‣ అభ్యర్థుల సందేహాలకు నిపుణుల సూచనలు
త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండింటికీ కలిపి ఒకేసారి సన్నద్ధం కావాలా? ఒకదాని తర్వాత మరో దానికి ప్రిపరేషన్ కొనసాగించాలా?... ఉద్యోగ నియామక పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అధిక శాతం అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్న సందేహమిది.
సన్నద్ధత విషయంలో అభ్యర్థులను కలవరపెడుతున్న ప్రశ్ననే పలువురు పోటీ పరీక్షల నిపుణుల వద్ద ‘ఈనాడు’ ఉంచింది. ఒకేసారి సన్నద్ధం కావొచ్చనీ, కాకపోతే తమ శక్తి సామర్ధ్యాలను సరిగా అంచనా వేసుకోవడం ముఖ్యమనీ బోధన నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అందుకే చాలాచోట్ల గ్రూపు-1, 2కు కలిపే కోచింగ్ తరగతులు జరుపుతున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం ఒకదాని తర్వాత మరో దానికి సన్నద్ధమైతేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
అయోమయానికి దారితీయొచ్చు
గ్రూపు-1 ప్రిలిమ్స్, గ్రూప్-2 సిలబస్ దాదాపు ఒకటే. సన్నద్ధత మాత్రం తేడా ఉంటుంది. గ్రూపు-1లో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలతో కూడిన ప్రిలిమినరీతోపాటు వ్యాసరూప ప్రశ్నలతో ప్రధాన పరీక్ష (మెయిన్) ఉంటుంది.
అదే గ్రూపు-2లో మెయిన్ ఉండదు. గ్రూపు-1లో 150 మార్కులతో ఒకటే ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. ఇంకా మెయిన్‌లో ఆంగ్లంతోపాటు మరో ఆరు పేపర్లు రాయాలి. అంటే విస్తృతంగా చదవాలి....రాయడం సాధన చేయాలి. అదే గ్రూపు-2లో ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున నాలుగు పరీక్షలు రాయాలి. అంతవరకు బాగానే ఉన్నా గ్రూపు-1 ప్రిలిమినరీలో కాన్సెఫ్ట్ ఆధారంగా, కొంచెం సంక్లిష్టంగా, గందరగోళంలో పడేసేలా ప్రశ్నలు ఇస్తారు.
గ్రూపు-2లో మాత్రం జ్ఞాపకశక్తిని పరీక్షించే...వాస్తవాల ఆధారంగా ప్రశ్నలుంటాయి. ఇక్కడ సిలబస్‌కు పరిమితి ఉంటుంది. అందువల్ల రెండిటికీ ఒకేసారి సన్నద్ధమవ్వడం అయోమయానికి దారితీస్తుంది. విజయావకాశాలను దెబ్బతీయొచ్చు. అందుకే వేర్వేరుగా సన్నద్ధం కావడం మంచిది.
- కృష్ణ ప్రదీప్, ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ
ఒత్తిడికి గురికాకుండా..
సిలబస్ ఒకటే అయినందున శాస్త్రీయపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా రెండిటికీ సన్నద్ధం కావడానికి అవకాశం ఎక్కువ. అయితే అభ్యర్థి తన శక్తి సామర్థ్యాలను నిజాయితీగా అంచనా వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గ్రూపు-1లో విశ్లేషణ సామర్ధ్యం, విస్తృత అవగాహన, సబ్జెక్టుపై పట్టు, రాత సాధన తప్పనిసరి. గ్రూపు-2 ఆబ్జెక్టివ్ విధానం కాబట్టి మెమరీ టెక్నిక్‌లు, సమాచార సేకరణ, పునశ్చరణ, నిరంతరం నమూనా పరీక్షలను రాయడం అవసరం. దీన్ని గమనంలో ఉంచుకొని అయోమయానికి గురికాకుండా...ఒత్తిడికి లోనుకాకుండా సన్నద్ధమవుతామా? అని ఎవరికివారు నిజాయితీగా అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది.
- నూతనకంటి వెంకట్, పోటీ పరీక్షల నిపుణులు

రెండు పరీక్షల పాఠ్య ప్రణాళిక ఒకటే అయినా... గ్రూపు-1లో ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. అదే గ్రూపు-2లో నేరుగా జవాబు ఉండే ప్రశ్నలిస్తారు. కొంచెం అదనంగా కష్టపడితే ఒకేసారి గ్రూపు-1తోపాటు గ్రూపు-2 సన్నద్ధత కూడా పూర్తవుతుంది.
- శ్రీకాంత్ విన్నకోట, అనలాగ్ ఐఏఎస్ అకాడమీ
గత అనుభవాలను బట్టి...

- దుంపల మల్లేశ్వరిరెడ్డి, లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ అకాడమీ.
*********************************************************************************
‣ సెక్షన్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు
2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
4. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర
6. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి
7. ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం యొక్క భౌతిక భూగోళశాస్త్రం
9. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ
10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్
‣ సెక్షన్-బి: జనరల్ ఇంగ్లిష్, తెలుగు
d) Logical re-arrangement of sentences
సి) తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు
డి) ఇంగ్లిష్ పదాలకు తెలుగు అర్థాలు
ఇ) పలుకుబడి/ వాడుక, నుడికారం/ జాతీయాలు
‣ ఈ-బుక్స్
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ రెండు డిగ్రీలతో రెట్టింపు లాభం!
‣ ఆర్థిక.. గణాంక.. వైద్య సేవల్లోకి కేంద్రం ఆహ్వానం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.