Asked By: బి.వందన
Ans:
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్స్ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. ఇంత పోటీని తట్టుకొని ఉద్యోగం సంపాదించాలంటే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం అవ్వాల్సిందే. జనరల్ నాలెడ్జ్, సెక్రటేరియల్ ఎబిలిటీస్‌ల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రాంతీయ భౌగోళిక, సామాజిక, సంస్కృతి, వారసత్వం, ఆర్ధికం, కళలు, సాహిత్యం, పాలన విధానాలపై అవగాహన ఏర్పర్చుకోండి. దీంతోపాటు భారత రాజ్యాంగం, భారత భౌగోళిక అంశాలు, భారత ఆర్ధిక వ్యవస్థ, భారత జాతీయోద్యమం అంశాలపై కూడా పట్టు సాధించండి. దైనందిన జీవితంలో సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, అంతర్జాతీయ సంబంధాలు, సమకాలీన సంఘటనలపై కూడా ప్రశ్నలుంటాయి. విజయం సాధించాలంటే రోజుకు కనీసం 8 గంటలు చదవాల్సిన అవసరం ఉంది. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంకగణిత/ సంఖ్యా సామర్థ్యాలకు సంబంధించిన సూత్రాలను ఒకచోట రాసుకొని, రోజూ ప్రాక్టీస్ చేయండి.
ఏ పోటీ పరీక్షలోనైనా సరైన సమాధానాన్ని ఒక నిమిషంలోపే గుర్తించగలిగే సామర్థ్యం ముఖ్యం. సోషల్ మీడియాలో వ్యాపించే నెగెటివ్ ప్రచారాలకు దూరంగా ఉండండి. ప్రామాణిక పుస్తకాల నుంచి సమాచారాన్ని సేకరించి మీరే సొంతంగా నోట్స్ తయారుచేసుకోండి. మార్కెట్లో/ సోషల్ మీడియాలో దొరికే స్టడీ మెటీరియల్ నాణ్యతను పరిశీలించాకే, దానిపై ఆధారపడండి. ప్రశాంతమైన మనసుతో, ఎలాంటి ఆందోళనకూ గురి అవ్వకుండా పరీక్షకు సన్నద్ధమై మీ లక్ష్యాన్ని చేరుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: జి. విక్రమ్
Ans:
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నిర్వహించే గ్రూప్-4 ఉద్యోగ పరీక్షలకు విద్యార్హత డిగ్రీ. యూజీసీ గుర్తింపు పొందిన ఏ విశ్వవిద్యాలయం నుంచైనా కనీసం మూడు సంవత్సరాల డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారే గ్రూప్-4 ఉద్యోగాలకు అర్హులు. దూరవిద్య, ఓపెన్ యునివర్సిటీ ద్వారా డిగ్రీ చదివినవారూ అర్హులే. కానీ, డిప్లొమా చదివినవారు గ్రూప్- 4 ఉద్యోగాలకు అర్హులు కారు. మన దేశంలో డిగ్రీని పూర్తిచేయడానికి కనీసం 15 సంవత్సరాల పాటు విద్యని అభ్యసించి ఉండాలి. మీరు మూడు సంవత్సరాల డిప్లొమాతో కలిపి 13 సంవత్సరాలే చదివారు కాబట్టి, గ్రూప్ 1,2,3,4 పరీక్షలకు అర్హత సాధించాలంటే కచ్చితంగా డిగ్రీ పూర్తిచేయాలి. డిప్లొమా చదివినవారు నేరుగా డిగ్రీ రెండో సంవత్సరంలో ప్రవేశం పొంది, రెండేళ్లలోనే డిగ్రీ పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మీరు డిప్లొమా/పదో తరగతి విద్యార్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు డిప్లొమా చదివినవారికి కూడా అర్హత ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలావాటికి అర్హత సాధించాలంటే ముందుగా మీరు డిగ్రీని పూర్తి చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: sudha
Ans:
The following link will help you.
https://pratibha.eenadu.net/tspsc/prathyekakadhanalu/2-1016-255
Asked By: Korada
Ans:
The following links will help you.
https://pratibha.eenadu.net/appsc
Asked By: P RAMESH
Ans:
The Selection of Candidates for appointment to the posts will be made by Written Examination (Objective Type) by CBRT/OMR based and the Selection for the posts will be based on marks secured in the written examination as well as fulfillment of physical requirements as per G.O. Ms. No. 07, TR&B (TR.SER) Department, Dt. 28/01/2021.
The following link will help you fo the selection procedure. Check Notification PDF.
Asked By: Gollapalli
Ans:
పోటీ పరీక్షల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రిపరేషన్
The following links will help you.
చరిత్ర
https://pratibha.eenadu.net/tspsc/article/specialstories//2-1016-255-0-22040000828
Asked By: illuru
Ans:
The following links will help you.
Asked By: venkata ramana murthy
Ans:
The following link will help you.