• facebook
  • whatsapp
  • telegram

విద్యాహక్కు చట్టం - 2009

ప్రాథమిక తరగతులకు ప్రవేశ పరీక్షపై నిషేధం!


దేశంలో బాలలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలన్న ఆశయంతో భారత పార్లమెంటు చేసిన చట్టమే ‘ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం - 2009’. ప్రాథమిక విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఈ చట్టం, విద్యార్థికి విద్యను ప్రాథమిక హక్కుగా అందించే దేశాల జాబితాలో భారత దేశాన్ని చేర్చింది. బోధనా శైలి, మూల్యాంకన పద్ధతులు, ప్రవేశాల ప్రక్రియను సమూలంగా మార్చి, ఆధునిక ధోరణులకు బాటలు వేసిన ఈ చట్టంపై ఉపాధ్యాయులు కావాలనుకుంటున్న అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. అందులోని ముఖ్యాంశాలను సెక్షన్ల వారీగా గుర్తుంచుకోవాలి.


1.    విద్యాహక్కు చట్టానికి సంబంధించి సరైంది?

1) 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక షెడ్యూల్‌    2) 6 అధ్యాయాలు, 31 సెక్షన్లు, 2 షెడ్యూళ్లు

3) 8 అధ్యాయాలు, 39 సెక్షన్లు, 4 షెడ్యూళ్లు   4) 9 అధ్యాయాలు, 37 సెక్షన్లు, 6 షెడ్యూళ్లు


2.     కిందివాటిలో RTE - 2009 కి సంబంధించి సరికానిది?

1) ఈ చట్టం పర్యవేక్షణ బాధ్యతను సమగ్ర శిక్షణ అభియాన్‌ చూసుకుంటుంది. 

2) ఈ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం - ఉత్తర్‌ప్రదేశ్‌

3) ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం, రాష్ట్ర నిధుల నిష్పత్తి 90 : 10

4) ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15కి లోబడి ఉన్నాయి.


3.     ఎ) 1 - 5 తరగతుల ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1 : 30

బి) 6, 7, 8 తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1 : 40

1) ఎ, బి లు సరైనవి    2) ఎ, బి లు సరైనవి కావు

3) ఎ సరైంది, బి సరైంది కాదు   4) ఎ సరైంది కాదు, బి సరైంది


4.     ఒక ప్రాథమిక పాఠశాలలో 148 మంది విద్యార్థులున్నారు. ఆర్‌టీఈ-2009 ప్రకారం ఆ పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య?

1) 5     2) 4     3) 3      4) 6


5.     విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం కింది ఏ  సందర్భంలో ఉపాధ్యాయుడి సేవలను విద్యేతర పనులకు ఉపయోగించుకోవచ్చు?    

1) జనాభా గణన        2) ఎన్నికల విధులు 

3) ప్రకృతి విపత్తుల సమయం 4) పైవన్నీ


6.     విద్యాహక్కు చట్టం-2009 ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం ఏ రకమైన హక్కు?

1) సమానత్వపు హక్కు  2) సాంస్కృతిక విద్యావిషయక హక్కు

3) స్వేచ్ఛా హక్కు         4) రాజ్యాంగ పరిహార హక్కు 


7.     విద్యాహక్కు చట్టం-2009లో ‘పాఠశాలల్లో చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు’ అని తెలియజేసే సెక్షన్‌?

1) సెక్షన్‌ - 14     2) సెక్షన్‌ - 13 

3) సెక్షన్‌ - 15     4) సెక్షన్‌ - 16


8.    విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఉండాల్సిన  పనిదినాలు?

1) 200   2) 220   3) 234   4) 215


9.     ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 5 దేనిని వివరిస్తుంది?

1) స్థానిక ప్రభుత్వ బాధ్యతలు     2) బడుల బాధ్యతలు

3) వయసు ధ్రువీకరణ     4) వేరే బడికి బదిలీ హక్కు


10. ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలుకు నిధులు సమకూర్చే బాధ్యత-     

1) పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిది    2) పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిది 

3) కేంద్రం 75% - రాష్ట్రం 25%   4) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన బాధ్యత


11. విద్యాహక్కు చట్టం-2009లోని ఏ సెక్షన్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని తెలియజేస్తుంది?

1) సెక్షన్‌ 23(1)     2) సెక్షన్‌ 23(3) 

3) సెక్షన్‌ 23(2)     4) సెక్షన్‌ 23(4)


12. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం కిందివాటిలో సరికానిది-

1) ప్రైవేటు పాఠశాలలో ప్రవేశ రుసుం తీసుకోకూడదు.

2) వయసు నిర్ధారణ పత్రం లేదనే సాకుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

3) స్టాగ్నేషన్‌ను కొనసాగించాలి.

4) బదిలీ పత్రం లేదనే సాకుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు.


13. కిందివాటిలో విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం సరికానిది?    

1) పిల్లవాడికి అతడి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించడం.

2) ఎలిమెంటరీ విద్య పూర్తిచేసే ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావాలి.

3) బాలలందరికీ (6-14 సంవత్సరాలు) ఉచిత నిర్బంధ విద్యాహక్కు.

4) ఏ పిల్లవాడికి జన్మ ధ్రువపత్రం, బదిలీ పత్రం లేదని పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు.


14. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం కింది ప్రవచనాల్లో సరైంది?

1) నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత ప్రవేశం ఇవ్వకూడదు.

2) బదిలీ ధ్రువపత్రం లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు.

3) బదిలీ ధ్రువపత్రం లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించకూడదు.

4) వయసుకు తగిన తరగతిలో నేరుగా ప్రవేశం ఇవ్వకూడదు.


15. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం, పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడికైనా ఈ విద్యాస్థాయి పూర్తిచేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచడం లేదా బయటకు పంపడం చేయకూడదు?

1) ప్రాథమిక విద్య     2) ప్రాథమికోన్నత విద్య 

3) సెకండరీ విద్య     4) ఎలిమెంటరీ విద్య


16. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం మూల్యాంకనం ఏ విధంగా ఉండాలి?    

1) విద్యార్థి వ్యక్తిగతాభివృద్ధి పత్రానికి (పీపుల్‌  క్యుములేటివ్‌ రికార్డు) సంబంధించి ఉపాధ్యాయులే నిర్వహించాలి.

2) నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలి.

3) ఉత్తీర్ణత కాలేదనే కారణంతో ఏ విద్యార్థిని    ఆపకూడదు.

4) పైవన్నీ


17. కిందివాటిలో విద్యాహక్కు చట్టానికి సంబంధించి సరికాని వాక్యం?    

1) 14 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఉచిత విద్యను పొందే హక్కు విద్యార్థికి ఉంటుంది.

2) పాఠశాలలో చేరడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని విద్యార్థి అందజేయాలి.

3) ఇది 6  14 సంవత్సరాల మధ్య వయసు వారికి సంబంధించింది.

4) ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసుకోని విద్యార్థులను వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి.


18. నిర్బంధ విద్య అంటే?

1) 6 - 14 వయసున్న వారందరికీ ఉచిత ప్రాథమిక విద్య.

2) 6  -14 వయసున్న వారికి ఉచిత ప్రాథమిక విద్య అందించడం, వారు ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడటం.

3) 03 - 06 వయసు వారికి పూర్వప్రాథమిక విద్య, 6 - 14 వయసు వారికి ప్రాథమిక విద్య.

4) ప్రాథమిక విద్య చదివిన వారంతా సెకండరీ విద్య చదవడం.


19. 3 సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయడానికి, 6 ఏళ్లు నిండే వరకు పూర్వపాఠశాల విద్యను కల్పించాలని పేర్కొన్న సెక్షన్‌?

1) సెక్షన్‌-6     2) సెక్షన్‌-11 

3) సెక్షన్‌-1     4) సెక్షన్‌-4


20. RTE చట్టం-2009 ప్రకారం పాఠశాలలో చేరేందుకు క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేస్తే విధించే జరిమానా-

1) వసూలు చేసిన పైకానికి పదిరెట్లు     2) రూ.లక్ష

3) రూ.25 వేలు 4) సందర్భానికి అనుగుణంగా విధింపు


21. విద్యాహక్కు చట్టం-2009లోని సెక్షన్‌ 21 చర్చించే అంశం?    

1) బడి నియమాలు              2) గుర్తింపు 

3) పాఠశాలల యాజమాన్య సంఘం     4) సంబంధిత ప్రభుత్వాల బాధ్యత


22. హోదా, హక్కుల్లో మనుషులంతా స్వేచ్ఛగా, సమానంగా జన్మించారు. ఇది దేనికి సంబంధించింది?

1) సమాచార హక్కు చట్టం - 2005

2) విశ్వమానవ హక్కుల ప్రకటన

3) బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009

4) మానవ అభివృద్ధి సూచిక


23. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలు ఎంత శాతం మించరాదు?

1) 15%       2) 10%   

3) 5%       4) 25% 


24. విద్యాహక్కు చట్టంలో బాలల హక్కుల సంరక్షణను ఏ అధ్యాయంలో చర్చించారు?    

1) 2     2) 4      3) 6     4) 8 


25. ఒక విద్యార్థిని అతడి తల్లిదండ్రులు డిసెంబరులో పాఠశాల ప్రవేశం కోసం తీసుకొచ్చారు. అప్పుడు ప్రధానోపాధ్యాయులు-

1) తల్లిదండ్రులను మందలించాలి 

2) పై అధికారుల అనుమతి తీసుకోవాలి

3) వెంటనే చేర్చుకోవాలి 

4) వచ్చే సంవత్సరం రమ్మని సలహా ఇవ్వాలి


26. RTE Act - 2009 ప్రకారం జాతీయ పర్యవేక్షణ కమిటీలో ఛైర్మన్‌తో సహా ఎంతమంది ఉంటారు?    

1) 15   2) 27   3) 30    4) 10  


27. విద్యాహక్కుచట్టం - 2009 ప్రకారం ప్రాథమిక విద్య అంటే...

1) 1 నుంచి 5వ తరగతి    2) 1 నుంచి 8వ తరగతి

3) 6 నుంచి 10వ తరగతి    4) 4 నుంచి 10వ తరగతి


28. కిందివాటిలో విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం తప్పుగా జతపరచింది?

1) అధ్యాయం 2 - ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు

2) అధ్యాయం 4 - ఉపాధ్యాయుల బాధ్యతలు 

3) అధ్యాయం 7 - పాఠశాలల ప్రమాణాలు 

4) అధ్యాయం 1 - బాలల హక్కుల సంరక్షణ 


29. కిందివాటిలో సరికాని ప్రవచనం?

1) విద్యార్థుల సంఖ్య 200 దాటితే ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1 : 40

2) ఒక పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.

3) తాత్కాలిక ప్రాతిపదికన తీసుకునేవారు ఆరోగ్య వ్యాయామ విద్య, వృత్తి విద్య, కళావిద్య ఉపాధ్యాయులు.

4) విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో ఉండే పనిదినాలు - 200 రోజులు


30. RTE Act - 2009లోని 23వ సెక్షన్‌ ప్రకారం ఉపాధ్యాయ అర్హతలు నిర్ణయించేది?

1zNCERT 2z NCTE

3z CABE 4z UGC


31. డిసెంబరు 10ని ఈ దినంగా పాటిస్తారు-

1) బాలల హక్కుల దినం     2) మావన హక్కుల దినం

3) ఐక్యరాజ్యసమితి దినం         4) ప్రజాసంక్షేమ దినం



సమాధానాలు

1-1; 2-4; 3-3; 4-1; 5-4; 6-3; 7-2; 8-1; 9-4; 10-4; 11-1; 12-3; 13-2; 14-3; 15-4; 16-4; 17-2; 18-2; 19-2; 20-1; 21-3; 22-2; 23-2; 24-3; 25-3; 26-1; 27-2; 28-4; 29-2; 30-2; 31-2.


రచయిత: కోటపాటి హరిబాబు  
 

Posted Date : 09-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌