• facebook
  • whatsapp
  • telegram

మానవ వ్యాధులు

జనరల్‌ సైన్స్‌లో భాగంగా మానవ వ్యాధులు అంశం నుంచి ఒక ప్రశ్న తప్పని సరిగా వచ్చే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఈ టాపిక్‌ కష్టంగా ఉంటుందని భావిస్తుంటారు. కానీ ఇందులో ఉండే క్లిష్టమైన పదాలు, వ్యాధికారకం, అది వ్యాపించే విధానం, వ్యాధి వల్ల ప్రభావితమయ్యే శరీర భాగం లాంటి అంశాలను ఒక వరుసక్రమంలో గుర్తుంచుకోవాలి. 

  మన శరీరంలో జీవక్రియలు దెబ్బతినడాన్ని వ్యాధిగా పరిగణిస్తారు. ప్రతి వ్యాధికి నిర్ణీత లక్షణాలు ఉంటాయి. 

 

మానసిక వ్యాధులు: స్కీజోఫీనియా, హిస్టీరియా, బైపోలార్‌ డిసీజ్‌.

 

జన్యు వ్యాధులు: హీమోఫీలియా వర్ణాంధత (కలర్‌ బ్లైండ్‌నెస్‌), మస్కులర్‌ డిస్ట్రోఫి, ఆల్‌కాప్టోన్యూరియా, ఆల్బినిజమ్, ఫీనైల్‌ కీటోన్యూరియా, థలసీమియా, సిస్టిక్‌ ఫైబ్రోసిస్, గాలక్టోసీమియా, విల్సన్‌ వ్యాధి, కొడవలి కణ రక్తహీనత. 

 

క్రోమోజోమ్‌ నిర్మాణంలో మార్పు వల్ల కలిగేవి: క్రైడ్యూ క్యాట్‌ సిండ్రోమ్‌ (Cri du Chat Syndrome), క్యాట్‌ ఐ సిండ్రోమ్‌. 

 

ఆటోజోమ్‌ల సంఖ్యలో మార్పు వల్ల కలిగేవి: డౌన్స్‌సిండ్రోమ్, ఎడ్వర్డ్‌ సిండ్రోమ్, పాటాసిండ్రోమ్‌. 

 

అల్లోజోమ్‌ల సంఖ్యలో మార్పు వల్ల కలిగేవి: క్లినిఫెల్టర్‌ సిండ్రోమ్, టర్నర్‌ సిండ్రోమ్, జాకబ్‌ సిండ్రోమ్, ట్రిపుల్‌ ఎక్స్‌ సిండ్రోమ్‌. 

 

అంటువ్యాధులు కానివి: పోషకాహార లోపం, హార్మోన్‌ల అసమతౌల్యత వల్ల కలిగే వ్యాధులు; మధుమేహం, రక్తపోటు, అల్సర్, క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం, జీవన శైలిలో మార్పు వల్ల కలిగే వ్యాధులు.

 

అంటువ్యాధులు: ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఈ వ్యాధులు గాలి, నీరు, ఆహారం, స్పర్శ, జంతువులు కరవడం, వాహకాల ద్వారా వస్తాయి.  

 

కలుషిత గాలి ద్వారా వ్యాపించేవి: వ్యాధిగ్రస్తుడు దగ్గడం, తుమ్మినప్పుడు తుంపరలు గాలిలో కలుస్తాయి. సూక్ష్మజీవులు కలిగి ఉన్న గాలిని పీల్చడంతో అవి మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధులను కలగజేస్తాయి. 

ఉదా: సాధారణ జలుబు, ఊపిరితిత్తుల క్షయ, స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లుయంజా, కొవిడ్‌ - 19, డిఫ్తీరియా న్యుమోనియా 

 

కలుషిత నీరు, ఆహారం ద్వారా కలిగేవి: టైఫాయిడ్, కలరా, పోలియో, బొట్యులిజమ్, అమీబిక్‌ డీసెంటర్, పెప్టిక్‌ అల్సర్,  హెల్మింథిస్‌ వ్యాధులు, హెపటైటిస్‌ - తి, బాలంటిడియాసిస్‌.

 

వ్యాధిగ్రస్తుడిని తాకడం ద్వారా కలిగేవి: వ్యాధిగ్రస్తుడి వస్తువులు వాడటం ద్వారా కూడా ఈ వ్యాధులు వ్యాపిస్తాయి. అన్ని లైంగిక వ్యాధులు, చికెన్‌పాక్స్, శిలీంధ్ర చర్మ వ్యాధులు, మీజిల్స్, హెపటైటిస్‌ - తీ. 

 

నేలను తాకడం ద్వారా: ధనుర్వాతం (టెటనస్‌), కొంకి పురుగు వ్యాధి (Hookworm disease)

 

జంతువులు కరవడం లేదా వాటి పదార్థాల ద్వారా: రేబిస్, ఆంత్రాక్స్, బర్డ్‌ఫ్లూ, సిట్టకోసిస్, భ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్‌ 

 

వాహకాల ద్వారా వ్యాపించేవి: మానవులను కుట్టే దోమలు, నల్లులు, ఈగలు లాంటి సూక్ష్మజీవులు ఒకరి నుంచి మరొకరికి వ్యాధులను వ్యాపింపజేస్తాయి. 

ఉదా: మలేరియా - ఆడ ఎనాఫిలస్‌ దోమ  

* బోదకాలు, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ - ఆడ క్యూలెక్స్‌ దోమ   

* ఎల్లోఫీవర్, డెంగీ, చికన్‌గున్యా - ఆడ ఎడిస్‌ దోమ   

* ఆఫ్రికన్‌ స్లీపింగ్‌ సిక్‌నెస్‌ - సి.సి ఈగ    

* కాలా అజార్‌ - సాండ్‌ఫ్లై    

* ప్లేగు - రాట్‌ఫ్లీ   

* టైపస్‌ - తలలోని పేను 

 

బ్యాక్టీరియల్‌ వ్యాధులు​​​​​​

వ్యాధి కలిగించే బ్యాక్టీరియా
కోరింతదగ్గు (పెర్టుసిస్‌) బోర్డిటెల్లా పెర్టుసిస్‌వ్యాధి -  కలిగించే బ్యాక్టీరియా
క్షయ మైకో బ్యాక్టీరియమ్‌ ట్యుబర్‌క్యులోసిస్‌
న్యుమోనియా డిప్లోకోకస్‌ న్యుమోనియే
కలరా విబ్రియో కలరే 
టైఫాయిడ్‌ సాల్మోనెల్లా టైఫి
డిఫ్తీరియా కార్నిబ్యాక్టీరియమ్‌ డిఫ్తీరియే
గనోరియా నిస్సీరియా గనోరియే
సిఫిలిస్‌ ట్రిపొనిమా పాల్లిడమ్‌
యాస్‌ ట్రిపొనిమా పెర్టునే
ప్లేగు  యెర్సీనియా పెస్టిస్‌
కుష్ఠు మైకో బ్యాక్టీరియమ్‌ లెప్రె
ధనుర్వాతం క్లాస్ట్రీడియం టెటని
ఆంథ్రాక్స్‌ బాసిల్లస్‌ ఆంథ్రాసిస్‌
బొట్యులిజమ్‌ క్లాస్ట్రీడియం బొట్యులినమ్‌
ఆహార పదార్థాలు విషపూరితం కావడం స్టఫైలోకోకస్‌ ఆరియస్‌
గ్యాస్‌ గ్యాంగ్రిన్‌ క్లాస్ట్రీడియం ఫెర్‌ఫ్రిన్‌జన్స్‌
ట్రావెలర్స్‌ డయేరియా ఈ.కొలై జాతులు
మెనింగో కోకల్‌ మెనింజైటిస్‌ నిస్సేరియా మెనింజిటైడిస్‌
హీమోఫిలస్‌ మెనింజైటిస్‌ హీమోఫిలస్‌ ఇన్‌ఫ్లుయంజే
పెప్టిక్‌ అల్సర్‌ హెలికోబాక్టర్‌ పైలోరి
సాల్మనెల్లోసిస్‌ సాల్మోనెల్లా
భ్రూసెల్లోసిస్‌ భ్రూసెల్లా
పింటా ట్రిపనోమా కరాటియమ్‌
స్కార్లెట్‌ ఫీవర్‌ స్ట్రెప్టోకోకస్‌ పయోజెనిసిస్‌
లైమ్‌ డిసీజ్‌ బొరిలియా భర్గడోఫెరి
రిలాప్సింగ్‌ ఫీవర్‌ బొరిలియా రికరెంటిస్‌

 

వైరస్‌ వ్యాధులు 
 
వ్యాధి కలిగించే వైరస్‌
చికెన్‌పాక్స్‌ వారిసెల్లా జోస్టర్‌
స్మాల్‌పాక్స్‌ వేరియోలా వైరస్‌
పోలియో పోలియో వైరస్‌
రేబిస్‌ రేబిస్‌ వైరస్‌
ఇన్‌ఫ్లుయంజా ఇన్‌ఫ్లుయంజా వైరస్‌
సాధారణ జలబు రినోవైరస్‌
బర్డ్‌ఫ్లూ బీ5వి1 ఇన్‌ఫ్లుయంజా వైరస్‌
స్వైన్‌ఫ్లూ బీ1వి1 ఇన్‌ప్లుయంజా వైరస్‌
హెపటైటిస్‌ A, B, C, D, E వ్యాధులు హెపటైటిస్‌ A, B, C, D, E వైరస్‌లు
సార్స్‌ (సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరి సిండ్రోమ్‌) కరోనా వైరస్‌ (సార్స్‌ కరోనా వైరస్‌)
మెర్స్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరి సిండ్రోమ్‌) మెర్స్‌ కరోనా వైరస్‌
కొవిడ్‌ - 19 సార్స్‌ కరోనా వైరస్‌ - 2 (2019 - నావెల్‌ కరోనా వైరస్‌)
గవదబిళ్లలు మిక్సో వైరస్‌ పెరటోడిస్‌
మీజిల్స్‌ మీజిల్స్‌ వైరస్‌
రూబెల్లా రూబెల్లా వైరస్‌
డెంగీ డెంగీ వైరస్‌
ఎల్లోఫీవర్‌ ఎల్లోఫీవర్‌ వైరస్‌
జపనీస్‌ - B - ఎన్‌సెఫలైటిస్‌ జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ వైరస్‌ (గ్రూప్‌ - B - ఆర్బోవైరస్‌) 
చికెన్‌గున్యా చికెన్‌గున్యా వైరస్‌ 
ఎబోలా ఎబోలా వైరస్‌
జికా వైరస్‌ వ్యాధి జికా వైరస్‌
డయేరియా రోటా వైరస్‌
శాండ్‌ఫ్లై ఫీవర్‌ శాండ్‌ఫ్లై వైరస్‌ 
బ్లడ్‌ క్యాన్సర్‌ HTLV (హ్యూమన్‌ టి - సెల్‌ ల్యుకేమియా వైరస్‌) 
గ్లాండ్యులార్‌ ఫీవర్‌ ఎప్‌స్టీన్‌ బార్‌ వైరస్‌
గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌
కాయసనూర్‌ ఫారెస్ట్‌ ఫీవర్‌ కాయసనూర్‌ ఫారెస్ట్‌ ఫీవర్‌ వైరస్‌
కొలరాడో టిక్‌ ఫీవర్‌ కొలిటి వైరస్‌
కోల్డ్‌సోర్స్‌C హెర్పిస్‌ సింప్లెక్స్‌ టైప్‌ - I వైరస్‌
హెమర్రేజిక్‌ ఫీవర్‌ హంటావైరస్‌
రాస్‌ ఫీవర్‌ రాస్‌ ఫీవర్‌ వైరస్‌

 

 

మరిన్ని అంశాలు... మీ కోసం!

జంతు ప్రపంచం

సూక్ష్మజీవులు - ప్రాముఖ్యం

మానవ అస్థిపంజర వ్యవస్థ  

 

Posted Date : 16-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌