• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం

ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1. పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం నుంచి లభించే సమాచారం ఏమిటి? (2 మార్కులు)

జ: పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు, ఆర్బిటాళ్లలోని ఎలక్ట్రాన్‌ల పంపిణీని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు.

* ఎలక్ట్రాన్ విన్యాసాన్ని nlx పద్ధతిలో, బ్లాక్ డయాగ్రం పద్ధతిలో రాయవచ్చు.

* nlx పద్ధతి సంక్షిప్త సంకేత పద్ధతి. ఇందులో n ప్రధాన శక్తిస్థాయి విలువ, l ఉపశక్తి స్థాయి విలువ, x ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలియజేస్తుంది.

* హైడ్రోజన్ పరమాణువును తీసుకుందాం. దాని పరమాణు సంఖ్య (Z) ఒకటి. అంటే దాని ఎలక్ట్రాన్ విన్యాసం 1s1

 

* బ్లాక్ డయాగ్రమ్ పద్ధతిలో ఎలక్ట్రాన్ విన్యాసంలో ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణం కూడా తెలియజేస్తారు.

* 1H    దీని ఎలక్ట్రాన్ విన్యాసం  

* 1sఉపస్థాయిలోని ఆర్బిటాళ్లలో నిండిన ఎలక్ట్రాన్ సవ్యదిశలో ఆత్మభ్రమణాన్ని చేస్తోంది.

* ఎలక్ట్రాన్ విన్యాసం ద్వారా

a) ఆ పరమాణు మూలకం క్రియాశీలత తెలుసుకోవచ్చు.

b) ఆ పరమాణువు సంయోజకత అవగాహన అవుతుంది.

c) ఎలాంటి రసాయన బంధాలను ఆ పరమాణువు ఏర్పరచగలదో ముందుగా ఊహించవచ్చు.

2. a) ఒక ప్రధాన శక్తి కర్పరంలో అమర్చగలిగే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?  (1 మార్కు)

జ: ఒక ప్రధాన శక్తి కర్పరంలో అమర్చగలిగే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య 2n2. ఇక్కడ n ప్రధాన క్వాంటం సంఖ్య.

b) ఒక ఉపకర్పంలో ఇమడగలిగే గరిష్ఠ ఎలక్ట్రాన్లు ఎన్ని?  (2 మార్కులు)

జ: * ప్రతి ఉపకర్పరంలో గరిష్ఠంగా ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్లకు రెట్టింపు సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి.

* వివిధ ఉపకర్పరాల్లో గరిష్ఠంగా ఉండగలిగే ఎలక్ట్రాన్‌ల సంఖ్యలను పట్టికలో ఇచ్చారు.

c) ఒక ఆర్బిటాల్‌లో అమర్చగలిగే గరిష్ఠ ఎలక్ట్రాన్‌లు ఎన్ని?   (ఒక మార్కు)

జ: ఒక ఆర్బిటాల్‌లో అమర్చగలిగే గరిష్ఠ ఎలక్ట్రాన్‌లు = 2

d) ఒక ప్రధాన శక్తి స్థాయిలో ఎన్ని ఉపకర్పరాలు ఉంటాయి?   (ఒక మార్కు)

జ: ప్రధానశక్తి స్థాయి సంఖ్యకు సమాన సంఖ్యలో ఉపకర్పాలు ఉంటాయి.

ఉదా: n = 1 విలువకు ఒకే ఒక ఉపకర్పం l = 0 ఉంటుంది.

     n = 2 విలువకు రెండు ఉపకర్పరాలు ఉంటాయి, l = 0, 1

e) ఒక ఆర్బిటాల్‌లోని ఎలక్ట్రాన్‌కు ఎన్నిరకాల స్పిన్ దృగ్విన్యాసాలు సాధ్యమవుతాయి?  (ఒక మార్కు)

జ: ఒక ఆర్బిటాల్‌లోని ఎలక్ట్రాన్‌కు రెండు రకాల స్పిన్ దృగ్విన్యాసాలు సాధ్యమవుతాయి.

3. ఒక పరమాణువులోని M - కర్పరంలో ఉండే ఎలక్ట్రాన్‌లు K, L కర్పరాల్లో ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానమైతే కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.  (4 మార్కులు)

ఎ) బాహ్య కర్పరం ఏది?

జ: N - కర్పరం

బి) దాని బాహ్యకర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్‌లు ఉంటాయి?

జ: రెండు ఎలక్ట్రాన్‌లు 

సి) ఆ పరమాణు సంఖ్య ఎంత?

జ: ఆ పరమాణు సంఖ్య - 22.

డి) ఆ మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.

జ: ఆ మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2

4. ఇంధ్రధనస్సు, ఒక అవిచ్ఛన్నమైన వర్ణ పటానికి ఉదాహరణ. వివరించండి.  (4 మార్కులు)

జ: * వర్షం కురిసిన తర్వాత వాతావరణంలో అనేక లక్షల నీటిబిందువులు ఉంటాయి. వీటిపై సూర్యకాంతి  పతనం చెంది ఆ కాంతి విక్షేపణం చెందడం వల్ల ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.

* ఈ ఇంద్రధనస్సులో ఏడురంగులు (VIBGYOR) కనిపిస్తాయి. ఈ రంగులు ఒకదానిపై మరొకటి ఆచ్ఛాదనం చెంది దేనికీ నిర్దిష్టమైన హద్దు లేకుండా ఏర్పడతాయి.

* ఇంద్రధనస్సులో రంగులన్నీ 'అవిచ్ఛిన్నంగా' ఉండే రంగులపట్టీగా కనిపిస్తాయి.

* ప్రతీ రంగు తీవ్రత బిందువు బిందువుకు మారుతూ ఉంటుంది.

* అందుకే అవిచ్ఛిన్న వర్ణపటానికి ఇంద్రధనస్సు ఒక ఉదాహరణ.

5. బోర్ 3వ కక్ష్యకు సోమర్‌ఫెల్డ్ ఎన్ని దీర్ఘ వృత్తాకార కక్ష్యలు జతచేశాడు? ఈ దీర్ఘవృత్తాలను జతచేయడానికి కారణాలు ఏమిటి?  (2 మార్కులు)

జ: * సోమర్‌ఫెల్డ్ రెండు దీర్ఘ వృత్తాకార కక్ష్యలను బోర్ 3వ కక్ష్యకు జత చేశాడు.

* రేఖావర్ణపటంలోని రేఖలు ఉపరేఖలు (finer lines)గా విడిపోవడాన్ని విశదీకరించేందుకు సోమర్‌ఫెల్డ్ ఈ దీర్ఘవృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టాడు. 

6. 'ఆర్బిటాల్' అంటే ఏమిటి? బోర్ 'కక్ష్య (Orbit)తో పోల్చినప్పుడు ఇది ఏవిధంగా భిన్నమైంది?  (4 మార్కులు)

జ: * పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌ను కనుక్కోగలిగే సంభావ్యత (Probability) అధికంగా ఉండే ప్రాంతాన్ని ఆర్బిటాల్ (Orbital) అంటారు.

* పరమాణువులో కేంద్రకం నుంచి నిర్దిష్ట దూరాల్లో ఉన్న నియమిత శక్తి స్థాయుల్లో (కక్ష్యల్లో) ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.

* ఆర్బిట్ (కక్ష్య) ద్విమితీయంగా, ఆర్బిటాల్ త్రిమితీయంగా ఉంటాయి.

* ప్రధాన క్వాంటం సంఖ్య కక్ష్యను తెలుపుతుంది. అయస్కాంత క్వాంటం సంఖ్య ఆర్బిటాల్‌ను తెలుపుతుంది.

* బోర్ కక్ష్యలో గరిష్ఠంగా 2n2 ఎలక్ట్రాన్‌లు ఉంటాయి. ఆర్బిటాల్‌లో గరిష్ఠంగా పట్టే ఎలక్ట్రాన్‌ల సంఖ్య - 2.

7. ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ స్థానాన్ని అంచనా వేయడానికి మూడు క్వాంటం సంఖ్యలు ఏవిధంగా ఉపయోగపడతాయో వివరించండి.  (4 మార్కులు)

జ: * కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో కేవలం కొన్ని ఆర్బిటాళ్లు మాత్రమే ఉంటాయి. ఒకే శక్తిస్థాయికి చెందిన ఆర్బిటాళ్ల గురించి క్వాంటం సంఖ్యల ఆధారంగా తెలుసుకోవచ్చు.

* పరమాణువులోని ప్రతి ఎలక్ట్రాన్‌ను n, l, ml అనే మూడు సంఖ్యల సమితులతో సూచిస్తారు. వీటినే క్వాంటం సంఖ్యలు అంటారు.

* క్వాంటం సంఖ్యలు పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌లు ఉన్న ప్రాంతం, వాటి శక్తుల గురించి సమాచారాన్ని తెలుపుతాయి.

* ప్రధాన క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ లేదా ప్రధాన కర్పర పరిమాణం, దాని శక్తి గురించి తెలుపుతుంది. దీన్ని 'n' తో సూచిస్తారు.

* కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను 'l' అక్షరంతో సూచిస్తారు.

* ప్రతి 'l' విలువ కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే ఒక నిర్దిష్ట ఉపకర్పరం ఆకృతి గురించి తెలుపుతుంది.

* అయస్కాంత క్వాంటం సంఖ్యను ml తో సూచిస్తారు. ఇది పరమాణువులోని ఆర్బిటాళ్ల ప్రాదేశిక దృగ్విన్యాసాన్ని తెలుపుతుంది.

* ప్రధాన క్వాంటం సంఖ్య n (n = 1, 2, 3,..) విలువ పెరిగే కొద్దీ ఆర్బిటాల్ పరిమాణం పెరుగుతుంది. అలాగే అందులోని ఎలక్ట్రాన్‌లకు కేంద్రానికి మధ్య దూరం కూడా పెరుగుతుంది.

* n = 1, 2, 3, 4 విలువలున్న స్థాయులను K, L, M, N... తో సూచిస్తారు. ప్రతి n విలువకు ఒక ప్రధాన కర్పరం ఉంటుంది.

* ప్రధాన క్వాంటం సంఖ్య (n) విలువకు, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య l కు 0 నుంచి (n - 1) వరకు విలువలు ఉంటాయి.

* ఒక ఆర్బిటాల్ లేదా ఉపకరణాలకు సంబంధించిన l విలువలను సాధారణంగా s, p, d, f సంకేతాలతో సూచిస్తారు.

* అయస్కాంత క్వాంటం సంఖ్య ml, 0 తో కలిపి - 1 నుంచి + 1 వరకు పూర్ణాంక విలువలు కలిగి ఉంటుంది. అంటే ఒక నిర్దిష్ట l విలువకు ml విలువలు (2l + 1) ఉంటాయి.

* ఉదాహరణకు l = 1 అనుకుంటే ml విలువలు (2 + 1) = 3 గా ఉంటాయి. ఇవి -1, 0, +1. ఇవి x, y, z అక్షాల వెంబడి అమర్చిన px, py, pz అనే మూడు p - ఆర్బిటాళ్లను సూచిస్తాయి.

8.  పద్ధతి అంటే ఏమిటి? ఇది ఎలా ఉపయోగపడుతుంది? (2 మార్కులు)
జ: * ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే సంక్షిప్త సంకేతం  పద్ధతి.

* ఇందులో n విలువ ప్రధాన శక్తిస్థాయి, l విలువ ఉపశక్తి స్థాయి, x ఉపశక్తి స్థాయిలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్యను తెలియజేస్తాయి.
ఉదా: హైడ్రోజన్ (H) పరమాణు సంఖ్య Z = 1, దాని ఎలక్ట్రాన్ విన్యాసం:
 1s2 అని రాస్తారు. 


9. కింది ఆర్బిటాల్ రేఖాచిత్రం నైట్రోజన్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచిస్తుంది. ఇది ఏ నియమానికి వ్యతిరేకం? ఎందుకు?   (2 మార్కులు)
N (Z = 7) 


జ: * పై ఆర్బిటాల్ రేఖాచిత్రంలో చూపిన నైట్రోజన్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం హుండ్ నియమానికి వ్యతిరేకం.
* హుండ్ నియమం ప్రకారం సమశక్తి ఆర్బిటాళ్లలో (degenerated) ఒక్కో ఎలక్ట్రాన్ చేరిన తర్వాతే జతకూడటం జరుగుతుంది. అందువల్ల సరైన ఎలక్ట్రాన్ విన్యాసం రేఖాచిత్రం కింది విధంగా ఉంటుంది. 

N (Z = 7) 

10. 1s0 1s2 2s2 2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసం ఏ నియమాన్ని ఉల్లంఘించింది? ఎలా? (2 మార్కులు)

జ: * 1s0 2s2 2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసంలో ఆఫ్‌బౌ నియమం ఉల్లంఘించబడింది.
* ఆఫ్ బౌ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ అతి తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్‌ను ముందుగా ఆక్రమిస్తుంది.
* అతి తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్ 1s0 ఎలక్ట్రాన్‌తో నింపబడలేదు. అందువల్ల ఈ ఎలక్ట్రాన్ విన్యాసం ఆఫ్‌బౌ నియమాన్ని ఉల్లంఘించింది.
* 1s ఆర్బిలాల్ నిండిన తర్వాతే ఎలక్ట్రాన్ 2s ఆర్బిటాల్‌లో ప్రవేశించాలి.

 

11. సోడియం పరమాణువులో చివరగా చేరే ఎలక్ట్రాన్ నాలుగు క్వాంటం సంఖ్యలు రాయండి.    (ఒక మార్కు)
జ: సోడియం (Na) Z = 11
పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s1

* సోడియం పరమాణువులో చివరగా చేరే ఎలక్ట్రాన్ 3s1 అంటే 3s ఆర్బిటాల్‌లో ఉంటుంది.
* దాని నాలుగు క్వాంటం సంఖ్యలు:

12. క్రోమియం, రాగి ఎలక్ట్రాన్ విన్యాసాలు రాసేటప్పుడు మినహాయింపులు ఎందుకు ఉన్నాయి? (2 మార్కులు)

జ: * క్రోమియం (Cr) Z = 24. దీని సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం: 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4
కానీ, ఈ పరమాణువు అధిక స్థిరత్వం కోసం 3d ఉపకర్పంలోని 5 ఆర్బిటాళ్లను నింపుతుంది. దీని కోసం 4s2 లోని ఒక ఎలక్ట్రాన్‌ను తీసుకుంటుంది.
* అందువల్ల ప్రయోగాత్మకంగా క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం ఈ విధంగా ఉంటుంది.

    1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s1  (లేదా)  Ar] 4s1 3d5
* రాగి (Cu) Z = 29 సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం: 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9
కానీ ఈ పరమాణువు అధిక స్థిరత్వం కోసం 4s2 లోని ఒక ఎలక్ట్రాన్‌ను తీసుకుని 3d ఉపకర్పరంలో 5 ఆర్బిటాళ్లలోను ఎలక్ట్రాను జంటలతో ఉంటుంది.

* అందువల్ల ప్రయోగాత్మకంగా రాగి ఎలక్ట్రాన్ విన్యాసం:

     1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s1 (లేదా) [Ar] 4s1 3d10

13. 1s1 అనే సంక్షిప్త సంకేతంతో చూపిన ఎలక్ట్రాను నాలుగు క్వాంటం సంఖ్యలు రాయండి.    (2 మార్కులు)

జ: 1s1 లో చూపిన ఎలక్ట్రాన్ నాలుగు క్వాంటం సంఖ్యలు 

14. ఒక పరమాణువులోని ఒక ఎలక్ట్రాన్‌కు సంబంధించిన నాలుగు క్వాంటం సంఖ్యలను కింది పట్టికలో ఇచ్చారు. ఆ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్‌కు చెందిందో తెలపండి.  (ఒక మార్కు)


జ: * n = 2 కాబట్టి 2వ కక్ష్య.
* l = 0 కాబట్టి అది s ఉపస్థాయి.
* ml = 0 కాబట్టి అది ఒక ఆర్బిటాల్‌లో మ్రాతమే ఉంది.
* ms =
 కాబట్టి ఎలక్ట్రాన్ సవ్యదిశలో ఆత్మభ్రమణం చేస్తుంది.
* ఈ పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం: 2s1

15. ప్రాథమిక రంగులైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ తరంగదైర్ఘ్యం, వాటి పౌనఃపున్యాల సమాచారం సేకరించండి. (4 మార్కులు)

జ:
 

 

16. ఒక రేడియో తరంగం తరంగదైర్ఘ్యం 1 m అయితే దాని పౌనఃపున్యం కనుక్కోండి. (2 మార్కులు)
జ: ఇచ్చినవి
 λ = 1 m,  υ = ?
   c = 3 × 108 m/s
సూత్రం c =
υλ లేదా υ =  
విలువలు ప్రతిక్షేపించగా
υ =    = 3 × 108 Hz 

17. ఒక ఇనుప కడ్డీని వేడిచేస్తే ఏం జరుగుతుంది? వేడిచేస్తున్న కొద్దీ కడ్డీ రంగులో ఏవైనా మార్పులు సంభవిస్తాయా?     (AS - 1) (2 Marks)
జ: * ఇనుపకడ్డీని వేడి చేస్తున్నప్పుడు అది కొంత శక్తిని కాంతి రూపంలో విడుదల చేస్తుంది. ముందుగా అది ఎర్ర రంగులోకి (ఎక్కువ తరంగదైర్ఘ్యం, తక్కువ శక్తి) మారుతుంది.
* వేడి చేయడం అలాగే కొనసాగిస్తే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అది క్రమంగా నారింజ రంగు, పసుపు, నీలం (తక్కువ తరంగదైర్ఘ్యం, ఎక్కువ శక్తి) ఇంకా అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రకాశమంతమైన దృగ్గోచర తరంగ దైర్ఘ్యాలన్నీ కలిసి ఉన్న తెలుపు రంగులోకి మారడం గమనించవచ్చు.


18. ఇనుప కడ్డీని వేడి చేసేటప్పుడు దాని నుంచి ఒక రంగు వెలువడుతున్న సమయంలోనే మరేవైనా ఇతర రంగులు వెలువడటాన్ని మీరు గమనించారా?    (AS - 1) (1 Mark)
జ: * ఇనుప కడ్డీ అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉన్నప్పుడు దాని నుంచి ఇతర రంగులు కూడా వెలువడుతాయి, కానీ దాని నుంచి వెలువడే ఒక నిర్దిష్ట రంగు (ఉదా: ఎరుపు) తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మిగతా రంగులు కనిపించవు.

 

19. దీపావళినాడు కాల్చే టపాసుల నుంచి వివిధ రంగులు వెలువడటం మీరు గమనించి ఉంటారు. కాలుతున్న టపాసుల నుంచి ఈ రంగులు ఎలా ఏర్పడతాయి?     (AS - 1) (2 Marks)
జ: * టపాసుల్లో ఉండే మూలకాల పరమాణువులు ఉష్ణశక్తిని శోషణం చేసుకుని దానిలోని ఎలక్ట్రాన్లను భూస్థాయి నుంచి ఉత్తేజిత స్థాయికి పంపుతాయి. 

* ఈ ఎలక్ట్రాన్‌లు తిరిగి భూస్థాయికి చేరినప్పుడు అవి శోషణం చేసుకున్న శక్తిని దృశావర్ణ పటంలోకి కాంతిశక్తిగా ఉద్గారం చెందిస్తాయి.
* అందువల్ల దీపావళినాడు కాల్చే టపాసుల నుంచి వివిధ రంగులు వెలువడటం గమనిస్తాం.


20. వీధి దీపాలు పసుపు రంగు కాంతిని విడుదల చేయడం మీరు పరిశీలించారా? ఈ రంగు కాంతి ఎలా విడుదలవుతుంది?    (AS - 1) ) (1 Mark)
జ: * సోడియం ఆవిర్లు పసుపు రంగు కాంతిని వీధి దీపాల నుంచి విడుదల చేస్తాయి.


21. వివిధ మూలకాలు ఒకే జ్వాలపై మండుతున్నప్పుడు వేర్వేరు రంగులు ఏర్పడటానికి కారణం ఏమిటి?   (AS - 1) (4 Marks)
జ: * ప్రతి మూలకం అణువులు, పరమాణువులతో నిర్మితమై ఉంటుంది. ఈ అణువులు, పరమాణువులు నియమిత స్థిర శక్తులు కలిగి ఉంటాయి.
* సాధారణంగా ఈ పరమాణువులు, అణువులు స్థిరంగా ఉండేందుకు భూస్థాయిలో ఉంటాయి.
* ఈ మూలకాల అణువులు, పరమాణువులు స్థిరత్వం కలిగి ఉండేందుకు అవి కనిష్ఠశక్తి కలిగి ఉంటాయి.
* వీటిని ఒక జ్వాలపై వేడి చేసినప్పుడు, ఈ పరమాణువులోని ఎలక్ట్రాన్‌లు శక్తి గ్రహించి ఉత్తేజిత శక్తిస్థాయులను పొందుతాయి.
* ఈ ఉత్తేజిత శక్తి స్థాయిల నుంచి తిరిగి భూస్థాయికి చేరి స్థిరత్వం పొందేందుకు అవి గ్రహించిన శక్తిని విడుల చేస్తాయి.
* ఈ ఎలక్ట్రాన్‌లు విడుదల చేసిన శక్తి కాంతి రూపంలో ఉద్గారం అవుతుంది. ఈ కాంతి మూలక పరమాణువును బట్టి ఒక స్థిరమైన తరంగదైర్ఘ్యాన్ని ఉంటుంది. అందుకే ప్రతి మూలకం తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుంది.

 

22. ఎలక్ట్రాన్ తాను గ్రహించిన శక్తిని ఎప్పటికీ అలాగే నిలుపుకుంటుందా? (AS - 1) (2 Marks)
జ: ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయిలో (Excited State) ఎక్కువ కాలం ఉండలేదు. అది శక్తిని కోల్పోయి తిరిగి భూస్థాయికి చేరుకుంటుంది.
ఇలా ఎలక్ట్రాన్ కోల్పోయిన శక్తి విద్యుదయస్కాంత రూపంలో విడుదలవుతుంది.
ఇది నిర్దిష్ట తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ తరంగదైర్ఘ్యం దృగ్గోచర వర్ణపట తరంగదైర్ఘ్య అవధిలో ఉంటే అది వర్ణ పటంలో ఉద్గార రేఖ
(emission line) గా కనిపిస్తుంది.


23. ఎలక్ట్రాన్ వేగం ఎంత? (AS - 1) (1 Mark)
జ: ఎలక్ట్రాన్ వేగం దాదాపు కాంతి వేగానికి దగ్గరగా ఉంటుంది.


24. ఎలక్ట్రాన్ కచ్చితమైన స్థానాన్ని కనుక్కోవడం సాధ్యమేనా? (AS - 1) (2 Marks)
జ: ఎలక్ట్రాన్ స్థానాన్ని, వేగాన్ని కనుక్కోవడానికి తగిన కాంతి సహాయాన్ని తీసుకోవచ్చు.
ఎలక్ట్రాన్‌లు అత్యంత సూక్ష్మమైనవి కాబట్టి, అతి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతినే ఈ పనికోసం వాడుకోవాల్సి ఉంటుంది.
ఈ తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి ఎలక్ట్రాన్‌ను తాకినప్పుడు అది ఎలక్ట్రాన్ చలనాన్ని ప్రభావితం చేసి దాని చలనంలో మార్పుని కలగజేస్తుంది.
అందువల్ల ఎలక్ట్రాన్ వేగాన్ని, స్థానాన్ని కచ్చితంగా ఒకేసారి కనుక్కోలేం.

 

25. బోర్ నమూనా ప్రతిపాదించినట్లు, పరమాణువులకు నిర్దిష్టమైన సరిహద్దు అంటూ ఉంటుందా? (AS - 1) (1 Mark)
జ: ఎలక్ట్రాన్‌లు కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన మార్గాలను అనుసరించవు కాబట్టి పరమాణువును నిర్దిష్టమైన సరిహద్దు అంటూ ఏమీ ఉండదు.


26. ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్‌లు ఉండే ప్రాంతాన్ని ఏమని పిలవవచ్చు?(AS - 1) (2 Marks)
జ: పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌ను కనుక్కోగలిగే సంభావ్యత
(Probability) ఎక్కడైతే అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని 'ఆర్బిటాల్' (Probability) అంటారు.


27. క్వాంటం సంఖ్యల వల్ల మనం ఏం సమాచారం పొందగలం? (AS - 1) (1 Marks)
జ: క్వాంటం సంఖ్యలు పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌లు ఉన్న ప్రాంతం, వాటి శక్తుల గురించి సమాచారాన్ని తెలుపుతాయి.


28. ఒక్కో క్వాంటం సంఖ్య దేని గురించి వ్యక్తపరుస్తుంది?(AS - 1) (4 Marks)
జ: ప్రధాన క్వాంటం సంఖ్య
(n) : ఇది ఆర్బిట్ లేదా ప్రధాన కర్పర పరిమాణం, దాని శక్తి గురించి తెలుపుతుంది.
కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య
(l) : ఇది కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే ఒక నిర్దిష్ట ఉపకర్పరం ఆకృతిని గురించి తెలుపుతుంది.
అయస్కాంత క్వాంటం సంఖ్య
(ml): పరమాణువులోని ఆర్బిటాళ్ల ప్రాదేశిక దృగ్విన్యాసాన్ని తెలుపుతుంది.
స్పిన్ క్వాంటం సంఖ్య
(ms): ఎలక్ట్రాన్ స్పిన్‌కు ఉండే రెండు రకాల దృగ్విన్యాసాలను సూచిస్తుంది.
 

29. కర్పరాలు, ఉప కర్పరాలు, ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌లు ఎలా చేరతాయి?(AS - 1) (1 Mark)
జ: పరమాణువులోని కర్పరాలు, ఉప కర్పరాలు, ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌ల పంపిణీని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు.


30. n = 3 అయితే l గరిష్ఠ విలువ ఎంత? ఏయే ఉపకర్పరాలు ఉంటాయి? (AS - 1) (1 Mark)
జ: n = 3 అయితే l గరిష్ఠ విలువ = 2.
   * 
l = 0, 1, 2 విలువలు ఉంటాయి. అంటే s, p, d ఉపకర్పరాలు ఉంటాయి.


31. n = 4 అయినప్పుడు l కి ఎన్ని విలువలు ఉంటాయి? ఏయే ఉపకర్పరాలు ఉంటాయి?(AS - 1) (1 Mark)
జ: n = 4 అయితే l విలువలు 0 నుంచి (n - 1) వరకు ఉంటాయి.
     * అంటే n = 4 అయితే l విలువలు 0, 1, 2, 3 విలువలు 4 ఉంటాయి.
     * 
l = 0, 1, 2, 3 విలువల ఉపకర్పరాలు s, p, d, f లు ఉంటాయి.


32. మూడు p - ఆర్బిటాళ్లు సమానమైన శక్తిని కలిగి ఉంటాయా? (AS - 1) (1 Mark)
జ: ఒక ఉపకర్పంలోని ఆర్బిటాళ్లన్నీ ఒకే శక్తి కలిగి ఉంటాయి. అంటే మూడు p - ఆర్బిటాళ్లు సమానమైన శక్తిని కలిగి ఉంటాయి.


33. హీలియం (He) (Z = 2) లో ఉన్న రెండు ఎలక్ట్రాన్‌లు ఎలా అమరి ఉంటాయి? (AS - 1) (1 Mark)
జ: హీలియం (He) (Z = 2) లో ఉన్న రెండు ఎలక్ట్రాన్‌ల ఎలక్ట్రాన్ విన్యాసం.
         1s2 (లేదా) 

* హీలియం పరమాణువులోని రెండు ఎలక్ట్రాన్లలో మొదటి ఎలక్ట్రాన్ 1s ఆర్బిటాల్‌ను ఆక్రమిస్తుంది. రెండో ఎలక్ట్రాన్ 1s ఆర్బిటాల్‌లోని మొదటి ఎలక్ట్రాన్‌తో జతకూడుతుంది. అంటే He భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం 1s2.
 

34. ఒక ఆర్బిటాల్‌లో గరిష్ఠంగా ఎన్ని ఎలక్ట్రాన్‌లు ఉండొచ్చు?(AS - 1) (1 Mark)
జ: ఒక ఆర్బిటాల్‌లో గరిష్ఠంగా వ్యతిరేక స్పిన్‌లున్న రెండు ఎలక్ట్రాన్‌లను ఉంచవచ్చు.


35. కార్బన్ (Z = 6) లో ఏ p - ఆర్బిటాల్‌లోకి 6వ ఎలక్ట్రాన్ చేరుతుంది? (AS - 1) (1 Mark)
జ: కార్బన్ (C) (Z = 6) పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2
* ఇందులో మొదటి నాలుగు ఎలక్ట్రాన్‌లు 1s, 2s ఆర్బిటాళ్లను ఆక్రమిస్తాయి. ఆ తర్వాత రెండు ఎలక్ట్రాన్‌లు వేర్వేరు p ఆర్బిటాళ్లను ఆక్రమిస్తాయి.
* ఆ రెండు ఎలక్ట్రాన్‌ల స్పిన్ ఒకే విధంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ విన్యాసం ఇలా ఉంటుంది.
     


36. ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్‌లోని ఒంటరి ఎలక్ట్రాన్‌తో జతకూడుతుందా? ఖాళీగా ఉన్న వేరొక p ఆర్బిటాల్‌ను ఆక్రమిస్తుందా?(AS - 1) (1 Mark)
జ: ఖాళీగా ఉన్న వేరొక p ఆర్బిటాల్‌ను ఆక్రమిస్తుంది.

కృత్యాలు

1. కాంతి తరంగ స్వభావాన్ని తెలిపే కృత్యాన్ని వివరించండి. (AS - 3) (4 Marks)
జ: 
* ఒక నిశ్చలమైన నీటి కొలనులోకి రాయిని విసిరినప్పుడు, అది పడిన చోటు నుంచి అలలు ఏర్పడటం మనం గమనిస్తాం. ఈ అలజడి, నీటి ఉపరితలంపై తరంగ రూపంలో అన్ని దిశల్లో ప్రసరిస్తుంది.
* ఒక విద్యుదావేశం కంపించినప్పుడు విద్యుదయస్కాంత తరంగాలు ఏర్పడతాయి.
* విద్యుదావేశం చుట్టూ కంపించే విద్యుదయస్కాంత క్షేత్రాలు, శూన్యం ద్వారా ప్రయాణించి తరంగ రూపంలోకి ఎలా మారతాయో తెలుసుకుందాం.
* ఏదైనా విద్యుదావేశం కంపిస్తూ ఉంటే అది తన చుట్టూ ఉండే విద్యుత్ క్షేత్రంలో మార్పు కలిగిస్తుంది. మారుతున్న ఈ విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రంలో మార్పును తీసుకు వస్తుంది.
* ప్రసార దిశకు లంబంగా, ఒకదానికొకటి లంబ దిశలో ఉండేలా విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు ఏర్పడే ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.
* మనం చూసే దృగ్గోచర కాంతి కూడా ఒక విద్యుదయస్కాంత తరంగమే. అంతరాళంలో కాంతి (C) 3 × 108 మీ./సె. వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది.

 

2. వివిధ మూలకాలు ఒకేరకమైన జ్వాలపై మండుతున్నప్పుడు వేర్వేరు రంగులు ఏర్పడతాయి అనే విషయాన్ని నిర్దారించే కృత్యాన్ని రాయండి. (AS - 3) (4 Marks)
జ: * చిటికెడు క్యుప్రిక్ క్లోరైడ్‌ను వాచ్ గ్లాసులోకి తీసుకుని, గాఢహైడ్రో క్లోరికామ్లాన్ని కలిపి ముద్దలా చేయండి.
ఒక ప్లాటినం తీగ చివరను రింగులా మడిచి లూప్‌గా చేసిదానిపై ముద్దని తీసుకుని జ్వాలపై పెట్టాలి.
ఆకుపచ్చని రంగు మంట కనిపిస్తుంది.
పై కృత్యాన్ని స్ట్రాన్షియం క్లోరైడ్‌తో చేస్తే ఎరుపు రంగు మంట కనిపిస్తుంది. అంటే వివిధ రకాల మూలకాలు ఒకే రకమైన జ్వాలపై మండుతున్నప్పుడు వేర్వేరు రంగులు ఏర్పడతాయి.


3. కింద ఇచ్చిన మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలని పట్టికలో రాయండి. (AS - 3) (4 Marks)

జ:

అదనపు ప్రశ్నలు - జవాబులు
I. విషయావగాహన

1. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? (2 మార్కులు)
జ: 
* ఇంద్రధనుస్సులో వరుసగా ఉదా (Violet), నీలిమందురంగు (Indigo), నీలం (Blue), ఆకుపచ్చ (Green), పసుపు (Yellow), నారింజ రంగు (Orange), ఎరుపు (Red) అనే ఏడు రంగులు (VIBGYOR) ఉంటాయి.
* ప్రతి రంగూ దాని తర్వాత రంగుతో కలిసిపోయి అవిచ్ఛిన్నంగా ఉండే రంగుల పట్టీ రూపంలో ఉంటుంది.
* ప్రతి రంగు తీవ్రత ఒక బిందువు నుంచి మరొక బిందువుకు మారుతూ ఉంటుంది.


2. విద్యుదయస్కాంత తరంగాలు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి? (ఒక మార్కు)
జ: విద్యుదావేశం కంపిస్తూ ఉంటే విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయి.


3. విద్యుదయస్కాంత తరంగ వేగం ఎంత? (ఒక మార్కు)
జ: మనం చూసే దృగ్గోచర కాంతి కూడా ఒక విద్యుదయస్కాంత తరంగమే. అంతరాళంలో కాంతి (C) 3 × 108 మీ. /సె. వేగంతో ప్రయాణిస్తుంది.

 

4. విద్యుదయస్కాంత తరంగం ఏ లక్షణాలను కలిగి ఉంటుంది? (4 మార్కులు)
జ: శూన్యం ద్వారా విద్యుదయస్కాంత వికిరణ శక్తి ప్రయాణం సముద్రంలో నీటితరంగాల ప్రయాణాన్ని పోలి ఉంటుంది. సముద్ర అలల మాదిరిగానే విద్యుదస్కాంత శక్తి వికిరణాన్ని కూడా తరంగదైర్ఘ్యం
(λ), పౌనఃపున్యం (υ) అనే లక్షణాల ద్వారా వివరించవచ్చు.
ఒక తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య దూరం లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని ఆ తరంగం తరంగదైర్ఘ్యం 
(λ) అంటారు.
ఒక సెకను కాలంలో, ఒక బిందువు నుంచి ప్రయాణించిన తరంగాల (శృంగాలు/ద్రోణులు) సంఖ్యను పౌనఃపున్యం
(υ) అంటారు.
పౌనఃపున్యాన్ని 1/s లేదా s-1 ప్రమాణాల్లో వ్యక్తపరుస్తారు. తరంగదైర్ఘ్యం
(λ), పౌనఃపున్యం (υ), కాంతివేగం (c) ల మధ్య సంబంధాన్ని కింది విధంగా చెప్పవచ్చు.
   

 లేదా c = υλ


5. విద్యుదయస్కాంత తరంగం అంటే ఏమిటి? ప్రకృతిలో దృగ్గోచర వర్ణపటానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. (2 మార్కులు)
జ: విద్యుదస్కాంత తరంగాలు విస్తృత వైవిధ్యం ఉన్న పౌనఃపున్యాల సముదాయం. విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌనఃపున్యాల సముదాయాన్నే విద్యుదస్కాంత వర్ణపటం
(electromagnetic spectrum) అంటారు.
ప్రకృతిలో దృగ్గోచర వర్ణపటానికి ఇంద్రధనస్సు ఏర్పడటం ఒక చక్కని ఉదాహరణ.

ఇంద్రధనస్సులోని ప్రతీ రంగు ఒక నిర్దిష్ట తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది.
వర్ణపటంలో ఎరుపు రంగు (ఎక్కువ తరంగదైర్ఘ్యం) నుంచి ఊదా రంగు (తక్కువ తరంగదైర్ఘ్యం) వరకు రంగులు విస్తరించి ఉంటాయి.


6. 'దృశ్యకాంతి' అంటే ఏమిటి? (ఒక మార్కు)
జ: మానవుడి కంటితో చూడగలిగే రంగుల (తరంగదైర్ఘ్యాలు) సముదాయాన్ని దృశ్యకాంతి
(visible light) అంటారు.
ఎరుపు రంగు నుంచి ఊదా రంగు వరకు ఉన్న తరంగదైర్ఘ్య సముదాయాన్ని దృగ్గోచ్చరకాంతి వర్ణపటం
(visible spectrum) అంటారు.


7. 'విద్యుదయస్కాంత వర్ణపటం' అంటే ఏమిటో విశదీకరించండి. (2 మార్కులు)
జ: విద్యుదయస్కాంత వర్ణపటం
(Electromagnetic spectrum)
విద్యుదయస్కాంత తరంగాలను వివిధ తరంగదైర్ఘ్యాల సముదాయంగా చెప్పవచ్చు.
విద్యుదయస్కాంత వర్ణపటంలో తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న గామా కిరణాల నుంచి అధిక తరంగదైర్ఘ్యం ఉన్న రేడియో కిరణాల వరకు ఉంటాయి. కానీ మన కళ్లు దృగ్గోచర వర్ణపట తరంగదైర్ఘ్యాలను మాత్రమే గుర్తించగలుగుతాయి.


8. మాక్స్‌ ప్లాంక్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని వర్ణించండి. (4 మార్కులు)
జ: విద్యుదయస్కాంత శక్తిని 'అవిచ్ఛిన్న శక్తి'గా నమ్మే సంప్రదాయక భావనను ఆధారంగా చేసుకుని శక్తి శోషణం లేదా ఉద్గారం ఎల్లప్పుడూ
(hυకి) పూర్ణాంక గుణిజాలుగా ఉంటుందని మాక్స్‌ప్లాంక్ ప్రతిపాదించాడు.
ఉదా:
hυ, 2hυ, 3hυ, ... nhυ.
ఒక నిర్దిష్ట పౌనఃపున్యానికి ఉండే శక్తిని E = hυ సమీకరణంలో సూచించవచ్చు. ఇందులో, 'h' అనేది ప్లాంక్ స్థిరాంకం. దీని విలువ 6.626 × 10-34 Js, 'υ' అనేది ఉద్గారమైన లేదా శోషితమైన వికిరణ పౌనఃపున్యం.

నీలం రంగు (తక్కువ తరంగదైర్ఘ్యం లేదా ఎక్కువ పౌనఃపున్యం) శక్తి తక్కువ. అంటే ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ ఒక పదార్థం నుంచి వెలువడే శక్తి పెరుగుతుందన్నమాట.
ప్లాంక్ సిద్ధాంత ప్రతిపాదనల్లో విశిష్టత ఏమిటంటే విద్యుదయస్కాంత శక్తి శోషణం లేదా ఉద్గారం అనేది అవిచ్ఛిన్న రూపంలో కాకుండా, నిర్దిష్ట విలువలున్న భాగాలుగా ఉంటుంది. కాబట్టి, ఉద్గార లేదా శోషణ కాంతి వర్ణపటం అనేది తరంగదైర్ఘ్యాల సముదాయంగా పేర్కొనవచ్చు.


9. బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాను - దాని పరిమితులను రాయండి. (4 మార్కులు)
జ: బోర్ ప్రతిపాదనలు:
పరమాణువుల్లో ఎలక్ట్రాన్‌లు, కేంద్రకం నుంచి నిర్దిష్ట దూరాల్లో ఉన్న నియమిత శక్తి స్థాయులు లేదా స్థిర కర్పరాల్లో ఉంటాయి.
ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయి (భూస్థాయి) నుంచి ఎక్కువ శక్తిస్థాయి (ఉత్తేజిత స్థాయి)లోకి వెళ్లినప్పుడు శక్తిని గ్రహిస్తుంది. అదేవిధంగా ఎక్కువ శక్తి స్థాయి నుంచి తక్కువ శక్తి స్థాయికి దూకినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది.
పరమాణువుల్లోని ఎలక్ట్రాన్‌లకు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి. అవి E1, E2, E3 అంటే ఎలక్ట్రాన్‌ల శక్తి క్వాంటీకరణం చెంది ఉంటుందన్నమాట. ఈ శక్తులకు సంబంధించిన స్థాయులను స్థిరస్థాయులు
(Stationary states) అని, వీటికుండే శక్తి విలువలను శక్తిస్థాయులు (energy levels) అని అంటారు.

ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినప్పుడు అది ఎక్కువ శక్తి స్థాయికి చేరుతుంది. అప్పుడు ఎలక్ట్రాన్‌ను ఉత్తేజిత స్థాయిలో ఉందంటారు.
ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయి
(Excited state)లో ఎక్కువ కాలం ఉండలేదు. అది శక్తిని కోల్పోయి తిరిగి భూస్థాయికి చేరుకుంటుంది. ఇలా ఎలక్ట్రాన్ కోల్పోయిన శక్తి విద్యుదయస్కాంత శక్తి రూపంలో విడుదలవుతుంది. ఇది నిర్దిష్ట తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ తరంగదైర్ఘ్యం దృగ్గోచ్చర వర్ణపట తరంగదైర్ఘ్య అవధిలో ఉంటే అది వర్ణపటంలో ఉద్గార రేఖ (emission line)గా కనిపిస్తుంది.
పరిమితులు 
(Limitations):
బోర్ నమూనా, హైడ్రోజన్ వర్ణపటంలో కనిపించే రేఖలను గురించి వివరించగలిగింది. హైడ్రోజన్ పరమాణువుకు సంబంధించిన రేఖావర్ణపటాన్ని వివరించడానికి బోర్ నమూనాను ఒక విజయవంతమైన నమూనాగా పేర్కొనవచ్చు.
అయితే హైడ్రోజన్ రేఖా వర్ణపటాన్ని అధిక సామర్థ్యం ఉన్న వర్ణపటదర్శిని
(Spectroscope)తో పరిశీలించినప్పుడు కొన్ని ఉపరేఖల సమూహాలు కనిపించాయి.
రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవటాన్ని బోర్ నమూనా వివరించలేకపోయింది.

 

10. బోర్ - సోమర్‌ఫెల్డ్ పరమాణు నమూనాను వర్ణించి దాని పరిమితులను పేర్కొనండి. (4 మార్కులు)
జ: బోర్ - సోమర్‌ఫెల్డ్ పరమాణు నమూనా
(Bohr - Sommerfeld model of an atom)


(ప్రధాన క్వాంటం సంఖ్యలకు అనుమతించిన ఎలక్ట్రాన్ కక్ష్యల బోర్ - సోమర్‌ఫెల్డ్ నమూనా)
* రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలు
(finer lines)గా విడిపోవడాన్ని విశదీకరించేందుకు సోమర్‌ఫెల్డ్, బోర్ నమూనాని స్వల్పంగా ఆధునీకరించాడు. అతడు దీర్ఘవృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టాడు.
* బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యను అలాగే ఉంచుతూ, రెండో కక్ష్యకు ఒక దీర్ఘవృత్తాకార కక్ష్య, మూడో కక్ష్యకు రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలుపుతూ, పరమాణువు కేంద్రకం ఈ దీర్ఘవృత్తాకార కక్ష్య రెండు ప్రధాన నాభిలలో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు.
* ఒక కేంద్రబలం ప్రభావానికిలోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం దీర్ఘవృత్తాకార కక్ష్యల ఏర్పాటుకు దారితీస్తుందనే విషయం సోమర్ ఫెల్డ్ ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది.

పరిమితులు:
బోర్ - సోమర్‌ఫెల్డ్ నమూనా హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని సూక్ష్మరేఖలను
(finer lines) గురించి వివరించగలిగినప్పటికీ, పరమాణు నిర్మాణం గురించి పూర్తిగా వివరించలేకపోయింది.
ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్‌లున్న పరమాణువుల యొక్క పరమాణు వర్ణపటాలను వివరించడంలోనూ ఈ నమూనా విఫలమైంది.


11. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌లు ఎల్లప్పుడూ నిర్దిష్ట మార్గాల్లో తిరుగుతూ ఉంటాయా? (2 మార్కులు)
జ: కేంద్రకం చుట్టూ ఉన్న నిర్దిష్ట మార్గాలు లేదా కక్ష్యల్లో ఎలక్ట్రాన్‌లు పరిభ్రమిస్తూ ఉన్నట్లయితే నియమిత కాల వ్యవధుల్లో ఎలక్ట్రాన్‌ల కచ్చితమైన స్థానాన్ని తెలుసుకోవచ్చు.
చిమ్మచీకటిలో వస్తువులను వెతకడానికి మనం టార్చిలైట్ సహాయాన్ని తీసుకుంటాం. అలాగే, ఎలక్ట్రాన్ స్థానాన్ని, వేగాన్ని కనుక్కోవడానికి కూడా తగిన కాంతి సహాయాన్నే తీసుకోవచ్చు.
ఎలక్ట్రాన్‌లు అత్యంత సూక్ష్మమైనవి కాబట్టి, అతి తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతినే ఈ పని కోసం వాడుకోవాల్సి ఉంటుంది.
ఈ తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి ఎలక్ట్రాన్‌ను తాకినప్పుడు అది ఎలక్ట్రాన్ చలనాన్ని ప్రభావితం చేసి దాని చలనంలో మార్పుని కలగజేస్తుంది.
అందువల్ల, ఎలక్ట్రాన్ స్థానాన్ని, వేగాన్ని కచ్చితంగా ఒకేసారి కనుక్కోలేం.
పై విషయాల ఆధారంగా, పరమాణువులో ఎలక్ట్రాన్‌లు నిర్దిష్టమైన మార్గంలో తిరగవని తెలుస్తుంది.

 

12. ఆర్బిట్ - ఆర్బిటాల్ మధ్య తేడాలు తెలపండి. (4 మార్కులు)
జ: 

ఆర్బిట్ ఆర్బిటాల్
కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాను తిరిగే నిర్దిష్ట మార్గాన్ని ఆర్బిట్ అంటారు ఎలక్ట్రాన్‌ను కనుక్కునే సంభావ్యత ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని పరమాణు ఆర్బిటాల్ అంటారు
ఆర్బిట్ ద్విమితీయంగా ఉంటుంది ఆర్బిటాల్ త్రిమితీయంగా ఉంటుంది.
ప్రధాన క్వాంటం సంఖ్య ఆర్బిట్‌ను తెలుపుతుంది. అయస్కాంత క్వాంటం సంఖ్య ఆర్బిటాల్‌ను తెలుపుతుంది.
ఆర్బిట్‌లో ఎలక్ట్రాన్ వేగాన్ని, స్థానాన్ని కనుక్కోవచ్చు. ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాను వేగాన్ని, స్థానాన్ని ఒకేసారి కనుక్కోలేం.
ఆర్బిట్‌లు అన్నీ వృత్తాకారంగానే ఉంటాయి. ఆర్బిటాల్ ఆకారం అజిముతల్ క్వాంటం సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. 

13. ప్రధాన క్వాంటం సంఖ్య ఏం తెలియజేస్తుంది?(4 మార్కులు)
జ: * ప్రధాన క్వాంటం సంఖ్య
 (Principle Quantum Number) (n):
ప్రధాన క్వాంటం సంఖ్య ఆర్బిట్ లేదా ప్రధాన కర్పర పరిమాణం, దాని శక్తిని గురించి తెలుపుతుంది. దీన్ని 'n'తో సూచిస్తాం.
ప్రధాన క్వాంటం సంఖ్య (n) (n = 1, 2, 3,....) ధనపూర్ణాంక విలువలను కలిగి ఉంటుంది. n విలువ పెరిగేకొద్దీ, ఆర్బిటాల్ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అలాగే, అందులోని ఎలక్ట్రాన్‌లకు కేంద్రకానికి మధ్య దూరం కూడా పెరుగుతుంది.
n విలువలో పెరుగుదల శక్తి స్థాయిలో పెరుగుదలను సూచిస్తుంది.
n = 1, 2, 3,.... విలువలున్న స్థాయులను K, L, M, ...లతో కూడా సూచిస్తారు. ప్రతి 'n' విలువకు ఒక ప్రధాన కర్పరం ఉంటుంది.

కర్పరం K L M N
n 1 2 3 4

14. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య గురించి మీకు తెలిసిన సమచారం రాయండి. (4 మార్కులు)
జ: * కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య
(l) (The angular momentum quantum number) :
ఈ క్వాంటం సంఖ్యను 'l' అనే అక్షరంతో సూచిస్తారు. ప్రధాన క్వాంటం సంఖ్య (n) విలువకు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య lకు, 0 నుంచి (n - 1) వరకు విలువలు ఉంటాయి. ప్రతి 'l' విలువ ఒక ఉప కర్పరాన్ని సూచిస్తుంది.
ప్రతి 'l' విలువ కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే ఒక నిర్దిష్ట ఉపకర్పరం ఆకృతిని గురించి తెలుపుతుంది.
ఒక ఆర్బిటాల్ లేదా ఉపకర్పరాలకు సంబంధించిన l విలువలను సాధారణంగా s, p, d,... సంకేతాలతో సూచిస్తారు.

l 0 1 2 3
ఆర్బిటాల్ పేరు s p d f

15. అయస్కాంత క్వాంటం సంఖ్య (n) ప్రాముఖ్యాన్ని వివరించండి. (4 మార్కులు)
జ: * అయస్కాంత క్వాంటం సంఖ్య
(ml) (The Magnetic quantum number)
అయస్కాంత క్వాంటం సంఖ్యను mlతో సూచిస్తారు.
అయస్కాంత క్వాంటం సంఖ్య ml 0తో కలిపి -l నుంచి +l మధ్య పూర్ణాంక విలువలను కలిగి ఉంటుంది. అంటే ఒక నిర్దిష్ట l విలువలకు అయస్కాంత క్వాంటం సంఖ్య ml కు (2l + 1) విలువలను కలిగి ఉంటుంది. వాటిని కిందివిధంగా సూచించవచ్చు.

-l, (-l + 1), 0, 1, (+l -1), +l
ఇది పరమాణువులోని ఆర్బిటాళ్ల ప్రాదేశిక దృగ్విన్యాసాన్ని (Spatial Orientation) తెలుపుతుంది. ఈ క్వాంటం సంఖ్య విలువలు, పరమాణువులో ఒక ఆర్బిటాల్ వేరొక ఆర్బిటాల్‌తో పోల్చినప్పుడు ప్రాదేశికంగా ఏ విధంగా అమర్చబడి ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది.
* l = 0 అయితే, (2l + 1) = 1 అవుతుంది. ml ఒకటే విలువ కలిగి ఉంటుంది. అప్పుడు 1s అనే ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది.
* l = 1 అయితే, (2l + 1) = 3, అంటే ml కు మూడు విలువలు ఉంటాయి. అవి, -1, 0, 1 అప్పుడు x, y, z అక్షాల వెంబడి మూడు విధాలుగా అమర్చబడిన px, py, pz అనే మూడు p - ఆర్బిటాళ్లు ఉంటాయి.

 

16. p - ఆర్బిటాళ్లన్నీ సమానమైన శక్తిని కలిగి ఉంటాయా? (2 మార్కులు)

జ: * ml ఒక పరమాణువులో ఉండే విలువల సంఖ్య ఒక నిర్దిష్ట l విలువకు దానికి సంబంధించిన ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ల సంఖ్యని సూచిస్తుంది.
* ఒక ఉపకర్పరంలోని ఆర్బిటాళ్లన్నీ ఒకే శక్తిని కలిగి ఉంటాయి. అంటే p - ఆర్బిటాళ్లన్నీ సమానమైన శక్తిని కలిగి ఉంటాయి.

 

17. (2l + 1) సూత్రాన్ని ఉపయోగించి ఇచ్చిన 'l' విలువకు ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ల సంఖ్యను పట్టికలో రాయండి. (2 మార్కులు)


 

18. వివిధ ఉపకర్పరాల్లో గరిష్ఠంగా ఉండగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్యలను ఒక పట్టికలో సూచించండి. (4 మార్కులు)
జ:


 

19. స్పిన్ క్వాంటం సంఖ్యను ఎందుకు ప్రవేశపెట్టారు. దీని ఆవశ్యకతను తెలపండి. (2 మార్కులు)
జ: 
* మూడు క్వాంటం సంఖ్యలు n, l, ml లు వరుసగా పరమాణు ఆర్బిటాల్ పరిమాణం (శక్తి), ఆకృతి, వాటి అమరికను తెలుపుతాయి.
* పసుపు రంగు కాంతిని వెలువరిస్తున్న వీధి దీపాలను
(Sodium Vapor Lamp) మీరు గమనించే ఉంటారు.
* ఈ పసుపు కాంతిని అధిక రిజల్యూషన్ ఉన్న వర్ణపటమాపని
(spectroscope) తో పరిశీలించినట్లయితే అందులో చాలా దగ్గరగా ఉన్న రెండు రేఖలు (Doublet) కనిపిస్తాయి.
క్షార, క్షార మృత్తిక లోహాల వర్ణపటాల్లో ఇలాంటి రేఖలు కనిపిస్తాయి.
ఎలక్ట్రాన్ ఈ ప్రవర్తనను వివరించేందుకు అదనంగా నాలుగో క్వాంటం సంఖ్య ప్రతిపాదించబడింది. అదే స్పిన్ క్వాంటం సంఖ్య. ఇది ఎలక్ట్రాన్ అభిలక్షణాలను వివరించడానికి తోడ్పడుతుంది. దీన్ని ms తో సూచిస్తారు.


20. స్పిన్ క్వాంటం సంఖ్య ఏం తెలియజేస్తుంది? దీని ప్రాముఖ్యాన్ని పేర్కొనండి. (2 మార్కులు)
జ: ఈ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్ స్పిన్‌కు ఉండే రెండు రకాల దృగ్విన్యాసాలని
(orientations) సూచిస్తుంది. అవి ఒకటి సవ్యదిశలో ఉండే స్పిన్ (+  ), మరొకటి అపసవ్య దిశలో ఉండే స్పిన్ ( -  ).
ఎలక్ట్రాన్‌లకు రెండు రకాల స్పిన్ విలువలు ధనాత్మకం అయితే ఆ స్పిన్‌లు సమాంతరంగా లేకపోతే వ్యతిరేక దిశల్లో ఉంటాయి.
బహు ఎలక్ట్రాన్‌లు ఉన్న పరమాణువుల్లో ఒక నిర్దిష్ట ఆర్బిటాళ్లలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్‌లు ఉన్నప్పుడు వాటి దృగ్విన్యాసాలను స్పిన్ క్వాంటం సంఖ్య వివరిస్తుంది.


21. ఎలక్ట్రానిక్ విన్యాసం అంటే ఏమిటి? హైడ్రోజన్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఎలా సూచిస్తారు?
జ: ఎలక్ట్రాన్ విన్యాసం: పరమాణువులోని కర్బరాలు, ఉపకర్పరాలు, ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌ల పంపిణీని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు.
హైడ్రోజన్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం: ఒక పరమాణువులో ఎలక్ట్రాన్‌ల అమరికను తేలికగా అవగాహన చేసుకోవడానికి ఒకే ఎలక్ట్రాన్ ఉన్న హైడ్రోజన్ పరమాణువును ఉదాహరణగా తీసుకుని పరిశీలిద్దాం.

ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే సంక్షిప్త సంకేతంలో ప్రధాన శక్తి స్థాయి (n విలువ), ఉపశక్తిస్థాయి (1 విలువ), ఉపశక్తి స్థాయిలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య (x విలువ)లు ఉంటాయి. వాటిని కింది విధంగా రాస్తారు.
                                                        nlx
ఉదాహరణకు హైడ్రోజన్ (H) పరమాణువును తీసుకుంటే, దాని పరమాణు సంఖ్య ఒకటి (Z = 1), అప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని 1s1 అని రాయాలి. 

ఎలక్ట్రాన్ విన్యాసంలో ఎలక్ట్రాన్ స్పిన్‌ని కూడా సూచించవచ్చు.
హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్ కలిగి ఉండే క్వాంటం సంఖ్యా సమితి ఈ విలువలను కలిగి ఉంటుంది.

n = 1, l = 0, ml = 0, ms =    


22. పౌలీవర్జన నియమం రాసి, దాన్ని వివరించండి. (4 మార్కులు)
జ: పౌలీవర్జన నియమం: ఒకే పరమాణువుకు చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్‌లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు.

వివరణ: హీలియం పరమాణువులో రెండు ఎలక్ట్రాన్‌లు ఉంటాయి. మొదటి ఎలక్ట్రాన్ 1s1 ఆర్బిటాల్‌ను ఆక్రమిస్తుంది. రెండో ఎలక్ట్రాన్ 1s ఆర్బిటాల్‌లోని మొదటి ఎలక్ట్రాన్‌తో జతకూడుతుంది. అంటే He భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం 1s2.
హీలియం పరమాణువులోని రెండు ఎలక్ట్రాన్‌లు 1s ఆర్బిటాల్‌లోనే ఉన్నాయి కాబట్టి వాటి n, l, ml విలువలు సమానంగా ఉంటాయి. అంటే ms తప్పనిసరిగా వేరుగా ఉండాలి. అంటే He పరమాణువులో ఎలక్ట్రాన్‌ల స్పిన్‌లు జతకూడాలి.
జంట స్పిన్‌లు ఉండే ఎలక్ట్రాన్‌లను  తో సూచిస్తారు. ఒక ఎలక్ట్రాన్ ms = +  అయితే రెండో ఎలక్ట్రాన్
ms = -  అవుతుంది. అంటే ఒకే ఆర్బిటాల్‌లోని రెండు ఎలక్ట్రాన్‌ల స్పిన్‌లు వ్యతిరేక దిశలో ఉంటాయి.
ఒక ఆర్బిటాల్‌లో గరిష్ఠంగా ఉంచగలిగే ఎలక్ట్రాన్‌ల సంఖ్యను తెలియజేయడానికి పౌలీవర్జన నియమం ఉపయోగపడుతుంది.
ఒక ఆర్బిటాల్‌కి కేవలం రెండు ms విలువలు మాత్రమే అనుమతించబడతాయి. కాబట్టి ప్రతి ఆర్బిటాల్‌లో గరిష్ఠంగా వ్యతిరేక స్పిన్‌లున్న రెండు ఎలక్ట్రాన్‌లు మాత్రమే ఉంటాయి.
అందువల్ల హీలియం (He) పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఈ విధంగా సూచించవచ్చు. 

23. పరమాణువులోని ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌లు నిండే క్రమంలో ఆఫ్‌బౌ నియమం ఏవిధంగా సహాయపడుతుందో వివరించండి?  (4 మార్కులు)
జ: ఆఫ్‌బౌ నియమం: ఎలక్ట్రాన్ అతి తక్కువ శక్తి ఉండే ఆర్బిటాల్‌ను ముందుగా ఆక్రమిస్తుంది.
వివరణ: * పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో ఒక మూలకం నుంచి మరొక మూలకానికి వెళుతున్న కొద్దీ పరమాణు ఆర్బిటాళ్లలో ఒక్కో ఎలక్ట్రాన్ కలుస్తూనే ఉంటుంది. ఒక కర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్యను 2n2తో సూచిస్తారు. దీనిలో 'n' ప్రధాన క్వాంటం సంఖ్య.
ఒక ఉపకర్పరం (s, p, d, f)లో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్‌ల సంఖ్య 2(2l + 1)తో సూచిస్తారు. ఇక్కడ l = 0, 1, 2, 3, .... విలువలు కలిగి ఉంటుంది. ఈ సూత్రం ఆధారంగా గరిష్ఠంగా వివిధ ఉపకర్పరాల్లో వరుసగా 2, 6, 10, 14 ఎలక్ట్రాన్లు ఉంటాయి.
పరమాణువు భూస్థాయిలో ఉన్నపుడు ఎలక్ట్రాన్‌లు అతి తక్కువ శక్తి ఉండే ఆర్బిటాల్‌లో చేరుతూ అలా మొత్తం ఎలక్ట్రాన్‌ల సంఖ్య పరమాణు సంఖ్యకు సమానం అయ్యే వరకు నిండేలా దాని ఎలక్ట్రాన్ విన్యాసం నిర్మితమవుతుంది. దీన్నే ఆఫ్‌బౌ నియమం అంటారు.
ఆఫ్ బౌ నియమం (జర్మనీ భాషలో 'ఆఫ్‌బౌ' అంటే ఊర్థ్వ నిర్మాణం అని అర్థం.) ప్రకారం పరమాణువులోని ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌లు నిండే క్రమం ఆర్బిటాళ్ల ఆరోహణ శక్తి క్రమంలో ఉంటుంది.
ఈ నియమం ద్వారా ఒక పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయడానికి రెండు సూత్రాలు సహాయపడతాయి.

ఎలక్ట్రాన్‌లు వివిధ ఆర్బిటాళ్లలో ఆయా ఆర్బిటాళ్లు (n + l) విలువలు పెరిగే క్రమంలో నిండుతాయి.
ఒకవేళ (n + l) విలువలు సమానంగా ఉన్నట్లయితే n విలువ తక్కువగా ఉండే ఉపకర్పరాన్ని ఎలక్ట్రాన్‌లు ముందుగా ఆక్రమిస్తాయి.


24. హుండ్ నియమం పేర్కొని, కార్బన్ పరమాణువులోని ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌లు ఎలా నిండుతాయో ఉదాహరణసహితంగా రాయండి.
జ: హుండ్ నియమం
(Hund's Rule):
ఈ నియమం ప్రకారం సమాన శక్తి ఉన్న అన్ని ఖాళీ ఆర్బిటాళ్లు (Degenerate Orbitals) ఒక్కో ఎలక్ట్రాన్‌తో నిండిన తర్వాతనే అవి జతకూడటం ప్రారంభిస్తాయి. అంటే 'సమశక్తి' ఆర్బిటాళ్లలో రెండు ఎలక్ట్రాన్‌లు చేరడానికి ముందే ప్రతీదానిలో ఒక్కో ఎలక్ట్రాన్ నిండి ఉండాలి అని చెప్పవచ్చు.
కార్బన్ పరమాణువు: కార్బన్ (C) (Z = 6) పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2. ఇందులో మొదటి నాలుగు ఎలక్ట్రాన్‌లు 1s, 2s ఆర్బిటాళ్లలోకి చేరతాయి. తర్వాతి రెండు ఎలక్ట్రాన్‌లు వేర్వేరు p ఆర్బిటాళ్లను ఆక్రమిస్తాయి. ఆ రెండు ఎలక్ట్రానుల స్పిన్ ఒకేవిధంగా ఉంటుంది. సౌలభ్యం కోసం ఇలా పైకే గుర్తించాలి.
                                
ఇక్కడ 2p ఆర్బిటాళ్లలో ఉన్న రెండు ఒంటరి ఎలక్ట్రాన్లని సమాంతర స్పిన్‌లు కలిగి ఉన్నట్లు చూపించారు.

 

25. విద్యుదయస్కాంత తరంగం పటం గీసి, భాగాలు గుర్తించండి. (4 మార్కులు)

జ:

26. విద్యుదయస్కాంత వర్ణపటం గీసి దానిలోని భిన్న వికిరణాల తరంగదైర్ఘ్యాలను గుర్తించండి. (4 మార్కులు)
:

27. హైడ్రోజన్ వర్ణపటం గీయండి. (2 మార్కులు)
జ:
                


                        హైడ్రోజన్ వర్ణపటం


28. s, p ఉపకర్పరాల్లోని ఆర్బిటాళ్ల జ్యామితీయ ఆకృతులను గీయండి.  (4 మార్కులు)
జ:

 s - ఆర్బిటాల్ గోళాకారంలో ఉంటుంది. p - ఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది.

 

29. d - ఉపకర్పరంలోని ఆర్బిటాళ్ల జ్యామితీయ ఆకృతులను గీయండి. (2 మార్కులు)

జ:

d ఆర్బిటాళ్లు డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది.


30. పరమాణు సంఖ్య విలువ పెరిగే క్రమంలో కొన్ని మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం, ఆర్బిటాల్ చిత్ర పటాలు గీయండి.  (4 మార్కులు)
జ: పరమాణు సంఖ్య విలువ పెరిగే క్రమంలో కొన్ని మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం, ఆర్బిటాల్ చిత్రపటాలు కింద ఇచ్చారు.

 

31. (n + l) విలువలు పెరిగే క్రమాన్ని పటరూపంలో చూపించండి. (మోలర్ చార్టు) (4 మార్కులు)

జ:   l =   l = 1   l =   l = 3


(n + l) విలువలు పెరిగే క్రమాన్ని చూపే పటం
*
(n+ l) విలువలు పెరిగే క్రమాన్ని పటంలో చూడవచ్చు. ఆరోహణ క్రమంలో పరమాణు ఆర్బిటాళ్ల వివిధ శక్తిస్థాయులు.
1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d < 4p < 5s < 4d < 5p < 6s < 4f < 5d < 6p < 7s < 5f < 6d < 7p < 8s...

32. కర్పరాలు, ఉపకర్పరాలు, ఉపకర్పరాల్లోని ఆర్బిటాళ్ల సంఖ్యను పట్టికలో చూపండి. (4 మార్కులు)
జ:

Posted Date : 20-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం