• facebook
  • whatsapp
  • telegram

పదజాలం

(ప్రకృతి - వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సమాసాలు)

ఒకే పదంలో ఇనుము.. ఆవిరి.. కన్నీరు!

పదాల సమితినే పదజాలం అంటాం. ఒక భాషలో ఉపయోగించే పదాలకు ఒక్కో సందర్భంలో ఒక్కో అర్థం వస్తుంది. అలాగే ఒకే పదాన్ని పదేపదే వాడాల్సి వచ్చినప్పుడు దాని సమానార్థకాన్నో, ఒక్కోసారి దాని వ్యతిరేక అర్థాన్నో వినియోగిస్తుంటారు. ఈ పదజాలంపై పట్టు పెంచుకుంటేనే భాషలో ప్రావీణ్యం సంపాదించడం సాధ్యమవుతుంది. పదసంపద, పదజాలం అనంతంగా ఉన్న తెలుగు భాషలో ఎక్కువగా వినియోగించే పదాలకు అర్థాలు, నానార్థాలు, తర తరాలుగా రూపం మార్పులతో ఏర్పడే ప్రకృతి-వికృతులు, జాతీయాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. సందర్భానుసారంగా ఎక్కడ ఏ పదాన్ని, ఎలా వాడాలో అవగతం చేసుకోవాలి.


1.     ‘కుల్య’ పదానికి వికృతిని గుర్తించండి.

1) గోడ   2) కులం  3) కాలువ  4) కూతురు


2.     ‘ఆహారము’ పదానికి వికృతిని గుర్తించండి.

1) ఆకారము       2) భోజనము       

3) తిండి            4) ఓగిరము


3.     ‘భృంగారము’ పదానికి వికృతి-

1) బంగరము            2) బొంగరము       

3) బంగారము         4) తుమ్మెద


4.     ‘ప్రేమ’ పదానికి వికృతి పదాన్ని తెలపండి.

1) కూరిమి             2) నెయ్యము       

3) ప్రేముడి           4) ప్రేమ


5.     కిందివాటిలో ‘అరిష్టం’ అనే పదానికి నానార్థం కానిది?

1) కీడు, మజ్జిగ          2) కాకి        

3) ఇరుగుడు చెట్టు        4) కుంకుడు చెట్టు


6.     ‘మిసిమి’ అనే పదానికి నానార్థం కానిది?

1) కాంతి  2) నవనీతం  3) సొగసు 4) సంపద


7.     మౌక్తికం అనే పదానికి నానార్థం కానిది?

1) రాజహంస           2) ఏనుగు కుంభ స్థలం

3) మేఘం              4) శంఖం


8. ‘హితం’ పదానికి నానార్థం కానిది?

1) ఉపకారం             2) అపకారం         

3) లాభం            4) క్షేమం, ఇష్టం


9.     శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు అనే నానార్థాలున్న పదం ఏది?

1) లక్ష్మీ              2) సరస్వతి         

3) యముడు             4) అర్థం


10. ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు అనే నానార్థాలున్న పదం ఏది?

1) పవిత్ర  2) పావని 3) ఆమని 4) సౌభాగ్యం


11.     ‘మూలం’ పదానికి నానార్థ పదం కానిది?

1) పురాణం             2) వేరు, ఊడ      

3) కారణం         4) పునాది, మొదలు


12. ‘చేవ’ పదానికి నానార్థం కానిది?

1) పొగరు 2) సొగసు  3) ధైర్యము 4) సారము


13. ‘పరమాత్మ, తెల్ల గుఱ్ఱం, మాత్సర్యం అనే నానార్థాలున్న పదం ఏది?

1) జీవుడు  2) శక్తి  3) మదము  4) హంస


14. ‘దిక్కు’ అనే పదానికి నానార్థం కానిది?

1) దిశ 2) శరణం  3) ప్రత్యుత్తరం   4) దారి


15. ‘విమర్శిస్తాడు’, ‘రాళ్లు విసురుతాడు’ అనేవి?

1) జాతీయాలు          2) సామెతలు       

3) సూక్తులు            4) శబ్ద పల్లవములు


16. గిరక, వృత్తం, గీర, ఒక ఆయుధం అనే నానార్థాలున్న పదం?

1) గద   2) చక్రం  3) గరము   4) పాలు


17. ‘ధ్వాంక్షము’ అనే పదానికి నానార్థాలు కానిది?

1) కాకి  2) కొంగ  3) బాతు  4) జలచర పక్షి


18. నందన అనే పదానికి నానార్థాలు ఏవి?

1) కొడుకు, ఒక సంవత్సరం       2) నెల, కొడుకు

3) కుమార్తె, ఒకనెల              4) కుమార్తె, ఒక సంవత్సరం


19. ‘యోగం’ నానార్థ పదం కానిది?

1) ధాన్యం            2) అదృష్టం, ఒక శాస్త్రం        

3) కూతురు         4) కూడిక


20. ‘బలిమి, చిల్లకోల, పార్వతి’ అనే నానార్థాలున్న పదం?

1) కర్ర  2) ఆయుధం  3) అమ్మ   4) శక్తి


21. ‘మతం’ నానార్థం కానిది?

1) అభిప్రాయం  2) ధర్మం 3) శాస్త్రం 4) సమ్మతి


22. ‘రాజు’ నానార్థం కానిది?

1) రేడ్లు  2) ప్రభువు 3) ఇంద్రుడు 4) చంద్రుడు


23. ప్రకృతి - వికృతుల్లో సరికానిది గుర్తించండి.

1) కన్య - కన్నె     2) ఏక - ఏకము 

3) ఆశ - ఆస     4) అగ్ని - అగ్గి


24. గరువము అనే వికృతి పదానికి, ప్రకృతిని    గుర్తించండి.

1) గారవము     2) గౌరవము 

3) గర్వము     4) గర్భము


25. కస్తి అనే పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి.

1) కుస్తి    2) కష్టం    3) బస్తి    4) కుశ


26. కరకు అనే వికృతి పదానికి ప్రకృతిని గుర్తించండి.

1) కర్కశం 2) కఠినం 3) కుఠిలం 4) గట్టితనం


27. సభ అనే పదానికి నానార్థం కానిది?

1) సైన్యం  2) పరిషత్తు  3) ఇళ్లు  4) జూదం


28. కొన, నోరు, వాదర అనే నానార్థాలున్న పదం ఏది?

1) వాయిద్యం 2) పగ్గం 3) వాయినం 4) వాయి


29. కింది ప్రకృతి వికృతుల్లో సరికానిది గుర్తించండి.

1) ఆవేశం- ఆవేసం     2) ఆళి-ఓలి    

3) గృహము- ఇల్లు     4) కథ- కత


30. సాధనం పదానికి నానార్థం కానిది?

1) సాధించుట     2) గెలుపొందుట

3) ఉపాయము     4) ఉపకరణము


31. ఐదు, గృహ పార్శ్వ ప్రదేశం, ఆశ్రయం అనే  నానార్థాలున్న పదం?

1) స్వాగతం  2) ఆదరణ  3) పంచ  4) కాలు


32. భుక్తికి నానార్థం కానిది?

1) ఆహారం 2) ఫలహారం 3) అనుభవం 4) మేర


33. కాక అనే పదానికి నానార్థం కానిది?

1) మేనమామ     2) చిన్నాన్న 

3) వేడిమి     4) కాకుండ


34. సృజించడం, ప్రకృతి, స్వభావం అనే నానార్థాలున్న పదం ఏది?

1) సృజన 2) స్పరించడం 3) వింటినారి 4) సృష్టి


35. స్తంభమునకు వికృతి పదం ఏది?

1) సంబము     2) కుంబము 

3) కంబము     4) స్తంబము


36. తండ్రి, బృహస్పతి, అన్న, రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది అనే నానార్థాలున్న పదం ఏది?

1) స్నేహితుడు     2) హితుడు 

3) ఉపాయం     4) గురువు


37. ఇనుము, ఆవిరి, కన్నీరు అనే నానార్థాలున్న పదం?

1) వర్షము     2) ఆనందబాష్పాలు 

3) బాష్పము     4) వేడి


38. మృత్యువు పదానికి వికృతి పదం?

1) మృత్యువు 2) మితువు 3) మరణం 4) మిత్తి


39.  కింది ప్రకృతి - వికృతుల్లో సరికానిది?

1) యజ్ఞం-యాగం     2) కావ్యం-కబ్బం

3) కవిత-కైత     4) ఆధారం-ఆదరువు


40. హరి పదానికి నానార్థం కానిది?

1) శివుడు, పరమేశ్వరుడు     2) విష్ణువు, ఇంద్రుడు

3) గుర్రం, దొంగ     4) సింహం, కోతి


41. ‘ముక్కు పచ్చలారని’, ‘ఎంగిలి చేత్తో కాకిని కొట్టడం’ అనేవి?    

1) సామెతలు     2) జాతీయాలు 

3) సూక్తులు     4) ఒరవడులు


42. ఇమానం అనే పదానికి అర్థం? (తెలంగాణ మాండలికంలో)

1) ఒట్టు 2) పేపరు 3) వివాహం 4) మాన్యాలు


43. పృథ్వి అనే పదానికి వికృతి పదం గుర్తించండి.

1) భూమి  2) వసుధ  3) పుడమి  4) అమ్మ


44. కర్కోటకం అనే పదానికి నానార్థం కానిది?

1) నాగుపాము     2) భుజంగము 

3) మారేడు     4) విషభేదం


45. కన్ను, బాణం, సరస్వతి, భూమి అనే నానార్థాలున్న పదం?

1) గోవు  2) సింహం  3) లక్ష్మీదేవి  4) శివుడు


46. ‘సమర్థంబులగు పదంబులు ఏకపదంబగుట సమాసంబు’ అని నిర్వచించింది ఎవరు?

1) అహోబల పండితుడు     2) అప్పకవి   

3) చిన్నయసూరి       4) బహుజన పల్లి


47. శబ్దాన్ని బట్టి సమాసాలు ఎన్ని విధాలు?

1) 3      2) 2      3) 9      4) 4


48. ఏకదేశి సమాసానికి మరొక పేరు?

1) ప్రథమ తత్పురుష సమాసం       2) ద్వితీయ తత్పురుష సమాసం

3) తృతీయ తత్పురుష సమాసం       4) పంచమీ తత్పురుష సమాసం


49. వ్యతిరేకార్థాన్ని ఇచ్చే సమాసం ఏది?

1) బహువ్రీహీ సమాసం     2) రూపక సమాసం

3) ద్విగు సమాసం       4) నఞ్‌ తత్పురుష సమాసం


50. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని ఏ సమాసానికి పేరు?

1) రూపక సమాసం               2) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

3) షష్ఠీ తత్పురుష సమాసం             4) ద్విగు సమాసం


51. పూర్వపదంలో ఉపమానం, పరపదంలో ఉపమేయం ఉన్న సమాసం ఏది?

1) ఉపమాన పూర్వపద కర్మధారయం   

2) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

3) ద్విగు సమాసం     4) విశేషణ ఉత్తరపద కర్మధారయం


52. సభాభవనం లోని విగ్రహ వాక్యం గుర్తించండి.

1) సభ కొరకు భవనం     2) సభ వలన భవనం

3) సభదైన భవనం      4) సభ అనెడి భవనం


53. మూడు దోషాలు సమాసం గుర్తించండి.

1) రూపక సమాసం      2) షష్ఠీ తత్పురుష సమాసం

3) ద్విగు సమాసం      4) ప్రథమ తత్పురుష సమాసం


54. ‘నా పాట’ విగ్రహ వాక్యం గుర్తించండి.

1) నా యొక్క పాట      2) నా కొరకు పాట

3) నా అనెడి పాట       4) నా వలన పాట


55. ‘విషాగ్ని’ సమాసం గుర్తించండి.

1) రూపక సమాసం  2) సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

3) బహువ్రీహి సమాసం      4) ద్వంద్వ సమాసం


56. ‘అధికార దర్పం’ విగ్రహ వాక్యం గుర్తించండి.

1) అధికారం కొరకు దర్పం      2) అధికారం చేత దర్పం

3) అధికారం అనెడి దర్పం       4) అధికారమూ, దర్పమూ


57. మూడడుగులు సమాసం గుర్తించండి.

1) ద్విగు సమాసం      2) రూపక సమాసం

3) ద్వంద్వ సమాసం      4) బహువ్రీహి సమాసం


58. మహారవం విగ్రహ వాక్యం గుర్తించండి.

1) మహా అనెడి రవం      2) గొప్పదైన రవం

3) మహా మహా రవం      4) మహా యొక్క రవం


59. పూర్వపదంలో పిలుపు లేదా పేరు ఉంటే అది ఏ సమాసం?

1) విశేషణ పూర్వపద కర్మధారయం       2) సంభావన పూర్వపద కర్మధారయం

3) విశేషణ ఉత్తర పద కర్మధారయం       4) ద్వంద్వ సమాసంసమాధానాలు

1-3; 2-4; 3-3; 4-3; 5-3; 6-3; 7-1; 8-2; 9-4; 10-2; 11-1; 12-2; 13-4; 14-3; 15-1; 16-2; 17-3; 18-4; 19-3; 20-4; 21-2; 22-1; 23-2; 24-3; 25-2; 26-1; 27-1; 28-4; 29-3; 30-2; 31-3; 32-2; 33-1; 34-4; 35-3; 36-4; 37-3; 38-4; 39-1; 40-1; 41-2; 42-1; 43-3; 44-2; 45-1; 46-3; 47-1; 48-1; 49-4; 50-1; 51-1; 52-1; 53-3; 54-1; 55-1; 56-2; 57-1; 58-2; 59-2.


రచయిత: సూరె శ్రీనివాసులు 

Posted Date : 22-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.