• facebook
  • whatsapp
  • telegram

గ‌ణిత ప‌రిక్రియ‌లు

లెక్కలను చక్కగా నడిపే క్రియలు!

గుణించటం గట్టిగా నేర్చుకున్నారు. భాగహారం బాగావచ్చు. కూడికలు, తీసివేతలైతే మరీ తేలిక. అయితే అన్నింటినీ కలిపి ఇస్తే దేన్ని ముందు చేయాలి? ఒక క్రమాన్ని పాటించకపోతే విలువలు, సమాధానాలు ఎందుకు మారిపోతాయి? తెలుసుకోవాలంటే లెక్కలను చక్కగా చేయడంపై అవగాహన కల్పించే గణిత పరిక్రియలపై పట్టు సాధించాలి. 

 

గణిత పరిక్రియలు

ప్రాథమిక గణిత పరిక్రియలు అయిన సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారాలను ఆధారంగా చేసుకుని పోటీ పరీక్షల్లో అనేక రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. ఒకే ప్రశ్నలో ఈ గణిత పరిక్రియలన్నీ ఇచ్చినప్పుడు ముందుగా ఏ పరిక్రియతో సూక్ష్మీకరించాలని అభ్యర్థి తడబడుతుంటాడు. దీనికోసం  BODMAS నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.

 

BODMAS అంటే

B − Bracket (బ్రాకెట్‌)

O − Of (ఒక రకమైన గుణకార పరిక్రియ)

D − Division (భాగాహారం)

M − Multiplication (గుణకారం)

A − Addition (సంకలనం)

S − Subtraction (వ్యవకలనం)


మాదిరి ప్రశ్నలు


మోడల్‌ - 1


1.   

     1. 12        2. 15       3. 10        4. 14

జవాబు: 2


సాధన: (36 − 12) ÷ 4 + 6 ÷ 2 × 3

        = 24 ÷ 4 + 6 ÷ 2 × 3 (బ్రాకెట్‌)

       = 6 + 3 × 3 (భాగాహారం)

       = 6 + 9 (గుణకారం)

      = 15 (సంకలనం)



 

మోడల్‌ - 2


3.     ఒక సంకేత భాషలో + అంటే ÷,  అంటే -, అంటే x, x అంటే -, అయితే 16 ÷ 8 - 4 + 2 x 4 విలువ ఎంత?

       1) 36        2) 28        3) 32         4) 38

జవాబు: 2

 

సాధన: 16 ÷ 8  - 4 + 2 x 4

    ఇచ్చిన గుర్తులను ప్రతిక్షేపించగా

  = 16 + 8 × 4 ÷ 2 − 4

  = 16 + 8 × 2 − 4

  = 16 + 16 − 4

 = 32 − 4 = 28  


 మోడల్‌ - 3

5.     6 + 2 = 64, 7 + 3 = 100 అయితే 11+ 5 = ?

      1) 256         2) 196         3) 225         4) ఏదీకాదు

జవాబు: 1

 

సాధన: 6 + 2 = 64, 7 + 3 = 100

దీన్ని a + b = (a + b)2 గా రాశారు. అంటే

6 + 2 = (6 + 2)2 = 64

7 + 3 = (7 + 3)2 = 100  కాబట్టి

11 + 5 = (11 + 5)2 = 256
   

 

6.    52 x 45 = 30, 73 x 21 = 23 అయితే 84 x 52 = ?

        1) 24     2) 45     3) 23     4) 42

జవాబు: 4

సాధన: 52 × 45 = 30, 73 × 21 = 23

దీన్ని b × cd = (a × b) + (c × d) గా రాశారు. 

52 × 45 = (5 × 2) + (4 × 5)

= 10 + 20 = 30 అదేవిధంగా

84 × 52 = (8 × 4) + (5 × 2)

= 32 + 10 = 42

 

మోడల్‌ - 4

7.     కింది ఏ సమీకరణంలో +, x చిహ్నాలను పరస్పరం మార్చితే సమీకరణం సరైంది అవుతుంది?

    1) 7 × 5 + 3 =  20                    2) 4 + 9 × 1 =  42

    3) 6 × 5 + 8 = 46                    4) 2 + 11 × 4 =  28

జవాబు: 3

సాధన: ఇచ్చిన ప్రతి ఆప్షన్‌ను తీసుకొని గుర్తులను మార్చి BODMAS నియమాన్ని అనువర్తింపజేయాలి.


8.  3 + 5 - 2 = 4 సమీకరణంలో వేటిని పరస్పరం మార్చితే సమీకరణం సరైంది అవుతుంది?

    1) +, −; 2, 3       2) +, −; 2, 5      3) +, −; 3, 5     4) ఏదీకాదు

జవాబు: 3

సాధన: 3 + 5 − 2 = 4

 

మ‌రిన్ని ప్రశ్న‌లు

 

 వివిధ పోటీపరీక్షల్లో గ‌ణిత ప‌రిక్రియ‌లకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో అభ్యర్థి ప్రాథమిక గణిత పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ప్రశ్నలో గుర్తులను కోడ్‌ల రూపంలో అడుగుతారు. వాటిని డీకోడ్‌ చేశాక 

మాదిరి ప్రశ్నలు


3. A ని +,  Bని n గా రాస్తే, C ని x గా రాస్తే (10C4) A  (4C4)  B6 = ?
 1) 60         2) 56         3) 50         4) 46

సాధన:  A = +: B = -: C = x
(10x4) + (4x4) - 6 = ?
40 + 16 - 6 = ? 
56 - 6 = 50
 సమాధానం: 3


రాస్తే, కింది సమీకరణాల్లో ఏది సత్యం?


సమాధానం: 4


5. కింది సమీకరణంలో ఏ రెండు అంకెలను పరస్పరం వాటి స్థానాల్లో ప్రతిక్షేపిస్తే "=" కు ఇరువైపులా ఉన్న విలువలు సమానమవుతాయి?

సమాధానం: 4


6. A+D = B + C, A + E = C + D, 2C < A + E, 2A > B + D అయితే కింది వాటిలో ఏది సత్యం?

1) A > B > C > D > E 

2) B > A > D > C  > E

3) D  > B > C > A > E 

4) B > C > D > E > A



సమాధానం: 2


7.  A + D > C + E , C + D = 2B, B + E  > C + D   అయితే కింది వాటిలో కచ్చితంగా సరైంది ఏది?

 


 

9. కింద ఇచ్చిన సమీకరణం సత్యం కావాలంటే ఖాళీల్లో ఏ గుర్తులు ఉండాలి?

 

గోలి ప్ర‌శాంత్ రెడ్డి

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ వైశాల్యాలు

‣ మిస్సింగ్ నంబర్స్

‣ సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 17-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌