• facebook
  • whatsapp
  • telegram

రవాణా వ్యవస్థ

జీవనరేఖ ఎక్స్‌ప్రెస్‌లో సంచార వైద్యశాల!


ప్రజలను, సరకులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులభంగా, వేగంగా తరలించేదే రవాణా. సువిశాల భూభాగం ఉన్న మన దేశంలో ఆర్థిక   కార్యకలాపాలు సజావుగా   సాగడంలో, ప్రజల సామాజిక అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడంలో, ప్రాంతాల మధ్య అనుసంధానంలో రవాణా   వ్యవస్థలు కీలకంగా పనిచేస్తున్నాయి. దేశంలో సమగ్ర, సమ్మిళిత అభివృద్ధిలో ప్రధానమైన   ఉపరితల, జల, వాయు రవాణా వ్యవస్థల స్వరూపం, అభివృద్ధి ప్రణాళికలు, సమకాలీన పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. జాతీయ రహదారులు, వాటి రూట్‌మ్యాప్‌లు, రైల్వే నెట్‌వర్క్, ముఖ్యమైన రైళ్లు, రైల్వే జోన్లు, కీలకమైన జలమార్గాలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలి.


1.     కిందివాటిలో ఏ రోజున అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం నిర్వహిస్తారు?

1) జనవరి 7    2) నవంబరు 7

3) డిసెంబరు 7    4) జూన్‌ 7


2.     భారత్‌లో రహదారుల అభివృద్ధి కోసం నాగ్‌పుర్‌ ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రకటించారు?

1) 1942  2) 1943  3) 1944  4) 1945


3.     జాతీయ జలమార్గం- 6 కింది ఏ నదిపై ప్రతిపాదించారు?

1) బ్రహ్మపుత్ర    2) గంగా    

3) గోదావరి    4) భరాక్‌


4.     భారత్‌లో షేక్‌-ఉల్‌-ఆలం అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?

1) శ్రీనగర్‌    2) తిరువనంతపురం 

3) లేహ్‌      4) వారణాసి


5.     భారత్‌లో అతి పొడవైన జాతీయ రహదారి ఏది?

1) NH-9         2) NH-40

3) NH-44       4) NH-6


6.     తూర్పు పశ్చిమ కారిడార్, ఉత్తర దక్షిణ కారిడార్‌లు  ఏ ప్రాంతంలో కలుస్తాయి?

1) జబల్‌పుర్‌ 2) ఝాన్సీ 3) నాగ్‌పుర్‌ 4) వారణాసి


7.     NHDP లో భాగంగా 2వ దశలోని తూర్పు-పశ్చిమ కారిడార్‌ పొడవు ఎంత?

1) 4000 కి.మీ.     2) 4500 కి.మీ. 

3) 3500 కి.మీ.     4) 3300 కి.మీ.


8.     స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా కోల్‌కతా - చెన్నై మధ్య ఎన్నికిలోమీటర్లు అభివృద్ధి చేశారు?

1) 1453 కి.మీ.     2) 1684 కి.మీ. 

3) 1290 కి.మీ.     4) 1419 కి.మీ. 


9.     భారత్‌లోని అతి పొడవైన సముద్ర వంతెన (అటల్‌సేతు)ను ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు?

1) జనవరి 12, 2024    2) జనవరి 13, 2024    

3) జనవరి 10, 2024    4) జనవరి 17, 2024


10. ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన అటల్‌ సేతు పొడవు ఎంత?

1) 18.8 కి.మీ.    2) 24.8 కి.మీ.

3) 21.8 కి.మీ.    4) 31.3 కి.మీ.


11. భారత్‌లో పౌర విమానయానానికి సంబంధించి రాజ్‌ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 1954  2) 1955  3) 1951  4) 1953


12. భారత దేశంలో విమానయాన రంగంలో సరకు రవాణా కోసం వాయుదూత్‌ సేవలను ఎప్పుడు ప్రారంభించారు?

1) 1953  2) 1982  3) 1981  4) 1943


13. పశ్చిమమధ్య రైల్వే మండలాన్ని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 1953  2) 2002  3) 2001  4) 2003


14. కింది ఏ నదిపై బోగిబీల్‌ రైల్‌ కమ్‌ రోడ్డు బ్రిడ్జ్‌ ఏర్పాటు చేశారు?

1) గంగా      2) బ్రహ్మపుత్ర 

3) చినాబ్‌     4) యమున


15. భారత్‌లో అధిక దూరం ప్రయాణించే వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎన్ని కి.మీ. ప్రయాణిస్తుంది?

1) 4,200 కి.మీ.            2) 5,248 కి.మీ.       

3) 4,282 కి.మీ.            4) 3,482 కి.మీ.


16. కిందివాటిలో ఏ ఓడరేవును ‘గేట్‌ వే ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ అంటారు?

1) ట్యుటికోరిన్‌          2) చెన్నై      

3) ఎన్నోర్‌           4) విశాఖపట్నం


17. కిందివాటిలో ఏ ఓడరేవును నదీ ఆధారిత ఓడరేవు అంటారు?

1) పారాదీప్‌           2) విశాఖపట్నం       

3) కోల్‌కతా          4) ఎన్నోర్‌


18. ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1984  2) 1986  3) 1981  4) 1999


19. కిందివాటిలో పశ్చిమ తీరం వెంబడి ఉన్న జాతీయ రహదారిని గుర్తించండి.

1) NHn-15 2) NHn-18

3) NHn-17 4) NHn-10


20. కింది ఏ జలమార్గాన్ని పశ్చిమతీర కాలువ అంటారు?

1) జాతీయ జలమార్గం - 1       2) జాతీయ జలమార్గం - 2

3) జాతీయ జలమార్గం - 3   4) జాతీయ జలమార్గం - 4


21. కింది ఏ ప్రాంతంలో రైల్వే డీజిల్‌ ఇంజిన్లు తయారు చేస్తారు?

1) వారణాసి    2) పెరంబదూర్‌

3) చిత్తరంజన్‌    4) ఎలహంక


22. జాతీయ జలమార్గం-3ను ఏ సంవత్సరంలో ప్రకటించారు?

1) 1994   2) 1986  3) 1993  4) 1991


23. జాతీయ జలమార్గం-6 కు నూతనంగా ప్రకటించిన నంబరు ఎంత?

1) జాతీయ జలమార్గం - 17    2) జాతీయ జలమార్గం - 19

3) జాతీయ జలమార్గం - 15    4) జాతీయ జలమార్గం - 16


24. కిందివాటిలో తూర్పు తీరంలోని ఏకైక సహజ ఓడరేవు ఏది?

1) చెన్నై    2) విశాఖపట్నం

3) ట్యుటికోరిన్‌    4) పారాదీప్‌


25. కిందివాటిలో చక్రవాతాల వల్ల అధికంగా నష్ట పోతున్న ఓడరేవు ఏది?

1) విశాఖపట్నం         2) చెన్నై     

3) పారాదీప్‌          4) ఎన్నోర్‌


26. భారత్‌లో ఎలక్ట్రానిక్‌ టోల్‌ సేకరణ వ్యవస్థ  FASTAG ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

1) 2014  2) 2015  3) 2016  4) 2017


27. జాతీయ జలమార్గం - 2 దాదాపుగా ఎన్ని కి.మీ. పొడవు ఉంటుంది?

1) 790 కి.మీ.     2) 891 కి.మీ. 

3) 981 కి.మీ.     4) 781 కి.మీ.


28. జాతీయ జలమార్గం - 4ను ఏ సంవత్సరంలో  ప్రకటించారు?

1) 2008  2) 2007  3) 2004  4) 2006


29. జాతీయ జలమార్గం - 16 పొడవు ఎన్ని కి.మీ.?

1) 209 కి.మీ.     2) 121 కి.మీ. 

3) 140 కి.మీ.     4) 153 కి.మీ.


30. ఏ ఓడరేవును స్వేచ్ఛా వ్యాపార ఓడరేవు (Free Trade Naval Port) అని అంటారు?

1) కాండ్ల     2) ముంబయి 

3) మంగళూరు     4) కొచ్చిన్‌


31. ప్రాచీన భారత దేశంలో రహదారులు నిర్మించిన తొలి రాజవంశం ఏది?

1) చోళులు    2) గుప్తులు     

3) మౌర్యులు    4) శాతవాహనులు


32. భారత్, పాకిస్థాన్‌ సరిహద్దు ద్వారా ప్రయాణించే జాతీయ రహదారి ఏది?

1) NHn-16 2) NHn-17

3) NHn-10 4) NHn-15


33. భారత్‌లోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక 2022-23 ప్రకారం దేశంలో మొత్తం జాతీయ రహదారులు ఎన్ని కి.మీ.?

1) 1,55,945 కి.మీ.     2) 1,44,955 కి.మీ. 

3) 1,67,079 కి.మీ.     4) 1,54,975 కి.మీ.


34. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక 2022-23 ప్రకారం మన దేశంలో మొత్తం రాష్ట్ర రహదారులు ఎన్ని కి.మీ.?

1) 1,44,955 కి.మీ.     2) 1,67,079 కి.మీ. 

3) 1,55,379 కి.మీ.     4) 1,67,971 కి.మీ.


35. భారత్‌లో రహదారుల అభివృద్ధి కోసం లఖ్‌నవూ ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు?

1) 1984    2) 1988    

3) 1961    4) 1943


36. జాతీయ రహదారుల పొడవు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?

1) మధ్యప్రదేశ్‌    2) మహారాష్ట్ర    

3) తెలంగాణ    4) పశ్చిమ బెంగాల్‌


37. జాతీయ రహదారుల పొడవు తక్కువగా ఉన్న రాష్ట్రం?

1) గోవా     2) సిక్కిం 

3) త్రిపుర     4) నాగాలాండ్‌


38. భారతదేశంలో జాతీయ రహదారులపై వంతెనల నిర్మాణానికి సంబంధించిన సేతుభారతం ప్రాజెక్ట్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1956  2) 2015  3) 2016  4) 2014


39. బంధన్‌ ఎక్స్‌ప్రెస్‌ కింది ఏ రెండు దేశాల మధ్య నడుస్తోంది?

1) భారత్‌ - పాకిస్థాన్‌    2) భారత్‌ - భూటాన్‌

3) భారత్‌ - బంగ్లాదేశ్‌    4) భారత్‌ - శ్రీలంక


40. కిందివాటిలో సంచార వైద్యశాల ఉన్న మొదటి రైలు ఏది?

1) జీవనరేఖ    2) గరీబ్‌రథ్‌    

3) జన్మభూమి        4) యువభూమి


41. చౌదరి చరణ్‌ సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కింది ఏ ప్రాంతంలో ఉంది?

1) గయ    2) జైపుర్‌     

3) లఖ్‌నవూ    4) దిల్లీ


42. జోలిగ్రాంట్‌ విమానాశ్రయం ఏ ప్రాంతంలో ఉంది?

1) చండీగఢ్‌     2) ఉదయ్‌పుర్‌ 

3) సిలిగురి     4) దేహ్రాదూన్‌


43. భారత్‌లో తొలివిమానం అధికారికంగా ఏ సంవత్సరంలో ఎగిరింది?

1) 1943      2) 1923  

3) 1933      4) 1921


44. భారత్‌లో ఓడరేవుల అభివృద్ధి కోసం సాగరమాల ప్రాజెక్ట్‌ను ఏ సంవత్సరంలో ప్రకటించారు?

1) 2014      2) 2015  

3) 2016      4) 2017


45. నూతన జాతీయ రహదారి నంబర్‌-1 (NHn-1) కింది ఏ ప్రాంతాల మధ్య ఉంది?

1) జమ్ముకశ్మీర్‌ - హిమాచల్‌ ప్రదేశ్‌    2) అస్సాం - సిక్కిం    

3) జమ్ముకశ్మీర్‌ - లద్దాఖ్‌     4) అస్సాం - మేఘాలయ


46. జాతీయ రహదారుల పొడవు అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) లద్దాఖ్‌     2) జమ్ము-కశ్మీర్‌ 

3) పుదుచ్చేరి     4) చండీగఢ్‌


47. జాతీయ రహదారులు 6, 7 (పాత జాతీయ రహదారులు) కలిసే ప్రాంతం ఏది?

1) జబల్‌పుర్‌    2) వారణాసి     

3) నాగ్‌పుర్‌    4) భోపాల్‌


48. మైత్రి ఎక్స్‌ప్రెస్‌ ఏ దేశాల మధ్య నడుస్తుంది?

1) బంగ్లాదేశ్‌ - భారత్‌  2) భారత్‌ - పాకిస్థాన్‌

3) భారత్‌ - శ్రీలంక   4) భారత్‌ - నేపాల్‌


49. కిందివాటిలో ఏ ఓడరేవు సూయజ్‌ కాలువ ద్వారా అధిక ప్రాధాన్యం పొందింది?

1) కాండ్ల    2) ముంబయి    

3) మర్మగోవా    4) కొచ్చిన్‌


50. ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీని ఎప్పుడు ప్రారంభించారు?

1) 2007     2) 2009

3) 2010    4) 2008



సమాధానాలు

1-3, 2-2, 3-4, 4-1, 5-3, 6-2, 7-4, 8-2, 9-1, 10-3, 11-4, 12-3, 13-4, 14-2, 15-3, 16-2, 17-3, 18-2, 19-3, 20-3, 21-1, 22-3, 23-4, 24-2, 25-3, 26-1, 27-2, 28-1, 29-2, 30-1, 31-3, 32-4, 33-2, 34-2, 35-1, 36-2, 37-1, 38-3, 39-3, 40-1, 41-3, 42-4, 43-3, 44-2, 45-3, 46-2, 47-3, 48-1, 49-2, 50-4.



రచయిత: బండ్ల శ్రీధర్‌  

Posted Date : 06-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌