• facebook
  • whatsapp
  • telegram

అనాలజీ (పోలిక పరీక్ష)/సాదృశ్యం

పోలిక తెలిస్తే జవాబు తేలికే!

  కొత్త సినిమా చూశారు. దాని గురించి స్నేహితుడికి విశ్లేషించాలంటే, ఇద్దరూ కలిసి చూసిన ఇంకో సినిమాతో పోలుస్తూ వివరించాలి. అప్పుడే అనుకున్నది సులభంగా చెప్పగలుగుతారు. తార్కికంగా వివరించగలిగిన ఆ విధమైన శక్తిని అభ్యర్థుల్లో పరిశీలించేందుకే పోటీ పరీక్షల్లో అనాలజీ ప్రశ్నలు ఇస్తుంటారు. ప్రశ్న మొదటి భాగంలోని పోలికను పట్టుకుంటే సమాధానాన్ని తేలిగ్గా  గుర్తించవచ్చు.

 

 పోలిక పరీక్ష (అనాలజీ)లో భాగంగా రెండు జతల పదాలు ఇస్తారు. మొదటి జతలోని రెండు పదాల మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కుని అదే సంబంధాన్ని రెండో జతలోని పదానికి అనువర్తించడం ద్వారా లోపించిన పదాన్ని కనుక్కోవచ్చు. సంఖ్యాశ్రేణి, అక్షరశ్రేణి లాంటి అంశాలపై పట్టు ఉంటే ప్రశ్నలకు సమాధానాలు సులువుగా సాధించవచ్చు.

 

సాదృశ్యం ప్రధానంగా మూడు రకాలు

 

అక్షర సాదృశ్యం

ఉదా: TGIR : QJLO : : PKMN : .... 

1) NMPQ     2) MNPQ    3) MNPK    4) PKMN

జవాబు: 3

సాధన: ముందుగా మొదటి జతలో గిబిఖిళి నుంచి శీరిలివీ ఎలా వచ్చిందో చూద్దాం.

ఇప్పుడు ఇదే రకంగా రెండో పదానికి అన్వయించాలి.

* ఆంగ్ల అక్షరమాలపై పట్టు సాధించడం ద్వారా అక్షర సాదృశ్యానికి సంబంధించిన ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు.

 

సంఖ్యా సాదృశ్యం

ఉదా: 18 : 342 : : 21 : ...

1)  441    2) 462    3) 420    4) 425

జవాబు: 2 

సాధన: ముందుగా మొదటి జతలో 18 నుంచి 342 ఎలా వచ్చిందో గమనిద్దాం.

= 18 x (15 + 1)

= 18 x 19

= 342

అంటే ఇచ్చిన సంఖ్య, దాని తరువాత సంఖ్యల లబ్ధం. 

అదేవిధంగా

= 21 x (21 + 1)

= 21 x 22

= 462

* సంఖ్యా సాదృశ్యానికి సంబంధించిన ప్రశ్నలను సాధించడానికి ముందుగా అభ్యర్థికి ప్రాథమిక గణిత పరిక్రియలు, వర్గాలు, ఘనాలు, ఎక్కాలపై అవగాహన ఉండాలి.

 

పద సాదృశ్యం

ఉదా: రేడియో : శ్రోత : : సినిమా : ...

1) నిర్మాత    2) నటుడు    3) ప్రేక్షకుడు    4)  దర్శకుడు

జవాబు: 3 

సాధన: రేడియో ప్రసారాలు వినేవారు శ్రోతలు కాగా, సినిమా వీక్షించే వారిని ప్రేక్షకులు అంటారు.

* పద సాదృశ్యానికి సంబంధించి అభ్యర్థికి పలురకాలైన అంశాలపై అవగాహన ఉండాలి. 

 

ఉదా: దేశం - అధ్యక్షుడు

దేశం - రాజధాని

దేశం - కరెన్సీ

రాష్ట్రం - ముఖ్యమంత్రి/గవర్నరు

రాష్ట్రం - రాజధాని

ప్రాంతం - కట్టడాలు

భౌతికరాశి - ప్రమాణాలు

పరికరం - ఉపయోగం

శాస్త్రవేత్త - పరికరం

వ్యాధి - వ్యాధి కారకం

  వీటితోపాటు భౌతిక, రసాయన, గణిత, సాంఘిక, జీవశాస్త్రాలకు సంబంధించిన పదాలు, వాటి వివరణలపై అవగాహన ద్వారా పద సాదృశ్య ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. GRL : LKU : : KTM : .....

1) MKV   2) PMV   3) LJV   4) LLU

జవాబు: 2

సాధన: 

 

2. ROSE : NIAO : : FLOW : .....

1) BEWG    2) FBGW   3) CEWG   4) BFWG

జవాబు: 4

సాధన:

 

3. PEAT : IZDS : : GUTS : .....

1) ZPQR  2) ZPWR  3) APWR  4) APQR

జవాబు: 2

సాధన:

 

 

4. DEAR : SBFE : : LOVE : .....

1) ZPQR    2) ZPWR    3) APWR   4) APOR

జవాబు: 3

సాధన:

 

 

 

 

5. COVID : XLERW : : VIRUS : .....

1) ERIFH      2) HFIRE    3) IREFH   4) RIFHE

జవాబు: 1

సాధన: 

* ఆంగ్ల అక్షరమాలలో రెండో అర్ధభాగాన్ని వ్యతిరేక దిశలో రాయగా ఏర్పడే అక్షరాలు తీసుకోవాలి..

అదేవిధంగా

 

6. POLICE : CEILOP : : RECORDS : .....

1) SDROCER   2) EROCRDS   

3) RECORDS   4) CDEORRS

జవాబు: 4

సాధన: POLICE అనే పదంలోని అక్షరాలను అక్షరమాల క్రమంలో రాయగా CEILOP 

అదేవిధంగా RECORDS అనే పదంలోని అక్షరాలను రాయగా CDEORRS

 

7. CARE : 4219 : ROSE : .....

1) 1920616   2) 1619206  

3) 1920166   4) 1916206

జవాబు: 4

సాధన: 

 

8. EXAM : 1849 : STUDY : .....

1) 7921    2) 7744    3) 8100    4) 7225

జవాబు: 1

సాధన: E + X + A + M = 5 + 24 + 1 + 13 = 43

(43)2 =  1849

S + T + U + D + Y = 19 + 20 + 21 + 4 + 25 = 89

(89)2 = 7921

 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

గడియారాలు - దోష సమయం

లాజికల్‌ వెన్‌ చిత్రాలు

* ర్యాంకింగ్‌ టెస్ట్‌

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌