• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జానపదుని జాబు

భాషా కార్యకలాపాలు/ ప్రాజెక్టు పని 

        

* అందమైన పల్లెటూరు ఎలా ఉంటుందో ఊహించండి. ప్రకృతి శోభలతో అలరారే అలాంటి గ్రామసీమ చిత్రాన్ని సేకరించండి. దాన్ని వర్ణిస్తూ, వివరిస్తూ రాసి ప్రదర్శించండి. మీ మిత్రులు కూడా ఇలాగే రాస్తారు కదా! వీటితో 'అందమైన గ్రామసీమలు' అనే పుస్తకం సంకలనం చేయండి. దానికి ముఖచిత్రం గీయండి. విషయసూచిక, ముందుమాట రాసి ప్రదర్శించండి.
జ: అందమైన పల్లెటూరు
     విశాలమైన ఇళ్లు, ఇళ్లముందు పచ్చని చెట్లు, పుష్పాల గుబాళింపు, పక్షుల కిలకిలరావాలు, పచ్చని పొలాలు, చెరువులో చేపల సందడి గ్రామాల్లో మనకు దర్శనమిస్తాయి. పొలాలపై నుంచి వచ్చే పైరుగాలికి తన్మయం చెందనివారు ఎవరు? ఒక్కో గ్రామదేవత ఆలయానికి ఒక్కో ప్రత్యేక గాథ. కల్మషం లేని ఆత్మీయ పలకరింపులు మనల్ని కట్టి పడేస్తాయి. లేగదూడల విన్యాసాలు, కులవృత్తుల పనితీరు పల్లెసీమకు కొత్త అందాలను అద్దుతాయి. అక్కడ అసూయలు ఉండవు.

 

'అందమైన గ్రామసీమలు' పుస్తకం (సంకలనం) 


విషయసూచిక:   

        1) గ్రామం నిర్వచనం
        2) ఇళ్ల అందాలు
        3) పచ్చని చెట్లు
        4) అందమైన చెరువులు
        5) పచ్చని పొలాలు - అభివృద్ధి
        6) పెంపుడు జంతువులు
        7) దేవాలయాలు - జానపద కళారూపాలు
        8) ఆత్మీయతలు - అనుబంధాలు

 

ముందుమాట
 గ్రామాలు అప్యాయాలు, ఆత్మీయతలకు నిలయాలు. ఎక్కడ చూసినా పచ్చదనమే. చూసి పరవశించాల్సిందే తప్ప వర్ణింపలేం. అందుకే గ్రామంలోని పచ్చనిచెట్లు, వివిధ రకాలుగా ఉండే ఇళ్ల నిర్మాణం అన్నింటినీ ఒకసారి చుట్టి రావాలి.  పల్లె ప్రజల జీవనం, పైరుగాలి తీరు, విజ్ఞానాన్ని పెంచే బడి, జానపద కళారూపాలను ఈ అందమైన గ్రామసీమలు అనే పుస్తక సంకలనం మనకళ్ల ముందు ఉంచుతుంది.  పాఠకులకు తమ ఊరితో ఉన్న అనుభవాలను గుర్తు చేస్తుంది. 'ఊరు పిలుస్తోంది' అనే భావన కలుగుతుంది. ఆనందంగా జీవించడాన్ని నేర్పే ఈ సంకలనం అందరికీ ఉపయోగకరం. పల్లెను విడిచి పట్టణాల బాట పట్టిన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.

రచయిత: అంజాగౌడ్


 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం