• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1879, మార్చి 14న జర్మనీలో జన్మించారు. 1905లో సాపేక్షతా సిద్ధాంతాన్ని రూపొందించారు. 1922లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. 1955 ఏప్రిల్ 14న మరణించారు.

కీలక పదాలు

*  వక్రీభవనం

* పతన కిరణం

*  వక్రీభవన కిరణం

* పతన కోణం

*  వక్రీభవన కోణం

* పరమ వక్రీభవన గుణకం

*  సాపేక్ష వక్రీభవన గుణకం

* స్నెల్ నియమం

*  సందిగ్ద కోణం

* సంపూర్ణాంతర పరావర్తనం

* ఎండమావులు

* విస్తాపనం

* ఆప్టికల్ ఫైబరు

* యానకాలను వేరుచేసే తలం

* లంబం

*దృశాపరంగా సాంద్రతర విరళ యానకాలు

కీలక పదాలు - వివరణలు

వక్రీభవనం: కాంతి ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రయాణించేటప్పుడు దాని ప్రయాణ దిశ మారుతుంది. రెండు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటారు.
పతన కిరణం: కాంతి జనకం నుంచి వక్రీభవన లేదా పరావర్తన తలంపై పతనం చెందే కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు.
వక్రీభవన కిరణం: కాంతి కిరణం ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రవేశించినప్పుడు అది పతన బిందువు వద్ద గీసిన లంబం వైపు లేదా దూరంగా వంగుతుంది. ఈ కిరణాన్నే వక్రీభవన కిరణం అంటారు.
పతన కోణం (i): పతన కిరణానికి, పతన బిందువు వద్ద యానక తలానికి గీసిన లంబానికి మధ్య ఉండే కోణాన్ని పతన కోణం అంటారు.
వక్రీభవన కోణం (r): పతన కిరణం పతన బిందువు వద్ద గీసిన లంబానికి, వక్రీభవన కిరణానికి మధ్య ఉండే కోణాన్ని వక్రీభవన కోణం అంటారు.
పరమ వక్రీభవన గుణకం: (n) = 

స్నెల్ నియమం: n1 . sin i = n2. sin r
n1 : మొదటి యానకం వక్రీభవన గుణకం
n2 : మొదటి యానకం వక్రీభవన గుణకం
i: పతన కోణం
r: వక్రీభవన కోణం


సందిగ్ద కోణం: సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించే కాంతి కిరణం ఏ పతన కోణం వద్ద, యానకాలను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని ఆ తలానికి సంబంధించిన సందిగ్ద కోణం అంటారు.
సంపూర్ణాంతర పరావర్తనం: సందిగ్ద కోణం కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు.
ఎండమావులు: ఎండమావులు దృక్‌భ్రమల వల్ల ఏర్పడతాయి. ఎండాకాలంలో కొన్నిసార్లు తారురోడ్లపై కొంతదూరంలో నీరు ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే నీరు ఉండదు.

విస్తాపనం: ఒక గాజు దిమ్మెపై పతనం చెందిన పతన కిరణం, బహిర్గతమైన బహిర్గామి కిరణాలు సమాంతరంగా ఉంటాయి. ఈ సమాంతర రేఖల మధ్య దూరాన్ని విస్తాపనం అంటారు.


యానకాలను వేరుచేసే తలం: రెండు యానకాలను వేరుచేసే తలాన్ని యానకాలను వేరుచేసే తలం అంటారు.
లంబం: యానక తలానికి పతన బిందువు వద్ద గీసిన లంబాన్ని లంబం (Normal) అంటారు.
దృశా పరంగా సాంద్రతర, విరళ యానకాలు: రెండు పారదర్శక యానకాల్లో ఏ యానకానికి హెచ్చు వక్రీభవన గుణకం ఉంటుందో దాన్ని దృశాపరంగా సాంద్రతర యానకం అంటారు. ఏ యానకానికి తక్కువ వక్రీభవన గుణకం ఉంటుందో దాన్ని దృశాపరంగా విరళ యానకం అంటారు.

సారాంశ సంగ్రహం
* కాంతి వల్లే ప్రకృతికి అందం చేకూరుతుంది. వివిధ సందర్భాల్లో కాంతి ప్రవర్తించే తీరు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
* ఒక పాత్రలోని నీటిలో ఉంచిన నాణెం ఆ పాత్ర అడుగు భాగం నుంచి పైకి ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది.
* కాంతి ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రయాణించేటప్పుడు దాని వేగం మారడం వల్ల కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటారు
* ఒక తలానికి లంబంగా పతనమైనప్పుడు తప్ప, మిగిలిన ఏ సందర్భంలోనైనా కాంతి వక్రీభవనం చెందినప్పుడు కాంతి కిరణం వంగి ప్రయాణిస్తుంది.
* యానకంలో కాంతివేగం మారడం వల్లే వక్రీభవనం జరుగుతుందని వివిధ ప్రయోగాలు తెలుపుతున్నాయి.
* వక్రీభవన గుణకం అనేది పారదర్శక యానకానికి ఉండే ధర్మం.
* కాంతి కిరణం విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రవేశిస్తే రెండు యానకాలను వేరుచేసే తలం వద్ద గీసిన లంబం వైపు వక్రీభవన కిరణం జరుగుతుంది.
* కాంతి కిరణం సాంద్రతర యానకం నుంచి విరళ యానకం వైపు ప్రయాణిస్తున్నప్పుడు వక్రీభవన కిరణం లంబానికి దూరంగా జరుగుతుంది.

* వక్రీభవన గుణకం ఒకే విధమైన రెండు రాశుల నిష్పత్తి కాబట్టి దీనికి ప్రమాణాలు ఉండవు.
*  యానకం వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటే, ఆ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది.
* యానకం వక్రీభవన గుణకం తక్కువగా ఉంటే ఆ యానకంలో కాంతివేగం ఎక్కువగా ఉంటుంది.

* ఒక యానకం వక్రీభవన గుణకం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
1) పదార్థ స్వభావం
2) ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యం


*  సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు లంబానికి దూరంగా వంగుతుందని,
r > i అవుతుందని చెప్పవచ్చు.
* కాంతి వక్రీభవనం కొన్ని నియమాలకు అనుగుణంగా జరుగుతుంది.


ఆ నియమాలు:
* పతన కిరణం, వక్రీభవన కిరణం, రెండు యానకాలను వేరుచేసే తలంపై పతన బిందువు వద్ద గీసిన లంబం అన్నీ ఒకే తలంలో ఉంటాయి.
* వక్రీభవనంలో కాంతి 'స్నెల్' నియమాన్ని పాటిస్తుంది.

n1 sin i = n2 . sin r = స్థిరాంకం.
* నిర్దిష్ట పతన కోణం వద్ద వక్రీభవన కిరణం గాజు, గాలి యానకాలను వేరుచేసే రేఖ వెంబడి ప్రయాణిస్తుంది. అప్పుడు ఉండే పతన కోణమే సందిగ్ద కోణం
(critical angle ).

*(ఇక్కడ c : సందిగ్ద కోణం)

* i = c (సందిగ్ద కోణం) అయితే, r = 900 అవుతుంది.
* అప్పుడు 
* సందిగ్ద కోణం కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకే పరావర్తనం చెందుతుంది. అంటే కిరణం విరళ యానకంలోకి ప్రవేశించదు. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు.
* నీటి వక్రీభవన గుణకం , గాజు వక్రీభవన గుణకం గా తీసుకోవచ్చు.
యానకం వక్రీభవన గుణకం ఆ యానకం అంతా ఒకే విధంగా ఉండనటువంటి సందర్భానికి ఎండమావులు ఒక మంచి ఉదాహరణ.
*  వజ్రాల ప్రకాశానికి ముఖ్య కారణం, సంపూర్ణాంతర పరావర్తనమే.
* వజ్రం సందిగ్ద కోణం విలువ చాలా తక్కువ (24.4 0) కాబట్టి వజ్రంలోకి ప్రవేశించే కాంతి కిరణం సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది అది ప్రకాశమంతంగా కనిపించేలా చేస్తుంది.

* ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి.
* ఆప్టికల్ ఫైబర్ అనేది గాజు లేదా ప్లాస్టిక్‌తో తయారైన అతి సన్నని తీగ. దీని వ్యాసార్ధం సుమారుగా 1 మైక్రో మీటరు (10-6 మీ) ఉంటుంది.
* ఇలాంటి సన్నని తీగలు కొన్ని కలిసి లైట్ పైప్‌గా ఏర్పడతాయి.
* సమాచార సంకేతాలను ప్రసారం చేయడానికి కూడా ఆప్టికల్ ఫైబర్స్‌ను విరివిగా ఉపయోగిస్తారు. దాదాపు 2000 టెలిఫోన్ సిగ్నళ్లను కాంతి తరంగాలతో సరైన విధానంలో కలిపి ఒకేసారి ఆప్టికల్ ఫైబర్ ద్వారా ప్రసారం చేయవచ్చు.
* ఇలా ప్రసారం చేసిన సంకేతాలు, సంప్రదాయ పద్ధతిలో ప్రసారం చేసే సంకేతాల కంటే చాలా స్పష్టంగా ఉంటాయి.
* గాజు దిమ్మె ఉపరితలంపై లంబంగా పతనమైన కాంతి కిరణం ఎలాంటి విచలనం పొందకుండానే గాజు దిమ్మె రెండో వైపు నుంచి బయటకు వస్తుంది.
* గాజు దిమ్మెపై పతనం చెందిన పతన కిరణం, బహిర్గత కిరణం సమాంతరంగా ఉంటాయి. ఈ సమాంతర కిరణాల మధ్య దూరాన్నే పార్శ్వ విస్తాపనం అంటారు

 

Mind Mapping (మైండ్ మ్యాపింగ్)

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం