• facebook
  • twitter
  • whatsapp
  • telegram

క్షేత్రమితి

బిట్లు

1. శంకువులో l = 10 సెం.మీ., r = 5 సెం.మీ. అయితే వక్రతల వైశాల్యం ........ సెం.మీ.2
జ: 157       ...       

 

2. అర్ధగోళం సంపూర్ణతల వైశాల్యం? 
జ:  3πr2          

3. 0.3 సెం.మీ. వ్యాసార్ధం గల అర్ధగోళ ఘనపరిమాణం?
జ:  0.018 ఘ.సెం.మీ.        

 

4. దీర్ఘఘనం సంపూర్ణతల వైశాల్యం?
జ: 2 (lb + bh + lh)

5. స్తూపం, శంకువు ఒకే వ్యాసార్ధం, ఎత్తు కలిగి ఉన్నాయి. స్తూపం ఘనపరిమాణం 27 సెం.మీ.3 అయితే శంకువు ఘనపరిమాణం?
జ:  9 సెం.మీ.           

 

6. శంకువు వక్రతల వైశాల్యం 4075 సెం.మీ2., దాని వ్యాసం 70 సెం.మీ. అయితే ఏటవాలు ఎత్తు ఎంత?
జ:  37 సెం.మీ2.            

 

7. ఎత్తు 24 సెం.మీ., వ్యాసార్ధం 6 సెం.మీ. ఉన్న ఒక శంకువును గోళంగా మార్చితే, దాని వ్యాసార్ధం ఎంత?
జ: 6 సెం.మీ.           

8. క్రమ వృత్తాకార స్థూపం వ్యాసం 28 సెం.మీ., ఎత్తు 21 సెం.మీ. అయితే దాని ఘనపరిమాణం ఎంత?
జ: 12936 సెం.మీ3.           

9. గోళం, ఘనం ఉపరితల వైశాల్యాలు సమానమైతే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి?
జ:  4 : 3

 

10. 21 సెం.మీ. వ్యాసార్ధం ఉన్న అర్ధగోళం ఉపరితల వైశాల్యం ......... చ.సెం.మీ.
జ:  5544          

 

11. క్రమ వృత్తాకార స్తూపం వ్యాసార్ధం 14 సెం.మీ., ఎత్తు 21 సెం.మీ. అయితే వక్రతల వైశాల్యం
జ:  1848 చ.సెం.మీ.

 

12. శంకువు ఘనపరిమాణం ........... ఘనపరిమాణంలో 3వ వంతు ఉంటుంది.
జ:  స్తూపం              

 

13. గోళం, స్తూపం, శంకువు ఒకే వ్యాసార్ధం, ఎత్తు కలిగి ఉంటే వాటి పక్కతల వైశాల్యాల నిష్పత్తి
జ:  4 : 4             

 

14. సమాన ఎత్తు, వ్యాసార్ధం ఉన్న స్తూపం, శంకువు ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?
జ:  3 : 1

 

15. స్తూపం సంపూర్ణతల వైశాల్యం = ........... చ.యూ.
జ:  2πr (h + r)            

 

16. రెండు గోళాల ఉపరితల వైశాల్యాల నిష్పత్తి 1 : 4 అయితే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి
జ:  1 : 8            

 

17. గోళం వ్యాసం d అయితే దాని ఘనపరిమాణం ........... ఘ.యూ.
జ:  1/6 πd        

 

18. 8 సెం.మీ. వ్యాసార్ధం ఉన్న ఒక గోళం నుంచి 1 సెం.మీ. వ్యాసార్ధం గల గోళాలను ఎన్ని తయారుచేయవచ్చు?
జ:  512

 

19. భూమి, ఘనపరిమాణాలు సమానంగా ఉన్న శంకువు, అర్ధగోళాల ఎత్తుల నిష్పత్తి
జ:  1 : 2

 

20. స్తూపం, శంకువు, గోళాలకు సమాన భూమి, ఒకే ఎత్తు ఉన్నాయి. వాటి ఘనపరిమాణాల నిష్పత్తి
జ: 3 : 1 : 2

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం