• facebook
  • whatsapp
  • telegram

బహుభుజి - త్రిభుజాలు

కొనను ఎత్తకుండా గీస్తే వక్రం!


మూడు భుజాలతో ఉండే త్రిభుజం, రేఖాగణిత భావనలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.  వివిధ వైశాల్యాలను గణించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. బహుభుజి మరిన్ని భుజాలతో అనేక ఆకారాలను సృష్టించడంలో సాయపడుతుంది. ఈ రెండూ జ్యామెట్రీ, భౌగోళిక సంబంధ గణిత సమస్యలను పరిష్కరించడానికి దోహదపడతాయి. కంప్యూటర్‌ గ్రాఫిక్స్, ఆర్కిటెక్చర్‌ రంగాల్లో, గణిత సిద్ధాంతాల అభివృద్ధిలోనూ ప్రధాన పాత్ర పోషించే బహుభుజి, త్రిభుజాల్లో రకాలను, నియమాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. భుజాలు-కోణాల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవాలి. 


వక్రం (Curve): పెన్సిల్‌ కొనను ఎత్తకుండా గీయగలిగే ప్రతి పటాన్ని వక్రం అంటారు.

సంవృత పటం(Closed figure): ఒక వక్రం తననుతాను కేవలం ఒక్కసారి మాత్రమే తాకితే ఆ పటం సంవృత పటం అవుతుంది.

గమనిక: సంవృత పటం ఏర్పడటానికి    కావాల్సిన రేఖాఖండాల సంఖ్య = కనీసం 3

వివృత పటం(Polygons): సంవృత పటాలు కాని వాటిని వివృత పటాలు అంటారు.

ఉదా:

బహుభుజిలు (Polygons): రేఖా ఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటారు. బహుభుజికి దాని భుజాల సంఖ్య ఆధారంగా పేరును నిర్ణయిస్తారు. 

కుంభాకార బహుభుజి (Convex Polygon):

* ఒక బహుభుజిలోని ప్రతీ కోణం 1800 కంటే తక్కువగా ఉంటే, ఆ బహుభుజిని కుంభాకార బహుభుజి అంటారు. ఒక బహు భుజిలోని ఏవైనా రెండు బిందువులను కలిపే రేఖా ఖండం యొక్క అన్ని బిందువులు ఆ బహుభుజి ప్రాంతానికే చెందితే దానిని కుంభాకార బహుభుజి అంటారు.


పుటాకార బహుభుజి(Concave Polygon):  ఒక బహుభుజిలోని ఏదైనా ఒక కోణం 1800ల కంటే ఎక్కువగా ఉంటే, దాన్ని   పుటాకార బహుభుజి అంటారు.

* ఒక బహుభుజిలోని ఏవైనా రెండు బిందువులను కలిపే రేఖాఖండం యొక్క అన్ని బిందువులు 

ఆ బహుభుజి ప్రాంతానికి చెందకపోతే దాన్ని పుటాకార బహుభుజి అంటారు.


క్రమబహుభుజి:

* భుజాలు, కోణాలు అన్నీ సమానంగా ఉండే బహుభుజిని క్రమబహుభుజి అంటారు.

గమనిక:                                     

*  n భుజాలున్న క్రమ బహుభుజిలోని కర్ణాల 

* n  భుజాలున్న క్రమ బహుభుజిలోని కోణాల మొత్తం = (2n - 4) x 90°

*  n భుజాలున్న క్రమ బహుభుజిలోని బాహ్య కోణాల మొత్తం = 3600

* n భుజాలున్న క్రమబహుభుజిలోని ఒక్కొక్క అంతర కోణం = 

* n భుజాలున్న క్రమ బహుభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం = 

త్రిభుజం:  మూడు రేఖాఖండాలతో ఏర్పడిన  సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు.

* త్రిభుజ శీర్షాలు A, B, C... వాటికి    ఎదురుగా ఉన్న భుజాలను a, b, c..... లతో సూచిస్తారు.

*  త్రిభుజంలోని 3 కోణాల మొత్తం = 1800.

*  త్రిభుజంలో భుజాలు, కోణాలు, శీర్షాలు మూడేసి చొప్పున ఉంటాయి.

*  త్రిభుజం అనేది అది ఉండే తలాన్ని మూడు బిందు సమూహాలుగా విభజిస్తుంది. అవి

1) త్రిభుజంపై ఉన్న బిందువుల సముదాయం.

2) త్రిభుజ అంతరంలోని బిందువుల  సముదాయం.

3) త్రిభుజ బాహ్యంగా ఉండే బిందువుల సముదాయం.

అసమానత్వ నియమాలు

*  త్రిభుజంలోని ఏ రెండు భుజాల మొత్తం అయినా మూడో భుజం కంటే ఎక్కువ.

a + b > c    b + c > a     c + a > b

*  ఏ రెండు భుజాల భేదం అయినా మూడో భుజం కంటే తక్కువ.

a - b < c    b - c < a    c - a < b

బాహ్య కోణం:

*   త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే కోణాన్ని బాహ్యకోణం అంటారు.

*    త్రిభుజంలోని బాహ్యకోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం.

*    బాహ్యకోణం అంతరాభిముఖ కోణాల్లో ప్రతి దాని కంటే పెద్దది.

*    త్రిభుజంలోని బాహ్యకోణాల మొత్తం = 3600.


భుజాలకు - కోణాలకు మధ్య ఉండే సంబంధం:

*  పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్దది గానూ, చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్నదిగానూ ఉంటుంది. 

*  సమాన కోణానికి ఎదురుగా ఉండే భుజాలు సమానంగా ఉంటాయి.

∆ ABC లో 0 అయితే  AB> AC > BC  అవుతుంది.

*  ∆ ABC లో AB = AC అయితే  

త్రిభుజాలు - రకాలు 

భుజాల పొడవుల ఆధారంగా త్రిభుజాలు 3 రకాలు

1. సమబాహు త్రిభుజం:

*  అన్ని భుజాలు సమానంగా ఉండే త్రిభుజం.

*  దీనిలో అన్ని కోణాలు సమానం.

*  ప్రతి కోణం విలువ 60లు ఉంటుంది.


2. సమద్విబాహు త్రిభుజం:

*  ఏవైనా రెండు భుజాలు సమానంగా ఉండే త్రిభుజం.

*  దీనిలో అసమాన భుజాన్ని భూమి అంటారు.

*  దీనిలో భూకోణాలు సమానం.


3) విషమబాహు త్రిభుజం:

*  ఏ రెండు భుజాలు సమానంగా లేని త్రిభుజం.

*  దీనిలో ఏ రెండు కోణాలు సమానంగా ఉండవు.


కోణాల విలువల ఆధారంగా త్రిభుజాలు 3 రకాలు అవి..

1) అల్పకోణ త్రిభుజం: 

*  ప్రతి కోణం అల్ప కోణంగా ఉండే త్రిభుజం. 

*  ప్రతి సమబాహు త్రిభుజం అల్పకోణ త్రిభుజం అవుతుంది.

2) అధిక కోణ త్రిభుజం: 

ఒక కోణం అధిక కోణంగా ఉండే త్రిభుజం.


3) లంబకోణ త్రిభుజం: 

*  ఒక కోణం 900 గా ఉన్న త్రిభుజం.

*  ఈ త్రిభుజంలో లంబకోణ శీర్షానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణం అంటారు (AC కర్ణం).

*  ఒక త్రిభుజంలోని రెండు కోణాలు పూరక కోణాలైతే అది లంబకోణ త్రిభుజం   అవుతుంది. 

*  పూరక కోణాలు సమానంగా ఉండే   త్రిభుజాన్ని లంబకోణ సమ ద్విబాహు త్రిభుజం అంటారు. దీనిలో కర్ణం భుజానికి  రెట్లు ఉంటుంది.

గమనిక:

*  ఒక త్రిభుజంలో ఉండదగిన అల్పకోణాల సంఖ్య = కనీసం 2.

* ఒక త్రిభుజంలో ఉండదగిన లంబ కోణాల సంఖ్య = 1.

* ఒక త్రిభుజంలో ఉండదగిన అధిక కోణాల సంఖ్య = 1.



 

రచయిత: సి.మధు

 

Posted Date : 07-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌