ అనే పదానికి  ‘appropriate’'గా వచ్చే ప్రిపొజిషన్ రెండు రకాలుగా ఉండే వీలుంది.
e.g.: I am angry with him

   I am angry at his manners.
¤ వివరణ: మొదటి వాక్యంలో ‘with’ అనే ప్రిపొజిషన్ angry అనే పదానికి PERSON ను నిర్దేశించడం కోసం Followed Preposition గా వచ్చి appropriate అయింది. మరొకటి కాదు. ఇక రెండో వాక్యంలో ‘at’ అనే ప్రిపొజిషన్ THINGను సూచించడం కోసం appropriate preposition అయింది. అంటే ఒక పదానికి ఉన్న Followed Prepositionను  Person/Thingకు  అనుగుణంగా వాడితేనే అక్కడ అది Appropriate Prepositionఅవుతుంది. అది చాలా ముఖ్యం!

 

మరికొన్ని సందర్భాలలో ఒక పదానికి గల Followed Preposition  అనేది Person/Thingకు ఒకేరకంగా ఉంటుంది. 
e.g.: I have enough acquaintance with my higher-ups. (Person)
        I have no acquaintance with politics. (Thing) 
¤ వివరణ : acquaintance  అనే పదానికి ఉన్న ఒకే Followed Preposition ‘with’. అది Person/Thing రెండినీ సూచించడం పై వాక్యాలలో చూడచ్చు.
అదేమంటే కొన్ని GERUNDS (Verbal Nouns)కూడా కొన్ని ప్రిపోజిన్స్ కి follow అవుతాయి. మనం, ఇప్పటివరకు Nouns కి Verbs కి Adjectives కి వచ్చే Followed Prepositions ని చూశాం. వాటితో పాటు Gerunds వచ్చే కొన్ని ప్రిపోజిన్స్ ఉన్నాయి.

e.g.:   addicted to ‘drinking’ (not ‘drink’)
           negligent in ‘paying’ (not ‘pay’)
           prohibited from ‘smoking’ (not to ‘smoke’)

 

¤  ప్రిపొజిషన్లను correct గా ఉపయోగించడం ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానానికి ముఖ్యం. ఎన్నో సందర్భాల్లో ప్రిపొజిషన్స్ ఉపయోగంలో తప్పులు/ ఒప్పులు గమనిస్తుంటాం. 'ఏది' ఎందుకు, ఎక్కడ, ఎలా సరైందనేది ఈ అధ్యయనంలో చూశాం. ఇప్పుడు ఈ కింది ఉదాహరణ చూడండి.
e.g.:   Due to the accident, I could not go. (WRONG)
          Owing to the accident, I could not go. (RIGHT)
¤  వివరణ: వాక్యాన్ని due to తో ప్రారంభిస్తే ‘be’ It was due to the accident, .... అంటూ, Owing అంటే because of, దీనితోనే వాక్యం మొదలు పెట్టవచ్చు.
¤  When the object of the preposition is the relative pronoun that, the preposition is
always placed at the end.
e.g.:    Here is the book that you asked for.
           This is the house that he came to.
¤  The use of a preposition at the end of a sentence is admissible only when it
combines with a preceding intransitive verb to form a compound transitive verb.

e.g.:    He dislikes being talked about.
           Such a result cannot be wondered at.
¤  The preposition is frequently placed at the end when the object is an interrogative
pronoun or a relative pronoun understood.
e.g.:   What are you looking at?
           That is the boy (whom) I was speaking of.

 

7.CONJUNCTION : Conjunction అనే పదంలోనే దాని అర్థ వివరణ ఉంది. అది రెండు మాటలను/ Phrases(పదబంధాలు)ను/Clauses (ఉపవాక్యాలు)ను/Sentences(వాక్యాలు)నుjoin చేస్తుంది. e.g.: Two and two make four. (రెండు పదాలను...) 
Neither the love of money nor desire for power influenced him. ( రెండు Phrases లను)Whether this is finished first or that is finished first does not matter. (రెండు Clauses ను) He is great, but he is not good. ( రెండు Sentence లను)
¤  A Conjunction is a word which merely joins together words, phrases, clauses and most often sentences.
గమనిక :  and, but, both, or, not, else, still, yet, for, therefore, so, hence, wherefore, consequently, them, also, too, only లాంటి సందర్భాలను బట్టి Conjunction లే.

¤  కానీ ....Conjunctions must be carefully distinguished from Relative Pronouns, Relative Adverbs, and Prepositions, which are also ‘connecting-words’.
e.g.:   This is the house that Bhaskar built. (Relative Pronoun)
          This is the place where he was murdered. (Relative Adverb)
          Take this and give that. (Conjunction)

 

CONJUNCTION రకాలు
1. Simple Conjunctions:
and, but, still, yet, otherwise, or, so, therefore , because మొదలైనవి. e.g.: He failed in the exam for he was lazy.
2. Pair Conjunctions: either . . .or; neither . . .nor; not only . . . but also; లాంటివి correlative గా ఉంటాయి.
e.g.: He is either a rogue or a fool.
3. Subordinating Conjunctions: that, if, as, though, although, for, since, even though,
unless, lest, before, till, until మొదలైనవి కాలాన్ని, కారణాన్ని, ఫలితాన్ని, పోలికని, షరతుని.... తెలియజేసేందుకు conjunctions గా వస్తాయి.
e.g.: Wait till I return.
Parts of Speech  లో ఇక చివరి విభాగమైన Interjection ఏమిటో చూద్దాం.

8. INTERJECTION: హఠాత్తుగా మనసులో కలిగే సంతోషం, ఆశ్చర్యం, విచారం, భీతిని తెలియజేసే పదాలు Interjections (భావోద్రేక ప్రకటనార్థాలు).
(Ah! Oh! Alas! Hurrah! Ho! మొదలైన శబ్దాలన్నీ  Interjectionలే.
e.g.: Aye! Where are those tender wintry winds . . .
        So, an Interjection is a word which expresses some sudden and strong feeling such as joy, surprise, sorrow, fear etc.
కింద ఇచ్చిన అభ్యాసాన్ని ప్రయత్నించండి.

 

EXERCISE
¤ Identify the part of speech of the underlined words in the following sentences.

1. John won a prize in the competition.
2. Neha looked at the clock.
3. He was angry with his staff.
4. Where did you buy the book?
5. She teaches English and French.
6. Children are fond of sweets.
ANSWERS : 1. Noun  2. Preposition  3. Adjective  4. Verb 5. Conjunction 6. Adverb

7. I saw her before.
8. I had met Sudha before her marriage.
9. I had got a job before I completed my graduation.
10. Dream more.
11. He is accustomed in live in a dream world.
12. I had dreamt a dream.
13. She is my better half.
14. I tried better this time to help her.
15. I always try my better to succeed in everything.
16. One should better oneself round the clock.
17. Book your car before the time gets lost.
18. The book I read last night was interesting.
19. His is a bookish language.
ANSWERS : 7. Adverb 8. Preposition 9. Conjunction 10. Verb 11. Adjective 12. Noun 13. Adjective 14. Adverb 15. Noun 16. Verb 17. Verb 18. Noun 19. Adjective.

20. They play a major role in their office.
21. It is not a child’s play.
22. He is a play boy in the cabinet.
23. We went round Delhi in a taxi.
24. He won the election in the last round.
25. I tried to bring him round to my idea.
26. Present him a round cake.
27. I always round up a discussion positively.
28. He cast a cold eye on her.
29. We eye on interesting things.
30. The doctors operated his left eye ball.
31. They wandered about in meadows.
32. I saw something pleasing about him.
ANSWERS : 20. Verb 21. Noun 22. Adjective 23. Preposition 24. Noun 25. Adverb 26. Adjective 27. Verb 28. Adjective 29. Verb 30. Adjective 31. Adverb 32. Preposition

33. All that glitters is not gold.
34. The baby was all alone when I saw it.
35. All animals are equal but some are more equal.
36. Walk as fast as you can.
37. She walks just as I do.
38. As I am ill, I can’t come out.
39. I have something else to tell you.
40. Work hard else you will fail.
41. Is there anything else?
42. Let us even the ground.
43. They went out for they had leisure.
44. It is no joke at all.
ANSWERS : 33. Noun 34. Adverb 35. Adjective 36. Adverb 37. Pronoun 38. Conjunction 39. Adjective 40. Conjunction 41. Adverb 42. Verb 43. Conjunction 44. Adjective

45. Alas! He is no more.
46. We near our death every moment.
47. Neither of the two girls has come.
48. Draw water from the well.
49. Talk less and work more.
50. Down with the reservations.
ANSWERS :
45. Adverb
46. Verb
47. Pronoun
48. Verb
49. Adverb
50. Verb

Posted Date : 13-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌