• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మాతృభావన

భాషా కార్యకలాపాలు/ ప్రాజెక్టు పని

* స్త్రీల అభ్యున్నతికి కృషి చేసిన సంస్కర్తల వివరాలు సేకరించి ప్రదర్శించండి.
                                                               (లేదా)
    వివిధ రంగాల్లో ప్రసిద్ధిగాంచిన స్త్రీల వివరాలను సేకరించి ప్రదర్శించండి.

 

స్త్రీల అభ్యున్నతికి కృషి చేసిన సంస్కర్తల వివరాలు:
 

 కందుకూరి వీరేశలింగం పంతులు: ఈయన గొప్ప సంఘ సంస్కర్త. స్త్రీల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారు. కందుకూరి ధవళేశ్వరంలో ఒక బాలికా పాఠశాలను స్థాపించారు. వివేక వర్ధిని అనే పత్రికలో స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ పద్యాలు, గద్యాలు రాసేవారు. వితంతు వివాహాలను ప్రోత్సహించిన వారిలో ఆద్యుడు.

రాజారామ మోహన్‌రాయ్: సంఘంలోని అనేక దురాచారాలను అరికట్టేందుకు కృషి చేశారు. సతీసహగమన నిషేధానికి పాటు పడ్డారు. బాల్య వివాహాలను రూపుమాపారు.
గురజాడ వేంకట అప్పారావు: నవయుగ వైతాళికుడు గురజాడ సంఘంలోని దురాచారాలను తన రచనల ద్వారా రూపుమాపారు. కన్యక, పూర్ణమ్మ, కన్యాశుల్కం మొదలైన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన సంస్కర్త. సమాజంలో స్త్రీలకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించారు.

జ్యోతిరావు పూలే: నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన సంఘ సంస్కర్త. బాలికల పాఠశాలను మొదటిసారి స్థాపించింది ఈయనే. తన భార్య సావిత్రి బాయికి చదువు చెప్పి పాఠశాలలో మొదటి పంతులమ్మగా ఉంచాడు. సత్యశోధక సమాజాన్ని స్థాపించారు.


ఉన్నవ లక్ష్మీబాయమ్మ: ఈమె గుంటూరులో తన భర్త ఉన్నవ లక్ష్మీనారాయణతో కలిసి 'శారదానికేతన్' స్థాపించారు. భార్యాభర్తలిద్దరూ పేద బాలికలను చేరదీసి చదువు చెప్పించేవారు. ఉచిత వసతి సౌకర్యాన్ని అందించేవారు. స్త్రీల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. సంఘం లక్ష్మీబాయి లాంటి స్త్రీలు ఎందరో 'శారదా నికేతన్‌'లో విద్యను అభ్యసించినవారే.
వివిధ రంగాల్లో ప్రసిద్ధిగాంచిన మహిళలు:

 

మదర్ థెరిస్సా: సేవారంగంలో కీర్తిగాంచిన కరుణామయి మదర్ థెరిస్సా. తన పూర్తి జీవితాన్ని పేద ప్రజలకే అంకితం చేసిన మహనీయురాలు. యుగోస్లావియా దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చి 'మిషనరీస్ ఆఫ్ ఛారిటీ', నిర్మల్ హృదయ్‌లను స్థాపించి పేదలకు విశేష సేవలను అందించిన అమృతమూర్తి.

సునీతా విలియమ్స్: అంతరిక్ష పరిశోధకురాలు. అంతరిక్షంలోకి వెళ్లి చాలా రోజులు గడిపి వివిధ విషయాలపై పరిశోధించారు. ఈమె భారత సంతతి మహిళ. అంతరిక్షయానం చేసి స్త్రీలకు ఆదర్శంగా నిలిచిన పరిశోధకురాలు.
 

ఇందిరా గాంధీ: భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా పనిచేశారు. తన హయాంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో మేలైన పథకాలను ప్రవేశపెట్టారు. 'గరీబీ హటావో' నినాదంతో ముందుకెళ్లిన వనిత.

కరణం మల్లేశ్వరి: వెయిట్ లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తిని దేశ విదేశాల్లో నిలిపింది. స్నాచ్, క్లీన్, జర్క్ విభాగాల్లో అనేక బహుమతులు సాధించింది. ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొని పతకాన్ని గెలుచుకుంది.
 

లతా మంగేష్కర్: ఈమె సినిమా రంగంలో తనదైన శైలిలో పాటలు పాడుతూ అలరిస్తున్న గాయని. వివిధ భాషల్లో వేల పాటలు పాడి అనేక అవార్డులు అందుకున్న గాన కోయిల. తన గానామృతంతో 'భారతరత్న'ను సంపాదించి భారత కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన కళామతల్లి ముద్దుబిడ్డ.


 

రచయిత: అంజాగౌడ్


 

Posted Date : 14-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

తెలుగు

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌