• facebook
  • whatsapp
  • telegram

లాజికల్‌ వెన్‌చిత్రాలు - 1

మార్కులు తెచ్చే తార్కిక చిత్రాలు!

 

సాధారణంగా ఎవరైనా ఏదైనా స్పష్టంగా చెప్పాలనుకున్నప్పుడు బొమ్మలు గీసి వివరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటినే రీజనింగ్‌లో వెన్‌ చిత్రాలు అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాల మధ్య సంబంధాన్ని తార్కికంగా, తేలిగ్గా చెప్పేందుకు ఇవి ఉపయోగపడతాయి. పోలీస్‌ ఉద్యోగాలు సహా పలు పరీక్షల్లో ఈ విభాగం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అవగాహన పెంచుకొని ప్రాక్టీస్‌ చేస్తే సులభంగా మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. 


లాజికల్‌ వెన్‌చిత్రాలు


లాజికల్‌ వెన్‌చిత్రాలకు సంబంధించిన ప్రశ్నల్లో కొన్ని జ్యామితీయ పటాల సమూహాన్ని ఇస్తారు. సాధారణంగా ఈ పటాలు త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, వృత్తాలు లాంటి బహుబుజులుగా ఉంటాయి. ప్రతి జ్యామితీయ పటం ఒక నిర్దిష్ట అంశాన్ని వ్యక్తపరుస్తుంది. 

సమస్యల సాధన 


    మొత్తం విద్యార్థులు = 100

    టీ తాగేవారు = 50

    కేవలం టీ మాత్రమే తాగేవారు = 30

    కాఫీ తాగేవారు = 70

    కాఫీ మాత్రమే తాగేవారు = 50

    రెండింటినీ తాగేవారు = 20

    ఏదో ఒకటి మాత్రమే తాగేవారు = 30 + 50 = 80

    కనీసం ఒకటైనా తాగేవారు = 30 + 20 + 50 = 100

 

మాదిరి ప్రశ్నలు


1.    కింది పటంలో త్రిభుజం ఆరోగ్యవంతులు, దీర్ఘచతురస్రం వృద్ధులు, వృత్తం పురుషులను సూచిస్తుంది. అయితే వృద్ధులు కాని ఆరోగ్యవంతులైన పురుషులను సూచించే సంఖ్య?


    

   1) 3      2) 4      3) 2      4) 5

జవాబు: 3

సాధన: త్రిభుజం, వృత్తంలో ఉమ్మడిగా ఉన్న సంఖ్య సమాధానం అవుతుంది.

 ఆ సంఖ్య 2

*  కింది సమాచారం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 

 

2.   కళాకారులు, ఆటగాళ్లు కాని డాక్టర్లు ఎంతమంది?

      1) 8      2) 17      3) 30     4) 25

జవాబు: 2

సాధన: కేవలం డాక్టర్లను మాత్రమే సూచించే సంఖ్య సమాధానం అవుతుంది.

కళాకారులు, ఆటగాళ్లు కానివారు 17 మంది.


3.  కళాకారులైన ఆటగాళ్లు ఎంతమంది?

    1) 5     2) 22      3) 3      4) 25

జవాబు: 4

సాధన: దీర్ఘచతురస్రం, వృత్తంలో ఉమ్మడిగా ఉన్న సంఖ్య సమాధానం అవుతుంది. ఈ సంఖ్య త్రిభుజంలో కూడా ఉండవచ్చు. ఎందుకంటే డాక్టర్లు కాని అనే పదం ఉపయోగించలేదు. 

 22 + 3 = 25


4. కళాకారులు, ఆటగాళ్లు అయిన డాక్టర్లు ఎంతమంది?

    1) 3      2) 8      3) 30      4) 22

జవాబు: 1

సాధన: ఇచ్చిన మూడు జ్యామితీయ పటాల్లో ఉమ్మడిగా ఉన్నది సమాధానం అవుతుంది.

కళాకారులు, ఆటగాళ్లు అయిన డాక్టర్లు ముగ్గురు.

* కింది సమాచారం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 


5.  సంగీత విద్వాంసులు కాని అక్షరాస్యులైన విదేశీయులను ఏ అక్షరం తెలియజేస్తుంది?

    1) b     2) c     3) d      4) g

జవాబు: 1

సాధన: సంగీత విద్యాంసులు కాకుండా అక్షరాస్యులు, విదేశీయులకు ఉమ్మడిగా ఉన్న అక్షరం b. 


6.  సంగీత విద్వాంసులు, విదేశీయులు కాని అక్షరాస్యులను ఏ అక్షరం సూచిస్తుంది?

       1) b       2) c       3) f       4) g
జవాబు: 3

సాధన: సంగీత విద్వాంసులు, విదేశీయులు కాకుండా కేవలం అక్షరాస్యులకు సంబంధించిన అక్షరం f. 


7. అక్షరాస్యులైన విదేశీయుల్లో సంగీత విద్వాంసులను సూచించే అక్షరం ఏది?

    1) a     2) b     3) c      4) d
జవాబు: 3

సాధన: అన్నింటిలో ఉమ్మడిగా ఉన్న అక్షరం c.   

* కింది సమాచారం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 


8.  పట్టణంలో నివసించని విద్యావంతులైన పురుషులను సూచించే సంఖ్య?

      1) 4        2) 5        3) 9       4) 11

జవాబు: 4

సాధన: విద్యావంతులు, పురుషులను సూచించే ఉమ్మడి సంఖ్య సమాధానం అవుతుంది.

 పట్టణంలో నివసించని విద్యావంతులైన పురుషులు 11 మంది. 


9. విద్యావంతులు కాని పట్టణంలో నివసిస్తూ ఉద్యోగులైన పురుషులను సూచించే సంఖ్య?

       1) 13      2) 12      3) 6      4) 10

జవాబు: 3

సాధన: వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రాల్లో ఉమ్మడిగా ఉన్న సంఖ్య సమాధానం అవుతుంది.

 విద్యావంతులు కాని పట్టణంలో నివసిస్తూ ఉద్యోగులైన పురుషులు 6 మంది


రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ వైశాల్యాలు

‣ మిస్సింగ్ నంబర్స్

‣ సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌