• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శతక మధురిమ

భాషాంశాలు 

పదజాలం
1. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ. భాసిల్లు = ప్రకాశించు
     ఏడుపాయల పుణ్యక్షేత్రం మంజీర పరవళ్లతో భాసిల్లుతోంది.
ఆ. ఉద్బోధించు = మేల్కొలుపు
     ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు చదువు గురించి ఉద్బోధించారు.
ఇ. దైన్య స్థితి = దీన స్థితి
     దైన్య స్థితి తొలగాలంటే చదువును ఆశ్రయించాలి.
ఈ. నరరూప రాక్షసుడు = రాక్షస గుణం ఉన్న మానవుడు
     సమాజంలో ఉన్న నరరూప రాక్షసులను శిక్షించాలి.

 

2. కింది వాక్యాల్లోని పర్యాయ పదాలను గుర్తించి రాయండి.
అ. అడవిలో ఏనుగుల గుంపు ఉంది. ఆ గుంపునకు ఒక గజరాజు నాయకత్వం వహిస్తోంది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తోంది.
జ: పర్యాయ పదాలు: ఏనుగు, గజము, కరి, నాగము
ఆ. స్నేహితులతో నిజాయతీగా ఉండాలి. ఆ నిజాయతీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. నెచ్చెలులే మనకు నిజమైన సంపద.
జ: పర్యాయ పదాలు: స్నేహితులు, మిత్రులు, నెచ్చెలులు.
ఇ. రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆ అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు.
జ: పర్యాయ పదాలు: కృపాణం, కత్తి, అసి
ఈ. కనకం అంటే అందరికీ ఇష్టం. శుభకార్యాలప్పుడు బంగారం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్లి తమకు నచ్చిన ఆభరణాలను తయారు చేయించుకుంటారు.
జ: పర్యాయ పదాలు: కనకం, బంగారం, స్వర్ణం.

 

3. కింది వాక్యాల్లోని ప్రకృతి - వికృతులను గుర్తించి వేర్వేరుగా రాయండి.
అ. తూరుపు దెస ఎర్రబడింది. దక్షిణ దిశ వైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను.
జ: పై వాక్యంలో ప్రకృతి - దిశ, వికృతి - దెస
ఆ. సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది.
జ: పై వాక్యంలో ప్రకృతి - సముద్రం, వికృతి - సంద్రం
ఇ. రాజు తలచుకుంటే అన్నీ సాధ్యం, రేడు మనసును పసిగట్టడం కష్టం.
జ: పై వాక్యంలో ప్రకృతి - రాజు, వికృతి - రేడు.

 

వ్యాకరణాంశాలు 
 

1. కింది వాక్యాలను చదివి సంధి పదాలు గుర్తించి, విడదీసి సంధుల పేర్లు రాయండి.
అ. సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు.
     i) బుద్ధిమంతురాలు - బుద్ధిమంత + ఆలు (రుగాగమ సంధి)
ఆ. అచ్చోట ఆ గులాబీ మొక్కకు ఎన్ని పూలు పూచినాయో!
     ii) అచ్చోట - ఆ + చోట (త్రిక సంధి)
ఇ. రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు.
     i) దివ్యౌషధం - దివ్య + ఔషధం (వృద్ధి సంధి)
ఈ. ఎవరెస్టును అధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు.
     i) సాహసవంతురాలు - సాహసవంత + ఆలు (రుగాగమ సంధి)
ఉ. సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం.
     i) సమైక్యత - సమ + ఐక్యత (వృద్ధి సంధి)
ఊ. విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడుతారు.
     i) ఎక్కాలం - ఏ + కాలం (త్రిక సంధి)

 

2. కింది పద్య పాదానికి గణవిభజన చేసి గురు లఘువులను గుర్తించి ఏ పద్య పాదమో తెలపండి.

     
     పై పద్యపాదంలో భ ర న భ భ ర వ - అనే గణాలు వరసగా వచ్చాయి. కాబట్టి ఇది ఉత్పలమాల.
* ఉత్పలమాలలో యతి స్థానం 10వ అక్షరం - (భం - బాం)

ఆటవెలది

కింది పద్య పాదాలను గమనించండి.


* సూర్యగణాలు - 2    1) న (|||)        2) హ ()
* ఇంద్రగణాలు - 6      1) నల (|||)     2) నగ (|||)      3) సల (|||)
                       4) భ (||)       5) ర (

|)        6) త (|)
* పై పద్యంలో నాలుగు పాదాలు ఉన్నాయి.
* ప్రతి పాదానికి అయిదు గణాలు ఉన్నాయి.
* 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు ఉన్నాయి.
* 2, 4 పాదాల్లో అయిదు సూర్యగణాలు ఉన్నాయి.
* ప్రతి పాదంలో 4వ గణం మొదటి అక్షరం యతి చెల్లింది.
* ప్రాస నియమం పాటించలేదు.
* ఇలాంటి లక్షణాలు ఉన్న పద్యాన్ని ఆలవెలది పద్యం అంటారు.
 

కింది పద్యపాదాన్ని గణవిభజన చేసి ఏ పద్య పాదమో గుర్తించండి.


* పై పద్యంలో అయిదు గణాలు వచ్చాయి.
* పై అయిదు గణాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు వచ్చాయి. అంటే ఇది ఆటవెలది పద్యపాదం.
* ఆటవెలదిలో 1, 3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు వస్తాయి. కాబట్టి పై పద్యపాదం 1 లేదా 3 వ పాదమైనా కావచ్చు.
* యతి స్థానం 4వ గణం మొదటి అక్షరానికి చెల్లింది (వ - వ).

 

రచయిత: జి. అంజాగౌడ్

Posted Date : 27-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం