• facebook
  • whatsapp
  • telegram

వనరుల వినియోగం

గణిత గ్రంథాలయం 
* గణిత పుస్తకాలు, గణిత పత్రికలు మాత్రమే ఉండే గ్రంథాలయం.
 * గణిత పుస్తకాలు మాత్రమే దొరికే స్థలం.
* గణిత గ్రంథాలయాలను నిర్వహించేవారు - గణిత ఉపాధ్యాయుడు (లేదా) ఆసక్తి ఉండే సీనియర్ విద్యార్థి.
* గణిత గ్రంథాలయం ప్రతిభావంతులకు ఉన్నత స్థాయి పుస్తకాలను అందిస్తూ వారి జ్ఞానతృష్ణను తీరుస్తుంది.
* గణిత గ్రంథాలయం మంద అభ్యాసకులకు వరం లాంటిది.
* సాధారణ స్థాయి విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలకు మరికొంత జ్ఞానాన్ని జోడించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇతర నూతన అంశాలు నేర్చుకోవడానికి సహకరిస్తాయి.
* తరగతి గదిలో చెప్పిన అంశాన్ని వీలైనన్ని సార్లు చదువుకుని, పునశ్చరణ చేసుకోవడానికి గణిత గ్రంథాలయం సహకరిస్తుంది.

గణిత ప్రయోగశాల 

 * గణిత ప్రయోగశాల ఉపాధ్యాయుడికి కుడి చేయి లాంటిది.
* గణితంలో ఎన్నో అంశాలను సులభంగా, కళ్లకు కట్టినట్లు బోధించడానికి ఇది ఉపయోగపడుతుంది.
* గణిత ప్రయోగశాలలో ఉపాధ్యాయుడు తాను సేకరించిన, పొందుపరిచిన సామగ్రిని భద్రపరుచుకుంటాడు. వాటిని తరగతి గదిలో బోధనకు అవసరమైనప్పుడు ఉపయోగిస్తాడు.
¤ విద్యార్థులకు స్వయంగా పరీక్షించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
* అమూర్త అంశాలను మూర్తంగా బోధించడానికి ఉపకరిస్తుంది.
* మంద అభ్యాసకులు త్వరగా అభ్యసించడానికి సహకరిస్తుంది.

 

గణితంలో నిర్వహించదగ్గ కొన్ని క్రీడలు 
* గణిత అంత్యాక్షరి
* గణిత క్విజ్
* గణితం వక్తృత్వ పోటీ
* గణిత వ్యాసరచన
* గణితంలో స్క్రాప్ బుక్
* గణితంలో చిక్కు ప్రశ్నలు
* గణితంలో క్రాస్‌వర్డ్ పజిల్స్
* వింత చదరాలు
* గణితంలో మనోరంజక అమరికలు


గణిత క్లబ్బు 
* గణిత కార్యక్రమాలను నిర్వహించేందుకు స్థాపించిన పాఠశాల విభాగమే గణిత క్లబ్బు.

 

గణిత క్లబ్ నిర్వహణ 
* సహపాఠ్య కార్యక్రమాలు, ఆటపాటలు, ఉపన్యాసాలు మొదలైనవి.
* గణితం పట్ల ఆసక్తి ఉండే కొందరు వ్యక్తులు కలిసి ఇష్టాగోష్టి జరిపే చోటే గణిత క్లబ్.
* ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి బోధించడానికి సాధ్యమయ్యే చోటు.
* గణిత క్లబ్ నిర్వహణాధికారి - గణిత ఉపాధ్యాయుడు.
* గణిత క్లబ్ అధ్యక్షుడు - ప్రధానోపాధ్యాయుడు.
* గణిత క్లబ్ ఉపాధ్యక్షుడు - సీనియర్ గణిత ఉపాధ్యాయుడు.
* గణిత క్లబ్‌కు అనుబంధంగా నడిచేవి - గణిత గ్రంథాలయం, గణిత ప్రయోగశాల.

గణిత క్లబ్ కార్యక్రమాలు
* గణితంలోని వివిధ అంశాల గురించి ఉపన్యాసాలు ఇప్పించడం.
* వ్యాసరచన, వక్తృత్వం లాంటి అంశాల్లో విద్యార్థులకు పోటీలు పెట్టడం.
* క్విజ్‌లు నిర్వహించడం.
* వింత చదరాలు పూరించడం.
* చిక్కు ప్రశ్నలు వేయడం, సాధించడం.
* గణిత శాస్త్రవేత్తల పుట్టిన రోజులు, ఇతర ప్రత్యేక దినాలను నిర్వహించడం.
* గణిత దినోత్సవం జరపడం.
* విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధులను చేయడం.
* గణిత యాత్రలకు తీసుకెళ్లడం.
* బ్యాంకు నిర్వహణ లాంటి కార్యక్రమాలు చేపట్టడం.
* గణిత క్లబ్బుకు కావాల్సిన మానవ వనరులు: దర్జీ, వడ్రంగి, తోటమాలి మొదలైనవారు.
* సంస్థాపరమైన వనరులు: బ్యాంక్, పోస్టాఫీస్, మార్కెట్.
* ''గణితంలో సత్యమే కాదు, సౌందర్యం కూడా ఉంది" అని పేర్కొన్నవారు రస్సెల్.

Posted Date : 05-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు