• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీ తిరుపతిలో సరికొత్త పీజీ! 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుపతి (ఐఐటీటీ)కి చెందిన హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగం పబ్లిక్‌ పాలసీలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ను కొత్తగా ప్రవేశపెడుతోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. విధానాల విశ్లేషణ, సమకాలీన పాలనలో ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఈ కోర్సును ప్రారంభించారు. 

విద్యార్థులు, వృత్తి నిపుణుల్లో ఇంటర్‌ డిసిప్లినరీ దృక్పథాన్ని అందించే ధ్యేయంతో రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ (ఎంపీపీ) ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఇది సిద్ధాంతపరమెనi అవగాహన, ఆచరణాత్మక బోధనా పద్ధతుల సమ్మేళనం. ఈ కోర్సులో భాగంగా మొదటి ఏడాది పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్‌ పాలసీ, గవర్నెన్స్‌కు సంబంధించిన అంశాలను బోధిస్తారు. 

ఎంపీపీ ప్రోగ్రామ్‌లో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. కోర్‌ కోర్సులను అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకోవాలి. సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ సస్టెయినబిలిటీ, డేటా సైన్స్, సస్టెయినబిలిటీ అండ్‌ ఇంజినీరింగ్‌.. ఈ మూడు స్ట్రీముల స్పెషలైజేషన్లు ఉంటాయి. ఎలక్టివ్‌ కోర్సులను మూడు స్ట్రీముల్లో అభ్యర్థులు తమ ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. డిసర్టేషన్‌ ఉంటుంది. 

ఈ కోర్సు చదివిన విద్యార్థులు దేశంలోని విధాన ప్రక్రియల్లో సమర్థ భాగస్వామ్యాన్ని అందించగలుగుతారు. కన్సల్టెంట్లుగా ఎన్‌జీవోల్లో పనిచేయగలుగుతారు. పాలసీ రిసెర్చర్స్, ప్రోగ్రామ్‌ ఎనలిస్ట్‌లుగానూ సేవలను అందించగలుగుతారు.

ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ తర్వాత ఐఐటీల్లో పబ్లిక్‌ పాలసీపై ప్రవేశపెడుతున్న పీజీ ప్రోగ్రామ్‌ ఇదే! 

అర్హత: డిగ్రీ పాసైనవారు లేదా చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు డిగ్రీలో 55 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. 

ఎంపిక విధానం: ఎంపీపీ ప్రోగ్రామ్‌లోకి అభ్యర్థుల ఎంపిక రెండు ట్రాక్‌ల ద్వారా జరుగుతుంది. 

ట్రాక్‌-1: గేట్‌కు హాజరై, వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ సాధించిన అభ్యర్థులు ట్రాక్‌-1లో ఉంటారు. 

ట్రాక్‌-2: గేట్‌ రాయని అభ్యర్థులు దీంట్లో ఉంటారు. తుది జాబితా రూపకల్పనలో రెండు జాబితాల్లోని అభ్యర్థులను వేర్వేరుగా పరిగణనలోకి తీసుకుంటారు. ధ్రువీకరణ నిమిత్తం ఒరిజినల్‌ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. 

ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీల్‌ పురుష అభ్యర్థులకు రూ.400. జనరల్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ మహిళా అభ్యర్థులకు రూ.200. ఎస్సీ/ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200. ఫీజును ఎస్‌బీఐ కలెక్ట్‌ ద్వారా మాత్రమే చెల్లించాలి. 

ఆర్థిక సహకారం: గేట్‌లో అర్హత సాధించి ట్రాక్‌-1లో స్థానం పొందిన అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందజేస్తారు. హాఫ్‌ టైమ్‌ టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌ (హెచ్‌టీటీఏ) కింద నెలకు రూ.12,400 పొందొచ్చు. ఈ సహాయాన్ని గరిష్ఠంగా 24 నెలలపాటు అందుకోవచ్చు. హెచ్‌టీటీఏ విద్యార్థులు వారానికి 8 గంటలపాటు డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది. వీటిల్లో ల్యాబొరేటరీ డెమన్‌స్ట్రేషన్, ట్యుటోరియల్స్, అసైన్‌మెంట్స్‌ ఎవాల్యుయేషన్, టెస్ట్‌ పేపర్స్, రిసెర్చ్‌ ప్రాజెక్స్‌.. మొదలైన విద్యా సంబంధిత విధులు ఉంటాయి. 

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 18, 2022

రాత పరీక్ష: మే 9, 14 

ఇంటర్వ్యూ: జూన్‌ 1, 4 

ఫలితాల విడుదల: జూన్‌ 27 నుంచి 30 వరకు. 

ఎంపికైన అభ్యర్థులు కోర్సులో చేరాల్సిన తేది: ఆగస్టు 1, 2022

వెబ్‌సైట్‌: https://admissions.iittp.ac.in/mpp/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇగ్నోలో.. బీ.ఎడ్, నర్సింగ్‌ కోర్సులు

‣ యూజీలో ప్రవేశానికి సీయూఈటీ

‣ చరిత్రపై ఎన్ని అపోహలో!

‣ భగ్గుమంటున్న ధరల ముప్పు

‣ తెల్లబంగారానికి యంత్ర సొబగు

‣ వినయం... విధేయం నేర్చుకుంటే విజయం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌