• facebook
  • whatsapp
  • telegram

ఇండియన్‌ ఎకానమీ.. ఇలా చదివేద్దాం!

భారత ఆర్థిక వ్యవస్థ ప్రిపరేషన్‌పై అపోహలు, వాస్తవాలు

గ్రూప్స్‌ సన్నద్ధతలో అభ్యర్థులంతా కాస్త భయపడేది ఎకానమీ విషయంలోనే. నిజానికి సరైన ప్రణాళిక ఉంటే ఈ సబ్జెక్టు చదవడం అంత కష్టమేమీ కాదు. ఏది, ఎంతవరకు, ఎలా చదవాలనే విషయం తెలుసుకుంటే ప్రిపరేషన్‌ సులువుగా సాగిపోతుంది. మరి గ్రూప్స్‌ పరీక్షలకు ఇండియన్‌ ఎకానమీ (భారత ఆర్థిక వ్యవస్థ)ను ప్రిలిమ్స్‌ కోసం ఎలా చదువుకోవాలో తెలుసుకుందామా!

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి భారతదేశ ఆర్థిక పయనం మొదలయింది. అందుకే విద్యార్థులు కూడా చదవటం అక్కడి నుంచే మొదలుపెట్టాలి. స్వాతంత్య్ర కాలం నాటి ఆర్థిక పరిస్థితులూ, పంచవర్ష ప్రణాళికలూ మనకు ఎందుకు అవసరమయ్యాయి, అవి ఎలాంటి విజయాలు సాధించాయి, ఏ విషయాల్లో వెనకబడ్డాయి... ఇలా ప్రతిదీ చదవాల్సి ఉంటుంది. జాతీయాదాయం, జీడీపీ లెక్కింపు, తలసరి ఆదాయం, తలసరి వినియోగం, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానాలు, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

ఆ తర్వాత 1991 కాలం నాటి ఆర్థిక సంస్కరణలు మరో ప్రధానమైన అంశం. దేశ దశనూ, దిశనూ మార్చిన నాటి ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌), భూ సంస్కరణలు ముఖ్య విషయాలు. ఆనాటి ఆ విధానాలే నేటి మన ఆర్థిక పరిస్థితికి పునాది. అందువల్ల వాటి గురించి ప్రతి అభ్యర్థీ క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

నీతిఆయోగ్‌ ఏర్పాటు, విధివిధానాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయం అంశాలపై పట్టు సాధించాలి. దేశంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల గురించి గ్రహించాలి. కేంద్రప్రభుత్వ పథకాలైన నేషనల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి వాటి గురించి చదవాలి. బడ్జెÆట్, ఎకనమిక్‌ సర్వేలో ముఖ్యమైన అంశాలు, కేటాయింపుల గురించి అవగాహన అవసరం.

సొంత నోట్సుతో...

ఎకానమీ అనే కాదు, ఏ సబ్జెక్టు చదివినా సొంత నోట్సు రాయడం తప్పనిసరి. అయితే చాలామంది అభ్యర్థులు నోట్సు రాసుకునేటప్పుడు ఏది ముఖ్యమైన పాయింటో, ఏది అవసరం లేనిదో తెలుసుకోలేక ఇబ్బంది పడతారు. ఒక అంశం ప్రాధాన్యం మనకు అర్థం కావాలంటే పాత ప్రశ్నపత్రాలు చూడటం ఒక్కటే దారి. తొలుత సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ సిలబస్‌లో ఏ సంవత్సరం, ఏ టాపిక్‌ నుంచి, ఎన్ని మార్కులకు ప్రశ్నలొచ్చాయనే విషయాన్ని గుర్తించాలి. దీనివల్ల మనం టాపిక్స్‌కు అలవాటుపడతాం. ఆ తర్వాత ఏ పాఠం ఎంతవరకు చదవాలనే విషయం మనకే అర్థమైపోతుంది. దానివల్ల అనవసర విషయాల జోలికి పోకుండా విలువైన సమయం ఆదా అవుతుంది.

చాలామంది అభ్యర్థులు ‘కోచింగ్‌ సెంటర్లలో ఇచ్చే మెటీరియల్‌ ప్రిపరేషన్‌కు సరిపోతుంది’ అనుకుంటారు. ఇది పొరపాటు. పాఠ్యపుస్తకాలు చదవడం తప్పనిసరి. మొత్తం అన్ని టాపిక్స్‌నూ పూర్తిగా నేర్చుకున్నాక వీలైనన్ని మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు సాధన చేయాలి. ఏదైనా బిట్‌ తప్పుగా జవాబు రాశామంటే ‘ఎందుకు పొరపాటు చేశాం?’ అనే విషయాన్ని గుర్తించాలి. అవసరం అయితే మళ్లీ ఆ చాప్టర్‌ చదవాలి. ఇలా తప్పుల నుంచి నేర్చుకుంటూ సమగ్రంగా సన్నద్ధమై పరీక్ష రాస్తే విజయం సిద్ధిస్తుంది. లక్ష్యంగా పెట్టుకున్న పోస్టుల్లో ఒకటి కచ్చితంగా మీదవుతుంది!

అపోహ: ఎకానమీలో చాలా అంకెలు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. 

నిజం: అన్నీ అవసరం లేదు, ముఖ్యమైనవి గుర్తుంటే చాలు. ఉదాహరణకు స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో సీˆ్త్ర పురుష నిష్పత్తి, శిశు మరణాల సగటు వంటివి ఈ కోవలోకి వస్తాయి.  

అపోహ: బడ్జెట్‌ గణాంకాలు మొత్తం కంఠస్థం చేయాలి. 

నిజం: ప్రధాన శాఖలకు ఇచ్చిన కేటాయింపులు మాత్రమే అవసరం. అలా కాకుండా బడ్జెట్‌లో ప్రతి అంశమూ చదివితే ఏదీ పూర్తిగా గుర్తుపెట్టుకోలేక ఇబ్బంది పడాల్సివస్తుంది!

చదవాల్సిన పుస్తకాలు

ఇంగ్లిష్‌ మీడియం 

ఇండియన్‌ ఎకానమీ బై దత్‌ అండ్‌ సుందరమ్‌

తెలుగు మీడియం

ఇంటర్‌ రెండో ఏడాది అర్థశాస్త్రం 

భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు (తెలుగు అకాడెమీ)  

యూనియన్‌ (కేంద్ర) బడ్జెట్‌ - 2022-23

యోజన 

ఎకనమిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 2021-22

*********************************************************************************

 

సెక్షన్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు

2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు

4. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర

5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకొని తీసుకున్న సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు

6. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి

7. ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం యొక్క భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

11. డేటా అనాలిసిస్: ఎ) టాబ్యులేషన్ ఆఫ్ డేటా బి) విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సి) బేసిక్ డేటా అనాలిసిస్ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం)

12. ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు(విభజన సమస్యలు)


సెక్షన్-బి: జనరల్ ఇంగ్లిష్, తెలుగు

a) Comprehension

b) Usage and Idioms

c) Vocabulary and Punctuation

d) Logical re-arrangement of sentences

e) Grammar

ఎ) పర్యాయపదాలు, పదజాలం

బి) వ్యాకరణం

సి) తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు

డి) ఇంగ్లిష్ పదాలకు తెలుగు అర్థాలు

ఇ) పలుకుబడి/ వాడుక, నుడికారం/ జాతీయాలు


ఈ-బుక్స్


పాత ప్రశ్నప‌త్రాలు


నమూనా ప్రశ్నపత్రాలు

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పరీక్ష కోణంలో.. పకడ్బందీగా!

‣ ఫార్మసీ పీజీకి నైపర్‌ దారి!

‣ ఐఐటీ తిరుపతిలో సరికొత్త పీజీ!

‣ ఇతరులతో పోల్చుకోవద్దు?

‣ ఇగ్నోలో.. బీ.ఎడ్, నర్సింగ్‌ కోర్సులు

‣ యూజీలో ప్రవేశానికి సీయూఈటీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌