• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెబిలో ఆఫీసర్‌ గ్రేడ్‌-ఎ పోస్టులు

జూన్‌ 30 దరఖాస్తుకు గడువు
 


ముంబయిలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) వివిధ విభాగాల్లో ఆఫీసర్‌ గ్రేడ్‌-ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను ఫేజ్‌-1, ఫేజ్‌-2లో ఆన్‌లైన్‌ పరీక్షలు, ఫేజ్‌-3లో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి 31.03.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక వర్గాలకు చెందినవారికి గరిష్ఠ వయసులో మినహాయింపులు వర్తిస్తాయి. అన్‌రిజర్వుడ్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూ ఎస్‌లకు దరఖాస్తు ఫీజు రూ.1000 (18 శాతం జీఎస్టీ అదనం). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100 (18 శాతం జీఎస్టీ అదనం).


మొత్తం 97 ఉద్యోగాల్లో ఏ పోస్టుకు ఏ విద్యార్హతలుండాలో చూద్దాం.   

1. జనరల్‌-62: ఏదైనా మాస్టర్స్‌ డిగ్రీ/ రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా/ లా డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ / చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌/ చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌/ కంపెనీ సెక్రటరీ/ కాస్ట్‌ అకౌంటెంట్‌. 

2. లీగల్‌-5: లా డిగ్రీ పాసై.. అడ్వకేట్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. 

3. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-24: ఏదైనా ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఏదైనా డిగ్రీ చేసి.. కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయాలి. 

4. రిసెర్చ్‌-2: ఎకనామిక్స్‌/ కామర్స్‌/ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/ క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌/ ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌/ మ్యాథమెటికల్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌/ అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా పూర్తిచేయాలి. 

5. అఫీషియల్‌ లాంగ్వేజ్‌-2: హిందీ/ హిందీ అనువాదంలో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదవాలి. లేదా సంస్కృతం/ ఇంగ్లిష్‌/ ఎకనామిక్స్‌/ కామర్స్‌తో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలి. డిగ్రీ స్థాయిలో హిందీ సబ్జెక్టుగా ఉండాలి.  

6. ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌)-2: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసవ్వాలి. సీసీటీవీ, సెక్యూరిటీ, ఫైర్‌ అలారం, యూపీఎస్‌ సిస్టమ్, ఏసీ ప్లాంట్ల నిర్వహణలో అనుభవం ఉండాలి.  


   అభ్యర్థుల ఎంపిక    


ఫేజ్‌-1: దీంట్లో రెండు పేపర్లు, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వంద మార్కులకు ఉంటాయి. 

పేపర్‌-1లో జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ - 100 మార్కులు. వ్యవధి 60 నిమిషాలు. 

పేపర్‌-2లో సబ్జెక్టు సంబంధిత మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు - 100 మార్కులు. వ్యవధి 40 నిమిషాలు. (లీగల్, రిసెర్చ్, ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌), అఫిషియల్‌ లాంగ్వేజ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మొదలైనవి).

రెండు పేపర్లలోనూ కలిపి 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. 

ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. 

ఫేజ్‌-1లో సాధించిన మార్కుల ఆధారంగానే ఫేజ్‌-2కు ఎంపిక చేస్తారు. 

ఫేజ్‌-2: పేపర్‌-1లో డ్రాఫ్టింగ్‌ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 60 నిమిషాలు. కటాఫ్‌ మార్కులు 30 శాతం. 

కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్, కంపెనీస్‌ యాక్ట్, ఎకనామిక్స్‌కు సంబంధించిన మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కులు. వ్యవధి 90 నిమిషాలు. కటాఫ్‌ మార్కులు 40 శాతం. 

పేపర్‌-2లో ప్రత్యేక సబ్జెకులకు సంబంధించిన 70 మల్టిపుల్‌ ఛాయిస్, మూడు డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలకు 100 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు. కటాఫ్‌ మార్కులు 40 శాతం. 

ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఫేజ్‌-2లో అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో హిందీ, ఇంగ్లిష్‌లో సమాధానాలు ఇవ్వొచ్చు. ఇంటర్వ్యూకు 75 శాతం, అనుభవానికి 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఎంపికైనవారికి రెండేళ్ల ప్రొబేషన్‌ ఉంటుంది. 

ఫేజ్‌-1 ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: ఏపీలో: గుంటూరు/ విజయవాడ, విశాఖ, కర్నూలు, రాజమహేంద్రవరం, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు. తెలంగాణలో: హైదరాబాద్‌/ సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం. 

ఫేజ్‌-2 ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌/ రంగారెడ్డి, విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం.

ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ సదుపాయం ఉంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపే సమయంలోనే సంబంధిత కాలమ్‌లో వివరాలను పూరించాలి.


   సన్నద్ధత కోసం..   

పేపర్‌-1 కోసం వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయొచ్చు. 

మాక్‌టెస్టులు రాయడం వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. దాంతో వెనుకబడిన అంశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించేలా ప్రణాళిక వేసుకుని అమలు చేయాలి.  

‣ పేపర్‌-2 సన్నద్ధత కోసం సబ్జెక్టు సంబంధిత పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. పాఠ్యాంశాల్లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేయాలి

ఫేజ్‌-2లోని పేపర్ల విభాగాలవారీ సిలబస్‌ 

వివరాలను ప్రకటనలో వివరంగా తెలియజేశారు. సిలబస్‌ విషయంలో స్పష్టమైన అవగాహనతో సంసిద్ధం కావాలి.  


  ముఖ్యమైన తేదీలు   

దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2024

ఫేజ్‌-1 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 27.07.2024

ఫేజ్‌-2 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 31.08.2024

వెబ్‌సైట్‌: http://www.sebi.gov.in./
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

Posted Date : 28-06-2024 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌