• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కాలానికి తగ్గట్టు నైపుణ్యంతో సాన పట్టు

అప్‌స్కిల్లింగ్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ 2024-25 నివేదిక 
 


 

ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఏ ఉద్యోగైనా నైపుణ్యం పెంచుకోవాల్సిందే.. వృత్తి నిపుణులు ఇందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2025లో 85 శాతం వృత్తి నిపుణులు నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించనున్నట్లు ‘అప్‌స్కిల్లింగ్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ 2024-25’నివేదిక వెల్లడించింది. 

ఈనాడు, హైదరాబాద్‌: డేటా సైన్స్, కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతితకలో వస్తున్న మార్పులతో పాత కొలువులు కనుమరుగై.. కొత్త ఉద్యోగాలు తలుపులు తడుతున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలంటే అందుకు తగ్గ నైపుణ్యాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.


 ఆత్మవిశ్వాసం పెరిగేలా..    

చదువులు పూర్తికాగానే ఉద్యోగాల్లో చేరుతున్న చాలామందిలో తగిన నైపుణ్యాలు ఉండటం లేదని సంస్థలు ఫిర్యాదు చేస్తుంటాయి. నైపుణ్య శిక్షణతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని 29 శాతం మంది ప్రారంభ ఉద్యోగులు వెల్లడించారు. 

కెరీర్‌లో నైపుణ్యాలు పెంచుకోవడం ముఖ్యమని సర్వేలో పాల్గొన్న నిపుణుల్లో 79 శాతం మంది పేర్కొన్నారు.


 సొంత సంస్థలో కెరీర్‌ వృద్ధికి..    

సర్వే చేసిన నిపుణుల్లో 39 శాతం మంది తమ ప్రస్తుత సంస్థలో కెరీర్‌ వృద్ధికి అప్‌స్కిల్లింగ్‌ అవసరమని భావిస్తున్నారు. వీరిలో 17 శాతం మంది వ్యక్తిగత ఆసక్తితో నేర్చుకుంటన్నారు.  

యజమాని తమపై ఉంచిన అంచనాలను అందుకోవడం కోసం 13 శాతం మంది నైపుణ్యాలను పెంచుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. 


 సవాళ్లు ఏమున్నాయ్‌..    

నైపుణ్యాలను పెంచుకునేందుకు సమయం వెచ్చించాలి..  34 శాతం మంది ఉద్యోగులు  పనితో తీరిక లేకపోవడంతో సమయం కేటాయించలేకపోతున్నామని చెప్పారు. 19 శాతం మంది వృత్తి నిపుణులు ఆర్థిక పరిస్థితులు అవరోధంగా ఉన్నాయని వెల్లడించారు.
 


 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

Posted Date : 01-07-2024 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌