• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బెల్‌లో ఉద్యోగాలు

జులై 7 దరఖాస్తు గడువు


 

హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) శాశ్వత ప్రాతిపదికన 32 ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ, టెక్నీషియన్‌-సీ, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు ఒక్కో కొలువుకు ఎన్ని పోస్టులు ఉన్నాయో, దరఖాస్తు చేయడానికి ఏ అర్హతలుండాలో చూద్దాం. 

1. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ-12: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ట్రేడ్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా. 

2. టెక్నీషియన్‌ సీ-17: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/ ఎలక్ట్రికల్‌)తోపాటు ఏడాది అప్రెంటిస్‌షిప్‌ పూర్తిచేయాలి. లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసై, మూడేళ్ల నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోర్సు చేయాలి.  

3. జూనియర్‌ అసిస్టెంట్‌-3: బీకాం/ బీబీఎం 

వేతనం: ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టుకు రూ.24,500- రూ.90,000. టెక్నీషియన్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.21,500- రూ.82,000.

మూడు పోస్టులకూ.. జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, ఎస్సీ/ ఎస్సీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో డిప్లొమా/ డిగ్రీ/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసవ్వాలి.  )్ల ఉద్యోగానుభవం అవసరం లేదు. 

అభ్యర్థులు తెలంగాణ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలి. గడువు తేదీ ముగిసిన/ పనిచేయని ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కార్డులను పరిగణనలోకి తీసుకోరు. 

మూడు పోస్టులకూ 01.06.2024 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో... ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. 

జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు ఫీజు రూ.250 (18 శాతం జీఎస్టీ అదనం). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు. 


   ప్రశ్నపత్రంలో...  

విద్యార్హతల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రంలో 150 మార్కులకు రెండు పార్టులు ఉంటాయి. 

పార్ట్‌-1 జనరల్‌ అవేర్‌నెస్‌కు 50 మార్కులు. జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్, కాంప్రహెన్షన్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ స్కిల్స్, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.   

‣ పార్ట్‌-2 టెక్నికల్‌/ ట్రేడ్‌ ఆప్టిట్యూడ్‌కు 100 మార్కులు. సంబంధిత బ్రాంచ్‌ నుంచి టెక్నికల్‌/ ట్రేడ్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన 100 ప్రశ్నలు అడుగుతారు. 

జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లు పార్ట్‌-1, పార్ట్‌-2లో వేర్వేరుగా 35 శాతం మార్కులు సాధించాలి. 

ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పార్ట్‌-1, పార్ట్‌-2లో వేర్వేరుగా 30 శాతం మార్కులు సంపాదించాలి. 

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులో ఆరు నెలల శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.24 వేలు స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణానంతరం గ్రెడేషన్‌ టెస్ట్‌ పాసైన తర్వాత రెగ్యులర్‌ పే స్కేల్‌కు ఎంపిక చేస్తారు. 

రాత పరీక్షకు హాజరయ్యే ఇతర ప్రాంతాలకు చెందిన ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు స్లీపర్‌ క్లాస్‌ రైలు/ బస్సు ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు. 

రాత పరీక్షల అర్హత సాధించినా.. వైద్య పరీక్షల తర్వాతే అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. 


 సన్నద్ధత   

పార్ట్‌-1లోని జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలపై అవగాహన పెంచుకోవడానికి పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. 

నిర్ణీత వ్యవధి లోపల సమాధానాలను గుర్తించడమూ ముఖ్యమే. మొదట్లో ఇది సాధ్యంకాకపోయినా.. రోజూ సాధన చేయడం వల్ల సమయంలోపల పూర్తిచేయగలుగుతారు. 

బలాలు, బలహీనతలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. కఠినంగా అనిపించే అంశాలకు అదనంగా సమయాన్ని కేటాయించాలి. 

మాక్‌టెస్ట్‌లు రాయడం వల్ల ఫలితం ఉంటుంది. 

టెక్నికల్‌/ ట్రేడ్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు వంద మార్కులు కేటాయించారు. వీటిల్లో నైపుణ్యం పెంచుకుంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. చదివిన బ్రాంచ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై పట్టు సాధించాలి. అన్నీ గతంలో తెలిసిన విషయాలేనని అశ్రద్ధ చేయకుండా ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 11.07.2024

వెబ్‌సైట్‌: https://bel-india.in/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

Posted Date : 20-06-2024 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌