• facebook
  • whatsapp
  • telegram

ర్యాంకింగ్‌ టెస్ట్‌

కుడి ఎడమైనా కనిపెట్టాల్సిందే!

  ఒక తరగతి లేదా సమావేశం లేదా ఇతర సందర్భాల్లో ఎప్పుడో ఒకప్పుడు వ్యక్తుల స్థానాల గురించి చెప్పాల్సి వస్తుంటుంది. అప్పుడు ఎడమ వైపు నుంచి లేదా కుడివైపు నుంచి అంటూ వివరిస్తుంటారు. ఒక్కోసారి పై నుంచి లేదా కింద నుంచి అని కూడా లెక్కగడుతుంటారు. దీన్నే రీజనింగ్‌లో ర్యాంకింగ్‌ టెస్ట్‌ అంటారు. ఆ లాజిక్‌నే కాస్త దృష్టిపెట్టి ఉపయోగిస్తే పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు. 

 

  ఒక సమూహంలో ఉన్న కొంత మంది వ్యక్తులు/వస్తువుల్లో ఒక వ్యక్తి లేదా వస్తువు స్థానాన్ని ఒక వైపు నుంచి ఇచ్చి మరొక వైపు నుంచి కనుక్కోమంటారు. సాధారణంగా వస్తువుల స్థానాలను కింది విధంగా వ్యక్తపరుస్తారు.

*ఎడమ వైపు  కుడి వైపు

*పై వైపు కింది వైపు

*ముందు వైపు  వెనక వైపు

*ఉత్తరం వైపు  దక్షిణం వైపు

*తూర్పు వైపు  పడమర వైపు

 

వ్యక్తుల స్థానాలను గుర్తించే క్రమంలో పైన వ్యక్తపరిచిన భావనలన్నీ ఒకే రకమైనవిగా భావిస్తాం.

T = n + k - 1

T = సమూహంలోని మొత్తం వ్యక్తుల సంఖ్య

n = వ్యక్తి స్థానం ఒకవైపు నుంచి

k = అదే వ్యక్తి స్థానం మరొకవైపు నుంచి

 

మాదిరి ప్రశ్నలు

 

1. ఒక తరగతిలోని 40 మంది విద్యార్థుల్లో దినేష్‌ ర్యాంక్‌ ఎడమ నుంచి 17. అయితే అతడి ర్యాంక్‌ కుడివైపు నుంచి ఎంత?

1) 20      2) 23      3) 25      4) 24

జవాబు: 4

సాధన: T = n + k - 1

40 = 17 + k - 1

k = 24

దినేష్‌ ర్యాంక్‌ కుడివైపు నుంచి 24

 

2. ఒక పరీక్షలో 120 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వారిలో ఆద్య ర్యాంక్‌ కింది నుంచి 56 అయితే పై నుంచి ఆమె స్థానం ఎంత?

1) 65     2) 70     3) 68     4) 75

జవాబు: 1

సాధన: T = n + k - 1

120 = 56 + k - 1

k - 65

పై నుంచి ఆద్య ర్యాంక్‌ 65 

 

3. ఒక పరీక్షలో అమర్‌ ర్యాంక్‌ పై నుంచి 12, కింది నుంచి 27. అయితే ఆ పరీక్షలో ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు? 

1) 35     2) 39     3) 38     4) 37

జవాబు: 3

సాధన: T = n + k - 1

T = 12 + 27 - 1 = 38

ఆ పరీక్షలో మొత్తం 38 మంది ఉత్తీర్ణులయ్యారు

 

4. చెట్ల వరుసలో ఒక చెట్టు ఇరువైపుల నుంచి 16వ స్థానంలో ఉంది. అయితే ఆ వరుసలోని మొత్తం చెట్లు ఎన్ని?

1) 30     2) 31     3) 32     4) 33

జవాబు: 2

సాధన: T = n + k - 1

= 16 + 16 - 1 = 31

ఆ వరుసలో మ్తొతం 31 చెట్లు ఉన్నాయి

 

5. ఒక పరీక్షలో మాధవ్‌ ర్యాంక్‌ పై నుంచి 24, కింది నుంచి 32. ఆ పరీక్షలో 19 మంది ఫెయిల్‌ అయ్యారు. 11 మంది పరీక్షకు హాజరు కాలేదు. అయితే తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?

1) 75     2) 70     3) 85      4) 90

జవాబు: 3

సాధన: T = n + k - 1

= 24 + 32 - 1 = 55

ఉత్తీర్ణులైనవారు = 55

ఫెయిల్‌ అయినవారు = 19

హాజరు కానివారు = 11

మొత్తం విద్యార్థులు = 55 + 19 + 11 = 85

 

6. ఒక వరుసలో A ఎడమ వైపు నుంచి 12వ స్థానంలో, B కుడి వైపు నుంచి 17వ స్థానంలో ఉన్నారు. వీరిద్ద్దరికీ సరిగ్గా మధ్యలో C ఉన్నాడు. B, C  ల మధ్య 5 మంది ఉంటే ఆ వరుసలో ఉండే గరిష్ఠ వ్యక్తుల సంఖ్య ఎంత?

1) 40        2) 35        3) 42        4) 38

జవాబు: 1

సాధన: ఇచ్చిన సమాచారం ప్రకారం

C అనే వ్యక్తి A, B లకు సరిగ్గా మధ్యలో ఉన్నాడు కాబట్టి B, C ల మధ్యలో అయిదుగురు ఉన్నప్పుడు A, C ల మధ్యలో కూడా అయిదు మంది ఉంటారు.

గరిష్ఠ వ్యక్తుల సంఖ్య = 12 + 5 + 1 + 5 + 17 = 40


7. ఒక వరుసలో సాత్విక ఎడమ నుంచి 16వ స్థానంలో, మేఘన కుడి వైపు నుంచి 13వ స్థానంలో ఉన్నారు. వారు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటే సాత్విక ఎడమ నుంచి 19వ స్థానంలో ఉంది. అయితే ఆ వరుసలో మొత్తం ఎంత మంది బాలికలు ఉన్నారు?

1) 41        2) 40       3) 31       4) 30

జవాబు: 3

సాధన: 

సాత్విక ఎడమ నుంచి 16వ స్థానంలో ఉంది.  

మేఘన కుడి నుంచి 13వ స్థానంలో ఉంది. 

వారు పరస్పరం స్థానాలు మార్చుకున్న తర్వాత సాత్విక ఎడమ నుంచి 19వ స్థానంలో ఉంది. అంటే ఈ స్థానం ఇంతకు ముందు మేఘనది. కానీ మేఘన కుడి వైపు నుంచి 13వ స్థానంలో ఉంది. కాబట్టి పై వివరణ నుంచి సాత్విక ఎడమ నుంచి 19వ స్థానంలో, కుడి నుంచి 13వ స్థానంలో ఉంది అని నిర్ధారణకు రావచ్చు.

T =  n + k - 1

   = 19 + 13 - 1 = 31

 మొత్తం బాలికల సంఖ్య 31

 

8. ఒక వరుసలో 17 మంది వ్యక్తులు ఉన్నారు. వారిలో మొదటి, చివరి వ్యక్తులు మహిళలు. ఆ వరుసలో ప్రతి రెండో వ్యక్తి పురుషుడు. అయితే మొత్తం వరుసలో మహిళలు ఎంత మంది ఉన్నారు?

1) 17      2) 15      3) 10     4) 9

జవాబు: 4

సాధన: F M F M F M F M F M F M F M F M F

 మొత్తం మహిళలు = 9

 

రచయిత: గోలి ప్రశాంత్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 వైశాల్యాలు

‣ మిస్సింగ్ నంబర్స్

 

 సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 03-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌