• facebook
  • whatsapp
  • telegram

నదీ వ్యవస్థ

గోదావరిలో కోనసీమ.. కృష్ణాలో దివిసీమ!


 ప్రజలకు జీవనోపాధి, వ్యవసాయ ప్రగతి, ఆర్థిక పురోగతి, మతవిశ్వాసాలు, నగరీకరణ లాంటి కీలక అంశాలెన్నో నదులతోనే ముడిపడి ఉంటాయి. అందుకే వందల నదులతో అలరారుతున్న భారత నదీ వ్యవస్థ స్వరూపంపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. హిమాలయ, ద్వీపకల్ప నదుల్లో పెద్ద నదులు, ప్రధాన ఉపనదులు, వాటి ప్రవాహమార్గాల పొడవు, ప్రవహించే రాష్ట్రాలు, తీరాల్లో వెలసిన పట్టణాలు, నగరాలు, పుణ్యక్షేత్రాలు, నదీ వ్యవస్థలతో అనుబంధంగా ఉన్న సరస్సులు, జలపాతాలు, నదుల పాయల మధ్యలో ఉన్న దీవులు, సముద్రంలో కలిసే ప్రాంతాల వివరాలను తెలుసుకోవాలి.


 

1.     ‘బాసర’ ఏ నది ఒడ్డున ఉంది?

1) కృష్ణా  2) గోదావరి 3) వార్దా 4) ప్రాణహిత


2.     కింది వాటిలో మహానది ఉపనది కానిదాన్ని గుర్తించండి.

1) ఇబ్‌   2) ఓంగ్‌    3) శాంక్‌   4) జోంక్‌


3.     కింది వాటిలో నర్మదా నది ఉపనది కానిది ఏది?

1) దరాది   2) తావా   3) షక్కర్‌   4) బోరి


4.     అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో రెండో పొడవైన నది?

1) నర్మద  2) తపతి  3) సింధు  4) సబర్మతి


5.     కిందివాటిలో హక్రా నది అని దేనిని పిలుస్తారు?

1) బానీ నది       2) ఘగ్గర్‌ నది  

3) లూనీ నది       4) తీస్తా నది


6.     మన దేశంలో ప్రవహించే నాలుగో పొడవైన నది?

1) గోదావరి  2) కావేరి 3) నర్మద  4) యమున


7.     కృష్ణానది ఉపనదుల్లో పొడవైనది?

1) బీమా 2) తుంగభద్ర 3) కోయనా 4) మున్నేరు


8.     బ్రాహ్మణి నది ఒడిశాలోని ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది?

1) కిర్తానియ      2) ధర్మా  

3) కటక్‌       4) చిల్కా సరస్సు


9.     కిందివాటిలో పెన్నా నది ఎడమ వైపు ఉండే ఉపనదిని గుర్తించండి.

1) జయమంగళి      2) చిత్రావతి  

3) చెయ్యేరు        4) మూసీ


10. కిందివాటిలో గోదావరి నది కుడి వైపు ఉండే ఉప నదిని గుర్తించండి.

1) కిన్నెరసాని      2) ప్రాణహిత  

3) ఇంద్రావతి      4) శబరి


11. కింది ఏ జలపాతాన్ని ‘నయాగరా ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు?

1) జోగ్‌      2) ధువన్‌ధార  

3) చిత్రకూట్‌      4) కపిలధార


12. శివసముద్రం ఏ నది తీరంలో ఉంది?

1) కృష్ణా  2) కావేరి  3) పాలార్‌ 4) తుంగభద్ర


13. కింది వాటిలో ఏది కావేరి నదికి ఉపనది కాదు?

1) అర్కావతి       2) కబిని   

3) లక్ష్మణతీర్థ    4) గోమతి


14. అలంపూర్‌ ఏ నదీ తీరంలో ఉంది?

1) గోదావరి       2) కృష్ణా   

3) ప్రాణహిత        4) తుంగభద్ర


15. దివిసీమను ఏర్పరిచే నది ఏది?

1) కృష్ణా      2) గోదావరి 

3) పెన్నా     4) మహానది


16. కుంచికల్‌ జలపాతాన్ని ఏ నది ఏర్పరుస్తుంది?

1) శిరావతి      2) వారాహి  

3) పెరియార్‌       4) నర్మద


17. కింది ఏ ప్రాంతంలో పెన్నా నది బంగాళాఖాతంలో కలుస్తుంది?

1) కృష్ణాపట్నం      2) గంగపట్నం  

3) ఊటుకూరు      4) మైపాడు


18. కిందివాటిలో కృష్ణా నది కుడి వైపు ఉండే ఉపనదిని గుర్తించండి.

1) భీమ 2) మున్నేరు  3) మూసీ  4) కోయనా


19. కృష్ణా నది జన్మస్థలం?

1) మహారాష్ట్ర - మహాబలేశ్వర్‌         2) మహారాష్ట్ర - నాసిక్‌

3) కర్ణాటక - నందిదుర్గం     4) కర్ణాటక - బ్రహ్మగిరి


20. మన దేశంలో అధిక పరీవాహక ప్రాంతం ఉన్న నది?    

 1) గోదావరి 2) గంగా 3) సింధు 4) బ్రహ్మపుత్ర


21. మనదేశంలో అగ్నిపర్వత సంబంధిత సరస్సు ఏది?

1) చోలామ్‌     2) సాంబార్‌  

3) లోనార్‌      4) నైనిటాల్‌


22. మనదేశంలో అతి పొడవైన లాగూన్‌ సరస్సు ఏది?

1) చిల్కా      2) వెంబనాడ్‌  

3) అష్టముడి      4) పున్నయాడ


23. నదీ పరీవాహక ప్రాంతం పరంగా దేశంలో రెండో అతి పెద్ద నది?

1) గంగా       2) సింధు    

3) బ్రహ్మపుత్ర       4) గోదావరి


24. మన దేశంలో ప్రవహించే నదుల్లో మూడో పొడవైన నదిని గుర్తించండి.

1) యమున 2) గోదావరి 3) కృష్ణా  4) గంగా


25. కిందివాటిలో భిన్నమైన నదిని గుర్తించండి.

1) గోదావరి      2) కావేరి   

3) కృష్ణా        4) వంశధార


26. కిందివాటిలో దేనిని ‘సాల్ట్‌ రివర్‌’ అని కూడా పిలుస్తారు?

1) లూనీ  2) బాని  3) ఘగ్గర్‌  4) సబర్మతి


27. కిందివాటిలో కర్కట రేఖని రెండు సార్లు ఖండించే నది ఏది?

1) సబర్మతి      2) మహి      

3) చంబల్‌       4) దామోదర్‌


28. కిందివాటిలో గోదావరి నది ఏ శాఖ ‘యానాం’ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది?

1) వశిష్ట  2) వైనతేయ  3) గౌతమి  4) తుల్య


29. కిందివాటిలో ఏ నది ‘కోనసీమ’ను ఏర్పరుస్తుంది.

1) గంగా  2) కృష్ణా  3) గోదావరి  4) పెన్నా


30. కింది ఏ నది గండికోట గార్జ్‌ను ఏర్పరుస్తుంది?

1) పెన్నా       2) జయమంగళి  

3) సగిలేరు      4) చిత్రావతి


31. కిందివాటిలో భిన్నమైన నదిని గుర్తించండి.

1) చంబల్‌  2) బెట్వా      3) కెన్‌   4) షిప్రా


32. కింది ఏ నదిని చౌక నది అని కూడా పిలుస్తారు.

1) గాగ్రా  2) సరయు  3) శారద  4) గోమతి


33. కిందివాటిలో గంగా నది ఎడమవైపు ఉండే ఉపనదుల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి.

1) గండక్‌   2) కోసి   3) గంగా   4) శారదా


34. కిందివాటిలో బ్రహ్మపుత్ర నది ఎడమవైపు ఉప నదిని గుర్తించండి.

1) మానస్‌       2) సుబాన్‌ సిరి  

3) సంతోష్‌       4) లోహిత్‌


35. కింది సింధూ నది ఉపనదుల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి.

1) జీలం  2) చినాబ్‌   3) రావి   4) సట్లెజ్‌


36. ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?

1) ఏప్రిల్‌ 22        2) మార్చి 22    

3) జూన్‌ 22         4) ఆగస్టు 22


37. కింది సింధు నది ఉపనదుల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి.

1) ష్యోక్‌   2) కాభుల్‌  3) కుర్యం   4) టోబ్‌


38. దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన రెండో నది ఏది?

1) గోదావరి  2) నర్మద  3) కృష్ణా  4) కావేరి


39. కింది ఏ ప్రాంతంలో లూని నది జన్మిస్తుంది?

1) అన్నాసాగర్‌      2) దేబార్‌   

3) జోధ్‌పుర్‌       4) జైపుర్‌


40. తూర్పు కనుమల్లో జన్మించి, ఉత్తరానికి ప్రవహిస్తూ ఒడిశాలోకి ప్రవేశించే నది?

1) వంశధార      2) నాగావళి   

3) బ్రాహ్మణి       4) మాచ్‌ఖండ్‌


41. గంగా నది ఉపనదుల్లో హిమాలయాల్లో జన్మించని నదిని గుర్తించండి.

1) గండక్‌   2) కోసి   3) సోన్‌   4) గాగ్రా


42. భారతదేశంలో అతి పొడవైన సరస్సును గుర్తించండి.

1) వెంబనాడ్‌      2) ఊలర్‌  

3) చిల్కా      4) సాంబార్‌


43. ప్రపంచంలో ‘వేయి సరస్సుల దేశం’ అని దేన్ని పిలుస్తారు?

1) ఫిన్‌లాండ్‌        2) ఫిలిప్పీన్స్‌  

3) స్వీడన్‌     4) నార్వే


44. భారతదేశంలోని కింది ఉపనదుల్లో పొడవైనది ఏది?

1) సట్లెజ్‌  2) యమున 3) గాగ్రా  4) చంబల్‌


45. శ్రీరంగపట్నం ఏ నది ఒడ్డున ఉంది?

1) కృష్ణా  2) కావేరి  3) కబిని  4) అమరావతి


46. గంగానది బిహార్‌లో ఎంత దూరం ప్రవహిస్తుంది?

1) 520 కి.మీ.        2) 110 కి.మీ.    

3) 445 కి.మీ.      4) 225 కి.మీ.


47. లోక్‌తక్‌ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?

1) నాగాలాండ్‌       2) మణిపుర్‌   

3) మిజోరాం       4) త్రిపుర


48. భారతదేశం నుంచి ప్రవహించే ఉపనదుల్లో పొడవైనది ఏది?    

1) సట్లెజ్‌   2) గాగ్రా  3) గండక్‌   4) కోసి


49. ‘జల్పాయిగురి’ ఏ నది ఒడ్డున ఉంది?

1) గండక్‌  2) సంకోష్‌  3) తీస్తా  4) మానస్‌


50. కిందివాటిలో భిన్నమైన నదిని గుర్తించండి.

1) నర్మద  2) తపతి  3) శరావతి  4) సబర్మతి


51. జాతీయ జలమార్గం - 2 ఏ నదిపై ఉంది?

1) గంగా       2) బ్రహ్మపుత్ర   

3) మహానది       4) గోదావరి


52. కింది ఏ నదిని చంద్రభాగ నది అని కూడా అంటారు?

1) జీలం 2) బియాస్‌  3) చినాబ్‌  4) గోదావరి


53. కిందివాటిలో నేపాల్‌లో సాలిగ్రామి అని పిలిచేనది?

1) గండక్‌       2) కోసి   

3) గాగ్రా       4) శారద


54. అలకనంద, మందాకిని నదులు ఏ ప్రాంతం వద్ద కలుస్తాయి?

1) రుద్ర ప్రయాగ       2) కర్ణ ప్రయాగ  

3) విష్ణు ప్రయాగ       4) దేవ ప్రయాగ


55. కిందివాటిలో గోదావరి నదికి సంబంధించని నది?

1) మంజీరా       2) మానేరు 

3) మున్నేరు       4) ప్రవర


56. ఆదిశంకరాచార్యుల జన్మస్థలం ‘కాలడి’ ఏ నది ఒడ్డున ఉంది?

1) పెరియార్‌   2) కావేరి   3) పంబ  4) వైగై


57. కిందివాటిలో భిన్నమైన నదిని గుర్తించండి.

1) కోసి  2) గండక్‌   3) సోన్‌   4) మానస్‌


58. సింద్రి ఏ నది ఒడ్డున ఉంది?

1) హుగ్లీ      2) సోన్‌  

3) దామోదర్‌       4) టాన్స్‌


59. ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌ ఏ నది ఒడ్డున ఉంది?

1) టైబర్‌  2) సీన్‌  3) విస్తుల 4) అట్టావా 


60. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ ఏ నది తీరాన ఉంది?

1) టైబర్‌ 2) విస్తుల 3) టైగ్రిస్‌   4) ఇరవాడి


61. కిందివాటిలో ‘నదుల దుఃఖదాయని’ అని ఏ నదిని పిలుస్తారు?

1) గంగా 2) సింధు 3) యమున 4) బ్రహ్మపుత్ర


62. కిందివాటిలో ‘కౌశికి’ నది అంటే?

1) గండక్‌   2) సోన్‌   3) కోసి    4) గాగ్రా


63. కిందివాటిలో కావేరి నదికి సంబంధించని నది?

1) భవాని     2) కబిని  

3) లక్ష్మణ తీర్థ      4) శరావతి


64. కిందివాటిలో కేరళలో ప్రవహించని నది?

1) పొన్నని     2) పెరియార్‌ 

3) ఇడుక్కి 4) మాండవి


సమాధానాలు

1-2; 2-3; 3-4; 4-1; 5-2; 6-4; 7-1; 8-2; 9-1; 10-1; 11-3; 12-2; 13-4; 14-4; 15-1; 16-2; 17-3; 18-4; 19-1; 20-2; 21-3; 22-1; 23-2; 24-3; 25-4; 26-1; 27-2; 28-3; 29-3; 30-1; 31-4; 32-3; 33-4; 34-4; 35-4; 36-2; 37-1; 38-3; 39-1; 40-4; 41-3; 42-1; 43-1; 44-2; 45-2; 46-3; 47-2; 48-1; 49-3; 50-3; 51-2; 52-3; 53-1; 54-1; 55-3; 56-1; 57-4; 58-3; 59-2; 60-3; 61-4; 62-3; 63-4; 64-4.


రచయిత: బండ్ల శ్రీధర్‌  

Posted Date : 26-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.