• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ సంబంధాలు

1. అంతర్జాతీయ సంబంధాలు అనే పదాన్ని మొదటిసారిగా ప్రాచుర్యంలోకి తెచ్చిన రాజనీతి తత్వవేత్త ఎవరు?

1) గ్రాన్‌విల్లే ఆస్టిన్‌    2) జెర్మీబెంథామ్‌    3) జీన్‌ బోడిన్‌    4) హెరాల్డ్ జాన్‌ లాస్కి


2. అంతర్జాతీయ సంబంధాలకు మూలం అని కింది దేన్ని పేర్కొంటారు?

1) వెస్ట్‌ఫేలియా సంధి (1648)        2) వర్సైల్స్‌ సంధి (1919)    3) పీటర్స్‌బర్గ్‌ సంధి  (1781)        4)ఇస్తాంబుల్‌ సంధి (1881)


3. అగ్రరాజ్యం (super power) అనే పదాన్ని 1944లో ఎవరు ఉపయోగించారు?

1) జాన్‌ ఆడమ్స్‌   2) ఫ్రెడరిక్‌ విలియమ్స్‌    3) విలియం ఫాక్స్‌    4) జాన్‌ ఆస్టిన్‌


4. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) కమ్యూనిజాన్ని నియంత్రించేందుకు అమెరికా ‘ట్రూమన్‌ సిద్ధాంతాన్ని’ అమలుచేసింది.

బి) అమెరికా ‘మార్షల్‌ ప్రణాళిక’ ద్వారా పశ్చిమ యూరప్‌ దేశాలకు ఆర్థిక సహకారాన్ని అందించింది.

సి) 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం తర్వాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది.

డి) ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అమెరికా కనుసన్నల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

1) ఎ, బి, సి     2) ఎ, బి, డి    3) ఎ, సి, డి    4) పైవన్నీ


5. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, సోవియట్‌ రష్యాల ప్రాబల్యాన్ని వివరిస్తూ, ప్రపంచాన్ని ద్విధ్రువ రాజకీయాలుగా అభివర్ణించింది ఎవరు?

1) ఆర్నాల్డ్‌ టాయిన్‌బీ        2) విలియం ఆడమ్సన్‌     3) జాన్‌ మార్షల్‌  4) గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌


6. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) మొదటి ప్రపంచ దేశాలు - అమెరికా నాయకత్వంలోని పెట్టుబడిదారీ దేశాలు

బి) రెండో ప్రపంచ దేశాలు - సోవియట్‌ రష్యా నాయకత్వంలోని కమ్యూనిస్ట్‌ దేశాలు

సి) మూడో ప్రపంచ దేశాలు - భారత్‌ నాయకత్వంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు

డి) నాలుగో ప్రపంచ దేశాలు - పాకిస్థాన్‌ నాయకత్వంలోని ఉగ్రవాద ముప్పు దేశాలు

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి    3) ఎ, బి, సి    4) పైవన్నీ


7. అంతర్జాతీయ సంబంధాలను ఒక అధ్యయన అంశంగా 1919లో ఏ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు?

1) వేల్స్‌ విశ్వవిద్యాలయం      2) కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం 

 3) లండన్‌ విశ్వవిద్యాలయం     4) రోమన్‌ విశ్వవిద్యాలయం


8. అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం కోసం ఉడ్రోవిల్సన్‌ పీఠాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అధిష్టించిన తొలి వ్యక్తి ఎవరు?

1) ఆల్‌ఫ్రెడ్‌ జమరిన్‌     2) జాన్‌ గాబ్రియల్‌     3) టి.హెచ్‌. గ్రీన్‌     4) జీన్‌ బోడిన్‌


9. ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు  మొదటగా ఏర్పడింది ఏది?

1) ఉడ్రోవిల్సన్‌ పీఠం  (1919)     2) వర్సైల్స్‌ సంధి (1919)

3) నానాజాతి సమితి (1920)        4) కాలిఫోర్నియా ప్రకటన (1923)

10. కింది ఏ కారణాల వల్ల అంతర్జాతీయ సంబంధాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి?

ఎ) రాజకీయ సార్వభౌమత్వం ఉన్న స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించడం

బి) వలసవాదం, సామ్రాజ్యవాదం అంతరించడం

సి) ప్రతి దేశం తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నించడం

డి) ప్రపంచ దేశాల్లో మారుతున్న వైఖరులు

1) ఎ, బి, డి   2) ఎ, బి, సి    3) ఎ, సి, డి       4) పైవన్నీ


11. నానాజాతి సమితికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ప్రారంభ సభ్య దేశాల సంఖ్య - 24

బి) ఇందులో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సభ్య దేశాలుగా ఉన్నాయి

సి) ఇందులో అమెరికా, కెనడా దేశాలకు సభ్యత్వం లేదు

డి) ఇది రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపేందుకు విశేష కృషి చేసింది.

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి     3) ఎ, బి, సి    4)  పైవన్నీ


12. యుద్ధాన్ని ఒక ఉన్నతమైన ఆదర్శంగా, జాతీయ పరిశ్రమగా భావించిన దేశం ఏది? (ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్రంగా నష్టపోయింది.)

1)  జర్మనీ    2) జపాన్‌    3) ఆస్ట్రియా    4) బ్రిటన్‌


13. జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? (నూతన జాతీయ రాజ్యాల ఆవిర్భావానికి ఇది కారణమైంది.)

1) విన్‌స్టన్‌ చర్చిల్‌   2)  ముస్సోలిని    3) ఉడ్రోవిల్సన్‌    4) అడాల్ఫ్‌ హిట్లర్‌


14. వర్సైల్స్‌ సంధికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఇది 1919, జనవరి 18న జరిగింది.

బి) మొదటి ప్రపంచ యుద్ధం ఈ సంధి ద్వారానే ముగిసింది.

సి)  ఈ సంధికి సంబంధించి 70 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

డి) ఓడిపోయిన దేశాలపై న్యాయబద్ధమైన షరతులు విధించారు.

1) ఎ, బి, డి      2) ఎ, బి, సి    3) ఎ, సి, డి      4) పైవన్నీ


15. ‘‘ఓడిపోయిన దేశాలపై గెలిచినవారు షరతులు విధించడం సహజమే, అయితే వర్సైల్స్‌ సమావేశంలో విధించిన షరతులు ఆధునిక చరిత్రలో లేవు’’ అని వ్యాఖ్యానించింది ఎవరు?

1) ఇ.హెచ్‌.కార్‌    2) ఉడ్రోవిల్సన్‌    3) టి.హెచ్‌.గ్రీన్‌    4) పాల్‌ ఆపిల్‌ బీ


16. 1939, సెప్టెంబరు 1న జర్మనీ ఏ దేశంపై దాడి చేయడం వల్ల రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది?

1) సెర్బియా    2) ఆస్ట్రియా    3) పోలండ్‌  4) బ్రిటన్‌


17. రెండో ప్రపంచ యుద్ధం వల్ల అంతర్జాతీయ సంబంధాల్లో ఎలాంటి మార్పులు జరిగాయి?

ఎ) అమెరికా, సోవియట్‌ రష్యా అగ్రరాజ్యాలుగా అవతరించాయి.

బి) ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వివిధ వలసపాలిత దేశాల్లో జాతీయోద్యమాలు ఊపందుకున్నాయి.

సి) అలీన విధానం అనేక దేశాల విదేశాంగ విధానంగా అవతరించింది.

డి) ప్రపంచ దేశాల మధ్య సమాచార - సాంకేతిక పరిజ్ఞానం, వస్తుసేవలు, పెట్టుబడుల అనుసంధానం పెరిగింది.

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి     3) ఎ, సి, డి      4) పైవన్నీ


18. వెస్ట్‌ఫేలియా సంధి (1648) కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఇది ప్రొటెస్టెంట్స్, కేథలిక్స్‌ మధ్య జరిగిన శాంతియుత సంధి.

బి) దీని ద్వారా హాలండ్, స్విట్జర్లాండ్‌ స్వతంత్ర గణతంత్ర రాజ్యాలుగా గుర్తింపు పొందాయి.

సి) ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్వీడన్‌ అగ్రరాజ్యాలుగా అవతరించాయి.

డి) ఈ సంధిలో మెటర్నిక్‌ కీలక పాత్ర పోషించారు.

1) ఎ, బి, సి     2) ఎ, బి, డి     3) ఎ, సి, డి     4) పైవన్నీ

సమాధానాలు

1-2  2-1  3-3   4-4   5-1   6-3   7-1   8-1   9-3   10-4  11-3  12-1   13-3  14-2  15-1  16-3  17-4   18-1.


మరికొన్ని..


1. ఫ్రాంకో - ప్రష్యన్‌ యుద్ధానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ప్రష్యా, ఫ్రాన్స్‌కి మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఫ్రాన్స్‌ ఓడిపోయింది.

బి) బిస్మార్క్‌ నాయకత్వంలో ప్రష్యా శక్తిమంతమైంది.

సి) యూరప్‌లో జర్మనీ అగ్రరాజ్యంగా అవతరించింది.

డి) ఈ యుద్ధంలో ఫ్రాన్స్‌కు అండగా నిలిచిన ఏకైక దేశం ఇటలీ.

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి    3) ఎ, సి, డి   4) పైవన్నీ


2. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) 1931లో చైనాలో ఉన్న మంచూరియాను జపాన్‌ ఆక్రమించింది.

బి) 1933లో నానాజాతి సమితి నుంచి జపాన్‌ వైదొలిగింది.

సి) 1935లో తటస్థ ప్రాంతమైన రైన్‌లాండ్‌ను హిట్లర్‌ ఆక్రమించాడు.

డి) హిట్లర్‌ తన గ్రంథమైన మెయిన్‌ కాంఫ్‌తో జర్మనీ ప్రజలను ప్రభావితం చేశాడు.

1) ఎ, బి, డి     2) ఎ, సి, డి    3) ఎ, బి, సి     4) పైవన్నీ


3. కింది అంశాల్లో సరైనవి?

ఎ) వలస ప్రాంతాల ఆక్రమణలో అన్నిటికంటే ముందున్న దేశం - బ్రిటన్‌

బి) వలస విధానంతో సంపన్నులైనవారు - యురోపియన్లు

సి) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వలస విధానం రద్దయ్యింది.

డి) వలస విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన దేశాలు - అమెరికా, రష్యా

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి   3) ఎ, డి    4) పైవన్నీ


4. కింది వాటిలో మూడో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి?

ఎ) వాతావరణ పరిస్థితులతో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ

బి) ఉగ్రవాదం, పేదరికం, విపత్తులు, నిరక్షరాస్యత, అధిక జనాభా

సి) సుస్థిరత కలిగిన పరిపాలన వ్యవస్థలు లోపించడం

డి) శాస్త్ర - సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి    3) ఎ, బి, డి    4) పైవన్నీ


5. ‘‘బ్రెట్టన్‌ ఉడ్స్‌’’ కవలలు అని వేటిని పేర్కొంటారు?

1) అంతర్జాతీయ ద్రవ్యనిధి, అంతర్జాతీయ ద్రవ్య కార్పొరేషన్‌

2) అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్‌

3) ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ

4) అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ


6.  NATO అంటే...

1) North Atlantic Treaty Organisation

2) North Asian Treaty Organisation

3) North Association Treaty Organisation

4) North American Treaty Organisation


సమాధానాలు

1-1   2-4    3-4    4-4   5-2   6-1.    


* యుటెరిచ్‌ సంధి (1713) కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) శక్తి సమతౌల్యం ప్రధాన సిద్ధాంతంగా అవతరించింది.

బి) శక్తి సమతౌల్య సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు ఇంగ్లండ్‌ - ఆస్ట్రియా నాయకత్వం వహించాయి.

సి) ఫ్రాన్స్‌ తీవ్రంగా నష్టపోయింది.

డి) ప్రష్యా ఏకీకరణకు బలమైన పునాది ఏర్పడింది.

1) ఎ, బి, డి   2) ఎ, సి, డి   3) ఎ, బి, సి   4) పైవన్నీ

సమాధానం - 4


* వియన్నా కాంగ్రెస్‌ (1815్శ ఫలితంగా పోలండ్‌ను ఏ దేశాలు తమలో తాము విభజించి పంచుకున్నాయి?

1) ప్రష్యా, ఆస్ట్రియా, రష్యా    2) ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ   3) ఇటలీ, జర్మనీ, రష్యా    4) అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌

సమాధానం: 1

Posted Date : 13-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌