• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Social Issues

UNIT - V
'A' Reading: The Storeyed House - I

 

Learning Objectives:
By the end of the section you will be able to
* Know The storeyed house is a powerful symbol of Dalit empowerment.
* Know the major social problems of India.
* Know the compound adjectives and phrasal verbs.
* Know the contractions and adverbial clauses.
* Write the discourse news report writing.

 

అభ్యసనా లక్ష్యాలు:
ఈ సెక్షన్ చివరలో మీరు కిందివాటి గురించి తెలుసుకుంటారు.
* దళితుల సాధికారతకు బలమైన గుర్తు The storeyed house అని తెలుసుకుంటారు.
* భారతదేశంలోని సాంఘిక దురాచారాలు.
* కాంపౌండ్ ఆబ్జెక్టివ్స్, ఫ్రేజల్ వెర్బ్స్.
* కాంట్రాక్షన్స్, ఆడ్వర్బియల్ క్లాజెస్.
* న్యూస్ రిపోర్ట్ రాయడం.
 

GIST:
   The given context is about dominance of forward class people on the Dalit (Victims of social injustice), written by Waman Govind Hoval, who is a well known Marathi writer for his concern for Dalits.
   Bayaji was a Mahar by caste worked honestly (lifting heavy loads and as supervisor in two years extension period) in the Bombay dockyard for past 35 years and retired from services two months before.
   He wanted to live peacefully in his birth place with family members. He started on a state transport bus. There was something wrong with the state transport bus, it moved as slowly as a sick man walking with the help of another. The bus entered the village reluctantly like a traunt child being dragged to school. As it halted, it gave a big lurch, sending the passengers helter, churned like water in pitcher when the carrier stumbles. All the passengers got down.
   Bayaji paid fifteen paise to the coolie, put the box, in which he had thrown pots and pans and sundry other things, on his own head and began to walk in the direction of his house.
   As he reached Kadam's house, he saw Bhujaba coming towards him, who was a known rascal of the village. Bayaji balanced the burden on his head, straightening his neck he said, ''Greetings to you sir how are things with you"? According to age old custom should have greeted Bhujaba with ''My humble salutations to you, sir, who are my father and, mother". So, when Bayaji merely said ''Greetings" Bhujaba became furious and said, 'Do you think you can become a Brahmin by saying ''Greetings?". Can you forget your position simply because you've turned Buddhist?
   Bayaji was nonplussed. For a moment, he was tempted to knock him down with his box but realised that he couldn't afford to do so. Besides, now he had come back to his village for good. He was to spend rest of his days on this soil and would be interred the same soil. So he said in a meek tone, "sir, why spring this on me even before I set foot on the soil of my forefathers? I have to stay here till the end of my life.
   Bhujaba asked, Are not you going back to your job? No sir, my service is over. 'I have turned sixty' said Bayaji. ''Then you've collected your fund amount, asked Bhujaba. Bayaji replied, yes I received two and half thousand rupees. Bhujaba said, go to your house first, you have a heavy load on your head, later we will discuss about it.
   Exchanging pleasantries with people he met on the way, Bayaji reached the public building called Takkya in the untouchables settlement (Buddha vihar). As Bayaji neared Buddha vihar, the children who were playing, finished their game and cried out, 'Baiju Nana is here, Baiju Nana is here' scampered (ran quickly) in the direction of Bayaji's house.
   His mother (85 years) told Bayaji to wait outside, and poured some water over the piece of bread in her hand, moved it around Bayaji's face and flung it away as an offering. She ran her palms over his cheeks and pressed her fingers on her temples, which gave out a cracking sound. His wife concealed her joy with the end of her sari and took down the box from his head. All the family members surrounded him. He had eight children in all, six sons and two daughters. The daughters had been married off and given birth to children. All of them wondered what their father had got for them from his life time's earnings. Bayaji calmly said, I wish to build a house out of my earnings. All were happy with his plan. The plan was finalised and the foundation of the storeyed house was laid on the auspicious New year day.

 

పాఠ్యసారాంశం
   ప్రస్తుత పాఠ్యభాగాన్ని (The Storeyed House - 1) ప్రముఖ మరాఠి రచయిత వామన్ గోవింద్ హోవల్ రాశారు. ఇది దళితుల మీద అగ్రవర్ణాల ఆధిపత్యానికి సంబంధించింది. మహర్ కులానికి చెందిన 'బాయాజీ (Bayaji) ముంబయి నౌకాశ్రయంలో 35 సంవత్సరాలుగా అధిక బరువులు ఎత్తే కూలీగా; పొడిగించిన చివరి రెండు సంవత్సరాలు సూపర్‌వైజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందుతాడు. పదవీ విరమణ తర్వాత తనకు రావల్సిన డబ్బు (రూ.2,500) తీసుకుని శేషజీవితాన్ని సంతోషంగా కుటుంబ సభ్యులతో కలసి పుట్టిన ఊరులో గడపడానికి బస్సులో బయలుదేరాడు. ఆ బస్సు, ఒక రోగి వేరొకరిని పట్టుకుని మెల్లగా ఎలా నడుస్తాడో, అంతమెల్లగా; ఇష్టంలేని విద్యార్థి పాఠశాలకు ఎలా వెళతాడో అలా వెళుతూ ఉంటుంది. చివరకు గ్రామాన్ని చేరి ఒకే ఊపుతో ఆగడంతో ప్రయాణికులందరూ helter skelter అయ్యారు. అందరూ బస్సు దిగారు. బస్సు దిగగానే తన పెట్టె తెచ్చిన కూలీకి 15 పైసలు ఇచ్చి, పెట్టెను తన తలమీద పెట్టుకుని ఇంటివైపు వెళుతుండగా Kadam ఇంటి ముందు Bhujaba గ్రామపెద్ద కనిపించగానే నమస్కారం చేశాడు. మహర్ కులస్థుల పురాతన ఆచారం ప్రకారం 'మా తల్లిదండ్రులైన మీకు మా వినయపూర్వక నమస్కారాలు అని అనకుండా సాధారణంగా నమస్కారం చేసేసరికి గ్రామపెద్దకు కోపం వచ్చి 'నీవేమైనా బ్రాహ్మణుడివా లేదా బౌద్ధమతం స్వీకరించినంత మాత్రాన నీ స్థితిని మరిచావా అని చీదరించుకున్నాడు. Bayajiకి ఏమనాలో తెలియక, ఒక క్షణం పెట్టెతో కొట్టాలని ఉద్రేకపడ్డాడు. కానీ అలా చేయకూడదని అనుకున్నాడు. తను వచ్చిన ఉద్దేశం శేషజీవితం సొంత గ్రామంలో గడపడానికి, ఇదే మట్టిలో కలిసిపోవడానికని గుర్తుకు తెచ్చుకుని మెల్లగా, 'అయ్యా మా తండ్రి తాతలు తిరిగిన మట్టిలో నా జీవితంలోని చివరి రోజులను గడపాలని వచ్చాను అని చెప్పగా, 'తిరిగి నీవు పనికి వెళ్లవా అని Bhujaba అడిగాడు.
   పదవీ విరమణ పొందానని చెప్పడంతో ఎంత డబ్బులు వచ్చాయని అడిగాడు Bhujaba. 2,500 రూపాయలు వచ్చాయని చెప్పడంతో 'సరే నీ నెత్తిన బరువు ఉంది, వెళ్లు తర్వాత మాట్లాడుకుందాం అని Bhujaba అన్నాడు. Bayaji మధ్యలో కలిసిన వారిని ఆత్మీయంగా పలకరిస్తూ బుద్ధవిహార్ (Takkya in the untouchable settlement) భవనం వద్దకు చేరుకున్నాడు. అక్కడ బంతితో ఆడుతున్న పిల్లలు ఆట ముగించి Baiju Nana వచ్చాడు Baiju Nana వచ్చాడు, అనుకుంటూ వేగంగా Bayaji ఇంటి వైపు పరుగెత్తారు.
   Bayaji అమ్మ (85 సంవత్సరాలు) అతడు ఇంటి దగ్గరకు రాగానే బయట ఉండమని చెప్పి రొట్టెముక్క మీద నీళ్లు పోసి ముఖం చుట్టూ తిప్పి దూరంగా విసిరింది. తన చేతులను అతడి చెంపల మీద ఆనించి తన ఎనిమిది వేళ్లను కణత మీద నొక్కుకోవడంతో శబ్దం వచ్చింది. అతడు లోపలికి రాగానే భార్య ఆనందంతో నెత్తిమీద పెట్టెను తీసుకుంది. తల్లి, భార్య, పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు చుట్టూ మూగారు.
   Bayajiకి 8 మంది సంతానం. ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్ల పెళ్లిళ్లై పిల్లలు ఉన్నారు. పదవీ విరమణ డబ్బులతో తమకు ఏమైనా విలువైన వస్తువులు తెచ్చాడని భావిస్తారు. కానీ Bayaji వారికి అంతస్తుల ఇల్లు నిర్మించుకుందామని చెప్పగానే అందరూ సంతోషిస్తారు. ఇంటి ప్లాన్ తయారు చేసుకుని నూతన సంవత్సరం రోజు ఇంటికి శంకుస్థాపన చేస్తారు.
 

Glossary
Come up (Phr. V) = Reach a particlar point
Goddammit (Phr) = An expression used to show that one is angry or annoyed
Get down (Phr. V) = Descend, come down
Put together (Phr. V) = Assemble, bring together
Initial momentum (Phr) = Basic movement
Hang around (Phr. V) = Stay in a place
Knock down (Phr. V) =  Hit and injure someone
Spring on (Phr. V) = Throw/jump
Fund amount (Phr) = Saved money
Mock Sympathy (Phr) = Insincere
Idle curiosity (Phr) = Wanting to know something for no specific reason
Ran one's (her) eyes (idiom) = Looked quickly at the whole of something
Persit (V) = Continue to do something despite difficulties
Swindle (V) = Cheat

 

(Writer : Satyanarayana Rao)

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం