• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు

ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 97 ఖాళీలకు నోటిఫికేషన్‌


 

నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) దేశంలోని వివిధ యూనిట్లు/ కార్యాలయాల్లో ఇంజినీర్, సీనియర్‌ కెమిస్ట్, మెటీరియల్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పర్సనల్‌ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

భర్తీ చేయనున్న పోస్టుల్లో ఇంజినీర్‌ (ప్రొడక్షన్‌)-40, మెకానికల్‌ -15, ఎలక్ట్రికల్‌-12, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-11, సివిల్‌-1, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ-3, సీనియర్‌ కెమిస్ట్‌ (కెమికల్‌ ల్యాబ్‌)-9, మెటీరియల్స్‌ ఆఫీసర్‌-6 ఉన్నాయి. 

1. ఇంజినీర్‌ (ప్రొడక్షన్‌)-40: కెమికల్‌ ఇంజినీరింగ్‌/ కెమికల్‌ టెక్నాలజీ/ కెమికల్‌ ప్రాసెస్‌ టెక్నాలజీలో బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత. 

2. మెకానికల్‌ -15: మెకానికల్‌ బ్రాంచ్‌తో బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత. 

3. ఎలక్ట్రికల్‌-12: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌తో బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి. 

4. ఇన్‌స్ట్రుమెంటేషన్‌-11: ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌తో బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి. 

ఈ పోస్టులకు ఇంజినీరింగ్‌ డిగ్రీ 60 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసవ్వాలి. 

కెమికల్‌/ పెట్రో కెమికల్‌/ పెట్రోలియం రిఫైనరీలో ఏడాది పని అనుభవం ఉండాలి. 

5. సీనియర్‌ కెమిస్ట్‌ (కెమికల్‌ ల్యాబ్‌)-9: కెమిస్ట్రీ/ ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/ అనలిటికల్‌ కెమిస్ట్రీ/ ఫిజికల్‌ కెమిస్ట్రీ/ అప్లైడ్‌ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ బ్రాంచ్‌తో ఎంఎస్సీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థులకు 50 శాతం సరిపోతుంది. 

అమోనియా - యూరియా ఫెర్టిలైజర్‌ కాంప్లెక్స్‌/ ఫెర్టిలైజర్‌ ఇండస్ట్రీ/ పెట్రో కెమికల్‌ ఇండస్ట్రీ/ పెట్రోలియం రిఫైనరీలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. 

బయోకెమిస్ట్రీ, ఫార్మసీ, టాక్సికాలజీ, జియోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫుడ్‌ టెక్నాలజీతో ఎంఎస్సీ పాసైనవారు దరఖాస్తుకు అనర్హులు. 

6. మెటీరియల్స్‌ ఆఫీసర్‌-6: మెకానికల్‌/ మెటీరియల్‌ సైన్స్‌/ మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌తో బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసవ్వాలి.   
దరఖాస్తు ఫీజు  రూ.700. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్‌ఎంలకు ఫీజు లేదు. అభ్యర్థుల వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులకు.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 


  గమనించండి   

దరఖాస్తులో తెలిపిన వివరాలు, అప్‌లోడ్‌ చేసిన ధ్రువపత్రాల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి.. పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే.. దిల్లీ-ఎన్‌సీఆర్‌/ ఏదైనా నగరంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ పెడతారు. 

స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహణ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. 

ఇంటర్వ్యూను ఫిజికల్‌ లేదా వీడియో కాన్ఫరెన్సింగ్‌ విధానంలో నిర్వహిస్తారు. 

ఇంటర్వ్యూలో 50 శాతం కనీసార్హత మార్కులు సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ఎంపికైనవారిని దేశంలోని ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు, కార్యాలయాల్లో ఎక్కడైనా నియమించవచ్చు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 01.07.2024

వెబ్‌సైట్‌: www.nationalfertilizers.com
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

Posted Date : 19-06-2024 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.