• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

జులై 4 దరఖాస్తు గడువు


 

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) 435 ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. గేట్‌-2024 స్కోరుతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.  అర్హులకు గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి మెరుగైన ప్రతిభ చూపినవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 


చివరి ఏడాది పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాల్లో.. ఎలక్ట్రికల్‌-331, సివిల్‌-53, కంప్యూటర్‌ సైన్స్‌-37, ఎలక్ట్రానిక్స్‌-14 ఖాళీలు ఉన్నాయి. 31.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌కు తాజా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.  దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. ఒక్కో విభాగంలో ఉన్న ఖాళీలు, వాటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హతల వివరాలు చూద్దాం. 

ఎలక్ట్రికల్‌-331: ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ (పవర్‌)/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ పవర్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌) బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) అరవై శాతం మార్కులతో పాసవ్వాలి. 

సివిల్‌-53: సివిల్‌ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి. 

కంప్యూటర్‌ సైన్స్‌-37: కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ ఇప్ఫర్మేషన్‌ టెక్నాలజీ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. 

ఎలక్ట్రానిక్స్‌-14: ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌/ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి. 

గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంట  ర్వ్యూల్లో సమాధానాలు చెప్పడానికి  హిందీ లేదా ఇంగ్లిష్‌ను ఎంచుకునే   అవకాశం ఉంటుంది. 

‣ గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల సమయంలో గేట్‌-2024 అడ్మిట్‌కార్డ్, ఒరిజినల్‌ గేట్‌ స్కోర్‌ కార్డ్‌ తీసుకెళ్లాలి. 

ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దాంట్లో పేర్కొన్న ధ్రువపత్రాలను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి. 

ఇంటర్వ్యూలో అన్‌రిజర్వ్‌డ్‌ 40 శాతం, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. 

గేట్‌ స్కోరుకు 85 శాతం, గ్రూప్‌ డిస్కషన్‌కు 3 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 12 శాతం వెయిటేజీ ఇస్తారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులో గేట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ రాయాలి. 

ఎంపికైనవారిని పవర్‌గ్రిడ్‌లోగానీ దాని అనుబంధ సంస్థ అయిన సెంట్రల్‌ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సీటీయూఐఎల్‌)లోగానీ నియమించవచ్చు. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత ప్రింటవుట్‌ను భద్రపరుచుకోవాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 04.07.2024

వెబ్‌సైట్‌: www.powergrid.in/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

Posted Date : 27-06-2024 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌