• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నిరూపక జ్యామితి

బిట్లు

అరమార్కు ప్రశ్నలు

1. కిందివాటిలో Y - అక్షంపై ఒక బిందువు 
   a) (0, - 3)           b) (2, 4)           c) (- 3, 5)           d) (4, 0)
 జ: (0, - 3)          

 

2. (3, - 4), మూల బిందువుల మధ్య దూరం ఎంత?
జ: 5          

 

3. కిందివాటిలో (0, 0) బిందువు ద్వారా వెళ్లే సరళరేఖ సమీకరణం
 a) y = - 3           b) y = x           c) x = 6           d) y = 3x + 4
జ: y = x          

 

4. త్రిభుజంలో గురుత్వ కేంద్రం ప్రతి మధ్యగత రేఖను ....... నిష్పత్తిలో విభజిస్తుంది.
జ: 2 : 1 

5. Y - అక్షంపై ఉన్న రెండు బిందువుల మధ్య దూరం ఎంత?
జ:     

6. (8, 3), (- 4, 3) బిందువుల మధ్య దూరం ఎంత?
జ: 12    
 

7. (x, y), O(0, 0) మధ్య దూరం ఎంత?
జ: 

8. x < 0, y > 0 అయితే అవి ఏ పాదంలో ఉంటాయి?
జ: రెండో          

 

9. Δ ABC లో G గురుత్వకేంద్రం, మధ్యగత రేఖ AD పొడవు 12 సెం.మీ. అయితే AG పొడవు ఎంత?
జ: 8 సెం.మీ.          

 

10. నిరూపక అక్షాలతో A (0, 4), B(6, 0) బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం ఎంత?
జ: 12 చ.మీ.          

 

11. (x1, y1), (x2, y2) బిందువులతో ఏర్పడే రేఖాఖండం వాలు ఎంత?
 జ: 

 

12. X - అక్షంతో ఒక రేఖ చేసే కోణం ' అయితే వాలు(m) =
జ: tanθ

 

13. (-3, 5) బిందువు దూరం X - అక్షం నుంచి..........
జ: 5          

14. (0, 0), (x, 0), (0, y) శీర్షాలతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం ఎంత?
జ: 

 xy
 

15. (- x, y) అనే బిందువు ఒకటో పాదంలో ఉంటే, (x, - y) బిందువు ఏ పాదంలో ఉంటుంది?
జ: మూడో          

 

16. y = -  x - 4 రేఖ వాలు ఎంత?
జ:  -            

 

17. సరళరేఖ y = - 4 అనేది X - అక్షానికి ఎన్ని యూనిట్ల దూరంలో ఉంటుంది?
జ: 4          

 

18. (-2, a), (8, 6) ల మధ్య బిందువు (3, 5) అయితే a విలువ ఎంత?
జ: 4

 

19. 3x + 4y - 10 = 0 సరళరేఖ వాలు ఎంత?
జ:        

 

20. x + y + k = 0 అనే రేఖ (1, 1) బిందువు ద్వారా వెళ్తే k విలువ ఎంత?
జ: - 2      

21. 7x + by + 5 = 0 సరళరేఖ వాలు  అయితే b విలువ ఎంత?
జ: - 9

 

22. (a, a), (- a, - a) బిందువుల మధ్య దూరం ఎంత?
జ: 

 

23. కిందివాటిలో 4వ (IV) పాదంలో ఉండే బిందువు ఏది?
   a) (-4, 5)        b) (4, 5)       c) (4, - 5)      d) (- 4, - 5)
జ: c (4, - 5)

 

24. (P, Q), (-P, R), (S, -Q) శీర్షాలుగా ఉండే త్రిభుజ గురుత్వకేంద్రం
జ: 

 

25. వృత్త కేంద్రం (0, 0), వ్యాసార్ధం ఒక చివరి బిందువు (7, - 4) అయితే రెండో బిందువు ఎంత?
జ: (- 7, 4)          

 

26. ఒకే సరళరేఖపై ఉన్న బిందువులను ఏమంటారు?
జ: సరేఖీయాలు          

 

27. ఒక త్రిభుజంలోని ప్రతి మధ్యగత రేఖను 2 : 1 నిష్పత్తిలో విభజించే బిందువు ఆ త్రిభుజానికి ఏమవుతుంది?
జ: గురుత్వకేంద్రం        

 

28. నిరూపక రేఖాగణితాన్ని పరిచయం చేసి, పరిశోధనలు ఎక్కువగా చేసిన శాస్త్రవేత్త ఎవరు?
జ: రెనెడె కార్టె          

 

29. త్రిభుజ భుజాలు వరుసగా 12 మీ., 9 మీ., 15 మీ. అయితే హెరాన్ సూత్రంలో S = ?
జ: 18 మీ.          

 

30. త్రిభుజ వైశాల్యం సున్నా అయితే ఆ బిందువులు........
జ: సరేఖీయాలు          
 

(రచయిత: సీహెచ్. నాగేశ్వర రావు)

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం