• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం - పరిణామ క్రమం

1. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) భారత్‌లో తొలి రాజ్యాంగ చట్టంగా ‘రెగ్యులేటింగ్‌ చట్టం, 1773’ను పేర్కొంటారు.

బి) ‘పిట్స్‌ ఇండియా చట్టం, 1784’ ద్వారా భారత్‌లో ‘‘బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌’’, ‘‘కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌’’ అనే వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

సి) భారత్‌లో తొలి సుప్రీంకోర్టును 1774లో కోల్‌కతాలో ఏర్పాటు చేశారు.

డి) ‘సెటిల్‌మెంట్‌ చట్టం, 1781’ ద్వారా గవర్నర్‌ జనరల్‌కు కౌన్సిల్‌ తీర్మానాలపై ‘వీటో’్బజు’్మ్న్శ అధికారాన్ని కల్పించారు.

1) ఎ, బి, డి                   2) ఎ, బి, సి

3) ఎ, సి, డి                   4) పైవన్నీ

2. ‘చార్టర్‌ చట్టం, 1853’కి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్‌ చట్టం.

బి) గవర్నర్‌ జనరల్‌ అధికార విధులను శాసన, కార్యనిర్వాహక విధులుగా విభజించారు.

సి) శాసనాల రూపకల్పనకు ‘సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేశారు.

డి) ఈస్టిండియా కంపెనీ హక్కులను పొడిగించే అంశాన్ని ప్రస్తావించలేదు.

1) ఎ, బి, సి            2) ఎ, సి, డి

3) బి, సి, డి           4) పైవన్నీ

3. ‘సివిల్‌ సర్వీసెస్‌’ పరీక్షల్లో జాతి వివక్ష లేకుండా బహిరంగ పోటీ విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?

1) చార్టర్‌ చట్టం, 1833

2) చార్టర్‌ చట్టం, 1813

3) చార్టర్‌ చట్టం, 1853

4) చార్టర్‌ చట్టం, 1823

4. ‘భారత ప్రభుత్వ చట్టం, 1858’కి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలపై అధ్యయనం కోసం ‘లార్డ్‌ మెకాలే’ కమిటీని ఏర్పాటు చేశారు.

బి) భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయ్యింది.

సి) మొదటి గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌గా లార్డ్‌ కానింగ్‌ వ్యవహరించారు.

డి) వైస్రాయ్‌ మనదేశంలో బ్రిటిష్‌ రాణి మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి.

1) ఎ, బి, డి                2) ఎ, బి, సి 

3) బి, సి, డి               4) పైవన్నీ

5. లండన్‌లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?

1) భారత ప్రభుత్వ చట్టం, 1858

2) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861

3) చార్టర్‌ చట్టం, 1853

4) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892

6. 1911లో ఎవరి కాలంలో భారతదేశ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చారు?

1) లార్డ్‌ ఎలిన్‌ బరో               2) లార్డ్‌ హార్డింజ్‌- II

3) లార్డ్‌ వెల్లస్లీ                      4) లార్డ్‌ విలియంసన్‌

7. కిందివాటిలో ‘మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919’కి సంబంధించి సరైనవి ఏవి?

ఎ) కేంద్ర శాసన వ్యవస్థలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.

బి) ‘భారత హైకమిషనర్‌’ అనే పదవిని సృష్టించారు.

సి) భారత రాజ్య కార్యదర్శి జీతభత్యాలను భారతదేశ రెవెన్యూ నుంచే చెల్లించాలని నిర్ణయించారు.

డి) కేంద్ర బడ్జెట్‌ నుంచి మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు.

1) ఎ, బి, డి                  2)  ఎ, సి, డి 

3) ఎ, బి, సి                  4) పైవన్నీ

8. కిందివాటిలో ‘మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919’కి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.

ఎ) సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేశారు.

బి) ‘పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ’ అనే పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు.

సి) మహిళలకు ఓటుహక్కును కల్పించే అంశాన్ని ప్రొవిన్షియల్‌ శాసనసభలకు అప్పగించారు.

డి) కేంద్ర, రాష్ట్రాల మధ్య 3 రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు.

1) ఎ, సి, డి                 2) ఎ, బి, సి

3) ఎ, బి, డి                 4) పైవన్నీ

9. 1925, ఆగస్టులో కేంద్రశాసన వ్యవస్థలో దిగువ సభగా పేరొందిన ‘లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’కి అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడు?

1) డాక్టర్‌ సచ్చిదానంద సిన్హా 

2) దాదాభాయ్‌ నౌరోజి

3) విఠల్‌భాయ్‌ పటేల్‌ 

4) భోగరాజు పట్టాభిసీతారామయ్య

10. కిందివాటిలో సైమన్‌ కమిషన్‌ సిఫార్సులను గుర్తించండి.

ఎ) భాషా ప్రాతిపదికన ఒడిశా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం.

బి) భారత్‌లో సమాఖ్యతరహా విధానాన్ని ఏర్పాటు చేయడం.

సి) రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ‘ద్వంద్వపాలనను’ రద్దు చేయడం.

డి) భారతీయులకు సార్వజనీన వయోజన ఓటు హక్కును నిరాకరించడం సమంజసమే.

1) ఎ, బి, డి                  2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి                  4) పైవన్నీ

11. కిందివాటిలో సరికానిది ఏది?

1) బ్రిటన్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ లండన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలను ఏర్పాటుచేశారు.

2) సైమన్‌ కమిషన్‌ను బహిష్కరిస్తున్నట్లు భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస అయ్యంగార్‌ ప్రకటించారు.

3) గాంధీజీ మొదటి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

4) రెండో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని బహిష్కరించిన గాంధీజీని ఎరవాడ జైల్లో బంధించారు.

12. బ్రిటన్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ కమ్యూనల్‌ అవార్డ్‌ను ఎప్పుడు ప్రకటించారు?

1) 1931, మే 27 

2) 1932, ఆగస్టు 16 

3) 1931, జులై 22 

4) 1932, అక్టోబరు 21 

13. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్, మహాత్మా గాంధీల మధ్య ‘పుణె ఒడంబడిక’ ఎప్పుడు జరిగింది?

1) 1932, సెప్టెంబరు                2) 1933, అక్టోబరు

3) 1934, నవంబరు                4) 1934, డిసెంబరు

14. కిందివాటిలో లండన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశాలకు సంబంధించి సరికానిది?

1) మొదటి రౌండ్‌టేబుల్‌ సమావేశం - 1930 

2) రెండో రౌండ్‌టేబుల్‌ సమావేశం - 1931 

3) మూడో రౌండ్‌టేబుల్‌ సమావేశం - 1932 

4) నాలుగో రౌండ్‌టేబుల్‌ సమావేశం - 1933

15. కిందివాటిలో ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’ ద్వారా ద్విసభా విధానాన్ని అమలు చేయని రాష్ట్రాలు?

1) అసోం, బిహార్‌            2) బెంగాల్, మద్రాస్‌ 

3) గుజరాత్, పంజాబ్‌ 

4) ఉత్తర్‌ ప్రదేశ్, కేరళ

16. 1940, ఆగస్టు 8న వెలువడిన ఆగస్టు ప్రతిపాదనలకు సంబంధించి సరైనవి ఏవి?

ఎ) రాజ్యాంగ పరిషత్‌లో అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం.

బి) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తితో కూడిన పాక్షిక స్వాతంత్య్రాన్ని కల్పించడం.

సి) అన్ని రాజకీయ పార్టీలు, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం.

డి) భారతదేశం నుంచి బర్మాను వేరుచేయడం.

1) ఎ, బి, సి              2) బి, సి, డి

3) ఎ, సి, డి             4) పైవన్నీ

17. బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ భారతదేశానికి క్రిప్స్‌ ్బరీ౯i్ప(్శ రాయబారాన్ని ఎప్పుడు పంపారు?

1) 1941, జులై 16 

2) 1942, జనవరి 18 

3) 1942, మార్చి 22 

4) 1943, డిసెంబరు 3

18. ‘‘దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందు తేదీ వేసిన చెక్కు లాంటిది’’ అని గాంధీజీ దేన్ని ఉద్దేశించి విమర్శించారు?

1) ఆగస్టు ప్రతిపాదనలు, 1940 

2) క్రిప్స్‌ ప్రతిపాదనలు, 1942 

3) భారత ప్రభుత్వ చట్టం, 1935 

4) సి.ఆర్‌. ఫార్ములా, 1944

19. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక, ప్రత్యేక పాకిస్థాన్‌ ఏర్పాటును కోరుతున్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణను ్బశిః’్జi(‘i్మ’్శ నిర్వహించాలని సిఫార్సు చేసింది?

1) ఆగస్టు ప్రతిపాదనలు, 1940 

2) క్రిప్స్‌ రాయబారం, 1942

3) సి.ఆర్‌ ఫార్ములా, 1944  

4) వేవెల్‌ ప్రణాళిక, 1945

20. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు 1945, జులైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న వారు ఎవరు?

1) భూలాబాయ్‌ దేశాయ్, లియాఖత్‌ అలీ ఖాన్‌

2) సచిన్‌ సన్యాల్, సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ 

3) మహత్మా గాంధీ, మహ్మద్‌ అలీ జిన్నా 

4) జవహర్‌లాల్‌ నెహ్రూ, రఫత్‌ అలీ ఖాన్‌

21. బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ భారతదేశానికి కేబినెట్‌ మిషన్‌ను ఎప్పుడు పంపారు?

1) 1944                  2) 1945 

3) 1946                  4) 1942

22. జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగ్‌ ఎప్పుడు చేరింది?

1) 1946, ఫిబ్రవరి 12  

2) 1946, సెప్టెంబరు 2 

3) 1946, సెప్టెంబరు 17 

4) 1946, అక్టోబరు 29

23. కిందివాటిలో ‘మౌంట్‌ బాటన్‌ ప్రణాళిక 1947’కు సబంధించి సరైనవి ఏవి?

ఎ) ఇండియన్‌ యూనియన్‌ను భారతదేశం, పాకిస్థాన్‌ అనే రెండు దేశాలుగా విభజించడం.

బి) స్వదేశీ సంస్థానాలు తమ అభీష్టం మేరకు, భారతదేశం లేదా పాకిస్థాన్‌లో చేరొచ్చు.

సి) అసోంను భారత్, పాకిస్థాన్‌లకు సమానంగా విభజించడం.

డి) ఈ ప్రణాళికను భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) తిరస్కరించింది.

1) ఎ, బి, సి                    2) ఎ, బి, డి

3) ఎ, సి, డి                    4) బి, సి, డి

24. ‘‘భారతదేశాన్ని సాధ్యమైతే విభజిస్తాం లేదా ధ్వంసం చేస్తాం’’ అని వ్యాఖ్యానించింది ఎవరు?

1) లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ 

2) క్లెమెంట్‌ అట్లీ 

3) ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ 

4) మహ్మద్‌ అలీ జిన్నా

25. భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటిష్‌ రాజమకుటం ఎప్పుడు అమోదముద్ర వేసింది?

1) 1947, జులై 15 

2) 1947, జులై 18 

3) 1947, ఆగస్టు 3 

4) 1947, ఆగస్టు 14

26. కిందివాటిలో ‘భారత స్వాతంత్య్ర చట్టం, 1947’లోని సరైన అంశాలను గుర్తించండి.

ఎ) భారత్, పాకిస్థాన్‌ అనే రెండు స్వతంత్ర దేశాలు అవతరించాయి.

బి) భారతదేశానికి గవర్నర్‌ జనరల్‌గా లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ నియమితులయ్యారు.

సి) పాకిస్థాన్‌ గవర్నర్‌ జనరల్‌గా మహ్మద్‌ అలీ జిన్నా నియమితులయ్యారు.

డి) భారత యూనియన్‌పై బ్రిటిష్‌ సార్వభౌమాధికారం కొంతకాలం కొనసాగుతుంది.

1) ఎ, బి, సి                2) బి, సి, డి

3) ఎ, సి, డి               4) పైవన్నీ

27. కిందివాటిలో ‘భారత ప్రభుత్వ చట్టం, 1947’కి సంబంధించి సరైనవి ఏవి?

ఎ) బ్రిటిష్‌ రాజు/ రాణికి ఉన్న భారత చక్రవర్తి అనే బిరుదు రద్దయ్యింది.

బి) సుమారు 562 స్వదేశీ సంస్థానాలు స్వాతంత్య్రం పొందాయి.

సి) భారతదేశంలో 554 స్వదేశీ సంస్థానాలు విలీనమయ్యాయి.

డి) బ్రిటిష్‌ కామన్వెల్త్‌లో సభ్యత్వం పొందడం అనేది రెండు దేశాల అభీష్టానికి వదిలిపెట్టారు.

1) ఎ, బి, డి                  2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి                  4) పైవన్నీ

సమాధానాలు

1 - 2                 2 - 4               3 - 3               4 - 3               5 - 1              6 - 2               7 - 1             8 - 2            9 - 3            10 - 4              11 - 3             12 - 2           13 - 1            14 - 4              15 - 3               16 - 1          17 - 3            18 - 2            19 - 3            20 - 1            21 - 3             22 - 4            23 - 2          24 - 4       25 - 2         26 - 1       27 - 4   


 

Posted Date : 26-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌