• facebook
  • whatsapp
  • telegram

క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలనుకుంటున్నారా?

అత్యుత్తమ సంస్థల్లో ఆహ్వానం


 

క్రీడారంగం నేటి తరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. విద్యార్థుల్లో ఆటలపై శ్రద్ధ పెరుగుతోంది. వీటినే కెరియర్‌గా భావించి, నిరంతరం శ్రమిస్తున్నారు. తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తున్నారు, విద్యా సంస్థలూ ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో క్రీడల్లో శిక్షకులకు గిరాకీ పెరిగిందిమేటి సంస్థల్లో ఈ విభాగంలో కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనంతో ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. సొంతంగానూ ఎదుగుతున్నారు. క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలనుకునే వారికి జాతీయ స్థాయిలో ఎన్నో అత్యుత్తమ సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి.


క్రీడలు, వాటి శిక్షణలో యువత రాణించడానికి కేంద్ర యువజన, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎస్‌యూ) ఉంది. దీన్ని ఇంఫాల్‌లో 2018లో ప్రారంభించి, కేంద్రీయ విశ్వవిద్యాలయ హోదా కల్పించారు. ప్రపంచ సంస్థగా రూపొందే క్రమంలో ఇది.. కాన్‌బెర్రా, విక్టోరియా యూనివర్సిటీలు-ఆస్ట్రేలియా, రష్యన్‌ ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ యూనివర్సిటీ-రష్యాలతో జత కట్టింది. క్రీడలకు సంబంధించి విద్య, పరిశోధన, శిక్షణల్లో ఆధునికత దిశగా అడుగులేస్తోంది. ఈ సంస్థ యూజీ, పీజీల్లో క్రీడా కోర్సులు అందిస్తోంది. రాత పరీక్ష, ఫిట్‌నెస్‌ టెస్టులు, గేమ్‌ ప్రొఫిషియన్సీ, క్రీడల్లో నైపుణ్యం, వైవాల్లోని ప్రతిభతో అవకాశం కల్పిస్తారు.


  ఇవీ కోర్సులు   

ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌ (ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్‌ లిఫ్టింగ్‌) 

వ్యవధి: రెండేళ్లు, సీట్లు: 20

అర్హత: డిగ్రీతోపాటు స్పోర్ట్స్‌ కోచింగ్‌లో పీజీ డిప్లొమా/డిప్లొమా లేదా నాలుగేళ్ల బీఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

ప్రవేశం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్, గేమ్‌ ప్రొఫిషియన్సీ, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్, వైవాలతో అవకాశం కల్పిస్తారు. పరీక్షకు 100, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు 20, గేమ్‌ ప్రొఫిషియన్సీకి 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌కి 30, వైవాకు 20 మార్కులు ఉంటాయి. 

పరీక్షలో: జనరల్‌ అవేర్‌నెస్‌ 10, ఆప్టిట్యూడ్‌ 10, స్పోర్ట్స్‌ సైన్స్‌ 40, అభ్యర్థి ఎంచుకున్న స్పోర్ట్స్‌ స్పెషలైజేషన్‌లో 40 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 2 గంటలు.   

కెరియర్‌: స్పోర్ట్స్‌ కోచ్‌లకు వారి నైపుణ్యాలను అనుసరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉంది. వీరు పాఠశాలలు, కళాశాలు, విశ్వవిద్యాలయాల్లో సంబంధిత క్రీడా శిక్షకులుగా రాణించవవచ్చు. ఫిట్‌నెస్‌ సెంటర్లలో మేనేజర్‌గానూ ఎదగవచ్చు. స్పోర్ట్స్‌ అకాడెమీలు, ప్రైవేటు క్రీడా కేంద్రాల్లో స్పోర్ట్స్‌ కోచ్‌గా అవకాశాలు అందుకోవచ్చు.


   ఎంఏ స్పోర్ట్స్‌ సైకాలజీ   

వ్యవధి: రెండేళ్లు, సీట్లు: 15

అర్హత: 50 శాతం మార్కులతో బీపీఎడ్‌ లేదా బీఏ సైకాలజీ/ స్పోర్ట్స్‌ సైకాలజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. క్రీడల్లో ప్రాతినిధ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

ప్రవేశం: పరీక్ష, వైవా, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ ద్వారా. పరీక్షకు వంద, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌కి 30, వైవాకు 20 మార్కులు ఉంటాయి. 

పరీక్షలో: స్పోర్ట్స్‌ అవేర్‌నెస్‌ 10, రీజనింగ్‌ 10, ఆప్టిట్యూడ్‌ 10, సైకాలజీ/స్పోర్ట్స్‌ సైకాలజీకి 70 మార్కులు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. 

కెరియర్‌: వీరు క్రీడాకారులకు మెంటర్‌గా వ్యవహరించవచ్చు. రిసెర్చర్, కౌన్సెలర్, థెరపిస్టుగా సేవలు అందించవచ్చు. క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, లక్ష్యం దిశగా అడుగులు పడేలా ప్రోత్సహించేది వీరే. స్పోర్ట్స్‌ అకాడెమీలు, క్రీడాశిక్షణ కేంద్రాల్లో అవకాశాలుంటాయి.


   ఎల్‌ఎన్‌ఐపీఈలో..  

క్రీడా కోర్సులకు జాతీయ స్థాయిలో పేరున్న మరో సంస్థ లక్ష్మీబాయి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, గ్వాలియర్‌. దీన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పారు. 

బీపీఈడీ, ఎంపీఈడీ

ఎంఏ: స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌/యోగా, పీజీ డిప్లొమా: స్పోర్ట్స్‌ కోచింగ్‌/ ఫిట్‌నెస్‌ మేనేజ్‌మెంట్‌/ స్ట్రెన్త్‌ అండ్‌ స్పోర్ట్స్‌ కండిషనింగ్‌/ యోగా ఎడ్యుకేషన్, పీహెచ్‌డీ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సులు ఈ సంస్థ రెగ్యులర్‌ విధానంలో అందిస్తోంది. 

ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ ద్వారా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్‌ జర్నలిజం, యోగా, స్పోర్ట్స్‌ అనలిటిక్స్, స్పోర్ట్స్‌ న్యూట్రిషన్, స్పోర్ట్స్‌ సైకాలజీలో డిప్లొమా, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తుంది. 

దరఖాస్తుకు గడువు తేదీ: జూన్‌ 20

పరీక్ష తేదీలు: జూన్‌ 25 నుంచి 27 వరకు. 

వెబ్‌సైట్‌: https://lnipe.edu.in/


   మరో రెండు సంస్థల్లో...   

నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్, పటియాలా, లక్ష్మీబాయి నేషనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, తిరువనంతపురం... ఈ రెండు సంస్థల్లోనూ పలు కోర్సులు ఉన్నాయి. ఇవి కూడా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 

గుజరాత్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ,  నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌- ముంబయి, సింబయాసిస్‌ స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ సైన్సెస్‌-పుణె, సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌-చెన్నై, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పుణె.. ఇవన్నీ క్రీడల్లో పలు యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. ఐఐఎం- రోహ్‌తక్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందుబాటులో ఉంది.


  బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యు. & స్పోర్ట్స్‌  

వ్యవధి: మూడేళ్లు.

సీట్లు: 50

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఏదైనా క్రీడలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం ఉండాలి. 

ప్రవేశం: పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్, గేమ్‌ ప్రొఫిషియన్సీ, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ ద్వారా. 

పరీక్షలో: జనరల్‌ ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్, కరెంట్‌ అఫైర్స్‌ల నుంచి 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌లో 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ 40, గేమ్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్‌కి 30 మార్కులు కేటాయించారు.  

కెరియర్‌: వీరు పాఠశాలలు, కళాశాల్లలో వ్యాయామ ఉపాధ్యాయులుగా రాణించవచ్చు. ఫిట్‌నెస్‌ క్లబ్బులు, హెల్త్‌ క్లబ్బుల్లో సేవలు అందించవచ్చు. స్పోర్ట్స్‌ సెంటర్లలో కోచ్‌ గానూ కొనసాగవచ్చు. 

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల విషయంలో.. పీజీ కోర్సులకు 45 శాతం, యూజీ కోర్సులకు 40 శాతం మార్కులు సరిపోతాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 27

పరీక్ష తేదీ: జులై 9.

వెబ్‌సైట్‌: https://www.nsu.ac.in/


   ఎమ్మెస్సీ అప్లయిడ్‌ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌  

వ్యవధి: రెండేళ్లు, సీట్లు: 15

అర్హత: 50 శాతం మార్కులతో న్యూట్రిషన్‌/ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌/ హోం సైన్స్‌/ డైటెటిక్స్‌/ స్పోర్ట్స్‌ సైన్స్‌/ బయోకెమిస్ట్రీ/ జువాలజీలో యూజీ లేదా బీపీఈఎస్‌/ బీఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌/ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ పూర్తిచేయాలి. 

ప్రవేశం: పరీక్ష, వైవా, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ ద్వారా. పరీక్షకు వంద, వైవాకు 20, స్పోర్ట్స్‌లో భాగస్వామ్యం/అనుభవానికి 30 మార్కులు ఉంటాయి. 

పరీక్షలో: స్పోర్ట్స్‌ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ల్లో 20, ఫిజియాలజీ 20, బయోకెమిస్ట్రీ 20, న్యూట్రిషన్, స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌కు 40 మార్కులు. వ్యవధి 2 గంటలు. 

కెరియర్‌: వీరు క్రీడాకారులకు న్యూట్రిషనిస్టులుగా వ్యవహరించవచ్చు. పబ్లిక్‌/ ప్రైవేటు స్పోర్ట్స్‌ అకాడెమీలు, స్పోర్ట్స్‌ ఏజెన్సీలు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, వెల్‌నెస్‌ కేంద్రాలు, న్యూట్రిషన్‌ ఉత్పత్తుల తయారీ సంస్థలు, విద్యాలయాలలో సేవలు అందించవచ్చు.


 మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌   

వ్యవధి: రెండేళ్లు,

సీట్లు: 30

అర్హత: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ (బీపీఈఎస్‌) లేదా సమాన స్థాయి కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.  

ప్రవేశం: పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్, గేమ్‌ ప్రొఫిషియన్సీ, వైవాలతో. 

పరీక్షలో: స్పోర్ట్స్‌ అవేర్‌నెస్‌ 10, ఆప్టిట్యూడ్‌ 10, సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ 60, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌ 20 మార్కులకు.ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ 20, గేమ్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ 30, వైవా 20 మార్కులకు ఉంటాయి.   

కెరియర్‌: వీరు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో స్పోర్ట్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేటర్‌గా రాణించవచ్చు. ఫిట్‌నెస్‌ సెంటర్లు, ఆతిథ్యరంగం, హెల్త్‌ క్లబ్బుల్లోనూ అవకాశాలు ఉంటాయి. పర్సనల్‌ ట్రెయినర్లు, కోచ్‌లు, ఇన్‌స్ట్రక్టర్లుగా రాణించగలరు.


   బీఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌  

వ్యవధి: నాలుగేళ్లు. వీరికి ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్‌ లిఫ్టింగ్‌ల్లో శిక్షణ అందిస్తారు. 

సీట్లు: 80

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఏదైనా క్రీడలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం ఉండాలి. 

ప్రవేశం: పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్, గేమ్‌ ప్రొఫిషియన్సీ, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ ద్వారా. 

పరీక్షలో: జనరల్‌ ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్, వర్తమాన వ్యవహారాల నుంచి 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌లో 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ 40, గేమ్‌ ప్రొఫిషియన్సీ 30, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్‌కి 30 మార్కులు కేటాయించారు. 

కెరియర్‌: వీరు జాతీయ సంస్థలు, ప్రైవేటు క్లబ్‌లు, పాఠశాలలు, శిక్షణ కేంద్రాలు, ఫిట్‌నెస్‌ సెంటర్లలో కోచ్, కోచింగ్‌ కన్సల్టెంట్‌గా సేవలు అందించగలరు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

Posted Date: 19-06-2024


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌