• facebook
  • whatsapp
  • telegram

నానో టెక్నాలజీ

* నానో (nano) అనే గ్రీకు పదానికి అర్థం చిన్న మరగుజ్జు (Dwarf).
       1 nano = 10-9 m
* నానో టెక్నాలజీని మొదటిసారిగా జపాన్‌కు చెందిన 'నొరియ టొనిగుచ్చి' (1974) ప్రవేశపెట్టారు.
* నానో టెక్నాలజీ అనే పదాన్ని రిచర్డ్ ఫెన్‌మన్ (1959) ప్రతిపాదించారు.
*  రిచర్డ్ ఫెన్‌మన్ "There's plenty of room at the bottom" అనే థీసిస్‌లో ప్రచురించి ప్రపంచానికి తెలియజేశారు.
* స్వతంత్ర అణువులను లాక్కోవడం వల్ల శాస్త్ర పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని 'ఫెన్‌మెన్' తెలిపారు.
* నానో స్కేల్‌ను ఇంజినీరింగ్‌లో వాడటం వల్ల అతి చిన్న యంత్రాలను తయారు చేయవచ్చని చెప్పారు.
* 'ఆర్థర్ వాన్ హిప్పల్' అనే శాస్త్రవేత్త నానో టెక్నాలజీలో నాన్ అణువులు నానో ఉపకరణాలను తయారు చేయవచ్చని తెలియజేశారు.
నానో టెక్నాలజీలో ఉపయోగించే STM (Scanning Tunneling Microscope - 1981) ను ఐబీఎం సంస్థకు చెందిన గెర్డ్ బిన్నింగ్, హెన్రిచ్ రోవర్ కనుక్కున్నారు. దీనికిగాను వీరికి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి (1986) లభించింది.
నానో టెక్నాలజీ పదాన్ని ప్రచారం చేసినవారు 'ఎరిక్ డ్రెక్సోలర్' (1986). (Engines of Creation: Coming  Era of Nano technology).


నానో టెక్నాలజీపై పరిశోధన చేసినవారు:


నానో టెక్నాలజీ ప్రయోజనాలు:

1. ఐటీ, ఎలాక్ట్రానిక్స్
*  టీవీ, కంప్యూటర్ పరికరాలు, చిప్‌లు, అతి చిన్న పరిమాణంలో ఎక్కువ సామర్థ్యం ఉన్నవాటిని రూపొందిస్తారు.
     ఉదా: టాబ్లెట్స్


2. అంతరిక్ష రంగంలో నానో పదార్థాలతో తయారైన శాటిలైట్స్ జీవితకాలం, సేవల నాణ్యత పెరుగుతుంది.


3. నానో మెటీరీయల్స్
*  టైటానియం డయోడ్స్ అనే నానో పదార్థంతో తయారైన కాస్మోటిక్స్, UV కిరణాలను ఉద్గారించడం వల్ల ఎలాంటి చర్మ సంబంధ క్యాన్సర్ రాదు.
*  టైటానియం డయోడ్స్‌తో వాహనాల అద్దాలను తయారుచేస్తే దుమ్ము రేణువులు సులభంగా జారిపోవడం జరుగుతుంది.


4. నానో మెడిసిన్
* వైద్య రంగంలో నానో పదార్థాలన్నీ కార్బన్‌తో తయారవుతాయి.
* అల్ట్రా సోనోగ్రఫీ, మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (MRI)లో నానో టెక్నాలజీని ఉపయోగిస్తారు.
* ఆస్తమా, బ్రాంకైటిస్‌లకు నానో మందులు అందుబాటులో ఉన్నాయి.
* భారతదేశంలో క్యాన్సర్ కోసం ఉపయోగించే ప్లాటిటాక్సెల్ స్థానంలో Nanoxel అనే మందును వాడుకలోకి వచ్చింది.


5. నానో మెమ్‌బ్రేన్స్ (నానో పొరలు)
* నానో పదార్థాలతో తయారయ్యే పొరలతో
     1) నీటిని శుద్ధిచేయడం
     2) లవణాలు, కలుషితాలను తొలగించవచ్చు.


6. నానో రోబోట్స్
* నానో పదార్థాలతో తయారయ్యే రోబోలను శరీరంలోకి పంపినప్పుడు అవి సులువుగా శరీరంలోకి రవాణా చెంది అసాధారణ కణాల ఉనికిని గుర్తిస్తాయి. ఫలితంగా సులభంగా వైద్య చికిత్స చేయవచ్చు.
* ఈ టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించడానికి కారణం 1985లో వచ్చిన కార్బన్ ట్యూబ్‌లు, ఫుల్లరిన్స్.


నానోపదార్థాల లక్షణాలు
  1) అతిసూక్ష్మంగా ఉంటాయి.
  2) అతి తేలికగా ఉంటాయి.
  3) అత్యంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
  4) స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటాయి.
  5) అధిక మెమొరీని నిల్వచేయవచ్చు.
  6) అత్యంత వేగవంతమైన ప్రక్రియ నిర్వహించవచ్చు.
* బంగారం నానో రేణువులను అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణలో ఉపయోగిస్తారు.
* వాటర్ ఫిల్టర్, మొబైల్ లాంటి పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.
* వెండి నానో రేణువులను ఉపయోగించి బ్యాక్టీరియాలను చంపే బ్యాండేజ్‌ను 'రాబర్ట్ బర్రెల్' కనుక్కున్నారు.
* బుల్లెట్‌ప్రూఫ్ పరికరాల తయారీలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు.


నానో టెక్నాలజీ - భారతదేశం
* భారతదేశంలో మొదటగా నానో ప్రాజెక్ట్స్‌ను 2004లో రూపకల్పన చేశారు.
* 2005లో నానో ఎలక్ట్రానిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
      1) ఐఐటీ, ముంబయి
      2) ఐఐఎస్ఈ, బెంగళూరు
2007లో నానో సిటీ ప్రాజెక్టు మీటింగ్‌ను నిర్వహించారు. దీని ఉద్దేశం దేశంలోని కొన్ని పట్టణాలను ఎన్నుకుని
* నానోసిటీగా మార్చడం. దీనిలో భాగంగా 'పంచకుల' (హరియాణా)లో నానో సిటీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
* 2007లో నాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్‌ను చేపట్టారు. దీని ఉద్దేశం భారతదేశాన్ని నానో రంగంలో గ్లోబల్ లీడర్‌గా చేయడం. దీని కాలవ్యవధి 5 సంవత్సరాలు.
* నానో టెక్నాలజీలో ఉపయోగించే ఫుల్లరిన్‌ను 1985లో రాబర్ట్‌కుల్, క్రోటో, స్మాల్లి కనుక్కున్నారు. వీరు రసాయనశాస్త్రంలో చేసిన కృషికిగానూ 1996లో నోబెల్ బహుమతి పొందారు.
* కార్బన్ నానో ట్యూబ్‌లను బకీట్యూబ్‌లు అని కూడా అంటారు.

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌