నిర్మాణాత్మక మూల్యాంకనం
ప్రాజెక్టు పనులు
ప్రాథమిక సమాచారం:
తరగతి : 10
విషయం : గణితం
యూనిట్/పాఠ్యాంశం పేరు : సాంఖ్యక శాస్త్రం
ప్రాజెక్టు సంఖ్య :
మీడియం : తెలుగు
పని విభజన :
i) సమాచార సేకరణ
ii) సమాచారాన్ని నమోదు చేయడం
iii) సమాచార విశ్లేషణ
iv) ప్రాజెక్టు ప్రదర్శన
ప్రాజెక్టు సమగ్ర సమాచారం
1. ప్రాజెక్టు పేరు :
రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న మీ తరగతిలోని 40 మంది విద్యార్థుల బ్లడ్ గ్రూపును తెలుసుకోవడం.
2. ప్రాజెక్టు లక్ష్యాలు:
i) సేకరించిన దత్తాంశానికి పౌన:పున్య విభాజన పట్టికను తయారు చేయడం.
ii) ఇచ్చిన దత్తాంశానికి కమ్మీ రేఖాచిత్రాలను గీయడం.
iii) ఫలితాల నుంచి ఏ బ్లడ్ గ్రూపును ఎక్కువ దానం చేస్తారో కనుక్కోవడం.
3. కావాల్సిన పరికరాలు:
తెల్ల కాగితాలు, గ్రాఫ్ కాగితాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు మొదలైనవి.
4. పద్ధతి:
1) పరిచయం: ఈ ప్రాజెక్టు నిర్వహించడానికి మనకు 'బాహుళకం, కమ్మీ రేఖాచిత్రాలు' గురించి తెలిసి ఉండాలి.
2) విధానం:
* రోటరీ క్లబ్/లయన్స్ క్లబ్/స్వచ్ఛంద సంస్థతో మన పట్టణంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి వెళ్లాలి.
* మా తరగతిలోని విద్యార్థులందరూ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వారి బ్లడ్ గ్రూపు వివరాలను సేకరించాం.
3) సమాచారం:
4) పౌన:పున్య విభాజన పట్టిక:
పట్టిక నుంచి "O" బ్లడ్ గ్రూపు ఎక్కువగా 15 సార్లు వచ్చింది కాబట్టి అదే బాహుళకం అవుతుంది.
కమ్మీ రేఖాచిత్రం:
5) విశ్లేషణ: ఎక్కువ మంది విద్యార్థుల బ్లడ్ గ్రూప్ "O". కాబట్టి "O" బాహుళకం అవుతుంది.
6) ముగింపు : ఈ ప్రాజెక్టు చేయడం వల్ల రక్తదానం చేసే వారిలో ఎక్కువ మంది "O" గ్రూపు వారని తెలిసింది.
5. విద్యార్థుల అనుభవాలు:
i) ఈ ప్రాజెక్టు చేయడంలో మేము ఎంతో ఆనందాన్ని పొందాం.
ii) ప్రతి వ్యక్తి తన బ్లడ్ గ్రూప్‌ను తెలుసుకోవాలి.
6. సందేహాలు, ప్రశ్నలు:
1) ఈ రకమైన దత్తాంశాలకు ఈ పద్ధతిలో బాహుళకం కనుక్కోవచ్చా?
2) ఒక దత్తాంశం సరాసరిని కనుక్కోవడానికి బాహుళకం కనుక్కుంటే సరిపోతుందా?
7. కృతజ్ఞతలు:
1) ఈ ప్రాజెక్టు చేయడానికి అనుమతి ఇచ్చినందుకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2) ఈ పాజెక్టు చేయడానికి ప్రోత్సహించి, తమ విలువైన సలహాలు, సూచనలు ఇచ్చిన మా గణిత ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
8. పరిశీలించిన గ్రంథాలు:
1) 10, 8వ తరగతి గణిత పాఠ్య గ్రంథాలు
2) NCERT వారి గణిత ప్రయోగ దీపిక
9. విద్యార్థుల సంతకాలు:
FORMATIVE ASSESSMENT
లఘు పరీక్ష - సాంఖ్యక శాస్త్రం
తరగతి: X గణితం
కాలం: 45 ని.
విద్యార్థి పేరు: సెక్షన్: రోల్ నెం.
I. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 3 x 2 = 6
1. ఆరోహణ క్రమంలో అమర్చిన కింది దత్తాంశానికి మధ్యగతం 27.5 అయితే ‘x’ విలువను కనుక్కోండి.
24, 25, x + 2, x + 3, 30, 31, 34
2. సోపాన విచలన పద్ధతిలో సగటును కనుక్కోవడానికి ఉపయోగించే సూత్రాన్ని రాసి దానిలోని అక్షరాలను వివరించండి.
3. x, x + 1, x + 2, x + 3, x + 4, x + 5, x + 6 దత్తాంశం యొక్క సగటును కనుక్కోండి.
II. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 2 x 1 = 2
4. మొదటి 'n' సహజ సంఖ్యల సగటును కనుక్కోండి.
5. అవర్గీకృత దత్తాంశానికి సగటును నిర్వచించండి.
III. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 2 x 4 = 8
6. ఒక ఆవాసంలోని పిల్లల రోజువారి చేతి ఖర్చుల వివరాలను కింది పట్టికలో ఇచ్చారు. పిల్లల సగటు చేతి ఖర్చు రూ.18 అయితే పట్టికలో లోపించిన పౌన:పున్యం ‘f’ను కనుక్కోండి.

7. కింది దత్తాంశానికి మధ్యగతంను కనుక్కోండి.
IV. కింద ప్రశ్నలకు సరైన సమాధానాన్ని సూచించే అక్షరాన్ని దానికెదురుగా ఇచ్చిన బ్రాకెట్‌లో రాయండి. 8 x ½ = 4
8. మొదటి 10 సహజ సంఖ్యల సగటు [ ]
A) 5 B) 6 C) 5.5 D) 6.5
9. 4, 6, 8, 10, x, 14, 16 దత్తాంశం సగటు 10 అయితే ‘x’ విలువ [ ]
A) 11 B) 12 C) 13 D) 9
10. 2, 3, 2, 5, 6, 9, 10, 12, 16, 18, 20 ల మధ్యగతం _______ [ ]
A) 9 B) 20 C) 10 D) 9.5
11. 2, 3, 5, 4, 2, 6, 3, 5, 5, 2, x ల బాహుళకం 2 అయితే ‘x’ విలువ _____ [ ]
A) 2 B) 3 C) 4 D) 5
12. ఒక ఉపాధ్యాయుడు గణితంలో ఆ తరగతి సరాసరి మార్కులను కనుక్కోమని విద్యార్థులకు చెప్పాడు. అప్పుడు వారు ఏమి కనుక్కోవాలి? [ ]
A) సగటు B) మధ్యగతం C) బాహుళకం D) మొత్తం
13. 19.5 – 29.5 తరగతి మార్కు _______ [ ]
A) 10 B) 49 C) 24.5 D) 25
14. కిందివాటిలో కేంద్ర స్థానం యొక్క కొలత కానిది? [ ]
A) సగటు B) మధ్యగతం C) వ్యాప్తి D) బాహుళకం
15. ఆరోహణ, అవరోహణ సంచిత పౌన:పున్య వక్రాలు ఖండించుకునే బిందువులో ప్రథమ నిరూపకం సూచించే కేంద్ర స్థానం యొక్క కొలత ____ [ ]
A) సగటు B) మధ్యగతం C) బాహుళకం D) వ్యాప్తి
రచయిత: టి.ఎస్.వి.ఎస్.సూర్యనారాయణ మూర్తి