• facebook
  • whatsapp
  • telegram

బాధ్యతగా ఉంటే విజయం

చదువులో సామర్థ్యాన్ని బట్టి విద్యార్థుల్లో మూడు రకాల వారుంటారని చూశాం. ఇందులో ప్రతిభావంతులైన విద్యార్థుల గురించీ, ఒక మాదిరిగా చదివేవారి గురించి తెలుసుకున్నాం కదా..! ఇక మూడో రకం అంటే చదువులో వెనకపడిన విద్యార్థులను ఎలా దారికి తేవాలో ఇప్పుడు చూద్దాం. వీళ్లతో వ్యవహరించడం తల్లిదండ్రులకు కాస్త క్లిష్టమైన పనే. ఓపిక, బాధ్యత రెండూ ముఖ్యమే. వీళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి రావడం తల్లిదండ్రులను కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది.

ఇక్కడా రెండు రకాలు...

చదువులో వెనకబడిన పిల్లల్లో రెండు రకాల వాళ్లు ఉంటారు.
          1) మొదటి నుంచీ చదువులో చురుగ్గా లేనివాళ్లు.
          2) కొంచెం పెద్ద తరగతులకు వచ్చిన తర్వాత ఇతర వ్యవహారాలు ఎక్కువై, చదువుని నిర్లక్ష్యం చేసేవాళ్లు.

మొదటి నుంచీ పిల్లలు చదువులో వెనుకంజలో ఉన్నప్పుడు బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులే వహించాల్సి ఉంటుంది. సాధారణంగా స్కూల్లో నెలకొకసారి జరిగే పేరెంట్స్-టీచర్ సమావేశాలకు వెళితే... పిల్లల చదువు, తరగతిలో వాళ్ల ప్రవర్తన ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలుంటుంది. కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరైనా ఈ సమావేశాలకు హాజరుకావాలి. ఇద్దరూ వెళ్లగలిగితే.. ఇంకా మంచిది. అయితే చాలామంది తల్లిదండ్రులు ఇంటి పనులు లేదా ఉద్యోగ బాధ్యతలు, సెలవు దొరక్కపోవడం లాంటి కారణాలతో వీటికి వెళ్లలేకపోతుంటారు. దాంతో స్కూల్లో ఏం చెప్తున్నారో.. పిల్లలు ఎలా చదువుతున్నారో అర్థం చేసుకునే అవకాశం కోల్పోతారు. కనీసం ఇవ్వాళ ఏం పాఠం చెప్పారు అని అడగడానికి కూడా సమయం ఉండని అమ్మా, నాన్నలు కోకొల్లలు. ఈ పిల్లలు స్కూల్లో చెప్పింది వినడం తప్ప ఇంటికి వచ్చాక చదివే ఆలోచన చేయరు. ఇంకొంతమంది తల్లిదండ్రులు తామిద్దరూ తెలివైన వారు కాబట్టి పిల్లలు కూడా తప్పకుండా తెలివైనవారే అయ్యితీరతారని లేనిపోని భ్రమల్లో ఉంటారు. ఇలా చాలా కారణాల వల్ల పిల్లలు నెమ్మదిగా చదువులో వెనకపడిపోయి 'మొద్దులు'గా టీచర్లతో ముద్ర వేయించుకుంటారు. జాలిపడాల్సిన విషయం ఏమిటంటే - కొన్నాళ్లకు మొద్దులనే ముద్ర అలవాటుగా మారి, ఆ మాటకు స్పందించడం కూడా మానేస్తారు!

 ఏంచేస్తే దారికి వస్తారు..?

ఒకసారి 'మొద్దులు'గా ముద్రపడిన పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచి, దారిలో పెట్టడం చాలా కష్టం! 'నేను బాగా చదవలేను' అన్న మైండ్‌సెట్ నుంచి వారిని ఒక్కసారిగా బయటికి తీసుకురాలేం! ఈ పరిస్థితిని నివారించాలంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల చదువుపై శ్రద్ధ తీసుకోవాల్సిందే. వేరే మార్గం లేదు. కింది తరగతుల నుంచే క్లాసులో ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకోవడం, హోమ్‌వర్క్, అసైన్‌మెంట్లు, ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంలో సహకరించడం, పరీక్షలప్పుడు దగ్గరుండి చదివించడం, ఏ సబ్జెక్టులో వెనకపడి ఉన్నారో దాని బోధనపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, సందేహాలను తీర్చడం, అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలకు అర్థం కాని విషయాలను ఒకటికి రెండుసార్లు విసుక్కోకుండా వివరించడం ముఖ్యం! కొంతమంది తల్లిదండ్రులు పిల్లల హోమ్‌వర్క్ చేస్తుంటే తాము టీవీ చూస్తూనో, కబుర్లు చెప్పుకుంటూనో ఉంటారు. 'వాళ్ల పని వాళ్లు చేస్తారులే' అన్న ధీమాతో. ఇది ఎంత మాత్రం హర్షణీయం కాదు.
ఇక మరికొందరు తల్లిదండ్రులు పరీక్షల్లో తక్కువ మార్కులు రాగానే కొట్టడం, తిట్టడం, ప్రోగ్రెస్ రిపోర్ట్ విసిరికొట్టడం లాంటి పనులతో ఆ పసివాళ్లను భీతావహులను చేస్తారు. (వాళ్లు పదోతరగతి పిల్లలైనా వీళ్ల ప్రవర్తనలో తేడా ఏమీ ఉండదు.) సమస్యకు మూల కారణం ఎక్కడుందో వెతకడం వీరికి అస్సలు నచ్చని పని! అయితే, ఇవన్నీ పిల్లలకు చదువంటే విరక్తి కలిగేలా చేస్తాయి. ఇటు తల్లిదండ్రులకు మానసికంగా దూరం అవుతారు తప్ప ప్రయోజనం శూన్యం. కాబట్టి పెద్దలు తమ ధోరణి మార్చుకోవాలి.
పిల్లలు మిగతావారికంటే చదువులో వెనుకబడి ఉన్నారని గమనించగానే తల్లిదండ్రులు ముందుగా చేయాల్సిన పని - వారి ఉపాధ్యాయులతో మాట్లాడటం! తర్వాత పైన చెప్పినట్లు వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ పైన ట్యూషన్ పెట్టించడం గురించి ఆలోచించవచ్చు. ఇక్కడ మరో జాగ్రత్త తీసుకోవాలి. ట్యూషన్‌లో చేర్పించేటప్పుడు ట్యూటర్‌తో విడిగా మాట్లాడి, తమ బిడ్డపై ప్రత్యేక శ్రద్ధ చూపించమని, చదువులో వెనకబడి ఉన్నారనీ చెప్పాలి. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు. కాబట్టి నిజం చెబితే తప్పేం లేదు. వారు డబ్బు తీసుకునే బోధిస్తారు కాబట్టి తప్పుగా ఏం అనుకోరు. అయితే, ట్యూషన్లో చేర్పించిన తర్వాతి రోజునుంచే పిల్లల్లో గణనీయమైన మార్పు రావాలని ఆశించడం తగదు. కాస్త సహనం వహించాలి. కనీసం రెండు నెలలైనా సమయం పడుతుంది. తరగతిలో అర్థంకాని పాఠాలను ట్యూషన్‌లో వివరంగా చెప్పేలా వీలు కల్పించాలి. చదువంటే ఆసక్తి పెంచేలా మాట్లాడుతూ మార్కుల్లో ఏ కొంచెం అభివృద్ధి కనిపించినా ప్రోత్సహించాలి. రేపటి ఉజ్జ్వల భవిష్యత్తు కోసమే ఇప్పుడు కష్టపడమంటున్న విషయం అర్థమయ్యేలా చెప్తే చాలు.

ఇది మాత్రం చేయకండి!

పిల్లలను పొగడకపోయినా ఫర్వాలేదు. కానీ వారి తెలివితేటలను కించపరుస్తూ మాట్లాడటం తల్లిదండ్రులు అస్సలు చేయకూడని పని!

'ఇక నీ బతుకంతా ఇవే మార్కులా?'

'ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో... ఈ జన్మలో ఇలాంటి పిల్లలు పుట్టారు'.
'ఈ ఒకట్లూ... రెండ్లూ చూడలేక చస్తున్నాం రిపోర్ట్ కార్డులో'.
'చదువు లేకపోతే అడుక్కు తినడానికి కూడా పనికి రావు. మూటలు మోసి బతకాలి'.  
ఇలాంటి మాటలు వాడే తల్లిదండ్రుల సంఖ్యకు కొదవలేదు. వాటివల్ల పెద్దల మనసులోని కోపం తీరుతుందేమో కానీ పసి మనసులు చాలా గాయపడతాయి. అలాంటి మాటలతో నష్టమే తప్ప ప్రయోజనం ఎంత మాత్రం ఉండదు... ఇలా తిట్ల దండకం అందుకునే తల్లిదండ్రులు తమని తాము ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు అదే. కోపాన్ని బహిర్గతం చేయడానికి తప్ప ఇలాంటి తిట్లూ శాపనార్థాలూ ఎందుకూ పనికిరావు. పిల్లలు మనసులు గాయపరిస్తే, తామెందుకూ పనికిరామనే భావన వాళ్లలో బలంగా పాతుకుపోతుంది.

మధ్యలో నిర్లక్ష్యం మొదలైతే...  

ఇక కొన్ని తరగతుల తర్వాత చదువును నిర్లక్ష్యం చేసే పిల్లలు - వీళ్లని దారిలో పెట్టడం మరీ అంత కష్టమేం కాదు. కొంతమంది పిల్లలు చదువే కాకుండా స్నేహితులు, ఇతర కార్యకలాపాల మీద శ్రద్ధ చూపుతారు. ముఖ్యంగా పదోతరగతి, ఇంటర్మీడియట్ పిల్లలకు కొత్త స్నేహాలు, కొత్త వాతావరణం ఎదురవుతాయి. అలాంటపుడు చదువు మరుగున పడిపోతుంది. చాలామంది పిల్లలు తెలివైన వారే అయినా ఆటలు, స్నేహితులతో కలిసి తిరగడాలు లాంటి పనులతో 'రేపటి నుంచీ తప్పక చదవాలి' అని ఎప్పటికప్పుడు తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు కానీ అమలు చేయలేరు. తర్వాతి రోజూ అదే విధంగా జరుగుతుంది. దీని ప్రభావం మొత్తంగా చదువు మీదా, మార్కుల మీదా పడక తప్పదు.
వీరిని మొదట బుజ్జగించి, చదువును నిర్లక్ష్యం చేస్తే కలిగే దుష్ఫలితాలను వివరించాలి. అర్థం చేసుకోగలరు కాబట్టి, ఆలోచిస్తారు.మొదట నెమ్మదిగా చెప్పి చూడాలి. మాట వినకపోతే కొంచెం కఠినంగా వ్యవహరించడం తప్పేమీ కాదు. కఠినం అంటే చేయి చేసుకోవడం, అవమానించే మాటలు మాట్లాడటం కాదు. తల్లిదండ్రులుగా తాము అతడి/ ఆమె వైఖరితో ఎంత అసంతృప్తిగా ఉన్నారో సూటిగా చెప్పాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టం చేయాలి.

సూటిగా... సున్నితంగా..  

చదవకపోతే పాకెట్ మనీ ఇవ్వడం, అడిగినవన్నీ కొనిపెట్టడం కూడా వీలుపడదని సున్నితంగా మందలించాలి. ఫలానా సమయానికల్లా ఇంటికి వచ్చేయాలని, రోజూ ఫలానా సమయం వరకు చదువుకోవాలని నిర్దేశించాలి. ఇవన్నీ చెప్పడం సులభమే. కానీ ఎదిగే పిల్లలు 'అహం' కారణంగా చెప్పిన వెంటనే చేయడానికి అంగీకరించరు. అయితే.. విని తీరతారు. ఎందుకుంటే వారికి వేరే మార్గం లేదు కాబట్టి. ఇవన్నీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేశాక కొంతకాలం నిరీక్షించడం మంచిది. రెండో రోజు నుంచే 'నిన్న చెప్పానుగా, మళ్లీ ఆటలకెళ్లావా' అంటూ విరుచుకుపడకూడదు. తల్లిదండ్రులు తమ ప్రవర్తన పట్ల విసుగుతో ఉన్నారనీ, అయినా సహనం వహిస్తున్నారనీ పిల్లలకు స్పష్టమైతే వారే దారికి వస్తారు.
సాధారణంగా అల్లరి పిల్లలు చదువులో ప్రతిభ చూపించలేరని ఒక నమ్మకం! అందులో నిజం ఎంత ఉన్నా, ప్రతిభ లేని కారణంగా తమను ఎవరూ పట్టించుకోరేమో అన్న భయంతో గుర్తింపు కోసం కొందరు పిల్లలు విపరీతమైన అల్లరి చేస్తారని పరిశీలనల్లో వెల్లడైంది. కాబట్టి పిల్లల భావాలను గుర్తించాలి. వారి ఆలోచనలను గౌరవించాలి. వారికి మేమున్నామనే ధైర్యాన్నీ, భరోసానీ ఇవ్వాలి.  

బాధ్యతగా ఉంటే విజయం మీదే

Posted Date: 22-08-2019

పిల్లల స్వభావాలు