• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ విదేశాంగ విధానం

1. 1927లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన విదేశీ వ్యవహారాల విభాగానికి(Foreign Affairs Department)  ఎవరు నేతృత్వం వహించారు?

1) మోతీలాల్‌ నెహ్రూ    2) సుభాష్‌ చంద్రబోస్‌     3) జవహర్‌లాల్‌ నెహ్రూ    4) సర్‌ తేజ్‌బహదూర్‌ సప్రూ


2. ‘ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ’ సమావేశాల్లో అంతర్జాతీయ పరిణామాలపై ప్రత్యేక తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశాలు ఎక్కడ జరిగాయి?

1) 1926 - గుహవాటి     2) 1927 - మద్రాసు     3) 1928 - కోల్‌కతా   4) పైవన్నీ


3. స్వతంత్ర భారతదేశంలో తొలి విదేశాంగ మంత్రిత్వ శాఖను నిర్వహించిన వారెవరు?

1) సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌     2) జైరాందాస్‌ దౌలత్‌రాం   3) జవహర్‌లాల్‌ నెహ్రూ  4)కె.ఎం.మున్షీ


4. కింది వారిలో పాకిస్థాన్‌-భారతదేశ సంబంధాల విధాన నిర్ణయాల విషయంలో నెహ్రూకు సహకరించిన వారెవరు?

1)  సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్, గోవింద్‌ వల్లభ్‌పంత్‌ 

2) సర్వేపల్లి రాధాకృష్ణ, గోవింద్‌ వల్లభ్‌పంత్‌ 

3) సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్,  కె.ఎం.మున్షీ 

4) రాజకుమారి అమృతకౌర్, జైరాందాస్‌ దౌలత్‌రాం


5. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.

ఎ) భారతదేశం, సోవియట్‌ రష్యాల మధ్య సత్సంబంధాల స్థాపనకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కృషి చేశారు.

బి) సోవియట్‌ రష్యా అధినేత స్టాలిన్‌తో  విదేశాంగ సంబంధాల మెరుగుదలకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కృషి చేశారు.

సి) చైనాతో భారతదేశ సంబంధాల మెరుగుదలకు కె.ఎం. ఫణిక్కర్‌ కృషి చేశారు.

డి) విజయలక్ష్మి పండిట్‌ సోవియట్‌ రష్యాలో భారతదేశ రాయబారిగా వ్యవహరించారు.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి     3) ఎ, బి, డి    4) పైవన్నీ


6. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) కొనసాగింది?

1) సోవియట్‌ రష్యా - అమెరికా    2) అమెరికా - చైనా    3) చైనా - సోవియట్‌ రష్యా    4) అమెరికా - జపాన్‌


7. కింది వాటిలో భారతదేశ విదేశాంగ విధాన లక్ష్యానికి సంబంధించి సరైంది?

ఎ) ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయడం

బి) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడం ద్వారా ప్రపంచ దేశాల మధ్య సమతౌల్యతను సాధించడం

సి) వివిధ ప్రాంతీయ సంస్థల మధ్య సమన్వయాన్ని సాధించడం

డి) ఆర్థిక, రాజకీయ, సాంకేతిక, దౌత్యరంగాల్లో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య సమన్వయాన్ని సాధించడం.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి     3) ఎ, బి, డి     4) పైవన్నీ


8. కింది అంశాల్లో సరైంది?

ఎ) 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైంది.

బి) 1991లో భారత్‌లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి.

సి) నూతన ఆర్థిక సంస్కరణలను పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

డి) భారత విదేశాంగ విధానంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం 'LOOK  EAST' విధానాన్ని ప్రారంభించింది.

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి    3) ఎ, బి, సి     4) పైవన్నీ


9. భారత్‌ రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్‌ వద్ద తొలిసారి అణుపరీక్షలను ఎప్పుడు నిర్వహించింది?

1) 1973, మే 18    2) 1974, మే 18    3) 1975, మే 18    4) 1977, మే 18


10. భారతదేశం తన అణ్వాయుధ విధానాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది?

1) 1975    2) 1999      3) 2003   4) 2014


11. భారతదేశ అణ్వాయుధ విధానానికి సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) అణ్వాయుధాలను ఏ దేశంపైనా ముందుగా ప్రయోగించరాదు.

బి) అణ్వాయుధాలు లేని దేశాలపై ముందుగా ప్రయోగించకూడదు.

సి) అణ్వాయుధ ప్రతిదాడులకు ఆదేశాలు ఇచ్చే అధికారం పౌర రాజకీయ నాయకత్వానికి మాత్రమే ఉండాలి.

1) ఎ, బి    2) ఎ, సి     3) బి, సి   4) పైవన్నీ


12. బంగాళాఖాత తీరప్రాంత దేశాల మధ్య సహకారం సాధించే లక్ష్యంతో BIST-EC ఏర్పడింది. దీనిలో సభ్యదేశాలు ఏవి?

1) బంగ్లాదేశ్, భారత్‌     2) శ్రీలంక, థాయ్‌లాండ్‌   3) 1, 2     4) భూటాన్, నేపాల్, భారత్‌


13. BIST-EC ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1997, జూన్‌ 6     2) 1998, జులై 9    3) 1999, ఆగస్టు 15     4) 2000, ఆగస్టు 29


14. 1997లో BIST-EC లో ఏ దేశం చేరడంతో BIMST-EC గా మారింది?

1) మాల్దీవులు    2) మారిషస్‌    3) మయన్మార్‌     4) మలేసియా


15. 2004, జులైలో జరిగిన శిఖరాగ్ర సదస్సులోBIMST-EC పేరు BBIMST-EC (Bay of Bengal Initiative for Multi Sectorial Technical and Economic Cooperation)  గా మారింది. అయితే ఈ సదస్సు ఎక్కడ జరిగింది?

1) బ్యాంకాక్‌     2) కొలంబో    3) ఢాకా    4) న్యూదిల్లీ


16. BBIMST-EC కూటమిలోని దేశాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది?

1) భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్‌     2) బంగ్లాదేశ్, మయన్మార్‌    3) నేపాల్, భూటాన్‌    4) ఆఫ్గానిస్థాన్, మాల్దీవులు


17. ‘మనకు శాంతి అనేది ఒక ఇష్టమైన ఆశయం కాదు. తక్షణ అవసరం’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) దలైలామా  2) మహాత్మాగాంధీ    3) జవహర్‌లాల్‌ నెహ్రూ     4) అంబేద్కర్‌


18. 1936లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ (INC) సమావేశంలో భారతదేశం సామ్రాజ్యవాదాన్న వ్యతిరేకిస్తున్నట్లుగా తీర్మానం చేశారు. ఈ సమావేశం ఎక్కడ నిర్వహించారు?

1) ఫైజ్‌పూర్‌     2) కాన్పూర్‌     3) కోల్‌కతా     4) వారణాసి 


19. కింది అంశాల్లో సరైంది?

ఎ) 1945 నాటికి అమెరికా అణ్వస్త్ర దేశంగా అవతరించింది

బి) 1949 నాటికి సోవియట్‌ రష్యా అణ్వాయుధాలను సమకూర్చుకుంది

సి) 1954లో భారతదేశం దక్షిణాఫ్రికాతో దౌత్య సంబంధాలను వదులుకుంది

డి) శ్వేతజాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జింబాబ్వే జరిపిన విముక్తి పోరాటానికి భారత్‌ మద్దతుగా నిలిచింది.

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి     3) ఎ, బి, సి    4) పైవన్నీ

సమాధానాలు

1-3  2-4   3-3   4-1  5-4   6-1  7-4  8-4  9-2  10-3   11-4   12-3    13-1    14-3    15-1   16-4   17-3   18-1   19-4

మరికొన్ని..


1. 1955లో ఎక్కడ జరిగిన ఆసియా-ఆఫ్రికా దేశాల సమావేశంలో అలీన విధానం అనే భావన ఊపిరి పోసుకుంది?

1) బాండుంగ్‌ (ఇండోనేసియా)     2) కైరో (ఈజిప్ట్)   3) కేప్‌టౌన్‌ (దక్షిణాఫ్రికా)      4) న్యూదిల్లీ (భారత్)


2. కింది వాటిలో అలీన విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ప్రముఖులకు సంబంధించి సరికానిదేది?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ (భారత్)     2) డా.సుకర్నో (ఇండోనేసియా)

3) యాసర్‌ అరాఫత్‌ (పాలస్తీనా)   4) మార్షల్‌ టిటో (యుగోస్లావియా)


3. 1954లో పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్, చైనా దేశాల ప్రధానులు ఎవరు?

1) నెహ్రూ, హుజింటావో    2) నెహ్రూ, చౌ-ఎన్‌-లై     3) నెహ్రూ, మావోసేటుంగ్‌   4) నెహ్రూ, చిన్‌జియాంగ్‌


4. భారత్, చైనాల మధ్య జరిగిన పంచశీల ఒప్పందంలోని అంశాన్ని గుర్తించండి?

ఎ) ఇరుదేశాలు ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను పరస్పరం గౌరవించుకోవాలి.

బి) ఒకదేశ అంతరంగిక వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోరాదు.

సి) ఒకదేశంపై మరో దేశం దురాక్రమణకు పాల్పడరాదు. శాంతియుత జీవనాన్ని అనుసరించాలి.

డి) సమానత్వం, పరస్పర ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి    3) ఎ, బి, డి     4) పైవన్నీ


5. కింది అంశాల్లో సరైంది?

ఎ) ఐక్యరాజ్య సమితి స్థాపక దేశాల్లో భారతదేశం ఒకటి

బి) మనదేశ విదేశాంగ విధానం ఐరాస ఆశయాలకు అనుగుణంగా ఉంది

సి) ఐరాసకి అవసరమైన ఆర్థిక, సైనిక, దౌత్యపరమైన సహకారాన్ని భారత్‌ అందిస్తుంది.

డి) కొరియా, కంబోడియా, వియత్నాం, లెబనాన్, పశ్చిమాసియా తదితర దేశాల సమస్యల పరిష్కారంలో ఐరాసకి భారత్‌ అండగా నిలిచింది.

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి    3) బి, సి, డి    4) పైవన్నీ


6. అలీన దేశాల 7వ శిఖరాగ్ర సదస్సును న్యూదిల్లీలో ఎప్పుడు నిర్వహించారు?

1) 1982, మార్చి 712     2) 1983, మార్చి 712   3) 1984, మార్చి 712     4) 1985, మార్చి 712


7. అలీన విధానానికి సంబంధించి సరికానిదేది?

1) దక్షిణ సుడాన్‌ సభ్యదేశంగా కొనసాగుతుంది.     2) ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య - 120

3) దీని సమావేశాలు సాధారణంగా 3 ఏళ్లకొకసారి జరుగుతాయి.

4) చైనా, బ్రెజిల్‌ పరిశీలక హోదాను కలిగి ఉన్నాయి.

సమాధానాలు

1-1   2-3  3-2   4-4   5-4   6-2   7-1. 

           

అలీన దేశాల 16వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?

1) డర్బన్‌ (దక్షిణాఫ్రికా)   2) హవానా (క్యూబా)     3) బాలి (ఇండోనేసియా)    4) న్యూదిల్లీ (భారత్‌)

జవాబు: 3


* ఒకదేశ విదేశాంగ విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషించే అంశాన్ని గుర్తించండి?

1) భౌగోళిక, చారిత్రక అంశాలు    2) ఆర్థిక, సామాజిక అంశాలు

3) రాజకీయ, సైనిక, సాంకేతిక అంశాలు    4) పైవన్నీ          

జవాబు: 4


‘భారతదేశ ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ వ్యవహారాల వేదికపై భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది’ అని 1903లో ఎవరు వ్యాఖ్యానించారు?

1) లార్డ్‌ కర్జన్‌     2) మింటో- మార్లే       3) చార్లెస్‌ మెట్‌ కాఫ్‌     4) విన్‌స్టన్‌ చర్చిల్‌ 

జవాబు: 1

Posted Date : 17-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌