• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆమ్లాలు - క్షారాలు - లవణాలు

ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1. A, B, C, D, E అనే ద్రావణాల pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించి, వాటిని వరుసగా 4, 1, 11, 7, 9గా గుర్తించారు. వీటిలో ఏది ......
a) తటస్థ ద్రావణం           b) బలమైన క్షారం      c) బలమైన ఆమ్లం
d) బలహీన ఆమ్లం         e) బలహీన క్షారం

వీటి pH విలువ పెరిగే దిశగా ఆరోహణ క్రమంగా రాయండి. (2 మార్కులు)

జ:


pH విలువ పెరిగే దిశగా ఆరోహణ క్రమం:
pH = 1, 4, 7, 9,11


2. తటస్థీకరణం అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు రాయండి. (2 మార్కులు)
జ: క్షారంతో ఒక ఆమ్లం చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరిచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు.
క్షారం + ఆమ్లం  లవణం + నీరు
ఉదా:
NaOH + HCl 

 NaCl + H2O
     Ca(OH)2 + H2SO4 CaSO4 + 2 H2O


3. ఆమ్లానికి /క్షారానికి నీటిని కలిపినప్పుడు ఏం జరుగుతుంది? (2 మార్కులు)
జ: * ఆమ్లానికి లేదా క్షారానికి నీటిని కలపడం వల్ల ప్రమాణ ఘనపరిమాణంలోని (H3O+/ OH-) అయాన్ల గాఢత తగ్గుతుంది.
* ఈ ప్రక్రియను విలీనం (dilution) చేయడం అంటారు. వాటిని విలీన ఆమ్లం లేదా విలీన క్షారం అంటారు.

 

4. నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు దంతక్షయం ఎందుకు ప్రారంభమవుతుంది? (4 మార్కులు)
జ: సూచన:
* pH విలువ 5.5 కంటే తక్కువ అయితే దంతక్షయం ప్రారంభమవుతుంది.
* దంతాలపై పింగాణి పొర ఉంటుంది. ఇది మానవ శరీరంలో అత్యంత ధృడమైంది. ఇది కాల్షియం ఫాస్ఫేట్‌తో తయారవుతుంది.
* ఇది నీటిలో కరగదు, కానీ నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువైనప్పుడు దంతాలు క్షయానికి గురవుతాయి.
* నోటిలో ఉన్న బ్యాక్టీరియమ్‌లు దంతాల మధ్య చిక్కుకుని ఉన్న చక్కెర లాంటి ఆహార కణాలను వియోగం చెందించి ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి pH విలువ తగ్గుతుంది.
నివారించడం: ఆహారం తిన్న తర్వాత నోటిని క్షారస్వభావం ఉండే టూత్‌పేస్ట్ ఉపయోగించి శుభ్రపరచుకోవాలి. దాంతో అంతకుముందు ఉత్పత్తి అయిన ఆమ్లాలను తటస్థీకరించి దంతక్షయాన్ని నివారించవచ్చు.


5. పొడి హైడ్రోక్లోరిక్ ఆమ్లం నీలి లిట్మస్ కాగితంతో చర్య జరపదు. కానీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్య జరుపుతుంది. ఎందుకు? (2 మార్కులు)
జ: * పొడి HCl (హైడ్రోజన్ క్లోరైడ్) ఆమ్లం కాదు. ఈ వాయువు పొడి లిట్మస్ కాగితం రంగులో ఎలాంటి మార్పును తీసుకురాలేదు.
* నీటి సమక్షంలో HCl వియోగం చెంది హైడ్రోజన్ అయాన్లను ఏర్పరుస్తుంది. కానీ నీరు లేనప్పుడు వియోగం చెందదు.
* హైడ్రోక్లోరిక్ ఆమ్లం నీలి లిట్మస్‌ను ఎరుపుగా మారుస్తుంది.
HCl + H2O  H3O+ + Cl- (జ.ద్రా.)


6. శుద్ధజలం విద్యుత్ వాహకతను ఎందుకు ప్రదర్శించదు? (2 మార్కులు)
జ: * శుద్ధజలం స్వచ్ఛమైంది. ఇందులో ఎలాంటి మలినాలు ఉండవు. అందువల్ల అది విద్యుత్ వాహకతను ప్రదర్శించదు.
* నీటి అణువులు వాటంతటవి విద్యుదావేశాన్ని కలిగి ఉండవు. అందువల్ల అవి ఎలక్ట్రాన్లను ఇవ్వలేవు.
* ఎలక్ట్రాన్లను ఇవ్వలేనప్పుడు, శుద్ధజలం ద్వారా విద్యుత్ ప్రవహించలేదు.

7. ఎసిటిక్ ఆమ్లం నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపుగా మార్చదు. ఎందుకు? ( ఒక మార్కు)
జ: ఎసిటిక్ ఆమ్లం బలహీనమైన ఆమ్లం. పైగా ఇది హైడ్రోకార్బన్. అందువల్ల ఇది నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపుగా మార్చదు.


8. పాలవ్యాపారి కొద్దిగా తినే సోడాను పాలకు కలిపాడు. అయితే కిందివాటికి కారణాలు రాయండి.
a) ఎందుకు ఆ పాల pH విలువను 6 నుంచి పెంచాడు.
b) ఈ పాలు పెరుగుగా మారడానికి ఎక్కువ సమయం ఎందుకు పట్టింది? (2 మార్కులు)

జ: * పాల pH విలువ 6 కంటే తగ్గితే వాటికి పులుపు వస్తుంది. అంటే ఆమ్లగుణం పెరిగి అవి పాడైపోతాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు పాలకు కొద్దిగా తినేసోడా (NaHCO3) కలుపుతారు. ఈ క్షారం పాల ఆమ్ల గుణాన్ని తటస్థీకరించి పాల pH విలువను తగ్గకుండా కాపాడుతుంది. అందువల్ల పాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
* పాలు పెరుగుగా మారడానికి కారణం బ్యాక్టీరియా. పాలకు ఆమ్ల గుణం ఉంటే ఈ బ్యాక్టీరియా చురుగ్గా పెరిగి పాలను పెరుగుగా మారుస్తుంది. పాలకు తినే సోడాను కలపడం వల్ల పాల ఆమ్ల గుణం తటస్థీకరించబడి బ్యాక్టీరీయా చురుకుదనం తగ్గిపోతుంది. అందువల్ల పాలు పెరుగుగా మారడానికి ఎక్కువ సమయం పడుతుంది.

9. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను తడిలేని, గాలి సోకని పాత్రల్లో నిల్వచేస్తారు. ఎందుకు? (2 మార్కులు)
జ: * ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను తడిలేని గాలి సోకని పాత్రల్లో నిల్వచేస్తారు. లేకపోతే గాలిలోని తేమను ఇది పీల్చుకుని గట్టి పదార్థం (జిప్సం)గా మారిపోతుంది.
* ఎలా మారుతుందంటే...



10. అప్పుడే పిండిన పాల pH విలువ 6, కానీ దాన్ని పెరుగుగా మార్చినప్పుడు pH ఎందుకు మారుతుంది? వివరించండి. (2 మార్కులు)
జ: * అప్పుడే పిండిన పాల pH విలువ 6 ఉంటుంది.
* అది పెరుగుగా మారేటప్పుడు పాలలోని బ్యాక్టీరియమ్‌లు పాల కణాలను వియోగం చెందించి లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి.
* ఈ ఆమ్లం కారణంగా పాల pH విలువ 6 కంటే తగ్గి పులుపు రుచి ఉండే పెరుగుగా మారుతుంది.

11. ఆల్కహాల్, గ్లూకోజ్ లాంటి లవణాల్లో హైడ్రోజన్ ఉన్నప్పటికీ అవి ఆమ్లాలు కావు. దీన్ని ఒక కృత్యం ద్వారా వివరించండి.  (4 మార్కులు)
జ: 
   

ఉద్దేశం: ఆల్కహల్, గ్లూకోజ్‌ల్లో హైడ్రోజన్ ఉన్నప్పటికి అవి ఆమ్లాలు కావని నిరూపించడం.
కావాల్సిసిన పరికరాలు: బీకరు, గ్రాఫైట్ కడ్డీలు, బల్బు, హోల్డర్, ఆల్కహాల్, గ్లూకోజ్, విలీన HCl వేర్వేరు రంగులున్న విద్యుత్ తీగలు.
చేసే విధానం:
* రెండు వేర్వేరు రంగులున్న విద్యుత్ తీగలకు గ్రాఫైట్ కడ్డీలను కలపండి. వీటిని 100 మి.లీ.ల గాజు బీకరులో పటంలో చూపిన విధంగా ఉంచండి.
* ఈ తీగల స్వేచ్ఛా కొనలను 230 వోల్ట్‌ల AC ప్లగ్‌కు కలపండి. పటంలో చూపిన విధంగా విద్యుత్ వలయాన్ని పూర్తిచేయండి.
* బీకరులో సజల HCl ద్రావణాన్ని పోసిన తర్వాత, వలయంలో విద్యుత్‌ను ప్రవహింపజేయండి.
* ఇదే కృత్యాన్ని సజల HCl ఆమ్లం, గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాలతో వేర్వేరుగా నిర్వహించండి.
పరిశీలనలు:
* ఆమ్ల ద్రావణాల్లో మాత్రమే బల్బు వెలగడాన్ని గమనిస్తాం.
* గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాల్లో బల్బు వెలగకపోవడాన్ని గమనిస్తాం.
* బల్బు వెలుగుతుందంటే ఆ ద్రావణం ద్వారా విద్యుత్ ప్రసరిస్తుందని అర్థం.
* ఆమ్ల ద్రావణాల్లో అయాన్లు ఉంటాయి. ఈ అయాన్ల చలనం వల్లే ఆ ద్రావణాల్లో విద్యుత్ ప్రసారం జరుగుతుంది.

 

తెలుసుకున్నది:
* HCl ద్రావణంలో ఉన్న ధన అయాను (కాటయాన్), (H+) కాబట్టి ఆమ్ల ద్రావణాలు, ఆమ్ల ధర్మాలకు కారణమైన హైడ్రోజన్ అయాన్లను H+ (aq) ఇస్తాయి.
* గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాల్లో బల్బు వెలుగదు. దీన్ని బట్టి ఈ ద్రావణాల్లో H+ అయాన్లు ఉండవని అర్థమవుతుంది.
* కాబట్టి ద్రావణాల్లో విడుదలైన H+ అయాన్లు ఆమ్లాల ఆమ్ల స్వభావాన్ని నిర్ధారిస్తాయి.


12. లవణాల స్ఫటిక జలం అంటే ఏమిటి? దీన్ని ఒక కృత్యం ద్వారా వివరించండి. (4 మార్కులు)
జ: స్ఫటిక జలం: ఒక లవణం ఫార్ములా యూనిట్‌లో నిర్ధిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటారు.
ఉదా: CuSO4 . 5 H2O(ఆర్ద్ర కాపర్ సల్ఫేట్)
కృత్యం: స్ఫటికీకరణ జలాన్ని నిరూపించడం.
* కొన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను ఒక పొడి పరీక్ష నాళికలోకి తీసుకుని వేడి చేయాలి.

* వేడిచేసిన తర్వాత కాపర్ సల్ఫేట్ స్ఫటికాల రంగులో మార్పును గమనించాలి.
* పరీక్ష నాళిక లోపల గోడలపై నీటి బిందువులు ఏర్పడతాయి.
* వేడిచేసిన తర్వాత లభించిన కాపర్ సల్ఫేట్‌కు 2 - 3 చుక్కల నీటిని కలపాలి.
* కాపర్ సల్ఫేట్ రంగు తిరిగి పూర్వస్థితిలోని నీలి రంగుకు మారింది.
వివరణ:
* పొడిగా కనిపించే కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు స్ఫటిక జలాన్ని కలిగి ఉంటాయి. వేడి చేసినప్పుడు ఈ స్ఫటిక జలం ఆవిరవడం వల్ల అది తెల్లగా మారుతుంది.
* తెల్లటి లవణానికి నీటిని కలిపినప్పుడు తిరిగి నీలిరంగు స్ఫటికాలు ఏర్పడి ఆర్ద్ర లవణం
(hydrated salt) గా మారింది.

IV. సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు

13. సమాన పొడవున్న (3 సెం.మీ.) మెగ్నీషియం ముక్కలను సమాన గాఢతలున్న హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లాలకు కలిపినప్పుడు ఏ ద్రావణంలో చర్య వేగంగా జరుగుతుంది? ఎందుకు?
జ:  * సమాన పొడవున్న మెగ్నీషియం ముక్కలను సమాన గాఢతలున్న హైడ్రోక్లోరిక్, ఎసిటిక్ ఆమ్లాలకు కలిపినప్పుడు ...
a) హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో చర్య వేగంగా జరుగుతుంది.
b) ఎసిటిక్ ఆమ్లంలో చర్య నెమ్మదిగా జరుగుతుంది.

* హైడ్రోక్లోరిక్ ఆమ్లం బలమైన ఆమ్లం. కాబట్టి జలద్రావణంలో వేగంగా H+, Cl- అయాన్లుగా విడిపోతుంది.
* రుణావేశం ఉన్న Cl- అయాన్ మెగ్నీషియం (Mg) తో చర్య జరిపి MgCl2 ను ఏర్పరుస్తుంది.
* ఎసిటిక్ ఆమ్లం బలహీనమైన ఆమ్లం. అందువల్ల జలద్రావణంలో అది చాలా తక్కువగా అయనీకరణం చెందుతుంది. ఈ కారణంగా దీనిలో చర్యావేగం చాలా తక్కువగా ఉంటుంది.

V. బొమ్మలు గీయడం, నమూనాలు తయారుచేయడం

14. నీటిలో కరిగిన ఆమ్ల ద్రావణం విద్యుత్ వాహకతను కలిగి ఉంటుందని చూపే ప్రయోగ పటం గీయండి.  (5 మార్కులు)
జ: 
   

15. బీట్‌రూట్‌ను ఉపయోగించి మీ సొంత సూచికను ఎలా తయారు చేస్తారు? వివరించండి. (4 మార్కులు)
జ: * బీట్‌రూట్‌ను తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి పీలర్ సహాయంతో దాని తొక్కను పూర్తిగా వేరుచేయాలి.
* తొక్కతీసిన బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేసి ఉడికించాలి.
* ఈ ద్రావణాన్ని వడగట్టాలి.
* ఒక చిన్న కాగితాన్ని ఈ బీట్‌రూట్ ద్రావణంలో ముంచి కొంతసేపటి తర్వాత బయటకు తీసి ఆరబెట్టాలి.
* ఇప్పుడు ఈ కాగితాన్ని బీట్‌రూట్ సూచికగా ఉపయోగించవచ్చు.
* ఈ కాగితపు సూచికను ఉపయోగించి ఇచ్చిన ద్రావణంలో ముంచినప్పుడు కింద పేర్కొన్న రంగులోకి అది మారితే, దాని ఎదురుగా తెలియజేసిన pH విలువ ఆ ద్రావణానికి ఉంటుందని తెలుసుకోవచ్చు.
* a) pH 2 - ఎరుపు రంగు           b) pH 4 - వంగపండు రంగు
   c) pH 6 - ఊదా రంగు            d) pH 8 - నీలి రంగు
   e) pH 10 - నీలి/ఆకుపచ్చ రంగు   f) pH 12 - ఆకుపచ్చ రంగు
* బీట్‌రూట్‌లో ఆంథోసయానిన్స్
(anthocyanins) ఉంటాయి. అందువల్ల అది సూచికగా పనిచేస్తుంది.

VII. నిజజీవిత వినియోగం, జీవవైవిధ్యంపట్ల సానుభూతి కలిగి ఉండటం

16. ఆమ్ల వర్షాలు చెరువులు/ నదుల్లోకి వచ్చి చేరినప్పుడు జీవచరాల ఉనికికి ప్రమాదం ఎందుకు?   (2 మార్కులు)
జ: * ఆమ్ల వర్షం చెరువు/ నదిలోకి వచ్చి చేరినప్పుడు ఆ నీటి pH విలువ మారిపోతుంది.
* ఈ కారణంగా జీవచరాలు ఆ నీటిలో బతకడం కష్టమవుతుంది.
* జీవచరాలు నది లేదా చెరువు నీటి pH 7 నుంచి 7.8 మధ్య ఉన్నప్పుడు సుఖంగా బతకగలవు.
* ఆమ్ల వర్షం ఈ నీటిలో చేరడం వల్ల ఈ నీటి pH విలువ తగ్గిపోతుంది.


17. బేకింగ్ పౌడరు అని దేన్ని పిలుస్తారు? ఇది కేక్‌ను తయారుచేసినప్పుడు దాన్ని మృదువుగా, మెత్తగా చేస్తుంది ఎందుకు? (2 మార్కులు)
జ: * బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ సోడా, టార్టారిక్ ఆమ్లాల మిశ్రమ పదార్థం.
* బేకింగ్ పౌడరును వేడిచేసినప్పుడు అది CO2 వాయువును విడుదల చేస్తుంది. దీనివల్ల కేక్‌ను ఆ వాయువు మృదువుగా, మెత్తగా చేస్తుంది.

18. తినే సోడా, బట్టల సోడాల రెండు ఉపయోగాలు రాయండి. (4 మార్కులు)
జ: తినే సోడా ఉపయోగాలు:
* దీన్ని ఏంటాసిడ్‌లలో ఒక ముఖ్య అనుఘటకంగా ఉపయోగిస్తారు. ఇది బలహీనమైన క్షారం కాబట్టి విడుదలైన జఠర ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం కలగజేస్తుంది.
* అగ్నిమాపక యంత్రాల్లో దీన్ని సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు.
* బలహీనమైన యాంటీసెప్టిక్‌గా కూడా ఉపయోగపడుతుంది.
వాషింగ్ సోడా (బట్టల సోడా) ఉపయోగాలు:
* గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమల్లో బట్టల సోడాను ఉపయోగిస్తారు.
* బొరాక్స్ (Borax) లాంటి సోడియం సమ్మేళనాల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు.
* గృహోవసరాల్లో బట్టల సోడాను వస్తువులను శుభ్రపరచడానికి వినియోగిస్తారు.

పాఠంలో ఇచ్చిన ప్రశ్నలు - జవాబులు
ఆలోచించండి - చర్చించండి

1. లిట్మస్ అంటే ఏమిటి? ఇతర సూచికలను కూడా పేర్కొనండి.(AS - 1) (ఒక మార్కు) 

జ: * లైకెన్ అనే (Lichen) మొక్క థాలోఫైటా వర్గానికి చెందింది. దీని నుంచి సేకరించిన రంజనమే (dye) లిట్మస్.
 * తటస్థ ద్రావణంలో దీని రంగు ముదురు ఊదా (Purple); హైడ్రాంజియా (Hydrangea), పిటూనియా (Petunia), జెరేనియం (Geranium) లాంటి మొక్కల రంగు పూల ఆకర్షక పత్రాలు కూడా సూచికలుగా ఉపయోగపడతాయి.


2. ఏంటాసిడ్ గుళిక (టాబ్లెట్)లో ఉన్న పదార్థం ఆమ్లమా? క్షారమా?
జ: యాంటాసిడ్ గుళికలో ఉండే ఒక పదార్థం సోడియం హైడ్రోజన్ కార్బొనేట్. ఈ పదార్థం క్షారం.


3. యాంటాసిడ్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు కడుపులో ఎలాంటి చర్య జరుగుతుంది? (AS - 7) (2 మార్కులు)
జ:  * జీర్ణక్రియలో మన జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణాశయానికి నష్టం కలగకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. అజీర్తి సమయంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వల్ల కడుపులో మంట, అసహనం కలుగుతాయి.
 * ఈ దుష్ప్రభావం నుంచి విముక్తిని పొందడానికి, మనం ఏంటాసిడ్‌లుగా పిలిచే క్షారాలను తీసుకుంటాం. ఇవి కడుపులో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి.
 * ఇందుకోసం సాధారణంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ (మిల్క్ ఆఫ్ మెగ్నీషియా) అనే బలహీనమైన క్షారాన్ని ఉపయోగిస్తారు.

4. స్వేదన జలం, ఆమ్లం, క్షారం ఉన్న మూడు పరీక్షనాళికలను మీకు ఇచ్చారు. ఒకవేళ మీకు నీలి లిట్మస్ కాగితం మాత్రమే ఇస్తే, దాని సహాయంతో ఆ మూడు పరీక్ష నాళికల్లో ఉండే ద్రావణాలను ఎలా గుర్తిస్తారు? (AS - 3) (4 మార్కులు)
జ: * మూడు పరీక్ష నాళికలు A, B, C అనుకుందాం.
* పరీక్షనాళిక Aలో ఉన్న ద్రావణంలో నీలి లిట్మస్ కాగితాన్ని ముంచి బయటకు తీయాలి. అది ఎర్రగా మారితే A పరీక్ష నాళికలోని ద్రావణం ఆమ్లం. అలా కాకపోతే ఆ ద్రావణం క్షారం లేదా స్వేదనజలం కావచ్చు.
* A పరీక్ష నాళికలో ముంచిన లిట్మస్ కాగితం ఎర్రగా మారితే దాన్ని B పరీక్ష నాళికలోని ద్రావణంలో ముంచి బయటకు తీయాలి. ఈ లిట్మస్ కాగితం రంగు నీలంగా మారితే B పరీక్ష నాళికలోని ద్రావణం క్షారం. లిట్మస్ కాగితంలో మార్పు ఉండకపోతే B పరీక్ష నాళికలోని ద్రావణం స్వేదనజలం.
* B పరీక్ష నాళికలోని ద్రావణం క్షారం కాకపోతే, C పరీక్ష నాళికలోని ద్రావణం క్షారం అవుతుంది. B పరీక్షనాళికలోని ద్రావణం స్వేదన జలం అవుతుంది.



5. ఒక ఆమ్లం, లోహంతో చర్య జరిపినప్పుడు సాధారణంగా వెలువడే వాయువు ఏది? దాన్ని ఎలా గుర్తిస్తారు? (AS - 3) (2 మార్కులు)
జ:  * ఒక ఆమ్లం, లోహంతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది.
 * మండుతున్న పుల్లను ఈ వాయువు దగ్గరకు తీసుకువస్తే అది 'టప్' మనే శబ్దం చేస్తూ ఆరిపోతుంది.


6. ఒక కాల్షియం సమ్మేళనం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిగినప్పుడు బుస బుస పొంగుతూ బుడగల రూపంలో వాయువు విడుదల అవుతుంది. ఈ చర్యలో విడుదలైన వాయువు మండుతున్న కొవ్వొత్తిని ఆర్పుతుంది, సున్నపు నీటిని పాలలా మారుస్తుంది. ఈ చర్యలో ఏర్పడిన ఒక సమ్మేళనం కాల్షియం క్లోరైడ్ అయితే జరిగిన చర్యకు తుల్య సమీకరణాన్ని రాయండి.(AS - 1) (2 మార్కులు)
జ: విడుదలైన వాయువు మండుతున్న కొవ్వొత్తిని ఆర్పడమే కాకుండా సున్నపునీటిని పాలలా మారుస్తుంది కాబట్టి అది కార్బన్ డై ఆక్సైడ్ (CO2).
 రసాయన సమీకరణం
కాల్షియం కార్పొనేట్ + సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం  కాల్షియం క్లోరైడ్ + కార్బన్ డై ఆక్సైడ్ + నీరు
CaCO3 + 2 HCl  CaCl2 + CO2 + H2O


7. జల ద్రావణాల్లో HCl, HNO3 మొదలైనవి ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఆల్కహాల్, గ్లూకోజ్ లాంటి దావ్రణాలు ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శించవు. ఎందుకు? (AS - 1) (2 మార్కులు)
జ: * HCl, HNO3 లాంటివి జలద్రావణాల్లో H+ అయాన్లను విడుదల చేయడం వల్ల అవి ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. 
* ఆల్కహాల్, గ్లూకోజ్ లాంటి సమ్మేళనాలు జలద్రావణల్లో H+ అయాన్లను విడుదల చేయలేవు. అందువల్ల అవి ఆమ్ల లక్షణాలు ప్రదర్శించలేవు.


8.  గాఢ ఆమ్లాన్ని సజల ఆమ్లంగా మార్చడానికి ఆమ్లాన్ని చుక్కలుగా నీటికి కలపాలి కానీ నీటిని ఆమ్లానికి కలపకూడదని సలహానిస్తారు - ఎందుకు? (AS - 3) (2 మార్కులు)
జ: * ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ ఒక ఉష్ణమోచక చర్య.
* ఆమ్లాన్ని కొద్దికొద్దిగా నీటికి కలుపుతూ ఆగకుండా కలియబెట్టాలి. అలా కాకుండా నీటిని నేరుగా గాఢ ఆమ్లానికి కలిపినట్లయితే వెలువడే అధిక ఉష్ణం పాత్ర నుంచి * పైకి చిమ్మడం వల్ల చర్మంమీద, కళ్లల్లో పడి ప్రమాదం సంభవిస్తుంది.
* ఒక్కోసారి అధిక వేడి వల్ల గాజుపాత్ర పగిలిపోవచ్చు.


9. మన శరీరంలో ఉండే రసాయనాల pH విలువ పెరిగితే ఏం జరుగుతుంది? (AS - 1) (2 మార్కులు)
జ: * మానవ రక్తం pH కొద్దిగా క్షారతత్వం కలిగి ఉండాలి. (pH = 7.35 నుంచి 7.45). pH విలువ 7 కంటే తగ్గితే శరీరం ఆమ్ల స్వభావానికి మారుతుంది. ఫలితంగా అనారోగ్యం, అలసట, రోగాలు లాంటివి వస్తాయి.
* శరీరంలోని కణాలు ఆమ్ల స్వభావం పుంజుకున్నాయంటే 'ఎసిడోసిస్' అనే స్థితి శరీరానికి వస్తుంది.
* 'ఎసిడోసిస్' స్థితి అనేక రోగాలకు కారణం అవుతుంది. ఎందుకంటే కాలేయం, మూత్రపిండాలు, జీర్ణాశయ మార్గం, గుండెలమీద భారం పెరగడమే కాకుండా శరీరంలోని ప్రతి జీవకణం ప్రభావితం అవుతుంది.
* ఆరోగ్యవంతమైన శరీరం బోలెడంత క్షారాన్ని దాచిపెడుతుంది. ఆమ్లం ఉత్పత్తి చేసే ఆహారాన్ని భుజించినప్పుడు ఎదురయ్యే ఆత్యయిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు శరీరం ఈ క్షారాన్ని ఉపయోగిస్తుంది.
* సాధారణంగా ఇలా దాచిపెట్టిన క్షారాలు తరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే శరీరానికి సంతులన కెమిస్ట్రీ ఎంతో అవసరం. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉండి రోగాలను దరిజేరనీయదు.
* శరీరం క్షారస్థితిలో ఉంది అంటే దాని pH విలువ 7.0 కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. అప్పుడు రోగాలు వెంటనే శరీరంపై దాడిచేయలేవు.

10. జీవులకు pH పరిధి అతిస్వల్పంగా ఎందుకు ఉంటుంది? (AS - 7) (2 మార్కులు)
జ: * జీవులకు pH పరిధి అతిస్వల్పంగా ఉంటుంది. మనుషుల్లో pH విలువలో స్వల్ప మార్పులు సంభవిస్తే శరీరంలో ఉండే పలు సూక్ష్మజీవులు చనిపోతాయి.
* ఈ సూక్ష్మజీవులు మనశరీరంలో ఉండకపోతే శరీరం సులువుగా రోగాలబారిన పడుతుంది.
* pHలో స్వల్ప మార్పులు కారణంగా శరీరంలోని జీవరసాయన ప్రక్రియలు క్రమరహితం అవుతాయి. ఫలితంగా అజీర్ణం, కడుపునొప్పి లాంటివి వస్తాయి.
* అందువల్ల జీవుల pH పరిధి అతి స్వల్పంగా ఉంటుంది.'

కృత్యాలు

1. మీ ప్రయోగశాల నుంచి కొన్ని రసాయనాలు సేకరించి వివిధ సూచికలతో వాటి ప్రతిస్పందన ఎలా ఉన్నది పట్టికలో నమోదు చేయండి.  (AS - 7) (4 మార్కులు)

జ:
         

2. సువాసన (Olfactory) సూచికలు అంటే ఏమిటి? వాటి పని తీరును తెలియజెప్పే కృత్యాన్ని రాయండి. (AS - 3) (2 మార్కులు)
జ: 1) సువాసన సూచికలు:
(Olfactory indicators)
కొన్ని పదార్థాలు ఆమ్ల, క్షార యానకాల్లో వేర్వేరు వాసనలు ప్రదర్శిస్తాయి. వాటిని సువాసన సూచికలు అంటారు.
* సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కొన్నింటిని శుభ్రమైన చిన్న గుడ్డముక్కలతో సహా ఒక ప్లాస్టిక్ సంచిలో ఉంచండి.
* సంచి మూతిని బిగుతుగా కట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టి, మరుసటిరోజు బయటకు తీయండి.
* ఆమ్ల, క్షార స్వభావాలను తెలుసుకోవడానికి ఈ చిన్న గుడ్డ ముక్కలు ఉపయోగపడతాయి. వీటి వాసనను పరీక్షించండి.
* శుభ్రమైన గచ్చుపై రెండు గుడ్డముక్కలను ఉంచండి. ఒక ముక్కపై కొన్ని చుక్కల సజల HCl ను, మరొక ముక్కపై కొన్ని చుక్కల సజల NaOH ను పోయండి.
* రెండు గుడ్డముక్కలను వేర్వేరుగా స్వేదన జలంతో ఉతికి (rinse), వాటి వాసనలు పరిశీలించి నమోదు చేయండి.
* క్షారం (NaOH) చుక్కలు పోసిన గుడ్డముక్క ఉల్లిపాయ వాసనను పొగొట్టుకుంటుంది.
* సజల ఆమ్లం (HCl) పోసిన గుడ్డముక్కకు ఉల్లిపాయ వాసన ఉంటుంది.
* ప్రయోగశాలలో అంధ విద్యార్థుల సౌకర్యార్థం ఈ సువాసనను సూచికలుగా వినియోగిస్తారు.

2ఎ) ఉల్లిపాయ, వెనిలా సుగంధ ద్రవ్యం, లవంగ నూనెలో వేటిని సువాసన సూచికలుగా ఉపయోగించవచ్చో వివరించండి. (AS - 3) (2 మార్కులు)
జ: * కొద్ది పరిమాణంలో లవంగ నూనె (clove oil), వెనీలా సుగంధ (venilla essence) ద్రవ్యాలను తీసుకోండి.
* రెండు వేర్వేరు పరీక్షనాళికల్లో, ఒకదానిలో కొన్ని చుక్కలు సజల NaOH, మరొకదానిలో సజల HCl లను వేయండి.
* రెండు పరీక్ష నాళికల్లోనూ ఒక్కో చుక్క చొప్పున సజల వెనీలా ద్రవాన్ని కలిపి పూర్తిగా కరిగేలా కుదుపుతూ వాటి వాసనలను పరీశీలించి నమోదు చేయండి.
* అదేవిధంగా లవంగనూనె వాసనలోని మార్పులను కూడా సజల HCl, సజల NaOH లతో పరిశీలించి నమోదు చేయండి.
* పరిశీలనల ఆధారంగా ఉల్లిపాయ, వెనీలా సుగంధ ద్రవ్యం, లవంగ నూనెలలో సువాసన సూచికలుగా ఉల్లిపాయను ఉపయోగించవచ్చునని తెలిసింది.

 


3. లోహాలతో ఆమ్లాలు చర్య జరిపితే ఏం జరుగుతుందో తెలియజేసే కృత్యాన్ని రాయండి.  (AS - 3) (4 మార్కులు)
జ:

కావాల్సిసిన పరికరాలు: పరీక్షనాళిక, డెలివరీ గొట్టం, గాజుతొట్టె, కొవ్వొత్తి, సబ్బు నీరు, సజల HCl, జింక్ ముక్కలు.
పద్ధతి: * పరికరాలను పటంలో చూపిన విధంగా అమర్చండి.
* ఒక పరీక్షనాళికలో 10 మి.లీ. సజల HCl ను తీసుకోండి. దానికి కొన్ని జింకు ముక్కలను కలపండి.
* పరీక్షనాళికలో వెలువడిన వాయువును సబ్బు నీటి ద్వారా పంపండి. సబ్బు నీటిలో బుడగలు ఏర్పడతాయి.
* సబ్బునీటి నుంచి వెలువడే వాయువు దగ్గర మండుతున్న కొవ్వొత్తిని తీసుకురండి.
* వెలువడిన వాయువును మండించినప్పుడు 'టప్' మనే శబ్దం రావడాన్ని మీరు గమనిస్తారు. దీన్నిబట్టి వెలువడిన వాయువు హైడ్రోజన్ (H2) వాయువని చెప్పవచ్చు.
* పై కృత్యం రసాయన చర్యను ఈ విధంగా రాయవచ్చు.
ఆమ్లం + లోహం  లవణం + హైడ్రోజన్

2 HCl + Zn 

 ZnCl2 + H2
(జ.ద్రా.)  (ఘ)      (జ.ద్రా.)   (వా)
* ఇదే కృత్యాన్ని H2SO4, HNO3 లాంటి ఆమ్లాలతో నిర్వహిస్తే H2 వాయువు విడుదల కావడం గుర్తిస్తాం.

3ఎ) లోహాలతో క్షారాల చర్యను వివరించే కృత్యాన్ని వివరించండి.
జ: * శుభ్రపరిచిన ఒక ఖాళీ పరీక్ష నాళికలో కొన్ని జింక్ ముక్కలను తీసుకుని దానికి 10 మి.లీ. సోడియం హైడ్రాక్సైడ్ (NaOH) ద్రావణాన్ని కలపండి.
* పరీక్ష నాళికను వేడిచేయండి.
* వెలువడే వాయువు దగ్గరకు మండుతున్న కొవ్వొత్తిని తీసుకురండి.
* వెలువడిన వాయువును మండించినప్పుడు 'టప్' మని శబ్దం రావడాన్ని గమనిస్తాం. అంటే వెలువడిన వాయువు హైడ్రోజన్ (H2) వాయువని చెప్పవచ్చు. ఏర్పడిన లవణం సోడియం జింకేట్ అని గుర్తిస్తాం.
* ఈ కృత్యం రసాయనిక చర్యను ఈ విధంగా రాయవచ్చు.

2 NaOH + Zn  Na2ZnO2 + H2 (హైడ్రోజన్)
                   (సోడియం జింకేట్)
* లోహాలు క్షారాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
* ఇలాంటి రసాయన చర్యలు అన్నిలోహాలతో సాధ్యం కావు.

4. సోడియం కార్బొనేట్‌లు, సోడియం హైడ్రోజన్ కార్బొనేట్‌లు ఆమ్లాలతో చర్య జరిపి కార్బన్ డై ఆక్సైడ్, నీటిని విడుదల చేస్తాయి. ఈ విషయాన్ని కృత్యం ద్వారా నిరూపించండి. (AS - 3) (4 మార్కులు)
జ:

* రెండు పరీక్షనాళికలను తీసుకుని వాటిపై A, B అక్షరాలను రాసిన కాగితాలను అతికించండి.
* పరీక్ష నాళికలో 0.5 గ్రా. సోడియం కార్బొనేట్ (Na2CO3)ను, B పరీక్షనాళికలో 0.5 గ్రా. సోడియం బైకార్పొరేట్ (NaHCO3) ను తీసుకోవాలి.
* రెండు పరీక్షనాళికలకు 2 మి.లీ. చొప్పున సజల HCl ద్రావణాన్ని కలపాలి.
* రెండు పరీక్షనాళికల్లో నుంచి వెలువడిన వాయువులను వేర్వేరుగా సున్నపుతేట (కాల్షియం హైడ్రాక్సైడ్) ద్వారా పంపినప్పుడు తెల్లటి అవక్షేపం ఏర్పడటం గమనిస్తాం.
* పైకృత్యాల్లో జరిగిన చర్యలను ఈవిధంగా రాయవచ్చు.

Na2CO(ఘ) + 2 HCl (జ.ద్రా.)  2 NaCl (జ.ద్రా.) + H2O (ద్ర) + CO2 (వా)
NaHCO3 (ఘ) + HCl (జ.ద్రా.)  NaCl (జ.ద్రా.) + H2O (ద్ర) + CO2 (వా)

* వాయువును సున్నపుతేట ద్వారా పంపినప్పుడు,
Ca(OH)2 (జ.ద్రా.) + CO(ఘ)    CaCO3 ↓     +   H2O (వా)
                                  తెల్లటి అవక్షేపం
* కార్బన్ డై ఆక్సైడ్ వాయువును అధికంగా పంపినప్పుడు

CaCO3 + H2O + CO2  Ca(HCO3)
                         (నీటిలో విలీనమవుతుంది)
* పై కృత్యం నుంచి అన్ని లోహ కార్బొనేట్లు, లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి ఆయా లోహ లవణాలతోపాటు కార్బన్ డై ఆక్సైడ్ వాయువు, నీటిని ఏర్పరుస్తాయని మీరు నిర్ధారించగలం.

5. తటస్థీకరణం అంటే ఏమిటి? తటస్థీకరణ చర్యను తెలియజేసే కృత్యాన్ని రాసి వివరించండి. (AS - 3) (4 మార్కులు)
జ: తటస్థీకరణం:
* క్షారంతో ఒక ఆమ్లం చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు. సాధారణంగా తటస్థీకరణ చర్యను కిందివిధంగా రాయవచ్చు.
క్షారం + ఆమ్లం  లవణం + నీరు
ఆమ్ల-క్షార తటస్థీకరణ చర్య:
* శుభ్రపరచిన పరీక్షనాళికలో 2 మి.లీ.ల సజల NaOH ద్రావణాన్ని తీసుకుని దానికి ఒక చుక్క ఫినాఫ్తలీన్ ద్రావణాన్ని కలపాలి. ద్రావణం గులాబీ(పింక్) రంగులోకి మారుతుంది.
* ఈ రంగు ద్రావణానికి సజల HCl ద్రావణాన్ని చుక్కలుగా కలుపుతూ మార్పులను గమనిస్తే ద్రావణం పింక్ రంగును కోల్పోతుంది.
* పై మిశ్రమానికి ఇప్పుడు మళ్లీ ఒకటి లేదా రెండు చుక్కలు NaOHను కలపాలి.
* ద్రావణం తిరిగి పింక్ (గులాబి) రంగులోకి మారుతుంది.

కారణాలు:
* పైకృత్యంలో పరీక్ష నాళికలోని ద్రావణానికి HCl ద్రావణాన్ని కలిపినప్పుడు ఆ ద్రావణం పింక్ (గులాబి) రంగును కోల్పోతుంది.
* దీనికి కారణం ద్రావణంలోని HClతో NaOH పూర్తిగా చర్యనొందడమే.
* ఈ చర్యలో క్షారం ప్రభావం ఆమ్లం వల్ల తటస్థీకరణం చెందుతుంది.
* ఈ స్థితిలో ఉన్న ద్రావణానికి కొన్ని చుక్కల NaOH ద్రావణాన్ని కలిపితే, ఆ ద్రావణం తిరిగి క్షార లక్షణాన్ని పొంది మళ్లీ పింక్ రంగులోకి మారుతుంది.
* పై కృత్యంలోని రసాయనిక చర్యను సమీకరణ రూపంలో ఈవిధంగా రాయవచ్చు.

NaOH (జ.ద్రా.) + HCl (జ.ద్రా.)  NaCl (జ.ద్రా.) + H2O (ద్ర)
* ఇది తటస్థీకరణ చర్య.

6. ఒక కృత్యం ద్వారా లోహపు ఆక్సైడ్‌లకు క్షారస్వభావం ఉంటుందని నిరూపించండి. (AS - 3) (4 మార్కులు)
జ: 
* కొద్ది పరిమాణంలో కాపర్ ఆక్సైడ్‌ను గాజు బీకరులోకి తీసుకోవాలి. దీన్ని గాజు కడ్డీతో కలియబెడుతూ నెమ్మదిగా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి.

* బీకరులోని కాపర్ ఆక్సైడ్, సజల HCl (హైడ్రోక్లోరిక్ ఆమ్లం)లో కరుగుతుందని, ద్రావణపు రంగు నీలి-ఆకుపచ్చ రంగులోకి మారుతుందని గమనిస్తాం.
* ఈ చర్యలో కాపర్ క్లోరైడ్ ఏర్పడటమే ఈ మార్పునకు కారణం.
లోహ ఆక్సైడ్ + ఆమ్లం 
 లవణం + నీరు
CuO + 2 HCl 
 CuCl2 + H2O
* పై రసాయనిక చర్యలో లోహ ఆక్సైడ్ ఆమ్లంతో చర్య జరిపి నీటిని, లవణాన్ని ఇస్తుంది. ఈ రసాయనిక చర్య ఆమ్ల, క్షారాల మధ్య చర్య వల్ల లవణం, నీరు ఏర్పడే చర్యను పోలి ఉంటుంది.
* రెండు చర్యల్లోనూ నీరు, లవణాలను క్రియాజనకాలుగా పొందుతాం. లోహ ఆక్సైడ్‌లు, లోహ హైడ్రైడ్‌లు ఆమ్లంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఇస్తాయి. కాబట్టి లోహ ఆక్సైడ్‌లు, లోహ హైడ్రైడ్‌ల్లా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని మనం నిర్ధారించవచ్చు.

 

7. హైడ్రోజన్ ఉన్న సమ్మేళనాలన్నీ ఆమ్లాలో కాదో కనుక్కోవడానికి ఒక కృత్యాన్ని నిర్వహించండి. (AS - 3) (4 మార్కులు)
జ:

* గ్లూకోజ్, ఆల్కహాల్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం మొదలైన సమ్మేళనాల ద్రావణాలను తయారుచేయాలి.
* రెండు వేర్వేరు రంగులున్న విద్యుత్ తీగలకు గ్రాఫైట్ కడ్డీలను కలపాలి. పటంలో చూపిన విధంగా విద్యుత్ వలయాన్ని కలపాలి.
* ఈ తీగల స్వేచ్ఛా కొనలను 230 వోల్ట్‌ల AC ప్లగ్‌కు కలపాలి. పటంలో చూపిన విధంగా విద్యుత్ వలయాన్ని పూర్తిచేయాలి.
* బీకరులో సజల HCl ద్రావణాన్ని పోసిన తర్వాత వలయంలో విద్యుత్‌ను ప్రవహింపజేయాలి.
* ఇదే కృత్యాన్ని సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం, గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాలతో వేర్వేరుగా నిర్వహించాలి.
* ఆమ్ల ద్రావణాలతో మాత్రమే బల్బు వెలగడాన్ని గమనిస్తాం. గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాల్లో బల్బు వెలగకపోవడాన్ని కూడా చూడొచ్చు.
* బల్బు వెలుగుతుందంటే ఆ ద్రావణం ద్వారా విద్యుత్ ప్రసరిస్తుందని తెలుస్తుంది.
* ఆమ్లద్రావణాల్లో అయాన్లు ఉంటాయి. ఈ అయాన్ల చలనం వల్లే ఆ ద్రావణాల్లో విద్యుత్ ప్రసారం జరుగుతుంది.
* HCl ద్రావణంలో ఉన్న ధన అయాను (కేటయాన్), (H+) కాబట్టి ఆమ్ల ద్రావణాలు, ఆమ్ల ధర్మాలకు కారణమైన హైడ్రోజన్ అయానన్లుH+(aq) ఇస్తాయి.
* గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాల్లో బల్బు వెలగదు. దీన్నిబట్టి ఈ ద్రావణాల్లో H+ అయాన్లు ఉండవని అర్థమవుతుంది. ద్రావణాల్లో విడుదలైన H+ అయాన్లు, ఆమ్లాల స్వభావాన్ని నిర్ధారిస్తాయి.


8. ఆమ్లాలు జలద్రావణంలో మాత్రమే అయాన్లను ఏర్పరుస్తాయా? ఒక కృత్యం ద్వారా ఈ విషయాన్ని పరీక్షించండి. (AS - 3) (4 మార్కులు)
జ: * శుభ్రపరచిన పొడి పరీక్ష నాళికలో 1.0 గ్రాముల ఘన NaClను తీసుకోవాలి
* కొద్దిగా గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పరీక్ష నాళికలోని NaClకు కలపాలి.
* వాయువాహక నాళం ద్వారా HCl వాయువు బయటకు వస్తుంది.
* ఈ చర్యను కింది సమీకరణంతో రాయాలి.

2 NaCl (ఘ) + H2SO4 (ద్ర)  2 HCl (వా) ↑ + Na2SO4 (ఘ)
* వెలువడిన వాయువును ముందుగా పొడి నీలి లిట్మస్ కాగితంతో, తర్వాత తడి నీలి లిట్మస్ కాగితంతో పరీక్షించాలి.
* పొడి HCl వాయువు (హైడ్రోజన్ క్లోరైడ్) ఆమ్లం కాదని నిర్ధారించగలుగుతాం. ఎందుకంటే పొడి లిట్మస్ కాగితం రంగులో ఎలాంటి మార్పు ఉండదు.
* సజల ద్రావణం ఒక ఆమ్లం. ఎందుకంటే తడిగా ఉండే నీలి లిట్మస్ కాగితం ఎరుపు రంగులోకి మారుతుంది.

* ఈ ప్రయోగాన్ని బట్టి నీటి సమక్షంలో HCl వియోగం చెంది హైడ్రోజన్ అయాన్లను ఏర్పరుస్తుంది కానీ నీరు లేనప్పుడు వియోగం చెందదు అని మనకు తెలుస్తుంది.
* నీటిలో HCl వియోగం కింది విధంగా జరుగుతుంది

HCl + H2 H3O+ + Cl- (జ.ద్రా.)
* హైడ్రోజన్ అయాన్లు స్వేచ్ఛా అయాన్లుగా ఉండలేవు. అవి నీటి అణువులతో కలిసి హైడ్రోనియం అయాన్లుగా (H3O+) ఏర్పడతాయి.
H+ + H2 H3O+
* ఆమ్లాలు నీటిలో H3O+ లేదా H+ (aq) అయాన్లను ఇస్తాయి.

 

8ఎ. ఒక క్షారాన్ని నీటిలో కరిగించినప్పుడు ఏం జరుగుతుందో తెలపండి. (AS - 3) (2 మార్కులు)
జ: * ఒక క్షారాన్ని నీటిలో కరిగించినప్పుడు ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.
      
* క్షారాలను నీటిలో కలిపినప్పుడు హైడ్రాక్సైడ్
(OH-) అయాన్లను ఇస్తాయి. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటారు. అన్నీ క్షారాలు నీటిలో కరగవు. Be(OH)2 కొద్ది పరిమాణంలో నీటిలో కరుగుతుంది.

9. ఆమ్లాలను నీటికి కలిపినప్పుడు ఏం జరుగుతుందో కృత్యం ద్వారా వివరించండి.
జ: * ఒక పరీక్ష నాళికలో 10 మి.లీ.ల నీటిని తీసుకోవాలి.
* కొన్ని చుక్కలు గాఢ H2SOను పరీక్ష నాళికలోని నీటికి కలపాలి. దాన్ని నెమ్మదిగా కదపాలి. పరీక్షనాళిక అడుగు భాగాన్ని చేతితో తాకాలి.
* అడుగు భాగం వేడిగా ఉంటుంది.
* ఆమ్లాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ ఒక ఉష్ణమోచక చర్య.

 

9ఎ. క్షారాన్ని నీటికి కలిపినప్పుడు ఏం జరుగుతుందో కృత్యం ఆధారంగా రాయండి.
జ: * ఒక పరీక్ష నాళికలో 10 మి.లీ. నీటిని తీసుకోవాలి.
* దీనికి కొన్ని సోడియం హైడ్రాక్సైడ్ ముక్కలు కలపాలి. పరీక్ష నాళికను నెమ్మదిగా కుదపాలి.
* పరీక్ష నాళిక అడుగు భాగాన్ని చేతితో తాకాలి.
* అడుగుభాగం వేడిగా ఉంటుంది.
* ఇది ఒక ఉష్ణమోచక చర్య.

 

10. ఒక ఆమ్లం బలమైందో లేదా బలహీనమైందో తెలుసుకునే పరీక్షను ఒక కృత్యం ద్వారా రాయండి.
జ:

* A, B అనే రెండు బీకర్లను తీసుకోవాలి.
* 'A' బీకరులో సజల
CH3COOH ను, 'B' బీకరులో సజల HCl ను తీసుకోవాలి.
* పటంలో సూచించినట్లు పరికరాలను అమర్చి రెండు ద్రావణాల ద్వారా ఒకేసారి విద్యుత్‌ను పంపి పరిశీలించాలి.
* HCl ద్రావణాన్ని ఉపయోగించినప్పుడు బల్బు ఎక్కువ ప్రకాశమంతంగా,
CH3COOH ద్రావణాన్ని ఉపయోగించినప్పుడు బల్బు తక్కువ ప్రకాశమంతంగా వెలగడం గమనిస్తాం.
* దీన్ని బట్టి HCl ద్రావణంలో ఎక్కువ అయాన్లు ఉన్నాయని, ఎసిటిక్ ఆమ్ల ద్రావణంలో తక్కువ అయాన్లు ఉన్నాయని తెలుస్తుంది.
* HCl ద్రావణంలో ఎక్కువ అయాన్లు ఉన్నాయంటే ఎక్కువ H3O+ అయాన్లు ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి ఇది బలమైన ఆమ్లం.
* అదేవిధంగా ఎసిటిక్ ఆమ్లంలో తక్కువ H3O+ అయాన్లు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక బలహీనమైన ఆమ్లం అని చెప్పవచ్చు.

 

11. పట్టికలో ఇచ్చిన ద్రావణాల pH విలువలను లిట్మస్ పేపరు ఉపయోగించి కనుక్కోండి. మీ పరిశీలనను పట్టికలోని 3వ నిలువ వరుసలో నమోదు చేయండి. 4వ నిలువ వరుసలో pH రమారమి విలువలను సార్వత్రిక సూచికా ద్రావణంతో కనుక్కుని నమోదు చేయండి. మీ పరిశీలనలను సార్వత్రిక సూచికతో పొందిన విలువలతో సరిపోల్చండి. (AS - 3) (4 మార్కులు)


 

12. ఏంటాసిడ్ ఏ విధంగా పనిచేస్తుందో ఒక కృత్యం ద్వారా వివరించండి. (AS - 3) (2 మార్కులు)
జ: * బీకరులో కొద్దిగా సజల HClను తీసుకుని దానికి 2, 3 చుక్కలు మిథైల్ ఆరెంజ్ సూచికను కలపాలి.
* ద్రావణం ఎరుపురంగులోకి మారుతుంది.
* ద్రావణానికి ఏదైనా ఏంటాసిడ్ (జెలూసిల్ లేదా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా)ను కలపాలి.
* ద్రావణం ఎరుపురంగును కోల్పోయి రంగులేని ద్రావణంగా మారుతుంది.
* అంటే ద్రావణంలోని ఆమ్ల గుణాన్ని ఏంటాసిడ్ అనే క్షారగుణం ఉన్న పదార్థం తటస్థీకరించింది.

13. మీ ప్రాంతంలోని మట్టి pH విలువ కనుక్కునే కృత్యాన్ని రాయండి.
జ: * మా ప్రాంతంలోని మట్టిని కొద్దిగా సేకరించాను.
* ఒక పరీక్ష నాళికలో 2 గ్రా. మట్టిని తీసుకుని దానికి 5 మి.లీ. నీటిని కలిపాను.
* పరీక్ష నాళిక మూతిని మూసి దాన్ని బాగా కుదిపాను.
* పరీక్ష నాళికలోని ద్రావణాన్ని వడబోశాను.
* సార్వత్రిక సూచిక సహాయంతో అవక్షేపం pH విలువ కనుక్కున్నాను.


14. కింది లవణాల సాంకేతికాలు రాయండి. ఈ లవణాలు ఏయే ఆమ్ల, క్షార జంటల మధ్య చర్య వల్ల ఏర్పడతాయో గుర్తించండి. ఈ లవణాల నుంచి ఎన్ని లవణ కుటుంబాలను గుర్తించవచ్చు తెలపండి.  (AS - 3) (4 మార్కులు)
జ:
     

లవణాల కుటుంబాలు

సోడియం కుటుంబం: Na2SO4, NaCl, NaNO3, Na2CO3
క్లోరైడ్ కుటుంబం: NaCl, NH4Cl
సల్ఫేట్ కుటుంబం: K2SO4, Na2SO4, CaSO4, MgSO4, CuSO4
కార్బొనేట్ కుటుంబం: Na2CO3, MgCO3, CaCO3

15. * సోడియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, సోడియం ఎసిటేట్, అమ్మోనియం క్లోరైడ్, సోడియం హైడ్రోజన్ కార్బొనేట్, సోడియం కార్బొనేట్ లవణాలను సేకరించండి.
* వాటిని విడివిడిగా స్వేదన జలంలో కరిగించి ఏర్పడిన ద్రావణం స్వభావాన్ని లిట్మస్ కాగితాల సహాయంతో కనుక్కుని నమోదు చేయండి.
* pH కాగితాన్ని (సార్వత్రిక సూచిక) ఉపయోగించి వాటి pH విలువలు కూడా నమోదు చేయండి.
* pH విలువల ఆధారంగా వాటిని ఆమ్లాలు, క్షారాలు, లవణాలుగా వర్గీకరించండి.
* ఆయా లవణాలు ఏర్పడటానికి ఉపయోగించిన ఆమ్ల, క్షార జంటలను గుర్తించండి.

జ:
    


అదనపు ప్రశ్నలు - జవాబులు

I. విషయావగాహన

1. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే కొన్ని ఆమ్ల - క్షార సూచికలను పేర్కొనండి. (AS - 1) (2 మార్కులు)
జ: * ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే లిట్మస్, రెడ్ క్యాబేజి రసం, పసుపు కలిపిన జలద్రావణం, రంగు పుష్పాల ఆకర్షక పత్రాల రసాలు మొదలైనవి.
* ఇవి బలహీన ఆమ్ల లేదా క్షార సంబంధమైన జీవ అణువులతో ఉంటాయి.
* వీటిని ద్రావణాల ఆమ్ల, క్షార స్వభావాన్ని పరీక్షించడానికి ఆమ్ల - క్షార సూచికలుగా ఉపయోగించవచ్చు.


2. కొన్ని రసాయనిక సూచికల పేర్లు రాయండి. (AS - 1) (ఒక మార్కు)
జ: మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్తలీన్ - రసాయనిక సూచికలు.
(Synthetic indicators)


3. సువాసన (olfactory) సూచికలు అంటే ఏమిటి? (AS - 1) (ఒక మార్కు)
జ: * కొన్ని పదార్థాలు ఆమ్ల, క్షార యానకాల్లో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వాటిని సువాసన
(olfactory) సూచికలు అంటారు

 

4. లోహాలతో ఆమ్ల - క్షారాలు జరిపే చర్యలకు ఒక్కో ఉదాహరణ రసాయన సమీకరణాలతో రాయండి. (AS - 1) (2 మార్కులు)
జ: ఉదా: 
1) 2 HCl (జ.ద్రా.) + Zn (ఘ) 

 ZnCl2 (జ.ద్రా.) + H2 (వా)
          ఆమ్లం    +   లోహం   లవణం    +    హైడ్రోజన్
      
 2) 2 NaOH (జ.ద్రా.) + Zn (ఘ)  Na2ZnO2 (జ.ద్రా.) + H2 (వా)
       క్షారం     +    లోహం     సోడియం జింకేట్ లవణం +   హైడ్రోజన్


5. కార్బొనేట్ ఆమ్లంతో పొందే రసాయన చర్యా, రసాయన సమీకరణం రాయండి. (AS - 1) (2 మార్కులు)
జ: * సోడియం కార్బొనేట్, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనొంది, సోడియం క్లోరైడ్ లవణంతోపాటు కార్బన్ డై ఆక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.

Na2CO(ఘ) + 2 HCl (జ.ద్రా.)  2 NaCl (జ.ద్రా.) + H2O (ద్ర) + CO(వా)


6. లోహ హైడ్రోజన్ కార్బొనేట్‌తో ఆమ్లం చర్య నొందితే ఏం ఏర్పడతాయి. రసాయన సమీకరణం రాయండి. (AS - 1) (2 మార్కులు)
జ: * సోడియం హైడ్రోజన్ కార్బొనేట్, హైడ్రోక్లోరికామ్లంతో చర్య జరిపి సోడియం క్లోరైడ్ లవణంతోపాటు కార్బన్ డై  ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది.

NaHCO3 (ఘ) + HCl (జ.ద్రా.)  NaCl (జ.ద్రా.) + H2O (ద్ర) + CO(వా)


7. లోహపు ఆక్సైడ్‌లతో ఆమ్లం చర్యనొందితే ఏం జరుగుతుంది? ఉదాహరణగా రసాయన సమీకరణాన్ని కూడా రాయండి. (AS - 1) (2 మార్కులు)
జ: * అన్ని సజల ఖనిజ ఆమ్లాలు (H2SO4, HCl, HNO3 ..... మొదలైనవి) లోహ ఆక్సైడ్‌లతో చర్య నొంది తత్సంబంధమైన లోహపు లవణాలు, నీటిని ఏర్పరుస్తాయి.
* లోహ ఆక్సైడ్ + ఆమ్లం (సజల)   
 లోహ లవణం    +  నీరు
     ZnO              +                     2 HCl        

                 ZnCl2                  +  H2O
  (జింక్ ఆక్సైడ్) + (సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం)  (జింక్ క్లోరైడ్)   + (నీరు)

8. సాధారణ ఉప్పు రసాయనిక సాంకేతికం రాయండి. (AS - 1) (ఒక మార్కు)
జ: * సాధారణ ఉప్పు రసాయనిక సాంకేతికం NaCl.
* అదే సోడియం క్లోరైడ్.


9. Na2CO3 .10 H2O సాంకేతికంలో 10 H2O ప్రాముఖ్యం ఏమిటి? (AS - 1) (ఒక మార్కు)
జ:  
Na2CO3 .10 H2O అంటే ఆర్ద్ర సోడియం కార్బొనేట్.
* ఒక ఫార్ములా యూనిట్
* సోడియం కార్బొనేట్‌లో 10 నీటి అణువులు ఉంటాయి.
* ఈ నీటి అణువుల వల్ల సోడియం కార్బొనేట్ తడిగా ఉండదు.


10. ఆమ్లాలన్నింటిలోనూ ఉండే ఉమ్మడి మూలకం ఏమిటి? (AS - 1) (2 మార్కులు)
జ: * ఆమ్లాలు లోహాలతో చర్యనొంది హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి.
* హైడ్రోజన్ అనేది ఆమ్లాలు అన్నింటిలో ఉండే ఉమ్మడి సామాన్య మూలకంగా కనిపిస్తుంది.


11. పదార్థాల ఆమ్ల స్వభావం దేని వల్ల నిర్ధారించబడుతుంది? (AS - 3) (ఒక మార్కు)
జ: * ఆమ్లద్రావణాలు, ఆమ్ల ధర్మాలకు కారణమైన హైడ్రోజన్ అయాన్లను (H+) (జ.ద్రా.) ఇస్తాయి.
* ద్రావణాల్లో విడుదలైన H+ అయాన్లు, ఆమ్లాల ఆమ్ల స్వభావాన్ని నిర్ధారిస్తాయి.


12. క్షారాల్లో ఉమ్మడిగా ఉండేది ఏమిటి? (AS - 1) (ఒక మార్కు)
జ: క్షారాల్లో ఉమ్మడిగా ఉండేది OH- అయాన్లు (హైడ్రాక్సైడ్ అయాన్లు).

13. విరంజన చూర్ణం ఎలా తయారు చేస్తారు? దాని సాంకేతికం రాయండి. (AS - 1) (2 మార్కులు)
జ: * తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్
(Slaked lime) Ca(OH)2 పై క్లోరిన్ వాయువు చర్య వల్ల బ్లీచింగ్ పౌడరు ఏర్పడుతుంది. దీన్ని CaOCl2 అనే సంకేతంతో సూచిస్తారు. దీని కచ్చితమైన సంఘటనం మిక్కిలి సంక్లిష్టమైంది.
Ca(OH)2 + Cl2  CaOCl2 + H2O


14. బేకింగ్ పౌడరు అంటే ఏమిటి? (AS - 1) (ఒక మార్కు)
జ: బేకింగ్ సోడాను, టార్టారిక్ ఆమ్లం లాంటి బలహీన, తినదగిన ఆమ్లంతో కలపగా ఏర్పడిన మిశ్రమాన్ని బేకింగ్ పౌడరు అంటారు.

 

15. తటస్థీకరణ చర్య అంటే ఏమిటి? (AS - 1) (2 మార్కులు)
జ: * క్షారంతో ఒక ఆమ్లం చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరిచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు.
* తటస్థీకరణ చర్యను కింది విధంగా రాస్తారు.
క్షారం + ఆమ్లం 
 లవణం + నీరు


16. ఆమ్లాలతో లోహ ఆక్సైడ్‌లు జరిపే చర్యకు సాధారణ సమీకరణం రాయండి.  (AS - 1) (ఒక మార్కు)
జ: లోహ ఆక్సైడ్ + ఆమ్లం 
 లవణం + నీరు


17. లోహ ఆక్సైడ్‌లు, క్షార స్వభావం కలిగి ఉంటాయని మీరు ఎలా నిర్ధారిస్తారు?  (AS - 1) (2 మార్కులు)
జ: * లోహ ఆక్సైడ్‌లు, లోహ హైడ్రైడ్‌లు ఆమ్లంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఇస్తాయి.
* కాబట్టి లోహ ఆక్సైడ్‌లు, లోహ హైడ్రైడ్‌లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని నిర్ధారించవచ్చు.

18. కార్బన్ డై ఆక్సైడ్‌ను సున్నపుతేట (కాల్షియం హైడ్రాక్సైడ్) ద్వారా పంపినప్పుడు జరిగే రసాయన చర్యను రాయండి. (AS - 1) (2 మార్కులు)
జ: * కార్బన్ డై ఆక్సైడ్ వాయువును సున్నపుతేట ద్వారా పంపినప్పుడు తెల్లటి అవక్షేపం CaCO3 ఏర్పడుతుంది.

Ca(OH)2 (జ.ద్రా.) + CO2 (వా)  CaCO3 ↓ + H2O (వా)
                               తెల్లటి అవక్షేపం
* కార్బన్ డై ఆక్సైడ్ వాయువును అధికంగా పంపినప్పుడు

CaCO3 + H2O + CO2  Ca(HCO3) నీటిలో విలీనమవుతుంది.


19. అలోహ ఆక్సైడ్ అయిన కార్బన్ డై ఆక్సైడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందని ఎలానిర్ధారిస్తారు? (AS - 1) (2 మార్కులు)
జ: * కార్బన్ డై ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ (సున్నపునీరు)ల మధ్య చర్యను గమనించాలి.
* క్షార స్వభావం ఉన్న కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డై ఆక్సైడ్‌తో చర్య నొంది నీరు, లవణాలను ఇస్తుంది.
* ఈ చర్య ఆమ్ల, క్షారాల మధ్య జరిగే చర్యను పోలి ఉంటుంది.
* కాబట్టి, అలోహ ఆక్సైడ్ అయిన కార్బన్ డై ఆక్సైడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందని మనం నిర్ధారించవచ్చు.
* సాధారణంగా అన్ని అలోహ ఆక్సైడ్‌లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.


20. పొడి HCl వాయువు (హైడ్రోజన్ క్లోరైడ్) ఆమ్లం కాదని మీరు ఎలా నిర్ధారించగలరు?(AS - 1) (ఒక మార్కు)
జ: * పొడి లిట్మస్ కాగితంతో పొడి HCl వాయువును పరీక్షించగా లిట్మస్ కాగితం రంగులో ఎలాంటి మార్పు లేదు.
* అందువల్ల పొడి HCl వాయువు (హైడ్రోజన్ క్లోరైడ్) ఆమ్లం కాదని నిర్ధారించగలం.
* HCl వాయువును తడి లిట్మస్ కాగితంతో పరీక్షిస్తే అది ఎరుపు రంగులోకి మారింది. అంటే HCl ద్రావణం ఆమ్లం అని స్పష్టం అవుతోంది.

 

21. నీటి సమక్షంలో HCl ఏ విధంగా వియోగం చెందుతుందో రాయండి. (AS - 1) (2 మార్కులు)

జ: * నీటిలో HCl వియోగం కింది విధంగా జరుగుతుంది.
HCl + H2 H3O+ + Cl- (జ.ద్రా.)
* హైడ్రోజన్ అయాన్లు స్వేచ్ఛా అయాన్లుగా ఉండలేవు. అవి నీటి అణువులతో కలసి హైడ్రోనియం అయాన్లుగా (H3O+) ఏర్పడతాయి.
H+ + H2 H3O+
* ఆమ్లాలు నీటిలో H3Oలేదా H+ అయాన్లను ఇస్తాయి.


22. ఒక క్షారాన్ని నీటిలో కరిగించినప్పుడు ఏం జరుగుతుంది. రెండు ఉదాహరణలు రాయండి. (AS - 1) (4 మార్కులు)
జ: ఒక క్షారాన్ని నీటిలో కరిగించినప్పుడు కింది విధంగా వియోగం చెందుతుంది.

 

23. ఆల్కలీలు అంటే ఏమిటి? రెండు ఆల్కలీల పేర్లు రాయండి. (AS - 1) (2 మార్కులు)
జ: * నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటారు.
* అన్ని క్షారాలు నీటిలో కరగవు. Be(OH)2 కొద్ది పరిమాణంలో నీటిలో కరుగుతుంది.
* NaOH, KOH క్షారాలు నీటిలో కరుగుతాయి. కాబట్టి అవి ఆల్కలీలు.


24. ఎసిటిక్ ఆమ్లం ఎందువల్ల బలహీనమైన ఆమ్లం? (AS - 1) (ఒక మార్కు)
జ: సజల ఎసిటిక్ ఆమ్లంలో తక్కువ H3O+ అయాన్లు ఉంటాయి. కాబట్టి అది ఒక బలహీన ఆమ్లం.


25. స్ఫటిక జలం అంటే ఏమిటి? (AS - 1) (ఒక మార్కు)
జ: * ఒక లవణం ఫార్ములా యూనిట్‌లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటారు.
ఉదా: ఆర్ద్రకాపర్ సల్ఫేట్:
CuSO4 . 5 H2O


26. సార్వత్రిక ఆమ్ల క్షార సూచిక అంటే ఏమిటి? దీనివల్ల ఉపయోగం ఏమిటి? (AS - 1) (2 మార్కులు)
జ: * సార్వత్రిక ఆమ్ల క్షార సూచిక
(Universal Acid - base indicator) ను ఉపయోగించి కూడా బలమైన, బలహీనమైన ఆమ్ల- క్షారాలను గుర్తించవచ్చు.
* సార్వత్రిక ఆమ్ల క్షార సూచిక అనేక సూచికల మిశ్రమం.
* ఇది ద్రావణంలో ఉండే వేర్వేరు హైడ్రోజన్ అయాన్ల గాఢతలను బట్టి వేర్వేరు రంగులను చూపుతుంది.

 

27. విలీనం చేయడం అంటే ఏమిటి? (AS - 1) (2 మార్కులు)
జ: * ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కలపడం వల్ల ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే అయాన్ల (H3O+/ OH-)  గాఢత తగ్గుతుంది. ఈ ప్రక్రియను విలీనం చేయడం (dilution) అంటారు. సంబంధిత ఆమ్ల, క్షారాలను విలీన ఆమ్లం లేదా విలీన క్షారం అంటాం.


28. pH స్కేలు అంటే ఏమిటి? ఇది ఆమ్లాల నుంచి క్షారాలకు వెళ్లేసరికి ఎలా మారుతుంది? (AS - 1) (4 మార్కులు)
జ: * ద్రావణంలోని హైడ్రోజన్ అయాన్ గాఢతను లెక్కించడానికి ఉపయోగించే స్కేలును pH స్కేలు అంటారు.
* pH లో p అనే అక్షరం 'పొటెన్జ్' అనే పదాన్ని సూచిస్తుంది. జర్మన్ భాషలో పొటెన్జ్ అంటే సామర్థ్యం అని అర్థం.
* ఒక ద్రావణం pH విలువ దాని ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించే ఒక సంఖ్య మాత్రమే. దీన్ని pH స్కేలులో ఒక సంఖ్యతో చూపవచ్చు.


pH విలువలు:
* తటస్థ ద్రావణపు pH విలువ 7.
* pH స్కేల్‌పై 7 కంటే తక్కువ విలువలు ఉండే ద్రావణాలను ఆమ్ల ద్రావణాలు అంటారు.
* pH విలువ 7 నుంచి 14కు పెరుగుతుంటే, అది ఆ ద్రావణంలో H3O+ అయాన్ల గాఢత తగ్గడాన్ని OH- అయాన్ల గాఢత పెరగడాన్ని సూచిస్తుంది.
* అంటే ద్రావణంలో క్షారస్వభావం పెరుగుతుంది. ద్రావణ pH విలువ 7 కంటే ఎక్కువైతే ఆ ద్రావణాన్ని క్షారం అంటారు.

29. రాతి ఉప్పు అంటే ఏమిటి? దీన్ని ఎలా తవ్వితీస్తారు? (AS - 1) (2 మార్కులు)
జ: * ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఘనసోడియం క్లోరైడ్ నిక్షేపాలు ఉన్నాయి.
* ఈ నిక్షేపాల్లో ఉండే సోడియం క్లోరైడ్ స్ఫటికాలు మలినాలతో కలిసి ఉండటం వల్ల ముదురు గోధుమ (జేగురు) రంగులో ఉంటాయి.
* ఈ సోడియం క్లోరైడ్‌ను రాతి ఉప్పు
(rock salt) అంటారు.
* గడిచిపోయిన కాలాల్లో సముద్ర జలాలు ఎండిపోవడం వల్ల ఈ రాతి ఉప్పు మేటలు ఏర్పడ్డాయి.
* రాతి ఉప్పును, బొగ్గులా గనుల నుంచి తవ్వితీస్తారు.


30. కింది పదార్థాలకు రసాయనిక సాంకేతికాలు రాయండి. (AS - 1) (ఒక్కోదానికి ఒక మార్కు)
a) సోడియం క్లోరైడ్         b) ఎసిటిక్ ఆమ్లం      c) జిప్సం
d) విరంజన చూర్ణం        e) బేకింగ్ సోడా         f) వాషింగ్ సోడా
g) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్     h) సున్నపుతేట        i) సోడియం హైడ్రాక్సైడ్

 

31. మీ కుటుంబంలో ఎవరైనా ఎసిడిటి (acidity) సమస్యతో బాధపడుతుంటే, నిమ్మరసం, వెనిగర్, బేకింగ్ సోడా ద్రావణాల్లో దేన్ని విరుగుడుగా సూచిస్తారు? (AS - 1) (2 మార్కులు)
జ: * బేకింగ్ సోడా ద్రావణాన్ని విరుగుడుగా సూచిస్తాను.
* ఇది బలహీనమైన క్షారం కాబట్టి విడుదలైన జఠర ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం కలగజేస్తుంది.


32. ఒక తటస్థ చర్య వల్ల ఏర్పడిన లవణం స్వభావాన్ని ఎలా నిర్ణయిస్తారు? (AS - 1) (2 మార్కులు)
జ: * తటస్థ చర్య వల్ల ఏర్పడిన లవణ స్వభావాన్ని ఆ చర్యలో పాల్గొన్న ఆమ్ల క్షారాల సాపేక్ష బలాల ఆధారంగా నిర్ణయిస్తారు.
* కింది చర్యలు లవణం స్వభావాన్ని తెలియజేస్తాయి.
a) బలమైన ఆమ్లం + బలమైన క్షారం   తటస్థ లవణం
b) బలమైన ఆమ్లం + బలహీనమైన క్షారం  ఆమ్ల స్వభావ లవణం
c) బలహీన ఆమ్లం + బలమైన క్షారం 

 క్షార స్వభావ లవణం
d) బలహీన ఆమ్లం + బలహీన క్షారం   లవణం
 

33. వాషింగ్ సోడా తయారు చేసే పద్ధతిని, దాని ఉపయోగాలను రాయండి. (AS - 1) (4 మార్కులు)
జ: * బేకింగ్ సోడాను సోడియం క్లోరైడ్ నుంచి తయారుచేస్తారు. దాని రసాయన చర్య కింది విధంగా ఉంటుంది.
NaCl + H2O + CO2 + NH3  NH4Cl + NaHCO3
* బేకింగ్ సోడాను వేడిచేస్తే వాషింగ్ సోడా లభిస్తుంది.

* సోడియం కార్బొనేట్‌ను పున:స్ఫటికీకరణం చేస్తే వాషింగ్ సోడా లభిస్తుంది.

Na2CO3 + 10 H2 Na2CO3 .10 H2O
వాషింగ్ సోడా ఉపయోగాలు:
* గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమల్లో సోడియం కార్బొనేట్ (వాషింగ్ సోడా) ఉపయోగిస్తారు.
* బొరాక్స్ (borax) లాంటి సోడియం సమ్మేళనాల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు.
* గృహావసరాల్లో, సోడియం కార్బొనేట్‌ను వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
* నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు.


34. విరంజన చూర్ణం ఎలా తయారు చేస్తారు. దాని ఉపయోగాలు రాయండి.  (AS - 1) (4 మార్కులు)
* సజల సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని (బ్రైన్ ద్రావణం) విద్యుత్ విశ్లేషణ చేయడం వల్ల క్లోరిన్ వాయువు లభిస్తుంది.
* తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ (Slaked lime) Ca(OH)2 పై క్లోరిన్ వాయువు చర్య వల్ల విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడరు) ఏర్పడుతుంది.
* విరంజన చూర్ణాన్ని CaOCl2 అనే సాంకేతికంతో సూచిస్తారు.

Ca(OH)+ Cl CaOCl+ H2O
బ్లీచింగ్ పౌడర్ ఉపయోగాలు:
* వస్త్ర పరిశ్రమల్లో కాటన్, నారలను; కాగితం పరిశ్రమలో కలప గుజ్జును; ఉతికిన బట్టలను విరంజనం చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.
* రసాయన పరిశ్రమల్లో దీన్ని ఆక్సీకారిణిగా వాడతారు.
* తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తారు.
* క్లోరోఫాం తయారీలో కారకంగా (reagent) ఉపయోగిస్తారు.

35. బేకింగ్ సోడా తయారీ విధానం తెలియజేసి దాని ఉపయోగాలు రాయండి. (AS - 1) (4 మార్కులు)
జ: * బేకింగ్ సోడా రసాయన నామం సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ (NaHCO3)
* దీన్ని కింది విధంగా తయారు చేస్తారు.

NaCl + H2O + CO2 + NH3  NH4Cl + NaHCO3
* వంటసోడా (NaHCO3) క్షయం చెందని ఒక బలహీన క్షారం.
సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఉపయోగాలు:
* బేకింగ్ సోడాను, టార్టారిక్ ఆమ్లం లాంటి బలహీన తినదగిన ఆమ్లం (edible acid)తో కలపగా ఏర్పడిన మిశ్రమాన్ని బేకింగ్ పౌడర్ అంటాం.
* సోడియం హైడ్రోజన్ కార్బొనేట్‌ను ఏంటాసిడ్‌లలో ఒక ముఖ్య అనుఘటకంగా ఉపయోగిస్తాం. ఇది బలహీనమైన క్షారం కాబట్టి విడుదలైన జఠర ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం కలగజేస్తుంది.
* అగ్నిమాపక యంత్రాల్లో దీన్ని సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు.
* బలహీనమైన యాంటిసెప్టిక్ (గాయాన్ని కుళ్లి పోకుండా చేసేది)గా కూడా ఇది ఉపయోగపడుతుంది.
* బేకింగ్ పౌడర్‌ను వేడి చేసినప్పుడు లేదా నీటిలో కలిపినప్పుడు కింది రసాయన చర్య జరుగుతుంది.

NaHCO3 + H+ 

 CO2 + H2O + ఆమ్లం యొక్క సోడియం లవణం.
* ఈ రసాయనిక చర్యలో విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ వాయువు రొట్టె లేదా కేక్ (Cake) నుంచి రంధ్రాలు చేసుకుని బయటకు రావడం వల్ల అవి వ్యాకోచించి మెత్తటి స్పాంజ్‌లా మారతాయి.


36. ఆమ్లాలు - క్షారాలు గురించి వివరించండి. (AS - 1) (2 మార్కులు)
జ: * ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. నీలి లిట్మస్‌ను ఎర్రగా మారుస్తాయి.
* క్షారాలు జారుడు స్వభావంతో ఉండి, ఎరుపు లిట్మస్‌ను నీలి రంగుకు మారుస్తాయి.

 

I. ప్రశ్నించడం, పరికల్పన చేయడం

37. ఊరగాయలు, పుల్లటి పదార్థాలను ఇత్తడి, రాగి పాత్రల్లో నిల్వ ఉంచరు. ఎందువల్ల?
జ: * ఊరగాయలు, పుల్లటి పదార్థాల్లో ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఇత్తడి, రాగి పాత్రలతో చర్య జరిపి హైడ్రోజన్‌ను విడుదల చేస్తాయి. ఆపైన ఆ లోహాల సంబంధిత లవణాలను ఏర్పరుస్తాయి.
* ఈ లవణాలకు విషపూరిత స్వభావం ఉంటుంది. అందువల్ల ఈ పాత్రల్లో నిల్వఉంచిన ఊరగాయలను, పుల్లటి పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
* అందుకే ఊరగాయలను, పుల్లటి పదార్థాలను ఇత్తడి, రాగి పాత్రల్లో నిల్వ చేయరు.


38. అధికంగా కార్బన్ డై ఆక్సైడ్ వాయువును సున్నపుతేట ద్వారా పంపితే ఏమవుతుంది? (AS - 2) (2 మార్కులు)
జ: * COవాయువును సున్నపు తేట [Ca(OH)2] ద్వారా పంపినప్పుడు CaCOతెల్లటి అవక్షేపం ఏర్పడుతుంది.

Ca(OH)(జ.ద్రా.) + CO2 (వా)  CaCO(జ.ద్రా.) + H2O (ద్ర)
                                  తెల్లటి అవక్షేపం.
* COవాయువును అధికంగా పంపినప్పుడు

CaCO(ఘ) + CO(వా) + H2O (ద్ర)  Ca(HCO3) (జ.ద్రా.)
                                      (నీటిలో విలీనమవుతుంది)

 

39. తగరపు పాత్రల్లో ఊరగాయలను నిల్వ చేయరు. ఎందువల్ల?
జ: * ఊరగాయలు, జామ్‌లు, జెల్లీలు లాంటి వాటిని ఎప్పుడూ తగరపు పాత్రల్లో నిల్వఉంచరు. ఎందుకంటే వీటిలో అంగారకామ్లాలు ఉంటాయి.
* పాత్రను తయారు చేసిన లోహంతో ఈ ఆమ్లాలు చర్యనొంది హానికర లవణాలను ఏర్పరుస్తాయి.
* ఈ ఆమ్లాలు పాత్రను కూడా తినేస్తాయి.
* అందువల్ల ఊరగాయలు, జామ్‌లు, జెల్లీలు లాంటి వాటిని గాజు పాత్రల్లో నిల్వ ఉంచుతారు.


40. మొక్కలు, జంతువులు pH లోని మార్పులకు ప్రభావితం అవుతాయా? (AS - 1) (2 మార్కులు)
జ: * జీవ సంబంధ ప్రాణులన్నీ pH విలువల్లోని అతిస్వల్ప మార్పులకు లోబడి మాత్రమే జీవించగలవు.
* వర్షపునీటి pH విలువ 5.6 కంటే తక్కువైతే దాన్ని ఆమ్ల వర్షం అంటారు.
* ఈ ఆమ్ల వర్షపు నీరు నదీ జలాలతో కలిసినప్పుడు నదీజలాల pH విలువలు తగ్గుతాయి.
* అలాంటి తక్కువ pH విలువలున్న నదీజలాల్లో ఉండే జలచరాల జీవనం సంకటంలో పడుతుంది.

41. మీకు తెలుసా?


* ఉప్పు స్వాతంత్ర పోరాటానికి ఒక సంకేతం.
* మనం తినే ఆహార పదార్థాలకు రుచిని కలిగించే పదార్థంగా సామాన్య ఉప్పు మీకు పరిచయమే. కానీ ఇది స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రజలను ప్రేరేపించడంలో ఒక గొప్ప పాత్రను పోషించింది.
* సామాన్య ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్ను ధనికులు, పేదలు అనే బేధం లేకుండా అందరినీ ఏకం చేసి స్వాతంత్య్ర పోరాటానికి కార్యోన్ముఖులను చేసింది.
* మహాత్మా గాంధీ నిర్వహించిన 'దండి సత్యాగ్రహ కవాతు' గురించి వినే ఉంటారు. ఇదే ఉప్పు సత్యాగ్రహం. స్వాతంత్య్ర సంగ్రామంలో ఇదొక ముఖ్య ఘట్టంగా నిలిచింది.


42. మీకు తెలుసా?
* లైకెన్ అనే (Lichen) మొక్క థాలోఫైటా వర్గానికి చెందింది. దీని నుంచి సేకరించిన రంజనమే (dye) లిట్మస్.
* తటస్థ ద్రావణంలో దీని రంగు ముదురు ఊదా (purple). హైడ్రాంజియా (Hydrangea), పిటూనియా (Petunia), జెరేనియం (Geranium) లాంటి మొక్కల రంగుపూల ఆకర్షక పత్రాలు కూడా సూచికలుగా ఉపయోగపడతాయి.

 

III. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు

43. ఒక పరీక్షనాళికలో 5 మి.లీ. సున్నపునీరు తీసుకున్నారు. ఇందులో ఒకటి లేదా రెండు చుక్కల ఎర్ర లిట్మస్ వేస్తే ఏం జరుగుతుంది? (AS - 3) (ఒక మార్కు)
జ: ఎరుపు లిట్మస్ నీలిరంగులోకి మారుతుంది.


44. 5 మి.లీ. ల సున్నపు నీటికి ఒకటి లేదా రెండు చుక్కల ఫినాఫ్తలీన్ కలిపారు. ఎలాంటి మార్పును మీరు పరిశీలిస్తారు. (AS - 3) (ఒక మార్కు)
జ:  ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది.


45. రెండు చుక్కల మిథైల్ ఆరెంజ్‌ను 5 మి.లీ. సున్నపునీటికి కలిపితే ఏం జరుగుతుంది? (AS - 3) (ఒక మార్కు)
జ:  ద్రావణం పసుపు రంగులోకి మారిపోతుంది.


46. ఆమ్లానికి నీటిని కలపమని చెబుతారు కానీ, నీటికి ఆమ్లాన్ని కలపమని చెప్పరు. ఎందువల్ల వివరించండి. (AS - 3) (4 మార్కులు)
జ: * ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ ఒక ఉష్ణమోచక చర్య.
* గాఢ నత్రికామ్లాన్ని లేదా గాఢసల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని నీటితో కలిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఆమ్లాన్ని కొద్దిగా నీటికి కలుపుతూ ఆగకుండా కలియబెట్టాలి.
* అలా కాకుండా నీటిని నేరుగా గాఢ ఆమ్లానికి కలిపినట్లయితే, వెలువడే అధిక ఉష్ణం పాత్ర నుంచి పైకి చిమ్మడం వల్ల చర్మంమీద, కళ్లల్లో పడి ప్రమాదం సంభవిస్తుంది

 

47. ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కలిపే ప్రక్రియను ఏమంటారు? (AS - 3) (ఒక మార్కు)

జ: *  ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కలపడం వల్ల ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే అయాన్ల (H3O+/ OH-) గాఢత తగ్గుతుంది.
* ఈ ప్రక్రియను విలీనం చేయడం (dilution) అంటారు.అందులో ఉండే వాటిని విలీమ ఆమ్లం లేదా విలీన క్షారం అంటారు.

 

IV. సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు

48. మూడు ఆమ్లాల పేర్లను తెలపండి. ఒక్కోదానికి కనీసం రెండు ఉపయోగాలు రాయండి. (AS - 4) (4 మార్కులు)
జ:  * హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl), సల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4), నైట్రిక్ ఆమ్లం (HNO3) మూడు ఆమ్లాలు.
హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl) :
* దీన్ని రంగుల పరిశ్రమలో ఉపయోగిస్తారు.
* స్టార్చి నుంచి గ్లూకోజ్ తయారు చేయడానికి దీన్ని వినియోగిస్తారు.
సల్ఫ్యూరికామ్లం (H2SO4) :
* రసాయనిక ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు.
* కారు బ్యాటరీలలో వాడతారు.

నత్రికామ్లం (HNO3) :
* TNT (ట్రై నైట్రో టాల్విన్), TNG (ట్రై నైట్రో గ్లిజరిన్) లాంటి పేలుడు పదార్థాల తయారీలో వినియోగిస్తారు.
* బంగారం, వెండి లాంటి లోహాలను శుభ్రపరచడంలో దీన్ని ఉపయోగిస్తారు.


49. ఏవైనా నాలుగు ఆమ్లాల పేర్లు పేర్కొని వాటి ఉపయోగం కనీసం ఒకటైనా రాయండి.
జ:  * ఫాస్ఫారిక్ ఆమ్లం, కార్బొనిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, టార్టారిక్ ఆమ్లం.
ఉపయోగాలు:
ఎ) ఫాస్ఫారిక్ ఆమ్లం: ఫాస్ఫేట్ ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు.
బి) కార్బొనిక్ ఆమ్లం: మనం సాధారణంగా తాగే సోడా ఇది. దీన్ని సిట్రిక్ ఆమ్లం, పంచదారలతో కలిపి సాఫ్ట్ డ్రింకులు తయారీ చేస్తారు.
సి) ఎసిటిక్ ఆమ్లం: దీన్ని టేబుల్ ఆమ్లంగా వాడుకుంటారు. ఆహార పదార్థాలను నిల్వ చేసుకునేందుకు వినియోగిస్తారు.
డి) టార్టారిక్ ఆమ్లం: బేకింగ్ పౌడరు తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.


50. క్షారాల్లో సూచికల రంగులు ఎలా మారతాయి? (AS - 4) (2 మార్కులు)
జ: 

51. నాలుగు ఆర్ద్ర లవణాలను పేర్కొని వాటి సాంకేతికం, రంగులను తెలియజేయండి. (AS - 4) (4 మార్కులు)
జ:
      

52. నాలుగు ఆర్ద్ర లవణాలను పేర్కొని, వాటి సాధారణ నామాలు, రసాయనిక పేర్లను, సాంకేతికాలను రాయండి.
జ:


53. బలమైన, బలహీనమైన క్షారాలు అంటే ఏమిటి? (AS - 4) (2 మార్కులు)
జ:
 * జలద్రావణంలో పూర్తిగా అయానీకరణం చెంది OH- అయాన్లు ఇచ్చే వాటిని బలమైన క్షారాలు అంటారు.
ఉదా: 
NaOH, KOH
* జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెందని క్షారాలను బలహీన క్షారాలు అంటారు.
ఉదా: 
NH4OH, Ca(OH)2, Mg(OH)2

 

54. బలమైన ఆమ్లాలు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి. (AS - 4) (ఒక మార్కు)
జ: * జలద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెంది
H3O+ అయాన్లను ఇచ్చేవాటిని బలమైన ఆమ్లాలు అంటారు.
ఉదా:
 HCl, H2SO4, HNO3 ......


55. బలహీనమైన ఆమ్లాలు అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. (AS - 4) (ఒక మార్కు)
జ: * జలద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెందని ఆమ్లాలను బలహీనమైన ఆమ్లాలు అంటారు.
ఉదా: కార్బొనిక్ ఆమ్లం, సల్ఫ్యూరస్ ఆమ్లం, ఫాస్ఫారిక్ ఆమ్లం, నైట్రస్ ఆమ్లం ....
* ఇవి జలద్రావణంలో కొద్దిగా మాత్రమే
H3O+ అయాన్లను ఇస్తాయి.


56. మీ ప్రాంతంలో మొక్కలు బాగా ఎదగడానికి అనుకూలమైన మట్టి pH విలువ ఎంత ఉండాలి? (AS - 4) (ఒక మార్కు)
జ: మొక్కలు బాగా పెరగడానికి అనుకూలమైన మట్టి pH విలువ 5.5 నుంచి 7.0 మధ్య ఉండాలి.


57. రైతులు వ్యవసాయ క్షేత్రంలో ఏ విధమైన మట్టి ఉన్నప్పుడు దానికి సున్నపు పొడిని లేదా కాల్షియం కార్బొనేట్‌ను కలుపుతారు.  (AS - 4) (2 మార్కులు)
జ: మట్టికి ఆమ్ల గుణం ఉన్నప్పుడు తటస్థీకరించడానికి రైతులు సున్నపు పొడిని లేదా కాల్షియం కార్బొనేట్‌ను కలుపుతారు.

 

58. సాధారణ ఉప్పు నుంచి సోడియం హైడ్రాక్సైడ్ పొందే విధానాన్ని వివరించి రాయండి. (AS - 4) (4 మార్కులు)

జ: * సోడియం క్లోరైడ్ జల ద్రావణం (బ్రైన్ ద్రావణం) ద్వారా విద్యుత్‌ను ప్రసరింపజేస్తే అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది.
* ఈ ప్రక్రియను క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు.
* ఈ ప్రక్రియలో ఏర్పడే క్రియాజన్యాలు క్లోరిన్ (క్లోరో), సోడియం హైడ్రాక్సైడ్ (ఆల్కలీ) కావడంతో దీన్ని ఆ పేరుతో పిలుస్తారు.
       

 

క్లోరో - క్షార ప్రక్రియలో ఏర్పడే ముఖ్య ఉత్పన్నాలు

2 NaCl (జ.ద్రా.) + 2 H2O (ద్ర)  2 NaOH (జ.ద్రా.) + Cl(వా) + H2 (వా)
* క్లోరిన్ వాయువు ఆనోడ్ వద్ద, హైడ్రోజన్ వాయువు కాథోడ్ వద్ద విడుదలవుతాయి.
* కాథోడ్ వద్ద సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏర్పడుతుంది.
* ఈ చర్యలో వెలువడే ఉత్పన్నాలు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. (పటం చూడండి)


59. కింద ఇచ్చిన గుర్తు దేన్ని సూచిస్తుంది? (AS - 4) (2 మార్కులు)


జ:
 ఈ గుర్తును గాఢ ఆమ్లాలు, క్షారాలు నిల్వచేసే పాత్రలపై హెచ్చరిక గుర్తుగా వేస్తారు.

V. బొమ్మలు గీయడం, నమూనాలు తయారుచేయడం

60. H+, OHఅయాన్ల గాఢతలోని మార్పుతో మారే pH విలువల పటాన్ని కింద ఇచ్చారు. పరిశీలించండి. (AS - 5)

61. pH విలువలను ఎవరు ప్రవేశపెట్టారు? ఇది ఏ ద్రావణాలకు మాత్రమే పరిమితం అవుతుంది?(AS - 5) (2 మార్కులు)
జ: * సజల ఆమ్లాలు, క్షారాల్లో H+ అయాన్ల గాఢతలో రుణఘాతాన్ని తొలగించేందుకు సోరెన్‌సెన్ pH విలువలను ప్రవేశపెట్టాడు.
* 1 మోల్ కంటే తక్కువ H+ అయాన్ల గాఢత ఉన్న ద్రావణాలకు ఈ pH స్కేలు పరిమితమవుతుంది.


62. కింది pH వ్యాప్తిని పరిశీలించి ఎలా చదవాలో వివరించండి.
జ: pH వ్యాప్తి - ఎలా చదవాలి?
* pH స్కేలు సాధారణంగా 0 నుంచి 14 వరకు వ్యాప్తి చెంది ఉంటుంది.
* ఈ pH విలువ H+ అయాన్ల గాఢతను సూచిస్తుంది. ఉదాహరణకు pH విలువ సున్నా వద్ద, హైడ్రోనియమ్ అయాన్ గాఢత ఒక మోలార్ ఉంటుంది.
* నీటిలో చాలా ద్రావణాల H+ అయాన్ల గాఢత
1 M (pH = 0) నుంచి 10-14 M (pH = 14) వరకు విస్తరించి ఉంటుంది.
* pH స్కేలులో కొన్ని సాధారణ ద్రావణాల స్థానాలను పటంలో చూపారు.


 

VII. నిజజీవిత వినియోగం, జీవవైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం

63. ఒక వ్యక్తి ఏంటాసిడ్ టాబ్లెట్ వాడితే ఏం జరుగుతుంది? (AS - 7) (4 మార్కులు)
జ: * జీర్ణక్రియలో మన జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది.
* ఇది జీర్ణాశయానికి నష్టం కలగకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది.
* అజీర్తి సమయంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వల్ల కడుపులో మంట, అసహనం కలుగుతాయి.
* ఈ దుష్ప్రభావం నుంచి విముక్తిని పొందడానికి, మనం ఏంటాసిడ్‌లుగా పిలిచే క్షారాలను తీసుకుంటాం.
* ఈ ఏంటాసిడ్‌లు కడుపులో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి. ఇందుకోసం సాధారణంగా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ (మిల్క్ ఆఫ్ మెగ్నీషియా) అనే బలహీన క్షారాన్ని ఉపయోగిస్తారు.


64. మొక్కలు, జంతువులు pH లోని మార్పునకు ప్రభావితమవుతాయా? (AS - 7) (2 మార్కులు)
జ: * జీవ సంబంధ ప్రాణులన్నీ pH విలువల్లోని అతిస్వల్ప మార్పులకు లోనై మాత్రమే జీవించగలవు.
* వర్షపునీటి pH విలువ 5.6 కంటే తక్కువైతే ఆమ్ల వర్షం అంటారు.
* ఈ ఆమ్ల వర్షపు నీరు నదీ జలాలతో కలసినప్పుడు నదీ జలాల pH విలువలు తగ్గుతాయి.
* అలాంటి తక్కువ pH విలువలున్న నదీ జలాల్లో ఉండే జలచరాల జీవనం సంకటంలో పడుతుంది.

 

65. స్వీయరక్షణ కోసం మొక్కలు, కీటకాలు, జంతువులు రసాయనాలను ఉపయోగించుకుంటాయా? (AS - 7) (4 మార్కులు)
జ: * తేనెటీగ కుట్టినప్పుడు దాని కొండి ద్వారా ఆమ్లాన్ని పంపడంవల్ల తీవ్రమైన నొప్పి, దురద కలుగుతాయి.
* బేకింగ్ సోడా లాంటి బలహీనమైన క్షారాన్ని కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పితీవ్రత తగ్గుతుంది.
* కీటకం కొండి నుంచి మిథనోయిక్ ఆమ్లం (ఫాల్మిక్ ఆమ్లం) విడుదలై చర్మం కిందకు చేరుతుంది. దాని ప్రభావం వల్ల తీవ్రమైన మంట, దురద కలుగుతాయి.
* ఆకులపై ముళ్లు ఉండే దూలగొండి మొక్క
(Nettle plant) మనకు గుచ్చుకున్నపుడు అది మిథనోయిక్ ఆమ్లాన్ని శరీరంలోనికి ప్రవేశపెడుతుంది.
* దాని వల్ల తీవ్రమైన మంట కలుగుతుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో దుష్టిపాకు
(dock plant) ఆకులతో, కుట్టిన ప్రదేశంలో రుద్దితే ఉపశమనం ఉంటుంది.

Posted Date : 23-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం