• facebook
  • whatsapp
  • telegram

విశ్వమంతా వ్యాపించినవాడు విష్ణువు!

పదజాలం

(అర్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్త్యర్థాలు, సమాసాలు)

తెలుగు అజంత భాష. ప్రతి పదం ఒక అచ్చుతో అంతమయ్యే ప్రత్యేక లక్షణం ఈ భాషకే ఉంది. ప్రాచీన భాషగా, మధుర భాషగా వెలుగొందుతోంది. ఒకే పదంలో ఎన్నో అర్థాలు వెలువరించే ప్రత్యేకత తెలుగులో ఉంది. తేట తెలుగులోని అనంత పదజాలాన్ని పోటీ పరీక్షార్థులు వీలైనంతగా ఎక్కువగా తెలుసుకోవాలి. అర్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, పర్యాయపదాలు, పద విశేషాలు, విశేషణ వాక్యాలకు సరైన సమాధానాలు, పద విరుపులు, మూల పదాలు, ప్రమాణాలను సూచించే పదాలకు ఉన్న విలువలపై  అవగాహన పెంచుకోవాలి. 
 

1. ‘చేతులు జోడించి చేయునది’ అనే వ్యుత్పత్త్యర్థం ఉన్న పదం ఏది?

1) శ్యేనము      2) కామారి  

3) కైమోడ్పు     4) సైన్యం 


2.  ‘సంయమము కలవాడు’ అనే వ్యుత్పత్త్యర్థం  కిందివాటిలో దేనికి సంబంధించింది? 

1) రాజు       2) సంయమి   

3) సైనికుడు       4) సైలికుడు


3.     ‘సోమార్ధధరుడు’ అంటే అర్థం ఏమిటి?

1) చంద్రవంక పై ఆటలాడువాడు 

2) చంద్రుడిని మింగి వేయడానికి సిద్ధంగా ఉన్నవాడు

3) చంద్రుడి వెన్నెల ఆహారంగా కలది

4) చంద్రవంకను శిరస్సున ధరించినవాడు


4.   కిందివాటిలో ‘పాదము’ అనే పదానికి పర్యాయపదం కానిది గుర్తించండి.

1) అడుగు  2) చెప్పులు 3) అంఘ్రి  4) చరణం


5.     ‘మరాళము, చక్రాంగము, మానసౌకము’ అనే  పర్యాయపదాలున్న పదం ఏది?

1) చిలుక   2) డేగ   3) హంస   4) తేనెటీగ


6.     కిందివాటిలో ‘బురద, అడుసు, పంకం’ అనే  పర్యాయపదాలున్న పదం ఏది?

1) తామర       2) కర్దమం   

3) కమండలం       4) చులకన


7.    ‘రాత్రి, యామిని, నిశ’ అనే పర్యాయపదాలున్న పదం ఏది?

1) నిశీధిని       2) ఇరులు   

3) కురులు        4) నిశాచరులు


8.     కిందివాటిలో ‘ధృతి’కి పర్యాయపదం కానిది-

1) ధైర్యం 2) బిడియం  3) బింకం  4) గట్టితనం


9.   ‘శబ్దము, సవ్వడి, చప్పుడు’ అనే పర్యాయపదాలున్న పదం ఏది?

1) క్వణము        2) కణజాలం   

3) అలికిడి       4) పిలుపు 


10. ‘రాకామల జ్యోత్స్న’ అంటే అర్థం ఏమిటి?

1) అమావాస్య నాటి వెన్నెల     2) పున్నమినాటి తెల్లని వెన్నెల 

3) గ్రహబలాన్ని తెలిపే కాలం     4) తియ్యమామిడి టెంక


11. ‘మిసిమి’ అంటే అర్థం ఏమిటి? 

1) రాత్రి   2) చీకటి   3) కాంతి   4) క్రాంతి


12. ‘బ్రాహ్మీ ముహూర్తం’ అంటే అర్థం ఏమిటి?

1) సూర్యోదయానికి మూడు గడియల ముందు కాలం

2) చంద్రోదయానికి ఒక గడియ ముందుకాలం 

3) సూర్యోదయానికి ఒక గడియ ముందుకాలం

4) చంద్రోదయానికి ఐదు గడియల కాలం


13. ‘తమ్మి’ అనే పదానికి అర్థం ఏమిటి?

1) పద్మం, చంద్రుడు        2) సూర్యుడు, చీకటి

3) చంద్రుడు, సూర్యుడు     4) పద్మం, తామరపువ్వు


14. ‘బు భుక్షితుడు’ అంటే అర్థం ఏమిటి?

1) ఆకలిగొన్నవాడు        2) ఆకలి తీర్చువాడు

3) ఆకలికి అన్నం పెట్టనివాడు   4) ఆహార దానం చేయువాడు


15. ‘పుల్లు’ అంటే అర్థం ఏమిటి?

1) గాడిద  2) ఏనుగు  3) గడ్డి  4) ఆహారం 


16. ‘కామారి’ అంటే అర్థం ఏమిటి?

1) బ్రహ్మ         2) శివుడు    

3) విష్ణువు        4) మన్మథుడు


17. ‘విశ్వమంతటా వ్యాపించి యుండువాడు’ అనే వ్యుత్పత్త్యర్థం ఉన్న పదం ఏది?

1) శివుడు  2) బ్రహ్మ  3) విష్ణువు  4) రాజు 


18. ‘నీరజ భవుడు’ అనే పదానికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.

1) శివుడు  2) బ్రహ్మ  3) విష్ణువు  4) లక్ష్మీదేవి


19. బంగారాన్ని గర్భం నందు గలది?

1) ఏనుగు  2) చిలుక  3) భూమి  4) దేవతలు 


20. కిందివాటిలో ‘ఉన్నతి’ అనే పదానికి పర్యాయపదం కానిది- 

1) వికాసం       2) అభివృద్ధి   

3) ప్రగతి       4) గౌరవ మర్యాదలు 


21. ‘వాః పూరము’ అనే పదానికి అర్థం చెప్పండి. 

1) అగ్నిప్రవాహం       2) గాలిప్రవాహం   

3) జలప్రవాహం      4) సముద్రం


22. విద్యత్తు అనే పదానికి అర్థం ఏమిటి?

1) పాండిత్యం       2) పామరులు   

3) మహిమాన్వితం       4) ఓర్పు


23. మాధుకరము అంటే అర్థం ఏమిటి?

1) ఇల్లిలూ తిరిగి అన్నం సేకరించుకోవడం

2) ఇల్లిలూ తిరిగి దీవెనలు ఇచ్చేవారు 

3) పుత్రాదుల యందు స్నేహభావం కలది

4) సర్వభూతాలయందు స్నేహం కలది


24. ‘పోషాకులు’ అంటే అర్థం ఏమిటి?

1) విద్య       2) పాండిత్యం   

3) ధనం       4) దుస్తులు 


25. ‘గీతిక’ అంటే అర్థం ఏమిటి?

1) పెద్దపాట       2) చిన్నపాట   

3) గొప్పపాట       4) వ్యర్థమైన పాట


26. ‘నిరయం’ అనే పదానికి అర్థం?

1) దుర్గతి, నరకం        2) స్వర్గం, నరకం 

3) యముడు-ఏనుగు     4) యముడు-దున్నపోతు


27. ‘చతురంతయానం’ అనే పదానికి అర్థం ఏమిటి?

1) బోయిలు       2) పల్లకి  

3) పల్లవి       4) చరణం 


28. ‘సంపన్నులు నివసించే పెద్ద భవంతి’ అనే అర్థం వచ్చే పదం?

1) చావిడీ  2) మేన  3) దేవిడీ   4) దేవదారు


29. ‘ఈవి’ అనే పదానికి అర్థం ఏమిటి?

1) రాజసం  2) గర్వం  3) వింత  4) త్యాగం


30. ‘ఉమ్రావులు’ అనే పదానికి అర్థం ఏమిటి?

1) దళిత వంశీయులైన కళాపోషకులు

2) మంత్రుల ముందున్న కళాపోషకులు

3) ఉన్నత వంశీయులైన కళాపోషకులు

4) గౌరవం దక్కని కళాకారులు


31. ‘ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్దపెద్ద అల్లిక బుట్టలు’ అనే అర్థం ఇచ్చే పదం?

1) గుడిగిలు 2) గుల్ల 3) గుమ్ములు 4) గవిన్లు


32. శేరు అంటే?


33. ‘సిత’ అంటే అర్థం?

1) నాగలి  2) తెల్లని  3) నల్లని  4) ఆకుపచ్చని


34. హాజర్‌ జవాబు అంటే?

1) ప్రశ్నకు జవాబు చెప్పలేనివాడు

2) ప్రశ్నలు అడిగేవాడే జవాబులు చెప్పడం

3) ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు

4) ఎలాంటి తెలివిలేనివాడు


35. ‘దయిత’ అంటే అర్థం?

1) ధైర్యం  2) దయ్యం  3) భార్య  4) మగడు


36. ‘కాకోదరం’ అనే పదానికి వ్యుత్పత్త్యర్థం ఏది?

1) కోకిల పొట్ట లాంటి పొట్ట గలది       

2) గద్ద లాంటి కన్నులు గలది

3) చిలుక లాంటి పలుకులు గలది       

4) కాకిపొట్ట లాంటి పొట్ట గలది


37. బలిగా ఇచ్చిన ఆహారంతో పోషించబడునది - బలపుష్టము అనే అర్థం గలది?

1) నక్క   2) కాకి    3) ఎలుక    4) పులి


38. ‘పాషండుడు’ అంటే వ్యుత్పత్త్యర్థం ఏమిటి?

1) సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రాన్ని  వాడుకునేవాడు

2) ధర్మశాస్త్రానికి అనుగుణంగా నడుచుకునేవాడు

3) ధర్మాన్ని విడిచిపెట్టేవాడు  4) మూర్ఖుడు


39. ‘రౌప్యం నుంచి వచ్చిన నాణెం’ అంటే?

1) దమిడి  2) అణా   3) కాసు  4) రూపాయి


40. ‘తేజి’ అనే పదానికి పర్యాయపదం కానిది ఏది?

1) గుర్రం  2) అశ్వం  3) కరభం  4) తురగం


41. వేవురు అంటే అర్థం ఏమిటి?

1) ఎనిమిది మంది     2) ఏడుగురు 

3) వెయ్యి మంది      4) లక్ష మంది


42. ‘కిణాంకం’ అంటే అర్థం ఏమిటి?

1) ఆధారం, ఆదాయం      2) మేలు, మంచి

3) కీడు, చెడు           4) చిహ్నం, గుర్తు


43. ‘కొడిమెలు’ అంటే అర్థం ఏమిటి?

1) నాగలి దున్నుట         2) చేపలు పట్టే సాధనాలు

3) స్త్రీలు వాడే సాధనాలు           4) రాజు కోసం చేసిన కార్యం


44. ‘కొరత వేయుట’ అంటే అర్థం?

1) శూలారోహణ శిక్ష       2) గజారోహణ శిక్ష

3) సముద్రమదన శిక్ష      4) అగ్నిలోకి దూకే శిక్ష


45. ‘భిక్షువు, జడధారి, యతి, ముని’ అనే  పర్యాయపదాలున్న పదం ఏది?

1) విద్యార్థి      2) వ్యాసుడు 

3) సంసారి      4) సన్యాసి


46. ‘అమెరికా రాయబారి’ ఈ పదంలోని సమాసాన్ని గుర్తించండి.    

1) షష్ఠీ తత్పురుష       2) పంచమీ తత్పురుష

3) ప్రథమ తత్పురుష      4) ద్వితీయ తత్పురుష


47. ‘నెల తేల్పు’ పదంలోని సమాసం?

1) ప్రథమ తత్పురుష   2) ద్వితీయ తత్పురుష

3) షష్ఠీ తత్పురుష       4) పంచమీ తత్పురుష


48. ‘ప్రాచీన కావ్యాలు’ అనే పదంలోని సమాసం  తెలపండి.

1) విశేషణ పూర్వపద కర్మధారయం   2) విశేషణ ఉభయపద కర్మధారయం

3) విశేషణ ఉత్తరపద కర్మధారయం   4) ఉపమాన ఉభయపద కర్మధారయం


49. ‘దొంగ భయం’ విగ్రహ వాక్యాన్ని గుర్తించండి.

1) దొంగ కొరకు భయం      2) దొంగ వలన భయం

3) దొంగ చేత భయం  4) దొంగ యొక్క భయం


50. ‘రెండు రాష్ట్రాలు’ లోని సమాసం?

1) సంభావన పూర్వపద     2) పంచమీ తత్పురుష

3) ద్విగు               4) బహువ్రీహి 


51. ‘జ్ఞాన జ్యోతి’ పదంలోని సమాసాన్ని గుర్తించండి.

1) విశేషణ పూర్వపద కర్మధారయం   

2) ఉపమాన పూర్వపద కర్మధారయం

3) రూపక సమాసం                    

4) ఉపమాన ఉత్తర పద కర్మధారయం


52. ‘పాలమూరు జిల్లా’ సమాసం పేరు రాయండి. 

1) రూపక       2) విశేషణ పూర్వపద   

3) షష్ఠీ తత్పురుష       4) సంభావన పూర్వపద


53. ‘మన్నెంకొండ’ సమాసం గుర్తించండి.

1) విశేషణ ఉత్తరపద కర్మధారయం   

2) ఉపమాన పూర్వపద కర్మధారయం

3) సంభావన పూర్వపద కర్మధారయం   

4) రూపక సమాసం


సమాధానాలు

1-3; 2-2; 3-4; 4-2; 5-3; 6-2; 7-1; 8-2; 9-1; 10-2; 11-3; 12-1; 13-4; 14-1; 15-3; 16-2; 17-3; 18-2; 19-3; 20-4; 21-3; 22-1; 23-1; 24-4; 25-2; 26-1; 27-2; 28-3; 29-4; 30-3; 31-3; 32-4; 33-2; 34-3; 35-3; 36-4; 37-2; 38-1; 39-4; 40-3; 41-3; 42-4; 43-2; 44-1; 45-4; 46-1; 47-2;  48-1; 49-2; 50-3; 51-3; 52-4; 53-3.


రచయిత: సూరె శ్రీనివాసులు
 

Posted Date : 01-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.