• facebook
  • whatsapp
  • telegram

పైపులు

నిండినా.. ఖాళీ అయినా మార్కులే!

  ట్యాంకును ఒక పైపు నింపుతుంది. మరో పైపు ఖాళీ చేస్తుంది. రెండింటినీ తెరిస్తే త్వరగా నిండుతుంది లేదా వేగంగా ఖాళీ అవుతుంది. దీన్నే కసాగులాంటి గణిత ప్రక్రియలను ఉపయోగించి లెక్కలు కడితే పైపులు అధ్యాయంలోని ప్రశ్నలకు జవాబులు వచ్చేస్తాయి. మార్కులూ దక్కుతాయి.

* పటంలో ఒక పైపు ట్యాంకును x గంటల్లో నింపుతుంది. అంటే ఒక గంటలో ట్యాంకు   వ వంతు నిండుతుంది.

* పటంలో ఒక పైపు ట్యాంకును y గంటల్లో ఖాళీ చేస్తుంది. అంటే ఒక గంటలో ట్యాంకు   వ వంతు ఖాళీ అవుతుంది. 

* పటంలో ఒక పైపు ట్యాంకును x గంటల్లో నింపుతుంది, మరొక పైపు y గంటల్లో ఖాళీ చేస్తుంది. అంటే ఒక గంటలో ట్యాంకు  నిండుతుంది. 

మాదిరి ప్రశ్నలు

1. రెండు పైపులు ఒక ట్యాంకును వరుసగా 60, 75 నిమిషాల్లో నింపుతాయి. మరొక పైపు ఖాళీ చేస్తుంది. అన్ని పైపులు ఒకేసారి తెరిస్తే ట్యాంకు 50 నిమిషాల్లో నిండుతుంది. అయితే ట్యాంకు ఖాళీ అవడానికి ఎంత సమయం పడుతుంది? 

1) 90 నిమిషాలు    2) 100 నిమిషాలు    3) 110 నిమిషాలు    4) 120 నిమిషాలు

జవాబు: 2

సాధన: దత్తాంశం ప్రకారం

2. రెండు పైపులు ఒక ట్యాంకును వరుసగా 15, 10 నిమిషాల్లో నింపుతాయి. మరొక పైపు నిమిషానికి 7 లీటర్లు ఖాళీ చేస్తుంది. మూడు పైపులను ఒకేసారి తెరిస్తే ట్యాంకు 120 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. అయితే ట్యాంకు పరిమాణం ఎంత? 

1) 30    2) 40    3) 50    4) 60 

జవాబు: 2

సాధన: దత్తాంశ ప్రకారం

3. ఒక పైపు ట్యాంకును 8 గంటల్లో నింపుతుంది. మరొక పైపు నిమిషానికి 6 లీటర్ల చొప్పున నింపుతుంది. రెండు పైపులను ఒకేసారి తెరిస్తే ట్యాంకు 12 గంటల్లో నిండుతుంది. అయితే ట్యాంకు పరిమాణం ఎంత? 

1) 7580    2) 7960    3) 8290    4) 8640 

జవాబు: 4

సాధన: దత్తాంశ ప్రకారం

4. రెండు పైపులు ఒక ట్యాంకును వరుసగా 20, 24 నిమిషాల్లో నింపుతాయి. మరొక పైపు నిమిషానికి 3 లీటర్లు ఖాళీ చేస్తుంది. మూడు పైపులు ఒకేసారి తెరిస్తే ట్యాంకు 15 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. అయితే ట్యాంకు పరిమాణం ఎంత?    

1) 60       2) 100    3) 120    4) 180

జవాబు: 3

సాధన: దత్తాంశం ప్రకారం

5.  A, B అనే రెండు పైపులు ఒక ట్యాంకును వరుసగా , 45 నిమిషాల్లో నింపుతాయి. రెండు పైపులు ఒకేసారి తెరిస్తే ట్యాంకు సరిగ్గా 30 నిమిషాల్లో నిండాలి. అంటే తీ పైపును ఎంత సమయం తర్వాత మూసివేయాలి? 

1) 5 నిమిషాలు 2) 9 నిమిషాలు 3) 10 నిమిషాలు 4) 15 నిమిషాలు


జవాబు: 2

సాధన: A పైపును x నిమిషాల తర్వాత మూసివేశాం అనుకుంటే 

దత్తాంశం ప్రకారం 

x నిమిషాల్లో (A + B) నింపిన భాగం +  (30 - x) నిమిషాల్లో A నింపిన భాగం = 1

6. ట్యాంకును ఒక పైపు మరొక పైపు కంటే 3 రెట్లు త్వరగా నింపుతుంది. రెండు పైపులు కలిసి 36 నిమిషాల్లో నింపుతాయి. అయితే ఆలస్యంగా నింపే పైపు ఎంత సమయంలో నింపుతుంది? 

1) 81 నిమిషాలు     2) 108 నిమిషాలు     3) 144 నిమిషాలు  4) 192 నిమిషాలు 

జవాబు: 3

సాధన: దత్తాంశం ప్రకారం 

సంక్షిప్త పద్ధతి: 4 x 36 = 144 నిమిషాలు

7. ఒక ట్యాంకులో 2/5వ వంతు నీళ్లు ఉన్నాయి. A అనే పైపు ట్యాంకును 10 నిమిషాల్లో నింపితే, B అనే పైపు 6 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. రెండు పైపులను ఒకేసారి తెరిస్తే ట్యాంకులోని నీరు ఎంత సమయంలో ఖాళీ అవుతుంది లేదా నిండుతుంది? 

1) 6 నిమిషాల్లో ఖాళీ అవుతుంది    2) 6 నిమిషాల్లో నిండుతుంది  

3) 9 నిమిషాల్లో ఖాళీ అవుతుంది     4) 9 నిమిషాల్లో నిండుతుంది 

జవాబు: 1

సాధన: 

8. ఒక ట్యాంకును A, B అనే రెండు పైపులు వరుసగా 12, 15 నిమిషాల్లో నింపగలవు. మరొక పైపు C దాన్ని 6 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. A, B లను తెరిచిన 5 నిమిషాల తర్వాత C ను కూడా తెరిస్తే ట్యాంకు ఎంత సమయంలో ఖాళీ అవుతుంది? 

1) 30 నిమిషాలు   2) 33 నిమిషాలు   3) 37.5 నిమిషాలు   4) 45 నిమిషాలు

జవాబు: 4 

సాధన: A, B పైపులు 5 నిమిషాల్లో నింపే భాగం

రచయిత: బిజ్జుల విష్ణువర్ధన్‌ రెడ్డి 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

   వయసులు

‣  వృత్తం - అర్ధవృత్తం - సెక్టార్‌

  సాపేక్ష వేగాలు

‣ ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 27-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌