• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ధన్యుడు

భాషా కార్యకలాపాలు/ ప్రాజెక్టు పని

* పాఠశాల గ్రంథాలయంలో పంచతంత్ర కథల పుస్తకంలోని కథలను చదవండి. మీకు నచ్చిన కథను మీ సొంతమాటల్లో రాసి ప్రదర్శించండి.
 

కొంగ - ఎండ్రి

 బదరికావనంలో సారోదం అనే సరస్సు ఉండేది. అక్కడికి ఒక ముసలి కొంగ వచ్చి తపస్సు చేస్తుండేది. దాన్ని ఒక ఎండ్రి చూసి 'నువ్వు ఎందుకిలా తపస్సు చేస్తున్నావు' అని అడిగింది. దానికి కొంగ బదులిస్తూ 'నేను గంగోత్తర తీరంలో ఒక మఱ్ఱి వృక్షం మీద కూర్చొని ఉన్నప్పుడు ఒక ముని తన శిష్యులకు అనేక రకాలుగా ఉపదేశించాడు. అది విని నేను మారాను' అని అంది.
కొంగ, ఎండ్రి మాటలను చేపలు విని మిక్కిలి బుద్ధిమంతుడు అని కొంగతో స్నేహం చేశాయి. కొంతకాలం గడిచింది. ఒకరోజు కొంగ చేపలతో ఇలా అంది. 'ఇప్పుడే కొంతమంది చేపలు పట్టేవారు వచ్చి కొంచెం నీరు ఇంకిన తర్వాత వస్తామని వెళ్లారు' అంది. 'నీవే మమ్మల్ని రక్షించాలి' అని చేపలు కొంగను వేడుకున్నాయి.  కొంగ తనకు తెలిసిన 'నిత్యాపంబు' అనే చెరువుకు తీసుకువెళతానంది. ప్రతిరోజు కొన్ని చేపలను తీసుకువెళ్లి తినడం మొదలు పెట్టింది. ఇలా కొంతకాలంలోనే చెరువులోని చేపలను ఖాళీ చేసింది.
     ఇది గ్రహించిన ఎండ్రి ఎలాగైనా కొంగను మోసంతోనే జయించాలని అనుకుని కొంగ దగ్గరకు వెళ్లి తనను కూడా రక్షించమంది. 'నీ కంఠాన్ని పట్టుకుంటాను. నన్ను కూడా సురక్షిత ప్రాంతానికి చేర్చు' అనివేడుకుంది. సరేనంది కొంగ. ఎండ్రికాయ తన కాళ్లతో కొంగ కంఠాన్ని పట్టుకుంది. కొంగ కొండ బండ మీద కాళ్లు పెట్టె సమయంలో ఎండ్రి తన పదునైన కాళ్లతో కొంగ కంఠాన్ని కత్తిరించింది.
నీతి - వంచకులను వంచనతోనే జయించాలి.

 

కందుకూరి వీరేశలింగం (1848 - 1919)

 భారతదేశం కథా సాహిత్యానికి ప్రసిద్ధి పొందింది. ప్రాచీన కాలం నుంచే భారతీయ సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన కథలు ఎన్నో ఉన్నాయి. విష్ణుశర్మ అనే పండితుడు అమరశక్తి అనే రాజు కొడుకులను వివేకవంతులను చేయడానికి పంచతంత్ర కథలను బోధిస్తాడు. అవే కథ రూపంలో వ్యాప్తి చెందాయి. వీటిని దాదాపు 200 భాషల్లోకి అనువదించారు. ఈ పంచతంత్ర కథలు మిత్రలాభం, మిత్రబేధం, కాకోలుకీయం (సంధి, విగ్రహం), లబ్దప్రణాశం, అపరీక్షిత కారకం (అసంప్రేక్ష్య కారిత్వం) అనే భాగాలుగా ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించిన వారిలో ముఖ్యులు చిన్నయ సూరితోపాటు కందుకూరి వీరేశలింగం పంతులు. సంధి, విగ్రహం అనే భాగాలను కందుకూరి తెలుగులోకి అనువదించారు. వీటితోపాటు రాజశేఖర చరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర, అభాగ్యోపాఖ్యానం మొదలైన గ్రంథాలు, శతకాలు, నాటకాలను రాసి గద్యతిక్కనగా ప్రసిద్ధికెక్కారు. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారు. సంఘ సంస్కర్తగా పేరు పొందారు.

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌