• facebook
  • whatsapp
  • telegram

సులువుగా పర్యావరణాన్ని చదివేద్దాం!

‘ఎన్విరాన్‌మెంటల్‌ ఇష్యూస్‌’ సన్నద్ధత విధానం

ఈరోజుల్లో అన్ని పోటీ పరీక్షల్లోనూ ‘పర్యావరణ మార్పులు’ ఓ కీలకాంశం. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్స్‌ ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు దీన్ని వర్తమాన వ్యవహారాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం వల్ల సులువుగా మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అయితే కేవలం బిట్లు బట్టీ పట్టకుండా... పర్యావరణ అధ్యయనం ప్రాథమిక అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల... దాని ఆధారంగా వచ్చే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు ఇవ్వగలుగుతారు.

4.5 బిలియన్‌ సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించినా మొదటి 500 మిలియన్‌ సంవత్సరాలు కేవలం రసాయనిక విప్లవం (కెమికల్‌ రివల్యూషన్‌) జరిగింది. అంటే అనేక అకర్బన, కర్బన మూలకాలు పదార్థాలుగా ఏర్పడ్డాయి. అవి ఒకదానికొకటి అనుసంధానించుకొని అతి సంక్షిష్టమైన న్యూక్లియోటైడ్‌లుగా అవతరించాయి. నత్రజని క్షారాలు, రైబోజ్‌ - ఫాస్పేట్‌ల కలయికనే న్యూక్లియోటైడ్‌ అంటున్నాం. భూమి సూర్యుని నుంచి విడివడిన తర్వాత సూర్యుని చుట్టూ పరిభ్రమించడం, తన చుట్టూ తాను తిరగడం వల్ల అనేక మార్పులు జరిగాయి. ఇక్కడి నుంచే జీవం ఆరంభమైంది. అభ్యర్థులు దీన్నుంచే మొదలుపెట్టాలి.

ఇదే విధానంలో ఏర్పడిన అమైనో ఆమ్లాలు న్యూక్లియోటైడ్‌లకు ఆకర్షితమై దగ్గరగా వచ్చాయి. మూడేసి న్యూక్లియోటైడ్‌లు ఒక్కొక్క అమైనో ఆమ్లాన్ని ఆకర్షించడం మొదలుపెట్టాయి. ఈ న్యూక్లియోడైట్‌ గొలుసునే ఆర్‌ఎన్‌ఏ అంటారు. 3 న్యూక్లియోటైడ్‌లను కలిపితే ఒక కోడాన్‌ అంటారు, అదే ట్రిపుల్‌ కోడాన్‌. ఈ కోడాన్‌లన్నీ వరసగా అమరి ఆర్‌ఎన్‌ఏలో ఉంటాయి. ఒక్కొక్క అమైనో ఆమ్లం ఒకదానికొకటి కలిసి ఒక పాలీపెప్టెడ్‌ గొలుసు ఏర్పడుతుంది. దీనినే ప్రొటీన్‌ అంటారు. ఈ విధంగా ఆర్‌ఎన్‌ఏ చుట్టూ ఒక ప్రొటీన్‌ ఏర్పడి వైరస్‌ అవతరించింది. దాని నుంచి కాలానుగుణంగా బాక్టీరియా, ప్రొటోజోవా, స్పంజికలు, కీటకాలు తదిరాలతోపాటు చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఆవిర్భవించాయి. ఈ జంతువులకు సమాంతరంగా మొక్కలు ఉద్భవించాయి.

ఈ రకంగా ఉద్భవించిన మొక్కలు, జంతువులు... వాతావరణం, జలావరణం, శిలావరణం కలయిక ద్వారా ఏర్పడిన బయోస్పియర్‌లో భాగమయ్యాయి. మిగిలినవి అబయోటిక్‌ కారకాలుగా ఉన్నాయి. ఇవి బయోస్పియర్‌లోని మొక్కలను, జంతువులను క్రమంగా ప్రభావితం చేస్తూ మార్పులకు గురిచేస్తున్నాయి. ఈ ప్రభావంతో అనేక కొత్త జీవులు పుట్టుకొచ్చాయి. దీనినే బయో డైవర్సిటీ అంటాం.

అభివృద్ధి - పర్యావరణం.. 

మానవ అభివృద్ధి జరగాలంటే పర్యావరణానికి కొంత చేటు తప్పదు అనే భావన ఉంది. అయితే వాతావరణం ప్రతి జీవి మనుగడకు అవసరమైన వనరులను సమకూరుస్తుంది. కానీ ఇక్కడ అవసరానికి బదులు ఆశ వస్తేనే సమస్య మొదలవుతుంది. పశ్చిమ దేశాలు పర్యావరణాన్ని నాశనం చేసి అభివృద్ధి సాధించాయి. ఇప్పుడు అంతా అయిపోయాక పర్యావరణ పరిరక్షణ గురించి చెబుతున్నాయనేది అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల వాదన.

2వ ప్రపంచ యుద్ధానంతరం 1948లో పర్యావరణ పరిరక్షణకు వివిధ దేశాల ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలతో కలిపి ఐయూసీఎన్‌ (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌) అవతరించింది. ఈ సంస్థ 1964 నుంచి జంతు, మొక్క జాతుల్లో అంతరించిపోతున్న, అంతరించడానికి సిద్ధంగా ఉన్న వివిధ జాతుల వివరాలను రెడ్‌ లిస్ట్‌ పేరుతో విడుదల చేస్తోంది.

జీవులు అంతరించడానికి ముఖ్యంగా 4 కారణాలు..

అవి నివసిస్తున్న ప్రాంతం లేకుండా పోవడం - ఇది ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల వల్ల కావొచ్చు.

ప్రకృతి వనరుల్ని అతిగా ఉపయోగించడం. 

ఇతర ప్రాంతాలకు చెందిన జాతులను ప్రవేశపెట్టడం వల్ల స్థానిక జాతులు అంతరిస్తాయి. ఉదాహరణకు పార్దీనియా, ఎకోర్నియాలు ప్రవేశించడం వల్ల స్థానిక జాతులు నశించాయి.

కో ఎక్స్‌టింక్షన్‌ వల్ల కావొచ్చు. ఒక జాతి మరొక జాతిపై ఆధారపడినప్పుడు ఒకటి అంతరిస్తే రెండోదీ అంతరిస్తుంది

ప్రస్తుతం జరుగుతున్నది ఆరో అంతరించిపోయే దశ. పోటీ పరీక్షల్లో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మిగతావాటిలో మానవ ప్రమేయం లేదు. కానీ ప్రస్తుతం మనుషుల కారణంగా ఈ ప్రక్రియ వేగవంతం అవుతోంది.

1972లో జరిగిన స్టాక్‌హోమ్‌ సమావేశం, తదనంతరం ఏర్పాటైన యూఎన్‌ఈపీ (యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌)... దీనివల్ల ప్రపంచ దేశాల్లో జరిగిన మార్పులతోపాటు మన దేశంలో 253వ రాజ్యాంగ అధికరణ ప్రకారం చేసిన చట్టాలు, ఏర్పడిన సంస్థలు, అవి చేస్తున్న పరిరక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి.

వివిధ దేశాలు వాతావరణ ఉష్ణోగ్రత పెరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయనేదీ ముఖ్యమే. ఇటీవల జరిగిన గ్లాస్‌గో సమావేశంలో చర్చించిన అంశాలు - నిర్ణయాల అమల్లో వస్తున్న సమస్యలు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు పరిశీలించాలి. 

వెట్‌లాండ్స్‌ (చిత్తడి నేలలు) పరిరక్షణ కోసం 1971లో ఇరాన్‌లోని రామ్‌సర్‌లో జరిగిన సమావేశం గురించి తెలుసుకోవాలి. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో గుర్తించిన వెట్‌లాండ్స్‌పై దృష్టి సారించాలి.

ఈ నేపథ్యంలో ఒక జీవికి, మరో జీవికి మధ్య ఉన్న సంబంధాన్ని అభ్యర్థులు గుర్తించాలి.

ప్లస్‌ అనేది లబ్ధి చేకూర్చే సంబంధం 

మైనస్‌ అనేది నాశనం చేసే సంబంధం బీ సున్నా తటస్థతను సూచిస్తుంది. 

ఉదాహరణకు పిట్చర్‌ మొక్క కీటకాన్ని తింటుంది. ఇది ప్రిడేషన్‌కు ఉదాహరణ. 

అలాగే సతతహరితారణ్యాలలోని మొక్కలు సూర్యరశ్మి కోసం ఒకదానితో మరొకటి పోటీపడతాయి. ఆవులపై ఉండే ఎగ్రిట్‌ కమెన్సలిజమ్‌కు ఉదాహరణ. ఆవరణ వ్యవస్థలోని జీవులు ఈ విధంగా ఒకదానితో మరొకటి సంబంధం కలిగి, అజీవక కారకాలతో ప్రభావితం అవుతూ జీవిస్తున్నాయి.

ఇంతకుముందు అంతరించిపోయిన పరిస్థితులు..

భూమి చరిత్రను మనం 5 యుగాలుగా చెప్పొచ్చు. అవి 

1. అజోయిక్‌ యుగం  

2. ప్రొటిరోజోయిక్‌ యుగం 

3. పెలియోజోయిక్‌ యుగం 

4. మీసోజోయిక్‌ యుగం 

5. సన్‌జోయిక్‌ యుగం

ఈ యుగాల్లో అనేక జీవులు పరిణామం చెందాయి, మరికొన్ని అంతరించాయి. ఇప్పటివరకు అయిదుసార్లు ఇలా అంతరించిపోవడం (ఎక్స్‌టింక్షన్‌) జరిగింది. ఇది ముఖ్యంగా పేలియో, మీసో, సన్‌జోయిక్‌ యుగాల్లో జరిగింది. అజీవక కారకాల్లో వచ్చిన మార్పులకు తట్టుకోలేకే జీవులు అంతరించి మళ్లీ కొత్త జీవులు ఉద్భవించాయి. దీనికి కారణం ప్రకృతే!

*********************************************************************************

 

సెక్షన్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు

2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు

4. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర

5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకొని తీసుకున్న సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు

6. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి

7. ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం యొక్క భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

11. డేటా అనాలిసిస్: ఎ) టాబ్యులేషన్ ఆఫ్ డేటా బి) విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సి) బేసిక్ డేటా అనాలిసిస్ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం)

12. ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు(విభజన సమస్యలు)


సెక్షన్-బి: జనరల్ ఇంగ్లిష్, తెలుగు

a) Comprehension

b) Usage and Idioms

c) Vocabulary and Punctuation

d) Logical re-arrangement of sentences

e) Grammar

ఎ) పర్యాయపదాలు, పదజాలం

బి) వ్యాకరణం

సి) తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు

డి) ఇంగ్లిష్ పదాలకు తెలుగు అర్థాలు

ఇ) పలుకుబడి/ వాడుక, నుడికారం/ జాతీయాలు


ఈ-బుక్స్


పాత ప్రశ్నప‌త్రాలు


నమూనా ప్రశ్నపత్రాలు

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎకానమీలో ఏవీ ముఖ్యం?

‣ అవుతారా డ్రోన్‌ పైలట్‌

‣ చదవాలని అనిపించట్లేదా?

‣ మీలో విశ్లేషణ శక్తి ఉందా?

‣ ఇంటర్‌ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ

‣ విదేశీ వ్యవహారాల అధ్యయన వ్యూహం ఇదీ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌