• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

న్యూదిల్లీలోని ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (పీఎంబీఐ) 44 ఉద్యోగాలను భర్తీ  చేయబోతోంది. ఈ ఒప్పంద ప్రాతిపదిక పోస్టులకు రాతపరీక్ష ఏమీ లేదు. మౌఖిక పరీక్ష ద్వారానే ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఈమెయిల్‌ ద్వారా కానీ, ఆఫ్‌లైన్‌లో పోస్టు/ కొరియర్‌ ద్వారా కానీ పంపాలి. 

సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చెయిన్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్, లీగల్‌.. విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. 

1. అసిస్టెంట్‌ మేనేజర్‌-10: ఏదైనా డిగ్రీ, ఎంబీఏ - సేల్స్‌/ మార్కెటింగ్‌/ తత్సమాన కోర్సు పూర్తిచేయాలి. ఫార్మా రంగంలోని సేల్స్‌/ మార్కెటింగ్‌ విభాగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. ముందుగా మూడేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. పనితీరు సంతృప్తికరంగా ఉంటే కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉంటుంది. వయసు 32 సంవత్సరాలు మించకూడదు. 

2. సీనియర్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌-12: ఏదైనా డిగ్రీ, ఎంబీఏ - సేల్స్‌/ మార్కెటింగ్‌/ తత్సమాన కోర్సు పూర్తిచేయాలి. ఫార్మా రంగంలోని సేల్స్‌/ మార్కెటింగ్‌ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. ప్రభుత్వ సంస్థలో పనిచేసినవారికి ప్రాధ్యామిస్తారు. వయసు 30 ఏళ్లు మించకూడదు. 

3. ఎగ్జిక్యూటివ్‌-12: ఏదైనా డిగ్రీ, ఎంబీఏ - సేల్స్‌/ మార్కెటింగ్‌/ తత్సమాన కోర్సు పూర్తిచేయాలి. ఫార్మా రంగంలోని సేల్స్‌/ మార్కెటింగ్‌ విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. ప్రభుత్వ సంస్థలో పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 28 సంవత్సరాలు మించకూడదు. 

4. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌-10: బీ.ఫార్మా/ బీఎస్సీ (బయోటెక్‌), ఎంబీఏ (ఫార్మా)/ఎంఫార్మా/ఎంఎస్సీ (బయోటెక్‌) పాసవ్వాలి. ప్రొక్యూర్‌మెంట్‌/ పర్చేజింగ్‌ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. ప్రభుత్వ సంస్థలో పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. 


   ఎంపిక ఎలా?  

దరఖాస్తుల స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను నింపి, విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలను జతచేసి పంపాలి. వీటి ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 

విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి. వీటిని పరిశీలించిన తర్వాత.. ఇంటర్వ్యూలో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 

దరఖాస్తులను వెబ్సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని.. నింపిన తర్వాత పోస్టు లేదా కొరియర్‌లో పంపాలి. 

మూడేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ.. మొదటి ఆరు నెలలు అభ్యర్థి పనితీరును పరిశీలిస్తారు. సంతృప్తికరంగా ఉంటే విధుల్లో కొనసాగిస్తారు లేనట్లయితే తొలగిస్తారు.

ప్రభుత్వ ఫార్మా రంగంలో పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తారు. 

ఎంపికైనవారిని దేశంలోని పీఎంబీఐ యూనిట్లలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది. 

 నిబంధనలకు అనుగుణంగా.. ప్రత్యేక వర్గాలకు చెందినవారికి గరిష్ఠ వయసులో సడలింపులు, రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: సీఈఓ, పీఎంబీఐ, బీ-500, టవర్‌ బీ, ఐదో అంతస్తు, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్, నౌరోజీనగర్, న్యూదిల్లీ-110 029.

దరఖాస్తుకు చివరి తేదీ: 08.07.2024

ఈమెయిల్‌: recruitment@janaushadhi.gov.in

వెబ్‌సైట్‌: janaushadhi.gov.in


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

Posted Date : 24-06-2024 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌