• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మాణిక్య వీణ

 భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాలు చదివి గీత గీసిన పదాలకు అర్థం రాయండి. పదాలతో సొంత వాక్యాలు రాయండి.

 

ఈ.   ఎందుకు? నెమ్మదిగా జవాబు చెప్పు.
జ: కళవళం = తొట్రుపాటు
సొంత వాక్యం: నా స్నేహితుడు యాదుల్ కళవళం లేకుండా ఉపన్యసిస్తాడు.

 

* ఈ పాఠంలోని అంత్యప్రాసలున్న పదాలు వెతకండి. అలాంటివే మరికొన్ని పదాలను రాయండి.
జ: పాఠంలోని అంత్యప్రాస ఉన్న పదాలు:
* అనవచ్చు
  అనిపించనూ వచ్చు
* పాడటం ఆరంభించినాడు
  కాలికి గజ్జె కట్టినాడు
* చవిగొన్నాడు.
  గీసుకున్నాడు
* ప్రముఖ దినమో
  శుభదినమో
* నేర్చుకున్న రోజు
  పదాలల్లుకున్న రోజు
*
 చిన్నవాడు మానవుడు
  చిరంజీవి మానవుడు
* నడిచేవి
  నడిపించేవి

మరికొన్ని పదాలు
* చేయవచ్చు 
  చేయించనూవచ్చు.

* పని ప్రారంభించినాడు
 కట్టను తెంచినాడు
* సంతాప జలమో
 హర్ష జలమో 
* ప్రయత్నించిన రోజు
  ఫలమందిన రోజు

2. పాఠం ఆధారంగా కింది వాక్యాలకు సమానమైన పదాలను వెతికి రాయండి.
 

 

3. కింది జాతీయాలను ఏయే సందర్భాల్లో ప్రయోగిస్తారో తెలిపి సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ. మంత్రాలకు చింతకాయలు రాలడం
 ఏ పనిచేస్తే ఏది జరుగుతుందో ఆ పనే చేయాలి. అలా కాకుండా వ్యతిరేకం అయిన పని చేసిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
సొంత వాక్యం: మా ఉపాధ్యాయుడు మంత్రాలకు చింతకాయలు రాలడం సాధ్యంకాదని చాలా సందర్భాల్లో చెబుతారు.

 

ఆ. మిన్నందుకోవడం 
  ఆనందం ఎక్కువైన సందర్భంలో, అభివృద్ధి చాలా జరిగిన సందర్భంలో ఏదైనా అమితమైన ఎత్తులో ఉన్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
సొంత వాక్యం: భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మిన్నందుకుంది.

 

ఇ. గజ్జెకట్టడం 

ఏదైనా మొదలు అయ్యే సందర్భంలో, కాలికి గజ్జెలు కట్టే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
సొంతవాక్యం: శృతి కాలికి గజ్జెకట్టిందంటే మమేకమై నాట్యం చేసి మురిపిస్తుంది.

 

4. కింది పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలు రాయండి.
అ. మిన్ను : ఆకాశం, నింగి
ఆ. తాండవం : ఉద్ధత నృత్యం, నాట్య విశేషం
ఇ. రుగ్మత : జబ్బు, రోగం
ఈ. జ్ఞానం : తెలివి, మేధస్సు

 

5. కింది వాక్యాల్లోని వికృతి పదాలను గుర్తించి పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు చేర్చి తిరిగి వాక్యాలు రాయండి.
అ. అమ్మ బాసలోనే నేను మాట్లాడతాను.
జ: వికృతి - బాస
'బాస' కు ప్రకృతి - భాష
అమ్మ భాషలోనే నేను మాట్లాడతాను.

 

ఆ. మన కవులు రాసిన కైతలు భారతి మెడలో అలంకరించిన హారాలు.
జ: వికృతి - కైతలు
    పాఠం ఆధారంగా ప్రకృతి - కవితలు
    మన కవులు రాసిన కవితలు భారతి మెడలో అలంకరించిన హారాలు.

 

ఇ. విన్నాణం పెంచుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది.
జ: వికృతి - విన్నాణం
    పాఠం ఆధారంగా ప్రకృతి - విజ్ఞానం
    విజ్ఞానం పెంచుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది.

 

ఈ. సింహాలు గొబల్లో నిద్రిస్తున్నాయి.
     వికృతి - గొబల్లో
     ప్రకృతి - గుహల్లో
     సింహాలు గుహల్లో నిద్రిస్తున్నాయి.

 

వ్యాకరణాంశాలు 

1. కింది పదాల్లో నుగాగమ సంధి పదాలను గుర్తించి, విడదీసి సూత్రం రాయండి.
    నిట్టనిలువు, తెల్లందనము, పోయేదేమి, తళుకుంగజ్జెలు, మహోపకారం, సరసపుఁదనము
నుగాగమసంధి పదాలు
    1) తెల్లందనము = తెల్ల + తనము
    2) సరసపుఁదనము = సరసపు + తనము
సూత్రం: ఉదంత స్త్రీ సమాలకు, 'పు', '0' పులకు అచ్చు అంతంగా ఉండే గుణవాచక (తెల్ల, పచ్చ మొదలైన) శబ్దాలకు 'తనము' పరమైతే నుగాగమం వస్తుంది.
    3) తళుకు + గజ్జెలు = తళుకుంగజ్జెలు
సూత్రం: ఉత్తు చివర ఉన్న స్త్రీ, సమాలు అయినందువల్ల నుగాగమం వచ్చింది.

 

2. కిందివాటిని జతపరచండి.

జ: సమాసపదం విగ్రహవాక్యం సమాసం

 
 

3. కింది వాక్యాలను పరిశీలించండి.
 

అ. మిమ్ము మాధవుడు రక్షించుగాక!
అర్థం:
1)  మిమ్ము మాధువుడు (విష్ణువు) రక్షించుగాక!
      2)  మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక!

 

ఆ. మానవ జీవనం సుకుమారం
అర్థం: 1)
మా నవ (ఆధునిక) జీవితం సుకుమారమైంది.
      2) మానవ (మనిషి) జీవితం సుకుమారమైంది.
   పై అర్థాలను గమనించారు కదా! ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలను అందిస్తోంది. అంటే విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇలా ఉంటే వాటిని 'శ్లేషాలంకారం' అని అంటారు.
శ్లేషాలంకారం: నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష.

 

* కింది లక్ష్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.
 

1. రాజు కువలయానందకరుడు
అర్థం: 1) రాజు (చంద్రుడు) కువలయ (కలవను) ఆనందకరుడు
      2) రాజు (పాలించే రాజు) కువలయ (భూమి) ఆనందకరుడు
సమన్వయం: 'రాజు కువలయానందకరుడు' అనే వాక్యంలో 'రాజు' అంటే రెండు అర్థాలు ఉన్నాయి.
                   1) చంద్రుడు
                   2) పాలించే రాజు
* కువలయం అంటే రెండు అర్థాలు ఉన్నాయి 
                    1) కలువ
                    2) భూమి
 పైన ఉన్న 'రాజు, కువలయం' అనే పదాల నానార్థాలను కలిపితే
 1) చంద్రుడు కలువలను ఆనందపరుస్తాడు
 2) రాజు భూమిని ఆనందపరుస్తాడు
 ఇలా నానార్థాలతో వాక్యాలు తయారుచేయవచ్చు.

 

2. నీవేల వచ్చెదవు
అర్థం: 1)
నీవు ఏల (ఎలా) వచ్చెదవు
       2) నీవు వేల (సమయానికి) వచ్చెదవు
సమన్వయం: 'నీవేల' అనే పదంలో రెండు అర్థాలు ఉన్నాయి.
                       1) ఎలా 
                       2) సమయానికి అనేవి వాటిలో వాక్యాలు చేస్తే
                       1) నీవు ఎలా వస్తావు.
                       2) నీవు సమయానికి వస్తావు.
 ఇలా ఒక పదానికి ఉన్న వేర్వేరు అర్థాలతో (నానార్థాలు) వాక్యాలు తయారు చేస్తే దాన్ని 'శ్లేషాలంకారం' అంటారు.

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం