• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చిత్రగ్రీవం

భాషాంశాలు 

పదజాలం

1. కింది పదబంధాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
 

అ) శ్రద్ధాసక్తులు
జ: విద్యార్థులందరూ చదువు పట్ల 'శ్రద్ధాసక్తులు' కలిగి ఉండాలి.

 

ఆ) ప్రేమ ఆప్యాయతలు
జ: పట్టణాల్లో కంటే పల్లెల్లో ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి.

 

ఇ) వన్నెచిన్నెలు
జ: మా సిరిపాప వన్నెచిన్నెలు నన్ను ఆకట్టుకుంటాయి.

 

ఈ) సమయ సందర్భాలు
జ: ప్రతి మనిషి సమయ సందర్భాలను బట్టి ప్రవర్తించాలి. మన సమయ సందర్భాలే మనకు విలువను తెస్తాయి.

 

ఉ) హాయి సౌఖ్యాలు
జ: చదువు హాయిసౌఖ్యాలు ఇచ్చే సాధనం.

 

2. కింది పదాలను వివరించి రాయండి.
 

అ) 'విజయవంతం కావడం' అంటే ఏమిటి?
జ: విజయవంతం కావడం అంటే మొదలు పెట్టిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తయితే దాన్ని విజయవంతం కావడం అంటారు.

 

ఆ) 'ఉలుకూ పలుకూ లేకపోవడం' అంటే ఏమిటి?
జ: ఎందరు ఏమన్నా, పట్టించుకోకుండా, మాట్లాడకుండా ఉండటాన్ని ఉలుకూ పలుకూ లేకపోవడం అంటారు.

 

3. కిందవాటిని గురించి పాఠంలో ఏ ఏ పదాలతో వర్ణించారు?
 

అ) గద్దింపులు: కువకువలాడటం
ఆ) పావురాలు: రకరకాల రంగురంగులతో
ఇ) గువ్వలు: నీలికళ్లతో కువకువలాడేవి
ఈ) పావురాల గుంపు: పెనుమేఘాలతో, బృహత్తర సమూహం
ఉ) పావురం మెడ: గ్రీవం, హరివిల్లు
ఊ) పుట్టిన పిల్లపక్షి: బలహీనమైన, నిస్సహాయమైన, అర్భకమైన
ఋ) చిత్రగ్రీవం ముక్కు: పొడవాటి, గట్టి, సూదిలాంటి ముక్కు
ఎ) చిత్రగ్రీవం ఒళ్లు: సముద్రపు నీలిరంగు
ఏ) చిత్రగ్రీవం మెడ: హరివిల్లు, చిత్రవిచిత్ర వర్ణభరితం

 

వ్యాకరణాంశాలు
 

1. కింది అలంకారాల లక్షణాలు రాయండి.
 

అ) శ్లేష
జ: శ్లేష అలంకారం లక్షణాలు: నానార్థాలను కలిగి ఉండేది. ఒకే శబ్దాన్ని వేర్వేరు అర్థాలతో ప్రయోగిస్తారు. విభిన్నమైన అర్థాలతో విభిన్నమైన వాక్యాలు తయారు చేయవచ్చు.
ఉదా: 1) మానవ జీవనం సుకుమారం.
అర్థం: 1) మా నవ (ఆధునిక) జీవితం సుకుమారమైంది.
   2) మానవ (మనిషి) జీవితం సుకుమారమైంది.
         
ఆ) అర్థాంతర న్యాసం: లక్షణం
జ: విశేష విషయాన్ని సామాన్య విషయంతో లేదా సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించి చెప్పడమే అర్థాంతరన్యాస అలంకారం.
ఉదా: 1) శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యం కానిది లేదు కదా!
   2) గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు. పూవ్వులతోపాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు.

2. కింది ఛందోరీతుల లక్షణాలు రాయండి.
 

అ) సీసం - లక్షణాలు
* నాలుగు పాదాలు ఉంటాయి.
* ప్రతిపాదం రెండు భాగాలుగా ఉంటుంది.
* ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
* పాదం రెండు భాగాలుగా ఉంటుంది కాబట్టి మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు, రెండో భాగంలో రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
* యతి ప్రతిపాదంలోనూ మూడో గణం మొదటి అక్షరంతో సరిపోతుంది.
* ప్రాసయతి చెల్లుతుంది.
* ప్రాస నియమం లేదు
* సీసపద్యం తర్వాత తేటగీతి లేదా ఆటవెలది తప్పనిసరిగా ఉంటుంది.

 

ఆ) ఆటవెలది - లక్షణాలు
* ఇది ఉపజాతి పద్యం.
* పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
* 1, 3 పాదాలు ఒకరకంగా, 2, 4 పాదాలు ఒక రకంగా ఉంటాయి.
* 1, 3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి.
* 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి.
* యతిస్థానం ప్రతిపాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి చెల్లుతుంది. యతి కుదరనప్పుడు 'ప్రాసయతి'  వేసుకోవచ్చు.
* ప్రాస నియమం ఉండదు.

 

ఇ) తేటగీతి - లక్షణాలు
* ఇది ఉపజాతి పద్యం.
* నాలుగు పాదాలు ఉంటాయి.
* ప్రతి పాదంలో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి.
* యతి స్థానం ప్రతిపాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి చెల్లుతుంది. యతి కుదరనప్పుడు 'ప్రాస యతి'  వేసుకోవచ్చు.
* ప్రాస నియమం ఉండదు.

 

3. కింది వాక్యాల్లోని అలంకారాలను గుర్తించండి.
 

అ) శ్రీకాంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది.
జ: పైవాక్యంలో 'ఉపమ' అలంకారం ఉంది. ఉపమ అలంకారం అంటే- ఉపమేయానికి, ఉపమానానికి మధ్య మనోహరమైన పోలిక చెప్పడాన్ని ఉపమ అలంకారం అంటారు.
సమన్వయం:
ఉపమేయం: చొక్కా
ఉపమానం: మల్లెపూవు
ఉపమవాచకం: 'లా' (లాగా)
సమాన ధర్మం: తెల్లగా ఉండటం అంటే ఉపమేయమైన చొక్కాను ఉపమానమైన 'మల్లెపూవు'తో పోల్చారు.

 

4. కింది పద్యపాదాలను పరిశీలించండి.

 
* పై పాదాలను గమనిస్తే గగ, భ, జ, స అనే గణాలు వచ్చాయి.
* 1, 3 పాదాల్లో మూడు గణాలు; 2, 4 పాదాల్లో అయిదు గణాలు వచ్చాయి.
* నాలుగు పాదాల్లో మొత్తం 16 గణాలు వచ్చాయి.
* పై రెండు పాదాలు ఒక భాగం, కింది రెండు పాదాలు ఒక భాగంగా చూడొచ్చు.
* రెండు, నాలుగు పాదాల్లోని చివరి అక్షరం గురువే ఉంది.
* రెండు భాగాల్లో కూడా '6వ గణం 'జ గణం ఉంది.
* అదే 'కందం'.

 

కంద పద్యం లక్షణాలు
* నాలుగు పాదాలు ఉంటాయి.
* గగ (గా), భ, జ, స, న ల అనే గణాలుంటాయి.
* మొదటి పాదం లఘువుతో మొదలైతే అన్ని పాదాల్లో మొదటి అక్షరం లఘువుగా, గురువుతో మొదలైతే అన్ని పాదాల్లో మొదటి అక్షరం గురువుగా ఉంటుంది.
* రెండో, నాలుగో పాదాల్లోని చివరి అక్షరం గురువుగానే ఉంటుంది.
* 1, 2 పాదాల్లో (3 + 5) 8 గణాలు, 3, 4 పాదాల్లో (3 + 5) 8 గణాలు ఉంటాయి.
* ఆరో గణం 'జ' గణం లేదా 'నల' మాత్రమే రావాలి.
* 2, 4 పాదాల్లో యతి గుర్తించాలి. యతి స్థానం నాలుగో గణం మొదటి అక్షరానికి, ఏడో గణం తొలి అక్షరానికి  చెల్లుతుంది.
* ప్రాస నియమం ఉంటుంది.
* 1, 2 పాదాల్లోని 8 గణాల్లో బేసి గణాల్లో (1, 3, 5, 7) 'జ' గణం రాకూడదు. అలాగే 3, 4 పాదాల్లోని 8 గణాల్లోని 'బేసి' గణాల్లో (1, 3, 5, 7) 'జ' గణం రాకూడదు.
* వినదగునెవ్వరు జెప్పిన.... అనే పద్యానికి లక్షణ సమన్వయం చేయండి.

 
* పై పద్యం 'కందం'.
* రెండో పాదం, నాలుగో పాదం చివర గురువు ఉంది.
* పై రెండు పాదాల్లోన్ని 8 గణాల్లో '6'వ గణం 'నల' వచ్చింది. 'బేసి' గణాల్లో 'జ' రాలేదు. మిగిలిన రెండు పాదాల్లోనూ అలాగే జరిగింది.
* రెండో పాదం, నాలుగో పాదాల్లోని నాలుగో గణం మొదటి అక్షరానికి ఏడో గణం మొదటి అక్షరానికి యతి  కుదిరింది.
(వి - వి) (మ - మ)
* ప్రాస నియమం ఉంది. నాలుగు పాదాల్లోని రెండో అక్షరం - న, ని, ని, ను- గా ఉంది.
* మొదటి పాదం లఘువుతో మొదలైంది. అలాగే 2, 3, 4 పాదం కూడా లఘువుతో మొదలైంది.

రచయిత: అంజాగౌడ్


 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం