• facebook
  • whatsapp
  • telegram

 Tenses  

                పోటీ పరీక్షలో విజయాన్ని నిర్దేశించే General English లో ఎక్కువ మార్కుల కోసం గ్రామర్‌లో అతి కీలకమైన tenses మీద పట్టు సాధించడం అవసరం. tenses ను Heart of English Grammar గా అభివర్ణిస్తారు. ఆంగ్లంలో మాట్లాడాలన్నా, రాయాలన్నా, ఆ భాషపై భయం తొలగిపోవాలన్నా 'tenses' మీద పట్టు సాధించడం అనివార్యం. అంతేకాకుండా ఇంగ్లిష్ గ్రామర్‌లో voice, speech లాంటి ఇతర అంశాలు కూడా పరోక్షంగా tenses మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి, మనం tenses ని ఎంత చక్కగా అర్థం చేసుకోగలిగితే, మిగతా విభాగాలనూ అంతే బాగా అర్థం చేసుకోగలం.
Tenses అనే పదం 'tempus' అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. లాటిన్‌లో'tempus' అంటే 'time' అని అర్థం. 'tense'అనేది పని జరిగే కాలాన్ని సూచిస్తుంది.

 Tense = Time + Action
ఇంగ్లిష్‌లో ప్రధానంగా మూడు Tenses ఉన్నాయి.
అవి:     
      1. Present tense 
      2. Past tense
      3. Future tense.
 ప్రతి tenseకి నాలుగు Sub tenses (ఉప కాలాలు) ఉంటాయి.
అవి:
      1. Simple
      2. Continuous
      3. Perfect
      4. Perfect Continuous.
ఇలా.. ఇంగ్లిష్‌లో మొత్తం tenses: 3 × 4 =12.

మనం ఇప్పుడు ఈ12 tenses గురించి నేర్చుకోవాలి. ఇక్కడ ప్రతి tense కి సంబంధించి ముఖ్యంగా 3 అంశాలు నేర్చుకోవాలి. అవి:
1. Structure (నిర్మాణం)
2. Usage (ఉపయోగం)
ముందుగా structureకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అదే వాక్య నిర్మాణం. ఇంగ్లిష్‌కు, మిగతా భాషలకు వాక్య నిర్మాణంలో చాలా తేడా ఉంది. కింది వాక్యాన్ని గమనించండి.
                        సీత         యాపిల్         తిన్నది.   
                        కర్త             కర్మ              క్రియ 
                        Subject     Object         Verb
ఈ వాక్యాన్ని ఇదే క్రమంలో English లోకి అనువదిస్తే ఆ వాక్యం ఇలా ఉంటుంది.
                        Sita     an apple     ate
కానీ, ఈ వాక్యం తప్పు కదా! sita ate an apple అని ఉండాలి.
                          కర్త                 క్రియ          కర్మ
                        Subject         Verb        Object
దీని నుంచి మనం గ్రహించేది ఏమిటంటే:
ఇంగ్లిష్‌లో వాక్య నిర్మాణం S + V + O
మిగతా భాషల్లో వాక్యనిర్మాణం S + O + V
ఈ 12టెన్స్‌ల నిర్మాణాలు, ఉపయోగాలు, ఆ tense ను గుర్తించడానికి అవసరమయ్యే clue words ని పట్టిక రూపంలో చూడొచ్చు. వీటిని క్షుణ్నంగా నేర్చుకుంటే tenses పై అడిగే ప్రశ్నలకు సమాధానాలు సులభంగా గుర్తించవచ్చు.
(తరువాత పేజీలోని పట్టిక చూడండి.)




పరీక్షలో tenses పై అడిగే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే పద్ధతి:
మొదటి దశ: ఇచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా చదివి, అర్థం చేసుకొని, ఏ tense కు చెందిందో నిర్ధారించుకోవాలి.
రెండో దశ: Clue word ను గుర్తించి, తద్వారా ఇచ్చిన వాక్యం కచ్చితంగా ఏ tense కు (నాలుగు sub tenses లో) చెందిందో గుర్తించాలి.
మూడో దశ: కచ్చితమైన tense ని నిర్ధారించిన తరువాత ఆ tense structure ను గుర్తుకు తెచ్చుకొని, కింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాల్లో ఏది సరిపోతుందో చూసి, సమాధానాన్ని గుర్తించాలి.

 

Illustrative Examples:
1. While he ---- the road, he met with an accident.

     1) is crossing            2) was crossing
     3) cross                    4) will be crossing
I st method: ఇచ్చిన వాక్యాన్ని చదివిన వెంటనే ఆ వాక్యం Past tense కు చెందిందిగా గుర్తించవచ్చు. ఎందుకంటే met అనేVerb Past Tense (V2)ను సూచిస్తుంది. ఇచ్చిన వాక్యం అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించినప్పుడు 'అతడు రోడ్డు దాటుతూ ఉండగా అతడికి ప్రమాదం జరిగింది' అనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. అంటే, గతంలో జరుగుతూ ఉండిన పని(Past Continuous Tense) అని తెలుస్తుంది. ఆ Tenseనిర్మాణం మనకు తెలుసు కాబట్టి 2వ ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించవచ్చు.

 

II nd Method: V2 + While అనేClue words Past Continuous Tense ను సూచిస్తాయి. కాబట్టి 1, 3వ ప్రత్యామ్నాయాలు సమాధానాలు కావు. ఎందుకంటే ఆ రెండు Present Tense ను సూచిస్తాయి. 4 కూడా సరైన సమాధానం కాదు. ఎందుకంటే అది Future Tense ను సూచిస్తుంది. కాబట్టి '2' మాత్రమే సరైన సమాధానం.
 

2. It ----- heavily since morning.
1) is raining              2) was raining             3) has been raining              4) rained
Ans: ఇచ్చిన వాక్యంలో since అనేది Clue word since/ for present perfect continuous tense ను సూచిస్తుంది కాబట్టి, సమాధానం 3 అని సులభంగా గుర్తించవచ్చు.

 

3. The patient ---- before the doctor arrived. 
   1) died              2) die                   3) has died                4) had died
Ans: ఇచ్చిన వాక్యంలో arrived (V2) ఉంది కాబట్టి, చూసిన వెంటనే Past tense అని గుర్తించవచ్చు. V2 + before/ after/ when Past Perfect Tense ను సూచిస్తుంది కాబట్టి సమాధానాన్ని 4 గా గుర్తించవచ్చు.

 

4. At present he ---- in Tirupathi.
   1) lives              2) is living             3) was living              4) lived
Ans: At Present అనేదిPresent Continuous Tense ను సూచిస్తుంది కాబట్టి, సమాధానం 2.

 

5. Birds ---- every year.
1) migrate              2) migrated             3) are migrating              4) migrates
Ans: Every అనేది Simple Present Tense ని సూచిస్తుంది కాబట్టి సమాధానం '1'.  

Posted Date : 30-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

study-material

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌