అన్ని కాలాలకు సమానమైతే సరళం!
అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడైనా, ఎవరైనా బ్యాంకులు లేదా వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుంటుంటారు. వడ్డీలు చెల్లిస్తుంటారు. నెలా నెలా లేదా సంవత్సరానికి ఒకసారి వడ్డీ కడుతుంటారు. అసలు, వడ్డీ మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చేస్తుంటారు. ఈ వ్యవహారాలను అంకగణిత సూత్రాల్లోకి మార్చి నేర్చుకుంటే వడ్డీల లెక్కలు తేలిగ్గా చేసేయవచ్చు. సులభంగా మార్కులు సంపాదించుకోవచ్చు.
బారువడ్డీ
అవసరానికి ఎవరి నుంచైనా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించేటప్పుడు కొంత మొత్తాన్ని అదనంగా ఇస్తుంటారు. ఆ అదనంగా ఇచ్చే మొత్తాన్ని వడ్డీ అంటారు. ఈ వ్యవహారంలో మొదట తీసుకున్న మొత్తాన్ని ‘అసలు (Principal - P)’, వడ్డీతో కలిపి ఇచ్చే సొమ్మును ‘మొత్తం (Amount - A) అంటారు.
నిర్ణీత కాలానికి అంటే నెలకు లేదా సంవత్సరానికి ఇంత వడ్డీ అని ముందే నిర్ణయిస్తారు. దాన్ని ‘వడ్డీ రేటు (Rate of Interest - R) అంటారు.
అప్పు ఎంత కాలానికి తీసుకున్నారో లేదా అప్పు ఎప్పుడు తీరుస్తారో అప్పటి వరకు గడిచిన సమయాన్ని కాలం (Time - T) అంటారు.
ఈ వడ్డీని రకరకాలుగా లెక్కగడుతుంటారు. వాటిలో ఒకటి సరళ వడ్డీ (Simple Interest - SI) లేదా బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ మొదటిది. ప్రతి నెలకు లేదా ప్రతి సంవత్సరానికి వడ్డీ మొత్తం సమానంగా ఉండటం సరళ వడ్డీ ప్రత్యేకత. ఇందులో వడ్డీ మీద వడ్డీ పడదు.

మాదిరి ప్రశ్నలు
1. రూ.4,000 అప్పుగా తీసుకుంటే సంవత్సరానికి 12% వడ్డీరేటుతో 2 సంవత్సరాల కాలానికి ఎంత వడ్డీ చెల్లించాలి?
1) రూ.860 2) రూ.960 3) రూ.1060 4) రూ.760
జవాబు: 2
1) రూ.8500 2) రూ.8000 3) రూ.7500 4) రూ.7000
జవాబు: 1
ఎప్పుడైనా లెక్కలో నెలలు అంటే మొత్తం కాలాన్ని నెలల్లోకి మార్చి 12తో భాగిస్తే లెక్కను సులభంగా చేయవచ్చు.
3. ఒక వ్యక్తి రూ.800ను సరళవడ్డీకి ఇస్తే 3 సంవత్సరాల్లో రూ.920 అయ్యింది. వడ్డీరేటును 3% పెంచితే అప్పుడది ఎంత మొత్తం అవుతుంది?
1) రూ.192 2) రూ.992 3) రూ.882 4) రూ.1092
జవాబు: 2
సాధన: ముందు వడ్డీరేటును లెక్కించాలి
వడ్డీ = మొత్తం అసలు
వడ్డీ = 920 800 = 120
అప్పుడు వడ్డీరేటు కోసం ఉపయోగించే సూత్రం
4. ఎంత సరళవడ్డీ రేటుతో సొమ్ము 12 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది?
5. కొంత సొమ్ము సరళవడ్డీ రేటుతో 6 సంవత్సరాల్లో రెట్టింపు అయితే 4 రెట్లు కావడానికి పట్టే కాలం ఎంత?
1) 12 సంవత్సరాలు 2) 14 సంవత్సరాలు 3) 16 సంవత్సరాలు 4) 18 సంవత్సరాలు
జవాబు: 4
సాధన: రెట్టింపు అంటే 100, 4 రెట్లు అంటే 300 తీసుకోవాలి.
100 ..... 6
300
6. కింది వివరణల్లో సరైంది.
సరళవడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిన సొమ్ము
ఎ) వడ్డీరేటు అయితే 5 ఏళ్లలో రెట్టింపు అవుతుంది.
బి) 20% వడ్డీరేటు అయితే 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది.
సి) 5 సంవత్సరాల్లో రెట్టింపు అయితే 10 సంవత్సరాల్లో 4 రెట్లు అవుతుంది.
1) ఎ, సి సరైనవి 2) బి మాత్రమే సరైంది 3) సి మాత్రమే సరైంది 4) బి, సి సరైనవి
జవాబు: 2
సాధన: ఇచ్చిన వివరణలను సరిచూడాలి.
7. కొంత సొమ్ము సరళవడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో రూ.720, 7 సంవత్సరాలకు రూ.1020 అయ్యింది. అయితే ఆ సొమ్ము ఎంత?
1) రూ.500 2) రూ.600 3) రూ.700 4) రూ.710
జవాబు: 2
సాధన: 5 సంవత్సరాల వడ్డీ 1020 - 720 = 300
అప్పుడు 2 సంవత్సరాలకు
8. కొంత సొమ్ముపై కొంత కాలానికి అయిన సరళవడ్డీ అసలులో 9ౌ16 వ వంతు. వడ్డీరేటు, కాలం సంఖ్యాత్మకంగా సమానమైతే వడ్డీరేటు ఎంత?
9. కొంత సొమ్మును 5% సరళవడ్డీ రేటుతో 6 సంవత్సరాలకు ఇస్తే రూ.2613 అయ్యింది. అదే వడ్డీరేటుతో ఎంత కాలానికి మొత్తం రూ.3015 అవుతుంది?
1) 8 సంవత్సరాలు 2) 9 సంవత్సరాలు 3) 10 సంవత్సరాలు 4) 7 సంవత్సరాలు
జవాబు: 3
సాధన: మొత్తం ఇచ్చినప్పుడు అసలు కనుక్కోవాలి.
10. ఒక వ్యక్తి రెండు నిర్ణీత మొత్తాలను ఒక బ్యాంకులో సాలీనా 10% వడ్డీరేటు చొప్పున 5 సంవత్సరాలకు పొందే వడ్డీ, మరొక బ్యాంకులో సాలీనా 9% వడ్డీరేటు చొప్పున 6 సంవత్సరాలకు పొందే వడ్డీ సమానమయ్యేలా ఉంచాడు. ఆ నిర్ణీత మొత్తాల మధ్య గల నిష్పత్తి ఎంత?
1) 25 : 27 2) 27 : 25 3) 21 : 20 4) 20 : 21
జవాబు: 2
రచయిత: బిజ్జుల విష్ణువర్ధన్ రెడ్డి
మరిన్ని అంశాలు ... మీ కోసం!
‣ సంఖ్యలు