• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మీలో విశ్లేషణ శక్తి ఉందా?

ప్రాంగణనియామకాల్లో ఉద్యోగులను ఎంపిక చేసుకునే ప్రక్రియలో నియామక సంస్థలు ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటాయి. సంబంధిత విషయ పరిజ్ఞానం, ఇతర అంశాలతో పాటు అదనంగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను కోరుకుంటాయి కొన్ని సంస్థలు. వాటిలో ఓ ముఖ్య లక్షణం- విశ్లేషణాత్మక శాస్త్రీయ దృక్పథం. అభ్యర్థి తాను నిర్వహించే విషయాలు, సమస్యలను పరిష్కరించే క్రమంలో సమస్యలను విశ్లేషిస్తున్నాడా? తాను ఎలాంటి దృక్పథంతో ఉన్నాడన్న అంశాన్ని  సెలక్టర్లు గమనిస్తారు!   

వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే ఇతర వృత్తి సంబంధిత నైపుణ్యాలతోపాటు విశ్లేషణాత్మక శాస్త్రీయ దృక్పథం అవసరం. ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తికయినా సమస్యా పరిష్కార నైపుణ్యం అతి కీలకం. సమస్యను పరిష్కరించే విధానాన్ని అనుసరించి వ్యక్తి ఉద్యోగ ప్రస్థానంలో అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. విజయవంతమైన వృత్తి నిపుణుడిగా ఎదగాలంటే ఇతర నైపుణ్యాలతో పాటు సమస్యలను సమర్థంగా పరిష్కరించగలరన్న నమ్మకాన్ని యాజమాన్యానికి కల్పించగలగాలి. అయితే సమస్యను ఏదో ఒక రకంగా పరిష్కరించడం గొప్ప విషయం కాదు. ఎదురయ్యే సమస్యను విశ్లేషణాత్మకంగా పరిశీలించాలి. శాస్త్రీయంగా క్రమపద్ధతిని అనుసరించి పరిష్కరించగలగాలి. 

సమస్య ఉత్పన్నమైనపుడు, లేదా వ్యాపార సంబంధమైన నిర్ణయాలు తీసుకునేముందు జరిగే మేధామథÅనంలో సంబంధిత ఉద్యోగులు తమ సలహాలూ, సూచనలూ ఇస్తుంటారు. గణాంకాల ద్వారా సంబంధిత సమాచారాన్ని సేకరించడం, ఆలోచించి చర్చించి హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ సమావేశాల ప్రాథమిక ఉద్దేశం. అలాగే ఈ నిర్ణయాలు కొన్ని ప్రాజెక్టులను నిర్వహించడానికి సహకరిస్తాయి.  

విశ్లేషణ క్రమంలో...  

  సమస్యపై స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోండి.  

  పరిష్కరించే క్రమంలో సాధించాలనుకున్న ఫలితాన్ని ముందే ఊహించి, నిర్వచించాలి. 

  ఆ ఫలితాన్ని/ లక్ష్యాన్ని చేరేందుకు అనుకూలమైన రోడ్‌ మ్యాప్‌ వేసుకోండి. 

  కొన్నిసార్లు సమస్యను వదిలేసి అందుకు సంబంధం లేని విషయాలపై చర్చిస్తుంటాం. అలా కాకుండా సమస్య మూలాలను  క్షుణ్ణంగా అర్థం చేసుకోండి.      

1.  పరిశీలించడం: నిరంతర పరిశీలన ఒక అంశంగా అలవరచుకోవాలి. మీరు ఏ పని చేస్తున్నా పరిసరాలనూ, పనిలో ఎదురయ్యే ప్రతి అంశాన్నీ పరిశీలించండి. వ్యక్తులు కావచ్చు లేదా సంఘటనలు కావచ్చు. అది మీ వృత్తికి సంబంధించినదైనా, సంబంధం లేనిదైనా పరిశీలన అవసరం. అందులో మీకు అవగాహనలేని విషయాలు ఎదురైతే ఆ అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి.  

2.  ఆసక్తి పెంచుకోవడం: ప్రతి అంశంపైనా ఆసక్తి పెంచుకోవడం అంటే ప్రశ్నించడం దానిలో భాగం. వాస్తవ పరిస్థితుల్లో అభ్యర్థి ఎంత ఆసక్తి కనబరుస్తాడో, అది అభ్యర్థిలోని శ్రద్ధ, జ్ఞాపకశక్తి లాంటి అంశాలను ప్రభావితం చేస్తుంది. విషయ పరిజ్ఞానం పెరిగే కొద్దీ మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇది సమస్యా పరిష్కారానికి ఉపయోగపడుతుంది.  

3.  నిర్ణయాలపై పునరాలోచన: పనికి సంబంధించిన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం సర్వసాధారణం. ప్రతి నిర్ణయం వెనుకా కొన్ని ఆలోచనలుంటాయి. ఆలోచనలనూ, నిర్ణయాలనూ హేతుబద్ధం చేయండి. మీ నిర్ణయాల ఫలితాలను చర్చించి, అందులోని లాభనష్టాలను బేరీజు వేయండి. అందుబాటులో ఉన్న వృత్తి నిపుణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకోండి. అవసరం మేరకు సలహాలూ తీసుకోండి. దీనికోసం విస్తృత పరిశీలన చేయండి. ఈ సమస్యకు ఇదే ఉత్తమ పరిష్కారమా? మరేదైనా మార్గం ఉందా అని పునరాలోచించండి. 


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.