• facebook
  • whatsapp
  • telegram

అదనపు ఖర్చులు కలిపితేనే గిట్టుబాటు!

లాభనష్టాలు

ఒక వస్తువును కొనేటప్పుడు గమనిస్తే దానిపై ఒక రేటు ముద్రించి ఉంటుంది. డిస్కౌంటు తర్వాత అది ఇంకో ధర పలుకుతుంది. మొత్తం మీద అమ్మిన తర్వాత కచ్చితంగా లాభం వచ్చే విధంగా వ్యాపారులు చూసుకుంటారు. అయితే ఆ లాభాలను నిర్ణయించేటప్పుడు రాయితీ లేదా రుసుం, ప్రభుత్వాలు విధించే పన్నులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కొన్ని రకాల వస్తువులపై పన్నులు ఉండవు. లాభనష్టాల లెక్కలు చేసేటప్పుడు అభ్యర్థులు ఈ అంశాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. సంబంధిత సాంకేతిక పదాల అర్థాలను తెలుసుకోవాలి. అప్పుడే అనవసరమైన గందరగోళానికి గురికాకుండా సరైన సమాధానాన్ని గుర్తించగలుగుతారు.



    గిట్టుబాటు వెల = కొన్న వెల + అదనపు ఖర్చులు

గమనిక: (లాభ శాతం లేదా నష్ట శాతాన్ని ఎల్లప్పుడూ కొన్న వెలపై లెక్కిస్తాం.)

    ఒక వస్తువుపై ముద్రించిన వెలను ప్రకటన వెల/గుర్తించిన వెల/పట్టీ వెల/క్యాటలాగ్‌ వెల/ లిఖిత మూల్యం అని అంటారు.

    రుసుంను రాయితీ/ రిబేటు/ ముదరా అని కూడా అంటారు.

గమనిక: రుసుంను ఎల్లప్పుడూ ప్రకటన వెలపై లెక్కిస్తాం.

    రుసుం = ప్రకటన వెల - అమ్మిన వెల రుసుం



    ప్రకటన వెల M, రుసుం శాతం d% అయితే 


అమ్మకపు పన్ను/ విలువ ఆధారిత పన్ను (VAT)

    వస్తువుల అమ్మకాలపై ప్రభుత్వం వసూలు చేసే పన్నును విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) అంటారు.

    అమ్మకపు పన్నును రవాణా చేసే సరకులపై మాత్రమే విధిస్తారు.

    VAT నిత్యావసర వస్తువులు, సేవలపై ఉండదు.

    VATను ఎల్లప్పుడూ అమ్మకపు పన్నుపై లెక్కిస్తారు. ఇది అమ్మకపు వెలపై పెరుగుదల శాతం.


మాదిరి ప్రశ్నలు


1. ఒక వస్తువు కొన్న వెల రూ.2400, లాభశాతం 20%. అయితే దాన్ని అమ్మిన వెల ఎంత?

1) రూ.2600       2) రూ.2660   

3) రూ.2860       4) రూ.2880


2. ఒక వస్తువు కొన్న వెల రూ.528, లాభం రూ.44. అయితే లాభశాతం ఎంత?

 


3.  జాన్‌ ఒక గడియారాన్ని రూ.301కు అమ్మగా 14% నష్టపోయాడు. అయితే అతడు ఆ గడియారాన్ని కొన్న వెల ఎంత?

1) రూ.330      2) రూ.350   

3) రూ.370       4) రూ.380


4. అజయ్‌ ఒక టి.వి.ని రూ.15,000 లకు కొని రూ.14,100 లకు అమ్మితే నష్టశాతం ఎంత?

1) 5%    2) 6%    3) 8%    4) 9%


5.  లాభం 20% అయితే కొన్న ఖరీదును ఏ భిన్నంతో గుణిస్తే అమ్మిన వెల వస్తుంది?


6.  ఒక వస్తువు లాభం, కొన్న వెలల నిష్పత్తి 4 : 9. అయితే కొన్న వెల, అమ్మిన వెలల నిష్పత్తి ఎంత?

1) 4 : 13  2) 9 : 4  3) 9 : 13  4) 13 : 9 1
 


8. ఒక బల్లను రూ.2142 లకు అమ్మగా 5% లాభం వచ్చింది. దానిపై 10% లాభం రావాలంటే దానిని ఎంతకు అమ్మాలి?

1) రూ.2266       2) రూ.2244   

3) రూ.2422       4) రూ.2288


9.  ఒక వర్తకుడు ఒక వస్తువును రూ.2560కి అమ్మి 4% నష్టం పొందాడు. ఆ వస్తువుపై 8% లాభం పొందేందుకు దానిని అమ్మాల్సిన ధర ఎంత?

1) రూ.2680       2) రూ.2700   

3) రూ.2800       4) రూ.2880


10. ఒక పుస్తకాల వ్యాపారి రీము తెల్లకాగితాలు రూ.100 లకు కొని దస్తా రూ.6.50 లకు అమ్మితే మొత్తం మీద లాభమా, నష్టమా ఎంత శాతం?

1) 20% లాభం       2) 20% నష్టం   

3) 30% నష్టం       4) 30% లాభం


11. పండ్ల వర్తకుడు తన వద్ద ఉన్న పండ్లలో సగ భాగం 60% లాభానికి,  వ భాగం 20% లాభానికి అమ్మాడు. మిగిలినవి పాడయ్యాయి. మొత్తం మీద అతడికి లాభమా, నష్టమా ఎంత శాతం?

1) లాభం 10%     2) లాభం 8% 

3) నష్టం 8%     4) నష్టం 10%


12. మధు, హరిత ఒక కొత్త ఇంటిని రూ.32,000లకు కొన్నారు. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ ఇంటిని రూ.28,000లకు అమ్మితే వచ్చిన నష్టశాతం ఎంత?

1) 10.5%  2) 11% 3) 12% 4) 12.5%


13. శ్రావ్య ఒక గడియారాన్ని రూ.480లకు కొని, రాధకు 6  % లాభానికి అమ్మింది. రాధ ఆ వాచీని 10% లాభంతో దివ్యకు అమ్మింది. అయితే దివ్య చెల్లించిన మ్తొతం ఎంత?

1) రూ.567    2) రూ.561 

3) రూ.551    4) రూ.541


14. గోపి ఒక గడియారాన్ని 12% లాభానికి ఇబ్రహీంకు అమ్మాడు. ఇబ్రహీం దానిని 5%  నష్టానికి జాన్‌కు అమ్మాడు. జాన్‌ ఆ వాచీకి  రూ.1330 లు చెల్లిస్తే, గోపి ఆ గడియారాన్ని ఎంతకు  కొన్నాడు? 

1) రూ.1050     2) రూ.1100 

3) రూ.1250     4) రూ.1280


15. ఒక వ్యాపారి 1000 కిలోల పంచదారలో కొంత భాగాన్ని 8% లాభానికి అమ్మాడు. మిగిలిన భాగాన్ని 18% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతడికి 14% లాభం వస్తే... 18% లాభానికి అమ్మిన పంచదార ఎన్ని కిలోలు?

1) 350 కిలోలు       2) 400 కిలోలు   

3) 650 కిలోలు        4) 600 కిలోలు


16. ఒక వర్తకుడు ఒక్కొక్కటీ రూ.20,000ల చొప్పున రెండు వస్తువులను అమ్మాడు. ఒకదానిపై 20% లాభం, రెండోదానిపై 20% నష్టం పొందాడు. అయితే మొత్తం మీద అతడికి లాభమా, నష్టమా, ఎంత శాతం?

1) లాభం 4%       2) నష్టం 4% 

3) లాభం 2%       4) లాభం/నష్టం ఉండదు


17. రూ.1200ల చొప్పున మీనా రెండు ఫ్యాన్లు కొనింది. వాటిలో ఒకదాన్ని 5% నష్టానికి, రెండోదాన్ని 10% లాభానికి అమ్మింది. అయితే మొత్తం మీద ఆమెకు లాభమా, నష్టమా ఎంత శాతం?

1) 2.5% లాభం     2) 2.5% నష్టం 

3) 1.5% లాభం     4) 1.5% నష్టం


18. ఒక మెకానిక్‌ రెండు స్కూటర్లను ఒక్కొక్క దానిని రూ.10,976 లకు అమ్మగా మొదటి దానిపై 12% లాభం, రెండోదానిపై 2% నష్టం వచ్చాయి. మొత్తం మీద అతడికి లాభమా, నష్టమా, ఎంత శాతం?

1) 3.54% లాభం     2) 4.53% నష్టం 

3) 4.53% లాభం     4) 3.54% నష్టం


19. 20 పెన్నుల కొన్న వెల.. 6 వస్తువుల అమ్మిన వెలకు సమానమైతే లాభశాతం ఎంత?    

1) 10%  2) 15%  3) 20%  4) 25%


20. 10 ఆపిల్స్‌ను రూ.50 లకు కొని, 15 ఆపిల్స్‌ను రూ.60 లకు అమ్మినా.. మొత్తంమీద లాభమా, నష్టమా, ఎంత శాతం?

1) లాభం 25%     2) నష్టం 20% 

3) లాభం 20%     4) నష్టం 25%


21. ఒక వస్తువు కొన్న వెలకు, అమ్మిన వెలకు తేడా రూ.360. లాభం 20% అయితే అమ్మిన వెల ఎంత?

1) రూ.2610     2) రూ.2160 

3) రూ.2106     4) రూ.2601


22. ఒక వస్తువును రూ.832 లకు అమ్మగా వచ్చిన లాభం, అదే వస్తువును రూ.448 లకు అమ్మగా వచ్చిన నష్టానికి సమానం. అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత?

1) రూ.960 2) రూ.820 3) రూ.640 4) రూ.760


23. వెంకన్న 50 డజన్ల అరటిపండ్లను రూ.1250లకు కొన్నాడు. రవాణాకు రూ.250 ఖర్చు చేశాడు. ఆ పండ్లలో 5 డజన్లు కుళ్లిపోయాయి. మిగిలిన వాటిని డజను రూ.35లకు అమ్మితే అతడికి లాభమా? నష్టమా, ఎంత శాతం?

1) లాభం 8%        2) లాభం 10%        

3) నష్టం 10%       4) నష్టం 8%


24. వినయ్‌ ఒక ఫ్లాట్‌ను రూ.4,50,000 లకు కొని దాని మరమ్మతులు, రంగులు వేయడానికి    రూ.10,000లు ఖర్చు చేశాడు. తర్వాత దానిని రూ.4,25,500లకు అమ్మితే అతడికి వచ్చే నష్ట శాతం ఎంత?

1) 9%   2) 8%   3) 10%   4) 7.5%


25. ఒక వస్తువు అమ్మిన వెల రూ.35. రుసుం అయిదు రూపాయలైతే రుసుం శాతం ఎంత?


26. రుసుం 25% అయితే అమ్మిన వెలను ఏ భిన్నంతో గుణిస్తే ప్రకటన వెల వస్తుంది?


27. ఒక డీలరు తన దగ్గర ఉన్న వస్తువులపై 10% తగ్గింపును ఇచ్చి కూడా 10% లాభం పొందాడు. ఒక వస్తువు కొన్న వెల రూ.900. అయితే దాని ప్రకటన వెల ఎంత?

1) రూ.1200        2) రూ.1150    

3) రూ.1000        4) రూ.1100


28. ఒక రేడియో పట్టీ వెల రూ.1200. దానిపై 20% రుసుం ఇచ్చి అమ్మితే 4% నష్టం వస్తుంది. అయితే రేడియో కొన్న వెల ఎంత?

1) రూ.900     2) రూ.1000 

3) రూ.1100     4) రూ.980


29. దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న వెల కంటే 25% అధికంగా ప్రకటించాడు. అతడు ప్రతి వస్తువుపై 12% రుసుం ఇస్తే   అతడికి వచ్చే లాభశాతం ఎంత?

1) 10%   2) 9 %   3) 8%   4) 7%


30. ఒక వస్తువు పై రెండు వరుస లాభాలు 10%, 20% లకు సమానమైతే ఒకే లాభం ఎంత?

1) 10%  2) 15%  3) 20%   4) 25%


31. నీలిమ దుస్తులు కొనడానికి దుకాణానికి వెళ్లింది. ఆమె ఎంచుకున్న దుస్తుల ప్రకటన వెల     రూ.1000. దుకాణదారుడు మొదట 20%, తర్వాత 5% రుసుం ఇచ్చాడు. అయితే ఆమెకు మొత్తం మీద ఎంత శాతం రుసుం లభించింది?

1) 25%  2) 26%  3) 24%  4) 20%


32. ఒక సైకిల్‌ ప్రకటన వెల రూ.1280. 10% రుసుం ఇచ్చి అమ్మితే రూ.72 లాభం వచ్చింది. అయితే సైకిల్‌ కొన్నవెల ఎంత? 

1) రూ.1180       2) రూ.1280   

3) రూ.980    4) రూ.1080 


33. ఒక వస్తువు పట్టీ వెల రూ.2400. దానిపై 10% రుసుం ఇచ్చి 8% లాభం పొందాలంటే ఆ వస్తువు అసలు ధర ఎంత?

1) రూ.1850      2) రూ.1900 

3) రూ.1980      4) రూ.2000


34. ఒక దుకాణంలో జత స్కేటింగ్‌ బూట్ల వెల   రూ.450. దానిపై 6% అమ్మకపు పన్ను విధిస్తే చెల్లించాల్సిన బిల్లు మొత్తం ఎంత?

1) రూ.477        2) రూ.462 

3) రూ.455    4) రూ.465 


35. వహీదా ఒక ఎయిర్‌ కూలర్‌ను 10% పన్నుతో కలిపి రూ.3300 లకు కొంది. VAT కలపక ముందు ఎయిర్‌ కూలర్‌ ఖరీదు ఎంత?

1) రూ.3630  2) రూ.3000 3) రూ.2800 4) రూ.3500


36. ఒక వస్తువు 18% GST తో కలిపి రూ.784లకు కొన్నారు. GST కలపక ముందు దాని అసలు ఖరీదు ఎంత?(సుమారుగా)

1) రూ.664  2) రూ.660  3) రూ.684  4) రూ.724


37. ఒక వడ్రంగి తాను తయారుచేసిన వస్తువులపై 15% తగ్గింపును ఇస్తాడు. ఒక కుర్చీ అమ్మిన వెల రూ.680 అయితే దాని ప్రకటన వెల ఎంత?

1) రూ.800  2) రూ.850    3) రూ.900    4) రూ.750


38. రాధిక ఒక పాత రిఫ్రిజిరేటర్‌ను రూ.5000 లకు కొని రూ.100 రవాణాకు, రూ.500 లు మరమ్మతులకు ఖర్చు చేసింది. ఆమె దానిని రూ.7000 లకు అమ్మితే లాభ/ నష్ట శాతం ఎంత?

1) 25% లాభం  2) 25% నష్టం  3)20% లాభం   4) 20% నష్టం  


39. ఒక వస్తువును రూ.216 లకు అమ్మగా వచ్చిన లాభం, రూ.124 లకు అమ్మగా వచ్చిన నష్టానికి సమానమైతే ఆ వస్తువు కొన్నవెల ఎంత?

1) రూ.190   2) రూ.180    3) రూ.170   4) రూ.160 


40. ఒక డీలరు సరకును కొన్నవెలకే అమ్ముతానని చెబుతూ ఒక కిలో బరువును 960 గ్రాములు మాత్రమే ఉపయోగిస్తాడు. అయితే అతడికి లాభశాతం ఎంత?

1) 4%    2) 3 5/6%  3) 4 1/6%    4)  4 1/2%     


సమాధానాలు

1-4; 2-3; 3-2; 4-2; 5-2; 6-3; 7-1; 8-2; 9-4; 10-4; 11-1; 12-4; 13-2; 14-3; 15-4; 16-2; 17-1; 18-3; 19-4; 20-2; 21-2; 22-3; 23-2; 24-4; 25-2; 26-3; 27-4; 28-2; 29-1; 30-2; 31-3, 32-4, 33-4, 34-1, 35-2, 36-1, 37-1, 38-1, 39-3, 40-3. 
 

Posted Date : 24-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌