• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 

     సర్.సి.వి.రామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లి గ్రామంలో 1888, నవంబరు 7న జన్మించారు. వివర్తన పట్టికలు గమనించి పట్టకంతో ప్రయోగం చేయడం అతడి జీవితంలో తొలి పరిశోధనా పత్రానికి నాంది అయ్యింది. అప్పటికే రామన్ బి.ఎ. విద్యార్థి. వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్యాలపై పరిశోధనలు చేశారు. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఫలితం ప్రకటించారు. దీనికి 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా పాటిస్తున్నారు. రామన్ 1970 నవంబరు 21న మరణించారు.

కీలక పదాలు

* కటకం

* నాభ్యంతరం

* నాభి

* దృక్ కేంద్రం

* ప్రధానాక్షం

* వక్రతావ్యాసార్ధం

* వక్రతా కేంద్రం

* కుంభాకార కటకం

* పుటాకార కటకం

* వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

* కటక సూత్రం

* కటక తయారీ సూత్రం

కీలక పదాలు - వివరణలు
కటకం: రెండు ఉపరి తలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలూ లేదా ఏదో ఒక తలం వక్రతలమైతే ఆ పారదర్శక పదార్థాన్ని కటకం అంటారు.
నాభ్యంతరం: కటక నాభి, దృక్ కేంద్రం మధ్య దూరాన్ని కటక నాభ్యంతరం 'f' (focal length) అంటారు.
నాభి: కటకం పై పతనమైన సమాంతర కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతాయి లేదా ప్రధానాక్షంపై ఉండే ఒక బిందువు నుంచి వెలువడుతున్నట్లుగా కనిపిస్తాయి. కాంతి కిరణాలు కేంద్రీకృతమైన బిందువు లేదా కాంతి కిరణాలు వెలువడుతున్నట్లు కనిపించే బిందువును కటక నాభి అంటారు.
దృక్ కేంద్రం: కటకం మధ్య బిందువును కటక దృక్ కేంద్రం 'P' అంటారు.
ప్రధానాక్షం: కటక వక్రతా తలాల వక్రతా కేంద్రాలను కలిపే రేఖను ప్రధానాక్షం అంటారు.
వక్రతా వ్యాసార్ధం: కటకం యొక్క రెండు వక్రతలాలు రెండు గోళాలకు సంబంధించినవి. ఒక వక్రతలానికి సంబంధించిన గోళం కేంద్రాన్ని ఆ వక్రతలం యొక్క వక్రతాకేంద్రం 'C' అంటారు.
కుంభాకార కటకం: కటకం రెండు తలాలు ఉబ్బెత్తుగా ఉండి అంచుల వద్ద పలుచగా, మధ్యలో మందంగా ఉండే కటకమే కుంభాకార కటకం.
పుటాకార కటకం: కటకం రెండు తలాలు లోపలివైపునకు వంగి ఉండి, అంచుల వద్ద మందంగా, మధ్యలో పలుచగా ఉండే కటకమే పుటాకార కటకం.

వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం: సమతల ఉపరితలంపై పతనమైన కాంతిలా వక్రతలంపై పతనమైన కాంతి కూడా విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబానికి దగ్గరగా విచలనం చెందుతుంది. సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు లంబానికి దూరంగా విచలనం చెందుతుంది.

సారాంశ సంగ్రహం
*
 వక్రతలం ఏ గోళానికి సంబంధించిందో ఆ గోళ కేంద్రాన్ని వక్రతాకేంద్రం 'C' అంటారు.
* వక్రతాకేంద్రం నుంచి వక్రతలంపై ఏదైనా బిందువుకు గీసిన రేఖ ఆ బిందువు వద్ద వక్రతలానికి లంబం (Normal) అవుతుంది.
* వక్రతలంపై వివిధ బిందువులకు లంబం దిశ మారుతుంది.
* వక్రతలం యొక్క కేంద్రాన్ని ధ్రువం (Pole) P అంటారు.
* వక్రతా కేంద్రాన్ని, ధ్రువాన్ని కలిపే రేఖను ప్రధానాక్షం అంటారు.
*స్నెల్ నియమం ప్రకారం తలానికి గీసిన లంబం వెంట ప్రయాణించే కిరణం విచలనం చెందదు
* వక్రతలంపై పతనమైన కాంతి విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి ప్రయాణించేటప్పుడు లంబానికి దగ్గరగా విచలనం చెందుతుంది.
* సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా విచలనం చెందుతుంది.
* కిరణాలు ప్రధానాక్షానికి అతి దగ్గరగా ప్రయాణిస్తే ఆ కిరణాలను పారాక్సియల్ కిరణాలు (Paraxial rays) అంటారు.
* n1 వక్రీభవన గుణకం ఉన్న యానకం నుంచి n2 వక్రీభవన గుణకం ఉన్న యానకంలోకి R వక్రతా వ్యాసార్ధం ఉండే వక్రతా తలం ద్వారా ఒక కాంతికిరణం ప్రయాణిస్తున్నప్పుడు  సూత్రాన్ని వినియోగిస్తారు. ఇక్కడ u, vలు వక్రతల ధ్రువం నుంచి వస్తు, ప్రతిబింబ దూరాలు.
* రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం రెండు తలాలూ లేదా ఏదో ఒక తలం వక్రతలమైతే ఆ పారదర్శక పదార్ధాన్ని కటకం అంటారు.
* కటకాలు వివిధ రకాలుగా ఉంటాయి. కటకం రెండు తలాలు ఉబ్బెత్తుగా ఉండి, అంచుల వద్ద పలుచగా, మధ్యలో మందంగా ఉంటే దాన్ని ద్వికుంభాకార కటకం అంటారు.
* ద్విపుటాకార కటకం, సమతల పుటాకార కటకం, సమతల కుంభాకార కటకం, కుంభాకార పుటాకార కటకం లాంటివి కటకాల్లో కొన్ని రకాలు.
* మనం పలుచని కటకాల (Thin lenses) గురించి, అంటే మందం పరిగణించనవసరం లేని కటకాల గురించి మాత్రమే చర్చిస్తాం.
* కటకం రెండు వక్రతలాలు రెండు గోళాలకు సంబంధించినవి. ఒక వక్రతలానికి సంబంధించిన గోళం కేంద్రాన్ని అ వక్రతలం యొక్క వక్రతాకేంద్రం 'C' అంటారు.
* ఒక కటకానికి రెండు వక్రతలాలుంటే దాని వక్రతా కేంద్రాలను C1, C2 లతో సూచిస్తారు.
* వక్రతాకేంద్రం నుంచి వక్రతలం వరకు ఉండే దూరాన్ని వక్రతా వ్యాసార్ధం R అంటారు.
* కటకం రెండు వక్రతా వ్యాసార్ధాలను R1, R2 లతో సూచిస్తారు. 
* C1, C2లను కలిపే రేఖను ప్రధానాక్షం అంటారు.
* కటకం మధ్య బిందువును కటక దృక్ కేంద్రం P(optic centre of lens) అంటారు.
* ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కాంతి కిరణమైనా విచలనం చెందదు.
* కటక దృక్ కేంద్రం ద్వారా ప్రయాణించే కాంతి కిరణం కూడా విచలనం చెందదు.
* ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు కటక నాభి వద్ద కేంద్రీకృతమవుతాయి లేదా నాభి నుంచి వికేంద్రీకృతమవుతాయి.
* కాంతి కిరణాలు కనిష్ఠ కాలనియమాన్ని పాటిస్తాయి. కాబట్టి నాభి ద్వారా ప్రయాణించే కాంతి కిరణం వక్రీభవనం చెందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది.

*  సూత్రం కటక సూత్రం (Lens formula), ఇక్కడ f అనేది కటక నాభ్యంతరం, వస్తుదూరం = u, ప్రతిబింబ దూరం = v.
* కటక నాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడుతుంది.

ఇక్కడ n: యానకం యొక్క పరమ వక్రీభవన గుణకం, R1, R2 లు వక్రతల వ్యాసార్ధాలు.

కుంభాకార కటకం ఏర్పరిచే వస్తు ప్రతిబింబ స్థానాలు,  ప్రతిబింబ స్వభావాలు

వస్తువు స్థానం ప్రతిబింబ స్థానం ప్రతిబింబ పరిమాణం ప్రతిబింబ స్వభావం
వస్తువు అనంతదూరం నాభి (F) వద్ద ప్రతిబింబం     బిందు పరిమాణం యదార్థం
వస్తువు C2కి ఆవల ప్రతిబంబం C1, F1ల మధ్య  చిన్నది యదార్థం తలకిందులు
వస్తువు C2 వద్ద      ప్రతిబింబం C1 వద్ద వస్తువుతో సమాన పరిమాణం యదార్థం తలకిందులు
వస్తువు F2, C2ల మధ్య ప్రతిబింబం C1కి ఆవల వస్తువు కంటే పెద్ద పరిమాణం యదార్థం తలకిందులు
వస్తువు F2 వద్ద    ప్రతిబింబం అనంత దూరంలో ప్రతిబింబ పరిమాణం చర్చించలేం   ప్రతిబింబ లక్షణాలు చర్చించలేం
వస్తువును P, F2ల మధ్య      వస్తువు ఉన్న వైపునే నిటారు ప్రతిబింబం ఆవర్థనం చెందిన ప్రతిబింబం మిథ్యా ప్రతి బింబం

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

భౌతిక రసాయన శాస్త్రం

ఇతర సబ్జెక్టులు

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌