• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Films and Theatre

C. Reading: A Tribute 

Learning objectives: 
    By the end of the section you will be able to
       1. Know the purpose of the tribute
       2. Know kind of actions do we find in Savitri

 

అభ్యసనా లక్ష్యాలు
  ఈ సెక్షన్ చివర్లో మీరు తెలుసుకునేది ఏమిటంటే...
       1. సంస్మరణ ఉద్దేశ్యం
       2. మహానటి సావిత్రిలో ఉన్న వివిధ నటనారీతులు
 

GIST
    The given context is about Mahanati Savitri, who is ever memorable in Telugu film industry. The Indian film industry has completed a hundred years in 2013. It is fitting tribute to the world of cinema to recollect our favourite films, producers, directors, actors, music and art directors.
    Savitri is one such prestigious artiste. Ever since she was eight, she evinced interest in learning dance. She was debut at the age of 12, in the film Agnipareeksha but was finally dropped as she looked too young for the role. After she was given roles in Pathala Bhairavi (a song sequence Raanante raanu raanu), Samsaaram, Devadasu, Ardhangi, Missamma, Maya Bazaar, Chivaraku Migiledi and other films. She acted nearly 300 films.
    In 'Devadasu' Parvathi comes alive in Savitri. She portrayed Devada's love and the role of richman's wife marvellously. Savitri left her mark in the evergreen Telugu Classic.
    In Ardhangi, she gave an exceptionally brilliant performance as a woman forced to marry a mentally retarded person (ANR). She nurses him back to health and also teaches a lesson to her in-laws.
    Savitri's amazing talent was in full form in 'Missamma', a hit comedy that established Savitri's place firmly as a star.
    Maya Bazaar is another film that brought fame to Savitri. She played the role of Sasirekha. Recollecting the 16 annas Telugu lass clad in parikirni in the song alli billi ammayiki..., remindes us of rich Telugu Culture of yester years. In the final part of the film Savitri plays the role of Maya (not real) Sasirekha (Ghatotkacha in Disguise). She walks in a masculine manner imitating the legendry S.V. Rangarao acting as Ghatotkacha in the film to perfection. The theatre rocks with laughter when Lakshmana Kumara (Relangi) is teased by Maya Sasirekha.
    Chivaraku Migiledi is one such film she played the role of nurse in a psychiatry ward. In a particular scene the nurse has a nervous break down and cries un-controllably. The shot was over but Savitri who played the role could not stop crying? The film became a milestone in her career.
    Savitri was awarded the title 'Mahanati'. She also received the presidential award for her performance in 'Chivaraku Migiledi', the magnum opus of Savitri. She was the recipient of 'Kalaimamani and Nadigayar - Tilakam' from Tamil film industry. She also acted in Tamil, Kannada and Hindi films. She directed and produced a few films.
    Savitri was a humane artiste. She was generous to the people who were in need. Once, she donated all jewellery she was wearing to the Prime Minister's fund. Her rise as a star was like a meteor. She left the world in 1981 leaving an envied and unsurpassed legacy behind her.

పాఠ్య సారాంశం:
    ప్రస్తుత పాఠ్యాంశం తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోలేని మహానటి సావిత్రి గురించి వివరిస్తుంది. భారత చలనచిత్ర పరిశ్రమ 2013 నాటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రసిద్ధ దర్శకులు, నిర్మాతలు, నటీనటులను గుర్తు చేసుకుంటోంది. తెలుగు సినిమాలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటి సావిత్రి. ఆమె తనకంటూ ఒక శైలిని సంపాదించుకున్న నటి. మొదట 'అగ్నిపరీక్ష' చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసినప్పటికీ ఆమెకు 12 ఏళ్లే ఉండటం వల్ల విరమించుకున్నారు. తర్వాత 'పాతాళభైరవి' చిత్రంలో 'రానంటే రానే రాను' అనే పాటతో అందరి మన్ననలను పొందారు. సంసారం, దేవదాసు, అర్ధాంగి, మిస్సమ్మ, మాయాబజార్, చివరకు మిగిలేది మొదలైన చిత్రాలు సావిత్రి నటనకు ప్రతిబింబాలు. ఆమె దాదాపు 300 చిత్రాల్లో నటించారు.
ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన 'సంసారం' (1950) చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. తనదైన శైలిని ప్రదర్శించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం 'దేవదాసు'. ఇందులో పార్వతి పాత్రకు జీవం పోశారు. 'దేవదాసు'ను ప్రేమించడం, సంపన్నుడి భార్యగా ఆమె నటన అద్భుతం.
    1955లో వచ్చిన 'అర్ధాంగి' చిత్రంలో మానసిక ఎదుగుదల లేని (మంద బుద్ధిగల) వ్యక్తి (అక్కినేని నాగేశ్వరరావు)కి భార్యగా సేవలు చేసి ఆరోగ్యవంతుడిగా చేయడంలో, మరుదులకు గుణపాఠం నేర్పే పాత్రలో అద్భుతంగా నటించారు. 'మిస్సమ్మ' చిత్రంలోని 'మేరి' పాత్ర ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చింది.
    సావిత్రికి పేరు తెచ్చిన మరో చిత్రం 'మాయాబజార్'. 'అల్లిబిల్లి అమ్మాయికి...' అనే పాటలో పదహారణాల తెలుగు అమ్మాయిలా అలనాటి తెలుగు సంస్కృతిని ప్రతిబింబింప చేశారు. ఘటోత్కచుడి మారువేషం (ఎస్‌వీఆర్) అయిన మాయా శశిరేఖ పాత్రలో లక్ష్మణ కుమారుడిని (రేలంగి) ఏడిపించడం కడుపుబ్బ నవ్విస్తుంది.
    సావిత్రి నట జీవితంలో మైలురాయిగా నిలిచిన చిత్రం 'చివరకు మిగిలేది'. ఈ చిత్రంలో సైకియాట్రిక్ వార్డులోని నర్సుగా నటించారు. మానసికంగా కృంగి నిరవధికంగా ఏడ్చే సీన్‌లో షాట్ అయిపోయినా, సావిత్రి ఏడుస్తూనే ఉన్నారు.
    సావిత్రికి 'చివరకు మిగిలేది' చిత్రంలోని నటనా ప్రతిభకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. తమిళ చిత్ర పరిశ్రమ 'కళైమామణి', 'నడిగయార్ తిలకం' అవార్డులతో సత్కరించింది. ఆమె తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించడమే కాకుండా, కొన్ని చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. సినిమాల్లోని ఆమె నటనకు 'మహానటి'గా పేరొచ్చింది.
    సావిత్రి ఒక మనసున్న నటి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుండేవారు. ఒకసారి తనకున్న బంగారు నగలన్నింటినీ ప్రధానమంత్రి నిధికి విరాళంగా ఇచ్చారు. తెలుగు చిత్రసీమకు వన్నె తెచ్చిన సావిత్రి 1981లో మరణించారు.

Glossary:
1. In the twinkling of an eye (Idiom) = very quickly.
2. needless to say (Phrase) = no need to mention specially
3. evince (V) = show clearly that you have a feeling or quality
4. indelible (V) = impossible to forget
5. encompass (V) = include a large number
6. conspire (V) = Secretly plan with other people to do illegal or harmful.

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం